Dec 11, 2019 Bangalore
""ప్రసాదం అంటే ఏమిటీ ??"
_________________
మనిషి తాను తలచినట్టుగా జరగక పోతే, గుండెలు బాదుకుంటూ విలపిస్తూ ఉంటాడు,!! మెదడు లో ఆలోచనలు పిచ్చిగా పరుగెత్తుతూ ఉంటాయి, !!కారణం,,? కర్మ ఫలాలు అతడికి అనుకూలంగా ఉండటం లేదు !!!
కానీ అలా అతడు ఊహించినట్టు గా పొందడం అతడి చేతుల్లో లేదు, కదా,, ఆ ఫలితం కేవలం భగవంతుడి చేతుల్లో నే ఉంటుంది, మనిషి చేతుల్లో ఉండదు, ఎలా పడితే. అలా తీసుకోడానికి !!
,,పరమేశ్వరుడి వద్ద నుండి ఫలితం ప్రసాదంగా వస్తుంది, అనే భావన, అత్యంత, అతి పవిత్రంగా,, అద్భుతమైన శక్తి ప్రభావం కల దై ఉంటుంది!!
ఉదాహరణకు,, తిరుపతి లడ్డూ, !!స్వామి దర్శనం కాగానే ప్రాంగణం లో ప్రసాదం గ్రహించి,లడ్డూ కొనుక్కుని ఇంటికి తీసుకొస్తాం,!
దానికి అందరికీ పంచుతాము !!,వారు, భక్తి శ్రద్ధలతో శ్రీవారి లడ్డూ కు నమస్కరిస్తూ ,, కళ్ళ కద్దు కొంటూ ,ఎంతో వినయ విధేయతలతో స్వీకరిస్తూ ఉంటారు, భక్తులు!!
కారణం ,,!? "అది భగవద్ ప్రసాదం,"" సాక్షాత్తూ పరమాత్ముని సన్నిధానం నుండి వచ్చింది!!
""ప్రసాదం" అనగానే మన ఆలోచన లో ఎంత గొప్ప మార్పు వస్తూ ఉంటుందో,, మనం గమనించాలి !!
అది ""ప్రసాదము ""అని తెలిశాక దాన్ని పడేయవు,!!
అది గ్రహించే సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య మంగళ విగ్రహ స్వరూపము నీ హృదయం లో మెదుల్తూ ఉంటుంది!!
,,,,ఆ క్షణంలో నీ మనసు ప్రసన్నత భావంతో నిండి పోయి మదిలో పరమానందాన్ని కలిగిస్తూ ఉంటుంది, !!
ఈ విధంగా ఏ దేవుడు, ఏ దేవత పేరు మీద ,,ఏ పదార్థం "" ప్రసాదం""గా వచ్చినా, అపుడు నీవు బజారు లో ఉన్నా సరే ,, కాళ్ళకు ఉన్న చెప్పులు విడిచి ,,,మొక్కుతు ప్రసాదాన్ని సంతోషంగా గ్రహిస్తు ఉంటాం! ఇది మన హిందూ సంప్రదాయం !!
""నాకు వద్దు !""అని ఎవరూ త్రునీకరించరు ,,!!
అలాగే ,, చేసిన పనులకు ,,అనుగుణంగా,మనకు అందే కర్మ ఫలాలు కూడా అదే పరమేశ్వరుడి నుండి వస్తూ ఉన్నాయి!!
,,,,దేవాల యంలో పూజారి,, స్వామికి నివేదించిన నైవేద్యాన్ని ప్రసాదంగా భక్తులకు పంచుతూ ఉంటాడు,!!
,,,ఆ పూజారి మన స్నేహితుడే కావచ్చు,!! అతడికి చెడు అలవాట్లు ఉన్నాయని నీకు తెలియ వచ్చు,,!!
,, కానీ ఎప్పుడైతే అతడి చేతుల మీదుగా భగవద్ ప్రసాదం వస్తూ ఉంటే,,, మాత్రం,,, దాన్ని కళ్ళ కధ్దుకుని ,,భక్తితో గ్రహిస్తూ, తింటూ ఉంటాం!!
ఈ విధంగా మనం చేస్తున్న కర్మలకు ఫలితాలు ఏ రకంగా వచ్చినా, దాన్ని ఒక ""ప్రసాదం""గా భావిస్తే, జీవితంలో ఏ బాధలూ ఉండవు కదా!!
""ఏది వస్తుందో, ఏది పోతుందో, ఎందుకు వస్తుందో, ఎందుకు పోతుందో, అది మాత్రం,, మన జ్ఞానానికి అందని విషయం,,!!
అవి,, నీతో ఉండవల్సినవి కనక నీతో ఉంటున్నాయి,!!, పోవాల్సి నవి కనుకనే పోతూ ఉన్నాయి,!
ఎందుకని? అవి నీ కర్మ ఫలాలు , కనుక !!
,అవి నీకు లాభం కలిగించినా ,,నష్టం కలిగించినా. ప్రసాదా లే,,!! ఇకపోతే, సుఖం ఇచ్చేవి,, ఫలితాలలో దుఃఖం ఇచ్చేవి, అంటూ,రెండూ వేరుగా ఉండవు ,!
అది కేవలం నీ భావనలో,, ఊహించు కొనేవిధానం లో ఉంటుంది ,,,!అంతే!
