Thursday, December 26, 2019

కృష్ణ లీలలు 1

Dec 23, 2019 Karimnagar
కృష్ణ లీలలు 1
______________
ఒకరోజు రేపల్లె లోని గోపికలు అందరూ కలిసి, కృష్ణుణ్ణి పట్టుకోవాలని నిర్ణయం తీసుకొని, ఆ రోజు రాత్రి నిద్ర పోకుండా కాపలా కాశారు,
తలుపులు దగ్గర వేసి, గొళ్ళెం పెట్టడం మరచి నట్టుగా , నటిస్తూ, మంచాల్లో, దొంగ నిద్ర నటిస్తూ పడుకున్నారు! అనుకున్నట్టు, అర్ధరాత్రి ,
కృష్ణుడు రానే వచ్చాడు తన బృందంతో,, !, లోనికి దూర నే దూరాడు,! పైనున్న ఉట్టి పగల గొట్టడానికి తెచ్చుకున్న చేతి కర్రను  పైకెత్త గానే, గోప గోపిక లు చటుక్కున లేచి కృష్ణుణ్ణి పట్టుకున్నారు! పాపం కృష్ణుడు చిక్కాడు వారికి !! మిగతావారు పారి పోయారు!
వారికి కూడా, దొంగల నాయకుడు  అయితే దొరికాడు అన్న అనందం తో, మిగతావారి ని పట్టించు కోలేదు కూడా!!
,వారు ,చక్కగా ఒక పెద్ద పెట్టెలో కృష్ణుణ్ణి దాచి, తాళం వేసి, తెల్లారే వరకు వేచి చూశారు!
ఇంకేం, తెల్లారి పోయింది!
వారు ఎంతో పరమ సంతోషంతో పెట్టెను అమాంతం ఎత్తుకెళ్లి, యశోదమ్మ ఇంటి ముంగిట్లో పెట్టారు,!
ఆశ్చర్యం ఏమంటే , అలా చాలా మంది గోపికలు అక్కడ కనిపించారు,! అందరూ వుత్సాహంగ ఏదో ఘన కార్యం సాధించి నట్టుగా సంబర పడుతూ ""నేను కృష్ణుణ్ణి పట్టి తెచ్చాను ""అంటూ, చూపడానికి పోటీలు పడుతూ ఉన్నారు!
ఒకరు మూటలు, మరొకరు సంచులు, గోతాము లు, ఇలా ఎన్నో తెచ్చారు!
""యశోదమ్మ ,,రావమ్మా! బయటకు రా,! నీ అల్లరి కృష్ణుణ్ణి పట్టి కట్టేసి తెచ్చాం! చూద్దువ్ గానీ, రా!"" అంటూ పిలిచారు యశోదమ్మ ను!
ఆమె వచ్చింది !,చూపారు తెచ్చినవన్ని!!
" ఇదిగో , నీ అమాయక కొడుకు,, చూడు!!"""గారాల కృష్ణుడు!!"" అంటూ.
, కృష్ణుడు ఒక్కడు ఉంటే, మీరు ఇంతమంది కృష్ణుల ను ఎలా పట్టుకున్నారు ,??"", ఆమెకు ఆశ్చర్యం వేసింది!
""చూపండి మీరు ఏం తెచ్చారో?""
వాళ్లంతా తెచ్చిన వన్ని ఆమె ముందు పెట్టీ చూపారు!
చిత్రం! దేనిలోనూ కృష్ణుడు లేడు,,! అందులో  వారి పిల్లలే ఉన్నారు ఏడుస్తు ,!
"అమ్మా! అమ్మా! నన్నెందుకు కట్టేశావే?? ఎంత బాధ గా ఉందో!!
పైగా అరవకుండా మూతికి బట్టా కూడా కట్టావ్ కదా, అమ్మా.!! నేనంటే నీకు ఎందుకింత కోపం అమ్మా ?!""
అంటున్నారు వాళ్లు!
గోపిక లంత నిశ్చేష్టులై పోయారు!
""లేదు !, యశోదా! స్వయంగా నీ కొడుకుని నిజంగా మా ఇంట్లో నిన్న రాత్రి గట్టిగా కట్టేసేను !"మరి మా పిల్లాడు ఎలా వచ్చాడో !""
అంటూ బిత్తర పోతూ అంటూ ఉన్నారు!!
యశోదమ్మ అంది, ""చూడండమ్మా! మీరు నా చిన్ని కృష్ణుణ్ణి ముద్దు ముచ్చట చూస్తూ  ఓర్వలేక చెప్పే చాడీ లు ఇక వినదలచుకొలేదు !
సరేనా !ఇదిగో !ఇప్పుడే మా కన్నయ్య ను పిలుస్తాను ,చూడండి,!" అంటూ" కృష్ణా, కృష్ణా !"అని యశోదమ్మ పిలవగానే , ఇంట్లోనుండి కన్నయ్య రానే వచ్చాడు! ""అమ్మా ,,పిలిచావా ,? మన ఇంటికి వీళ్లంతా ఎందుకు ఇక్కడికి వచ్చారు, అమ్మా??""
అంటూ
గోపిక లంత బిత్తర పోయారు!
""ఏమిటి ఈ మా య ,? ఇదేదో ఇంద్రజాలం లా ఉంది!"
"అమ్మా ,,యశోదా!  నీ కృష్ణుడు మా ఇళ్లకు వచ్చిన మాట నిజం, !మమ్మల్ని నమ్ము ""అంటూ ఉంటే
యశోద కు కోపం మండి పోయింది. !
""ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, !ఏమిటి?? అందరూ ఇలా  కట్టగట్టుకొని వచ్చి,నా చిన్ని కృష్ణయ్య పై ఇంత అపవాదు వేస్తారా?? ఇది మీకు న్యాయంగా ఉందా, నన్ను ఇలా బాధ పెట్టడం, నా కృష్ణుని నానా మాటలు అని వెళ్ళి పోవడం?!
""ఉండండి! మా  నంద రాజు తో చెపుతాను! మీ పని చెబుతాడు ఆయన!""
అంటూ కోపంగా అంటూ ఉంటే, గోపికలు భయంతో బతిమాలుతూ,
""వద్దమ్మ  ,వద్దు !ఎవరికీ ఈ విషయం చెప్పొద్దు ! ఈ కృష్ణయ్య , నీ కే  కాదు, మాకు కూడా కొడుకు లాంటి వాడే, !!ఇలాంటి కొడుకు మాకు కూడా ఉంటే బావుండు ను కదా !అని మేము ఎప్పుడూ అనుకుంటూ ఉంటాము!!
మా కొడుకు కంటే ఎక్కువగా నీ కృష్ణుణ్ణి ప్రేమిస్తూ ఉంటాం ,యశోదా!
కృష్ణయ్య ను చూడం దే ఉండలేక పోతున్నాం మా మాట నమ్ము!
ఏదో ఒక మిషతో వచ్చి నీ కొడుకు సుందర వదనారవిందాన్ని చూసి పోతు ఉంటాం ,యశోదా!
అంటూ రెండు చెంపలు వేసుకుంటూ వెళ్ళి పోతు ఒక్కసారి ఆ కృష్ణుని వేపు చూస్తూ అలాగే ఉండి పోయారు,వారంతా!
,, తల్లీ చాటుకు దొంగలా నక్కి నక్కి తమనే చూస్తూ వెక్కిరించే ఆ బాల ముకుందుని తనివారా కళ్ళార్పకుండా చూస్తూ, వెళ్ళలేక వెళ్ళలేక తమ ఇళ్లలోకి వెళ్ళి పోయారు ఆ కృష్ణ భక్త గోపికలు!!
కృష్ణుని కట్టేయాలంటే ఎంత పుణ్యం ఉండాలి! యశోదమ్మ కు మాత్రమే, ఆ బ్రహ్మాండ నాయకుని భక్తి అనే  తాడుతో కట్టి వేసింది!
ఏ భక్తునికి అంత భాగ్యం దక్కింది?? అది అందరికీ సాధ్యమా?? సాక్షాత్తూ పరమాత్ముని కి పాలిచ్చి పెంచి, ప్రేమను పంచి, తనను దండించే  అధికారాన్ని కూడా అనుగ్రహించిన  ఆ గోవిందుని కరుణ కు హద్దు ఉందా!!
వారికి తనయందు గల అనురాగం తో సమానంగా తన ప్రేమతో వారిని మైమరపించాడు !!
""కృష్ణ తత్వం ""అర్థం చేసుకోవడం కష్టం!
కృష్ణుని చూపులో ,రూపు లో ,నవ్వులో, నడకలో, నర్తన లో, చేష్ట ల్లో , మాటల్లో ఒక అందం, ఒక అద్భుతం, ఒక పరమార్థం, దాగి వుంటుంది,!! అది ఎంతవరకైనా అర్థం కావడం కష్టం, !
గోపికల మనసును చూరగొన్న వాడికి , వారి ఇళ్లలో వెన్న గ్రహించడం ఒక లెక్కా!
తాను తీసుకున్నది స్వల్పం! కానీ,. తిరిగి ఇచ్చే ప్రతిఫలం ,"ఐశ్వర్యం "అనంతం ,అమూల్యం, అపురూపం,బ్రహ్మానందం!""
ఏది ఎప్పుడు ఎలా పరమాత్మకు ఇవ్వాలో జీవుడికి  తెలియదు,! ఉన్న జ్ఞానం సరి పోదు!,, పోనీ కదా ,స్వయంగా
పరమాత్ముడే  వచ్చిగ్రహిస్తే,  ""అయ్యో !అది నాది, కదా !!"అనుకుంటాము!
కానీ, గోపిక లు అలా కాదు! ఇంకా ఇంకా ఇవ్వాలన్న తపనతో అల్లాడు తూ ఉంటారు. వారి హృదయం అంతా గోపాలుని భావంతో నిండి పోయి ఉంది,! అక్కడ చిక్కాక ఇక బయట పడటం కష్టం !
నిష్కల్మషమైన , నిష్పలాపెక్ష , తో అందించే గోపికల ప్రేమ అమూల్యం !!పూర్వ జన్మ లో మునులు, ఋషులు,సురులు ,
వారి పూర్వజన్మ తపఃఫలం వలన ,,అద్భుతమైన కృష్ణానుభవం కృష్ణ సాక్షాత్కారం , కృష్ణ పరిష్వంగం, సాధించారు!!  భక్తుల యోగ్యత ను బట్టే, వారికి అందించే  పురస్కారం ఉంటుంది కదా !, ఒక నాటి వారి భక్తి ప్రపత్తులు ఈ నాడు వారికి తరగని పెన్నిధి, లా వాసుదేవుని సన్నిధి ప్రాప్తించింది,,!
*"పరమానందం " అంటే కృష్ణుని గురించిన చింతన, అనుభవ సారమే కదా! అది సాధించిన గోపికల గోపాలుర కీర్తి అమరము, అనుపమాన ము!!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...