Thursday, December 26, 2019

సుందరకాండ, ఎందుకు సుందరం

Dec 20, 2019 Karimnagar
సుందరకాండ, ఎందుకు సుందరం అయ్యింది??
_____________
*""మనోహి హేతువు సర్వేషాం!"అనగా మనం చేస్తున్న అన్ని పనులకు ముఖ్య కారణం"" మనసే"" కదా! అనగా,, మనం చేసుకున్న
పాప పుణ్యాల కు కారణం ఈ  మనస్సే కదా!
మనసుతో సంబంధం ఏర్పడితే నే, ఇంద్రియాల లో జ్ఞానం ప్రకోపించ బడుతుంది !
అందుకే "మనకు "మనసే శతృవు"" మనసే మిత్రువు""కూడా!;
ఇది" గీతా వాక్యం!"ఉదాహరణకు,,
ఇద్దరు స్నేహితులు నగ రానికి వచ్చికలుసుకున్నారు అనుకుందాం !;
, ఒకరు సినిమాకు, మరొకరు పురాణ శ్రవణా నికి  విడిగా వెళ్ళారు,,!
సినిమాకు వెళ్లినవాడు, అయ్యో నేను పురాణ శ్రవణం చేస్తే బావుండేది, రామా కృష్ణా అని అంటే, వింటే, ఇంత పుణ్యమై నా దక్కేది కదా, డబ్బు ఖర్చు! టైమ్ వేస్ట్  అనుకున్నాడు
ఇక పురాణం వింటున్న వాడు , మనసు ను సినిమా వైపు ఉంచాడు , ఏముందీ ఈ పురాణం లో హాయిగా సినిమా చూస్తే ఎంజాయ్ చేసే వాణ్ణి గదా అనుకున్నాడు
ఇక్కడ పురాణం వింటే వచ్చే పుణ్యం ఎవరికీ వస్తుందో మనం సులభంగా చెప్పవచ్చు ను
అందుకే,అన్నింటికంటే,""మనసే కీలకం ""
హనుమ అనుకున్నాడు కూడా, ఇలా స్త్రీలను చూడటం లో తన బ్రహ్మచర్యానికి భంగం కలిగిందా, తాను పొరబాటు చేశానా అని ఆత్మవిమర్శ చేశాడు
లేదు, నా మనసు ఎక్కడా చలించలేదు ,ప్రయత్నం  కేవలం పరదేవతా దర్శనం కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నాడు, అది కూడా  ఎవరికి ఇబ్బంది కలిగించకుండా నే
ఇంతలో రావణుని చూశాడు అతడి ప్రక్కనే దేవతా స్త్రీల సౌందర్యాన్ని కూడా తల దన్నే అందమైన స్త్రీ నీ మండోదరి ని చూసి ఆనందం తో ఎగిరి కుప్పి గంతులు వేశాడు
తర్వాత మళ్లీ ఆలోచనలో పడ్డాడు , సీతా మాత అలా స్వర్ణ ఆభరణాలతో అలా రావణుని ప్రక్కనే హంసతూలికా తల్పం పై పడుకొని ఉంటుందా,,
ఉండదు! ఆమె సీతా మాత కాదు నేను ఎంత పొరబాటు పడ్డాను , అమ్మా క్షమించు అంటూ పరితాపం చెందాడు
అయితే ఇక్కడకూడా హనుమ చేసిన పొరబాటు లేశం కూడా లేదు
ఒక తల్లి కొడుకు రాక కోసం ఎదురు చూస్తోంది , సాయంత్రం 5 గంటలకు వస్తాడు అన్న కొడుకు 6, అయ్యింది. 7 దాటింది,8కూడా అయ్యింది
ఇప్పుడు తల్లి ప్రేమ కీడును శంకిస్తు ఉంటుంది , కొడుక్కు ఏమైనా జరగరానిది జరగలేదు కదా, అని  వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉంటుంది ,
