Thursday, December 26, 2019

కృష్ణ లీలలు 2

Dec 24, 2019 Karimnagar
కృష్ణ లీలలు 2
________&____
_ఒకరోజున ,,5 ఏళ్ల వయసు లో ఉన్నచిన్ని  కృష్ణయ్య  ,యమున ఒడ్డుకు తన తోటి గోపాలుర తో ఆడుకుంటూ ఉన్నాడు,,
ఒక గోపిక,  అటుగా చూస్తూ ,వచ్చింది కడవ తో నీళ్ళు తీసుకొని వెళ్ళడానికి!!,, నిజానికి ఆమె వస్తోంది కృష్ణుణ్ణి చూడటానికి ,! అలా కృష్ణయ్యను చూస్తూ నీటి ఒడ్డున కొంత సేపు గడిపి , నిట్టూరుస్తూ వెళ్ళి పోతుంది,!, కానీ, ఒక్కసారి కూడా ,ఆమెకు కృష్ణుని తో మాట్లాడటం కుదరడం లేదు,  అయినా,ఆమె నిరాశ పడలేదు !!, అలా రోజూ బాల కృష్ణ సుందర రూపం చూస్తే చాలు అన్న  ఆశ ,!!  పైగా,ఒక్కసారైనా ,
కృష్ణుడు కన్నెత్తి కూడా చూడలేదు , ఆమెను !
,  ఈ రోజున ,ఆమె,  నీటితో బరువుగా  ఉన్న కడవను ఎత్తడానికి ప్రయత్నిస్తూ  అవస్త పడుతోంది ,
,,  అంత దూరాన ఉండి కూడా, ఆమెను గమనిస్తున్న  బాల కృష్ణుడు   చటుక్కున  వచ్చి ,, నవ్వుతూ
""బరువుగా ఉందా కడవ?"
అన్నాడు
ఆమె సంతోషంతో  పొంగి పోయింది , తన కల ఫలించింది ,అనుకుంది,! కృష్ణా! నా బంగారు తండ్రీ,! ఇప్పుడు కరుణిం చావా?? ఎన్నాళ్లు గా  ,నీవు నా కోసం  పరుగున వస్తావని ,ఎదురు చూస్తూ వస్తూ ఉన్నానురా కన్నయ్యా ,!
""కొంత సహాయం చేయరాదా కృష్ణా??""
అంది
""అమ్మో !ఇంత చిన్న పిల్లాడిని!! అంత పెద్ద కడవ ఎత్తనా!! వామ్మో!!"నా వల్ల కాదు !""
ఆమెకు  కృష్ణుని ముద్దు మాటలు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి,దీనికోసమే కదా ఇన్ని రోజులు,అక్కడ, ఆమె పడిగాపులు పడింది
""మరి ఎందుకంత వేగంగా పరిగెత్తి వచ్చావు, కృష్ణా??" ఆసరా కు కాక??"" అంది ప్రేమగా,,
,""పాపం !ఒక్క దానివి కదా ,! కాస్తా నిన్ను  మాటల్లో పెడితే , అది నీకు   బరువు అనిపించదు కదా !""
""ఓహో !మాటల తో బరువు తగ్గి స్తావన్న మాట , నీవు!""
""అంతే కదా! అదిగో చూడు! , నీవు ఒక్కదాని వే ఎత్తే శావు  గదా!"" చూశావా ,నేను రాగానే ఎంత బలం వచ్చిందో!""
",,"నిజమే సుమా ,,కృష్ణా ,! నీతో మాట్లాడుతూ ఉంటే అసలు బరువే తెలియ దురా కన్నా  ! ఏం మాయ చేస్తుంటా వో గానీ!""
""నేను చెప్ప లా! నేను రావడం , నీ కు హాయిగా  ఉంటుందని!""
""నిజంగా, నీ మాటల్లో ఏదో గారడీ ఉంది రా కృష్ణా!""
""అది సరే,, కానీ,,రోజూ వస్తావు కదా నీళ్లకు,! మరి ఈ రోజు ఎందుకు బరువని పించిం ది. ?!""
""నిజం చెప్పనా ,కృష్ణా !""
""నా ముందు నీవు అబద్దం చెప్పలేవు కదా!""
""ఎంత గడుగ్గాయివిరా కృష్ణా !,, అయినా  నిజం చెప్పావు, రా కన్నా! నీతో మాట్లాడాలని ఎన్నో సార్లు ఆనుకుంటు ఉంటే , ఈ రోజు దొరకవు కదా,,! నిన్ను చూస్తూ ఉంటేనే అనందం! ఇక నీతో మాట్లాడితే నా పరమానందం సుమా !!
ఇంటికి వెళ్ళినా నీవే మనసంతా నిండి ఉంటావు !
బంగారు కొండా!! నీవు రావాల నే  , ఈ నీటి కడవ బరువు గా ఉన్నట్టు నటిస్తూ ఉంటే, నా మనసులో మాట గ్రహించావు,వచ్చావు , కదా కన్నా!!""
ఎందుకు నా కోసం అంత బెంగ గోపికా,?
ఎందుకో ,మాటల్లో చెప్పలేను కృష్ణా!!ఒక్క ,నేనే కాదు ,నీవంటే పిచ్చి ప్రేమ, ఈ రేపల్లె వారికందరికీ !! తెలుసా నందకుమారా ??
,,,నీ వద్ద ఏముందో,ఏమీ లేదో,తెలియదు గానీ,  కృష్ణా ,,మా అందరి హృదయాల్లో నీవు ఉన్నావురా బుజ్జి తండ్రి,! యశోద తనయా!! ఏం చెయ్యను చెప్పు? ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి ఉండలేక పోతున్నా  నేనైతే,, నాన్నా !"