వేసిన ప్రతీ బాల్ కు వికెట్ పడి పోతూ ఉంటే, రెండు ఓవర్ లలో క్రికెట్ ఆట అయిపోదా,? ఔటయ్యే పరిస్తితి ఏర్పడే దాకా బౌలింగ్ చేయాల్సిందే ,,,!వాడు క్రికెట్ ఆడుతూ ఉండాల్సిందే!! అంతే !!
అనుకున్నట్టు ప్రతిదీ జరిగితే , సంతోషం !
,, నిజానికి ,,ఏ కర్మకు ఏది ఫలమో ఎరిగిన వారు ఎవరు?? ఆ దేవుడు తప్ప !!
అందుచేత ,,,ఏది వచ్చినా, ఎలా వచ్చినా నీకు అది ""ప్రసాదం 'అని గ్రహించాలి!
ఈ ""రాగద్వేషాలు ""మనలో ఉన్నంత కాలం ఈ కర్మ ఫలాలు మనల్ని బందిస్తూ నే ఉంటాయి ,!
కోరింది అయినా, కోరని ది అయినా, ఇష్టం అయినా, కాకున్నా, వచ్చిన కర్మ ఫలాన్ని ప్రసాదం అనుకోవాలి! అది మనిషికి ఉండాల్సిన వివేకం , విజ్ఞత!!
ఒక సాధారణమైన మనిషి అయిన పూజారి ఇచ్చే నైవేద్యాన్ని నీవు ఎంతో గౌరవ మర్యాదగా అంత భక్తితో తీసుకుంటున్నప్పుడు , మరి, సాక్షాత్తూ భగవంతుని అమృత హస్తాల మీదుగా వచ్చే కర్మ ఫలితాలను ప్రసాదంగా ఎందుకు అంగీకరించ లేక పోతున్నావు. ?
""ప్రసాదం" అనే పదానికి ఏ భాషలోనూ పర్యాయ పదం కానరాదు, అందరూ దానిని ప్రసాదం అని అనాల్సిందే ! అది అంతే !!
""ప్రసాదేతి ప్రసన్నత,""!! అనగా ప్రసన్నత, అనందాన్ని ఇచ్చేదే ప్రసాదం !;
,,, చేసే వ్యాపారం లో లాభం ప్రసాదం,,!! నష్టం ప్రసాదం!
పరీక్షల్లో ఉత్తీర్ణత అయ్యాడు ప్రసాదం,!! కాలేదు ప్రసాదం!!, ఆరోగ్యం గా ఉంది ప్రసాదం,!! కాదు చెడిపోయింది ప్రసాదం,!!
కొన్నేళ్ళు జీవించాడు ప్రసాదం!! అర్ధాంతరంగా మరణించాడు ,,ప్రసాదం !!
ఇలా దొరికే, లభించే ప్రతిదీ ప్రసాద మే,!!,
,,ఎందుకంటే భగవంతుని విజ్ఞతను,సర్వాజ్ఞత ను నీవు తప్పు పట్టలేవు,! అంటే,, అతడి తీర్పు ధర్మ బద్ధంగా న్యాయ సమ్మతంగా పరమ సత్యంగా ఉంటుంది!!
అందుకే మన సనాతన వైదిక ధర్మం లో ఈ ప్రసాదము అనే పవిత్రమైన పదం తో పేర్లు కూడా పెట్టు కుంటు ఉన్నా ము ,,
శివ ప్రసాద్, రామ ప్రసాద్, విష్ణు ప్రసాద్,, క్రిష్ణ ప్రసాద్, దుర్గాప్రసాద్, హరి ప్రసాద్, గురు ప్రసాద్,,!!
ఇవన్నీ భగవద్ ప్రసాదా లే,,! ప్రసాదం అనే పదం మన జీవిత పరమార్థం కావాలి అనే పవిత్ర భావన అప్పటి మన సమాజంలో ఉండేది
ఆడపిల్ల పుట్టినా, ,,మగ పిల్లాడు పుట్టినా ,,,"ప్రసాదం" గా భావించారు అప్పటివాళ్ళు!
,, నేడు మనం టీవీ లో పేపర్ల లో చూసే అన్యాయాలు అశ్లీల ప్రవర్తనకు కారణం,,, వాటిని, గత జన్మల మన కర్మ అనుసారం గా పరమేశ్వరుడు మనకు అనుగ్రహించిన ఫలితా లని భావించక పోవడమే!!
, ఈ నాడు సమాజం లో చూస్తున్న రుగ్మతలకు, చెడు ప్రవర్తనకు మూల కారణం , మన సనాతన హైందవ ధర్మ శాస్త్ర సిద్దాంతం ప్రకారం ,, మనిషి మనుగడకు, ప్రశాంత జీవనానికి ఆధారభూతమైన , """వేదాంతము,, ""నేటి సగటు మనిషికి అతని ఆధునిక జీవితంలో దూరం కావడమే!
అందుబాటులో ఉండి కూడా, అందుకోకుండ ,ఆ జ్ఞానం లేకుండా ,అందని ఎండమా వి లాంటి ఇతర సంప్రదాయాల వ్యామోహం వైపు పరుగులు పెడుతూ ఉన్నాడు!!
అందుకే ""ప్రసాదం ""విలువ తెలుసుకుందాం , ప్రసాదంగా జీవితాన్ని గడుపు దాం !!!
మంచీ చెడుల ను కలిపి ప్రసాదంగా అందరితో కలిసి ఆస్వాదిస్తు , ఆనందమయ జీవనాన్ని గడుపు దాం;!
స్వస్తి!!
హరే కృష్ణ హరే కృష్ణా!
No comments:
Post a Comment