ఎందుకంటే తల్లికి కొడుకు పైగల అపారమైన ప్రేమ , కడుపు తీపి
అలాగే మనకు ఇష్ఠమై న వస్తువు దూరం అయితే,దొరక్కుండా పోతే,మనసు పరి పరి విధాల కొట్టుకుంటుంది కదా
మన హనుమ విషయంలో కూడా ఇలానే జరిగింది ఇక్కడ
, పండితుడు కూడా మాయ కు వశుడే, భ్రమల కు లోనౌ తుంటాడు అలా
అందుకే హనుమ వలె ఎప్పటి కప్పుడు అత్మ శోధన చేసుకుంటూ చేసేది తప్పా ఒప్పా అనుకుంటూ సదనట్ సాగిస్తూ ఉండాలి
సముద్రాన్ని దాటే ముందు హనుమ కేవలం రాముడిని మాత్రమే ప్రార్థించాడు, సీతమ్మ ను కాదు
ఆ విషయాన్ని హనుమ ఇప్పుడు గుర్తించాడు. అంగుళం మేర విడవకుండా వేదకినా అమ్మ కనిపించక పోతే,ఇక భయపడ్డాడు , బాధ పడ్డాడు , విపరీతంగా దుఃఖించాడు కూడా, ఒక దశలో మరణమే శరణం అనుకున్నాడు,
కానీ మరణం ఎన్నడూ ఏ సమస్యకు పరిష్కారం కాదు,
హనుమ కుషాగ్రబుద్ది కలవాడు, వేద వేదాంగాలు చదివిన వాడు ,అందుకే
మళ్లీ అత్మ విమర్శలో పడ్డాడు ,
మానవ ప్రయత్నం ఎంతగా చేయాలో మనం కూడా అంతగా చేస్తూ వుంటాం
ఫలిస్తే సరే పొంగి పోతాం,ఫలించక పోతే కృంగి పోతాం అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు
భగవంతుడా ,నీదే భారం అంటూ దండాలు పెడుతూ ఉంటాం
అదే ఇక్కడ హనుమ విషయంలో జరిగింది ,
ఎంత చెయ్యాలో అంత చేశాడు, ఏడుస్తూ కూర్చోడం బుద్దిమంతు డి లక్షణం కాదు,
తప్పు ఎక్కడ జరిగింది
అమ్మ లంక లో ఉంది ఇది నిజం కాని కనిపించడం లేదు తనకు ఎందుచేత
సీతా మాతను చూడనిదే తిరిగి వెళ్ళే సమస్య లేదు, అని నిర్ణయం తీసుకున్నాడు
ఒక ద్వారం తోరణం పై నిదానంగా ఆలోచిస్తూ ఉండగా తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది
తల్లీ, జగన్మాత జగజ్జననీ నేను నిన్ను చూడ గలను అనుకున్న నా అహంకారాన్ని అణచి వేశావు
నీ కృప లేనిదే , నీ ఆజ్ఞ లేనిదే నిన్ను  దర్శించ లేను అని  ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది
తల్లీ జానకీ మాతా, నన్ను క్షమించు , నా తప్పు మన్నించు, దయచేసి నీ దర్శనం ఇప్పించూ నిన్ను చూడాలన్న తపనతో పరితపించే ఈ దాసుని కనికరించి నీవు ఉన్న చోటును సూచించు మాతా అంటూ అమ్మతో బాటుగా సకల దేవతలను మార్గదర్శనం చేయమని ప్రార్థించాడు భక్త హనుమ.!
వైరాగ్యం తో నిండిన పరితప్త హృదయం తో ఉపాసనా దృష్టితో తన ఇష్ట దైవాన్ని , సీతా మాతను , బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలను ఆర్తితో వేడుకుంటూ ప్రార్థించాడు.