,, ""అవును కదా ,!దానికి  నేనేం చేయను చెప్పు??""!,,, నీవు ,పిలువకున్నా  వచ్చాను కదా ! ఇందుకు నీవు  నాకేం ఇస్తావు ?""
,,,ఇంకా నాకంటూ, ఏముంది కృష్ణా, నా వద్ద,  ? అంతా నీవే, అంతా నీదే కదా! అయినా,
""కృష్ణా !నీకూ ,నీ బృందానికి సరిపడా వెన్న, జున్ను ,,పెరుగు అన్నీ ఇస్తాను !!?? కానీ, బదులుగా  నీవు నాకు చిన్న ముద్దు ఇవ్వాలిరా కన్నా! సరేనా ??""
""అంతే కదా ! తీసుకో ,""
"" ఒకటి కాదు ,,రెండు !""
""ఓస్ ,,అంతే కదా !""
""అదుగో, మాటల్లో వచ్చేసింది ఇల్లు ,!! కృష్ణా !""
""సహాయం చేయనా , కడవ దించనా  నేను ?
  ""పెద్ద ఆరిందాలా, అక్కడ , కడవ ఎత్తమంటే అంత గొప్పకూ పోయావు!! మరి, ఇక్కడ, బరువు దింపడానికి నీవే తయారయ్యావు , ఏమిటి కథ ,,కృష్ణా??
""నేను బరువులు దించేవాడినే కానీ ,,ఎత్తే వాడిని కాదు సుమా!""
,, ఎందుకలా లేని పోని బరువులు,ఆశలు  మనస్సులో పెట్టుకొని, అనవసరంగా బాధపడుతూ  ఉంటారు! మీరంతా !!! అవన్నీ పెట్టుకోమని నేను చెప్పానా మీకు ,, ఎత్తడానికి !!
, అంతగా మోయలేక పోతే, నన్ను కోరితే, అప్పుడు వస్తాను ,, సహాయం చేయడానికి !!, అంతే""తెలుసా!!"
""అవునురా , కృష్ణా!! నిన్ను చూస్తే ,ఐదేళ్ల పిల్లాడి లా కనబడ తావు ,కానీ !! ఇంత పెద్ద వాళ్ళం !,,మాకే అంతుబట్టని  పెద్ద పెద్ద  విషయాలు , ఇవన్నీ   నీకు ఎలా తెలుస్తూ ఉంటాయి రా కృష్ణయ్యా ? ఆశ్చర్యంగా అంది,
""ఇదిగో గోపికా,,!నీ ఇంటికి నిన్ను  చేర్చాను,! తల మీది బరువు కూడా  దింపాను , ! నీవు కొరుకున్నట్టుగా పిలవకుండా నే వచ్చాను కదా !!,ఇక వెళ్ళి మా స్నేహితులతో ఆడుకోనా!"?"
అంటూ అమాయకంగా అడుగుతూ ఉన్న చిన్ని కృష్ణుని ముగ్ద మోహన సుందర రూపాన్ని చూస్తూ,పరవశిస్తూ ,, ఆ
గోపిక  పరమానందం తో,, ఆ అందాల  కృష్ణయ్యను తన రెండు చేతులతో ఎత్తుకొని, హృదయానికి గట్టిగా హత్తు కుం ది,, ఎంతో ఆనందంగా !
ఆమె  గుండె ల్లో అనందం పాల పొంగులా పొంగి పోయింది,, ఆ చిన్నారి కృష్ణయ్య ,,అల్లరి కన్నయ్య నును లేత పాల  బుగ్గల పై గట్టిగా  ముద్దు లు పెట్టుకుం టూ ఉంటే ,,ఆమె హృదయం పులకించి పోయింది ,, అమితానందం  పొందింది ఆ గోపిక ! ఆనందా మృత
'మధురానుభూతి తో ,,బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ,కళ్ళు మూసుకొని, తన్మయ స్థితి లో లీనమై న ఆ గోపిక కి ఎప్పుడు ఆ బాల కృష్ణుడు తన చేతుల్లోంచి జారి పోయి వెళ్ళి పోయాడో తెలియదు !
క్రిష్ణ రూపంలో అంత గమ్మత్తు, అంత సమ్మోహన శక్తి  ఉంటుంది, కృష్ణ భక్తులను ఉన్మాదుల ను చేస్తుంది,
అలాంటి దివ్యమైన  కృష్ణ తత్వం తో నిండి ఉన్న ప్రతీ భక్తుని మనసూ ఒక బృందావన దివ్య సీమయే కదా !!
శ్రీకృష్ణుని జగన్మోహన మంగళ కర సుందర దివ్య రూప లావణ్య వైభవం !భావిస్తే చాలు హృదయం పులకరించి పోతుంది !!,,సృష్టి లోని  సమస్త  కమనీయ రమణీయ సురుచిర సౌందర్యరాశి  అంతా ఒక్కచోటే విగ్రహం గా,, పోత పోసిన విధంగా విరాజిల్లే తేజోమూర్తి, షోడశ కళా పరిపూర్ణ అవతారము  ,సచ్చిదానంద  స్వరూపుడైన శ్రీకృష్ణ
పరమాత్మ ,ఎవరిని ఎప్పుడు ఎలా కరుణిస్తా డో , కదా !!
ఆ దేవదేవుని కరుణను కోరుకుందాం!!
ఆ గోపాల,కృష్ణయ్య తన  అపార కరుణా కటాక్ష వీక్షణాలను  మనపై వర్షించమని వేడు కుందాము 
హరే కృష్ణ హరే కృష్ణా!!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...