వెంటనే చంద్రకాంతి లో అల్లంత దూరాన ప్రకాశిస్తూ ఉన్న అశోక వనం అగుపించింది
తక్షణమే వెళ్లి చూడగా అక్కడ శింశుపా వృక్షము క్రింద కూర్చుని  దీనంగా ఖేద వదనం తో ఉన్న అత్యద్భుత సౌందర్య రాశి లా వెలిగిపోయే ఒక స్త్రీ మూర్తిని చూసి సంతోషం తో పొంగి పోయాడు అతడు,
హనుమ, చేసిన ఇలాంటి శరణాగతి అలనాటి గజేంద్రుడు కూడా చేశాడు. తన కాలు పట్టి నీళ్ళలోకి లాగుతూ ఉన్న మొసలి తో వేయి సంవత్సరాలు ఘోరంగా పోరాడాడు ఫలితం కనిపించలేదు, ఇక పరమాత్ముని కి మొరపెట్టుకున్నాడు ,
కలడు కలండ నెడు వాడు కలడో లేడో, అంటూ కొంత సందేహం తో వేడుకుంటే మహా విష్ణువు రాలేదు
ఎప్పుడైతే, నీవే తప్ప ఐతః పరం బెరుగ , మన్నింపన్ దగున్ దీనునిన్ , అని సంపూర్ణ శరణాగతి చేయగానే క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా వచ్చి, మకరిని చంపి, కరిని కాపాడాడు.
ద్రౌపదీ వస్త్రాపహరణం సమయం లో ఆమె కూడా రెండు చేతులూ పై కెత్తి అంజలి ఘటించి హే కృష్ణా అంటూ రోదిస్తూ వెడుకొగానే  కరుణించి ఆమె మొర విని రక్షించాడు ,
రుక్మిణీ దేవి కూడా తనను తాను పూర్తిగా అర్పించుకుంది, నీ కోసమే నిరీక్షణ, నీ కోసం జన్మించాను నీవు లేని జీవితం గడప లేను, నిన్ను తప్ప మరొకరిని వివాహం చేసు కో ను, నీవు నిరాక రించిన నా ఈ  జీవితం తో   నాకు పని లేదు, అంటూ జీవాత్మ, పరమాత్ముని తో చేరుకోడానికి శరణాగతి చేసిన విధంగా  రుక్మిణి శ్రీకృష్ణుని కి లేఖ ద్వారా తెలియజేసింది
హనుమ కూడా చేయవల్సిన పురుష ప్రయత్నం చేశాడు సీతామాత ను కనుగోవడానికి ,, తన ప్రయత్నం వృథా కాగానే అమ్మను శరణు వేడుకొన్నాడు,
తల్లీ , నా ఇంద్రియాలు మనసూ బుద్ది ఇవన్నీ  పనిచేయడం లేదు, నేను నిన్ను చూడడం కాదు, అమ్మా నీవే నన్ను దయతో చూడాలి , నా శక్తి సామర్థ్యాలు నిన్ను దర్శనానికి సరిపో వు, మాతా ! అంటూ దీనంగా శరణాగతి చేసుకున్నాడు
అప్పుడు మహాలక్ష్మి,ి సీతా మాతకు అనుగ్రహం కలిగి తన జాడ తెలిపింది, అంతవరకూ కనపడని అశోకవ నం అతడికి అగుపడెలా చేసింది,,
ఉపాసకులు ఆ విధంగా సంపూర్ణ విశ్వాసాన్ని ప్రదర్శిస్తే నే తప్ప దైవానుగ్రహం ప్రాప్తించ దు ,
శక్తిని చైతన్యాన్ని వేరు గా చూడలేము కదా ,
అగ్ని నుండి వేడిమిని ,చంద్రుని నుండి వెన్నెలను ,సూర్యుని నుండి కాంతిని ఎలా వేరు గా చూడలేమో , అలాగే,సీతారాములను, లక్ష్మీ నారాయణుల ను, గౌరీ శంకరుల ను, రాధా కృష్ణుల ను ,అరుంధతి వశిష్ఠుని లను వేరుగా భావించలేము 
అందుకే సీతారాములను కలిపి పూజించాలి, ఒక్కచోట చేర్చి కల్యాణం జరిపించాలి, ఎట్టి పరిస్థితిలో కూడా వేరుగా భావించడం, వేరుగా సేవించడం చేయవద్దు
ఒక్క రాముణ్ణి మాత్రమే కోరిన శూర్పణఖ ,ఒక్క సీతమ్మ ను కోరిన రావణుడు బాగుపడలేదు
భద్రాద్రిలో రాముడు తన తొడపై సీతమ్మను కూర్చో బెట్టు కొని ఉండటం మనం చూస్తున్నాం కదా. ,

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...