Dec 17, 2019 Karimnagar
బ్రహ్మానంద పరిస్తితి, అంటే,
భాగము ,,3
____________________
"అనందం" అంటే పరమాత్మ తో భక్తుడు ఏర్పరచుకునే మధురాతి మధురమైన ప్రేమానుబంధం!
"అనందం "అంటే దైవాన్ని త్రికరణ శుద్ధితో భావిస్తూ సేవించడం, ! నిత్యం పూజించడం,! భక్తితో రచనలు చేయడం, !భక్తితో స్తుతించడం,! కీర్తనలు ఆనందంగా గానం చేస్తూ ఉండడం,! షోడశోచారాలతో. స్వామిని మనసారా, తనివారా చేతులారా సేవించడం,! అదే భగవన్నామ స్మరణం తో జీవిస్తూ ఉండడం !,ఇలాంటి నిరవధిక భగవద్ చింతన నే "పరబ్రహ్మ గురించిన అనందం" అంటారు!!
ఇదే అనుబంధం నిత్యం మనిషి తన అనుభవానికి తెస్తే *"బ్రహ్మానందం"" అంటాము,,
,, ఈ విధమైన అనందం ,,భగవంతునికి భక్తునికి మద్య విడదీయరాని ఒక ""అవినాభావ సంబంధం"గా జీవితాంతం
పెనవేసుకు పోతుంది,,!
"అది సాధ్యమా??"" అంటే ముమ్మాటికీ సాధ్యమే,! సాధకునికి తగిన భావ సంపత్తి, కృషి, పట్టుదల, గురు కృప,"ఉండాలి,,! ""దైవం ఉన్నాడు,,, సదా తనని గమనిస్తూ, బాధ్యత వహిస్తూ, శిక్షకుడు మరియు రక్షకుడై ఉంటున్నాడు!"" అనే ధృఢ విశ్వాసం ఉంటే, ఆ పరమేశ్వరుడు, భక్తుల పాలిట ""కొం గుబంగారమై" బ్రతుకును ఆనందమయం చేస్తాడు,,
""భగవంతుడు అంటే ఎవరు? " ఎలా ఉంటాడు ?? ఎలా కొలవాలి ?? అనే పలు రకాల సందేహాలకు, విజ్ఞులు సమాధానంగా ఎన్నో వివరాలు సూచించారు,,!
మనకు అతడి స్వరూపం సులభంగా అర్థం కావాలంటే,"" గుణావయవ రహిత నిర్గుణ నిరాకార సచ్చిదానంద స్వరూపుడు "గా గుర్తించాలి!! కావున, అతడిని, ""సత్యం, జ్ఞానం అనంతం"", గా ఉండే బ్రహ్మ పదార్థంగా గా తెలుసుకోవాలి..!
తమ మనసును, ఆనందంగా , ప్రశాంతంగా, ఉంచుతూ, నిత్యం దైవ ధ్యాసతో జీవితం గడిపే ప్రతీ మనిషి "బ్రహ్మ స్వరూపమని"భావించ బడతాడు . !!
త్యాగరాజు, గారు, నాద బ్రహ్మ ,!! తాను, అద్భుతంగా పాడుతూ, రాగ తాళ యుక్తంగా సమకూర్చిన ఎన్నో కీర్తన లలో "పంచరత్నాలు "అనే 5 కీర్తనలు మాత్రం, ఆయనకు గల అపారమైన రామభక్తి కి మకుటాయమానం గా నిలిచి, జగత్ ప్రసిద్ది ని పొందాయి ,,
అందులో ఒకటి, ""ఎందరో మహానుభావులు ,, అందరికీ వందనములు,,!""
ఈ, మధుర సంకీర్తనలో, వారు అంటారు కదా,,
""చందురుని మించు అందచందములు గల శ్రీరామచంద్రుని అపురూప సౌందర్యాన్ని ,, భక్తులు, తమ హృద య కమలాలలో అందంగా,పరమానంద భరితంగా, ,నిలుపుకుంటూ,," బ్రహ్మానందం"" అనుభవిస్తూ ఉంటున్నారు. నిజంగా అలాంటి ""నిజ భక్తు లే మహానుభావులు కదా !అంటూ వారికి ప్రణామాలు అందజేస్తాడు, అద్భుతంగా "శ్రీ రాగం"" లో ముగ్ద మనోహరంగా, రాగ రంజి తంగా అలాపిస్తూ, రాముని అలరిస్తూ, ఆ బ్రహ్మానందాన్ని తాను అంతరంగం లో అనుభవిస్తూ వర్ణించాడు ఆ కీర్తనలో,,!!
అలా తన " హృదయ సంపదను" బ్రహ్మానందం" అనే సుమధుర పుష్ప సౌరభాల తో ఆవిష్కరించాడు ఆ కవి బ్రహ్మ శ్రీ త్యాగ రాజు ,!
,, తన ఆరాధ్యదైవం అయిన ఆ ""శ్రీరామ చంద్ర ప్రభువు ""యొక్క అద్వితీయమైన దివ్య రూప సౌందర్య వైభవాన్ని ఆయన తన్మయత్వంతో అంతరంగం లో దర్శించిన కమనీయ దృశ్యం అది!!
ఇలా " సర్వాంతర్యామి" గా ప్రకృతి యందు జగతిలో భాసించే ఆ జగన్మోహన సౌందర్య రూపాన్ని, ""రసో వై విష్ణు" , లా పరమాత్మ ఆరాధన , అనందానుభవం అనే మధుర రసాన్ని ఆస్వాదించడం , ""అనందం ""అనుకుంటే,, అఖిలాండకోటి బ్రహ్మాండ భాండాలు తన కుక్షిలో నిలిపి,అనంతవిశ్వం మంతా ప్రకాశిస్తూ ఉన్న ఆ విశ్వాత్మ ను , సుతారంగా, సున్నితంగా సుమధురంగా తన హృదయం అనే సూక్ష్మ పద్మ కమలం పైకి, ఆహ్వానించి ,,ఆ మూర్తిని అచట నిక్షెపించి, తన్మయం తో పొందే ""అనుభవ స్వరూప వైభవాన్ని ""బ్రహ్మానందం అంటారు!!
""రామ చక్కదనం ""తో పోలిన అందచందాలు భువిలో దివిలో చూడలేం కదా!
,,ఋషులను మునులను, చరాచర జగత్తు ను తన భువనైక జగన్మోహన సౌందర్య రూపం ,తో మోహింపజేసిన ప్రభువు,, సామాన్య పామర భక్త జనులను వివశులను చేయలే డా ??""
ఆ విధంగా, మనసును అనందం తో ద్రవింపజేసే ఆ ""సామగాన లోలు "ని ముగ్ద మోహన రూపాన్ని మదిలో భావిస్తూ ,,శిరస్సు వంచి ప్రణామం చేస్తూ , ధన్యత పొందేవారు నిజంగా మహానుభావు లే కదా!!
అంటే పరమాత్మునిగురించిన
మహా అనుభవం, స్వయంగా పొందినవారు అని కదా అర్థం!!
,,,ఈ "మనస్సు "అనే మహరణ్యం లో నిరంతరం కదలాడే "కోరికలు "అనే మృగాల సంచారాన్ని నిలిపి వేస్తూ,, అటువైపు గా దృష్టి సారించకుండ , కేవలం పరమాత్మ యొక్క దివ్య సుందర మంగళ కరమైన మూర్తి పై నే ,తమ చూపులను నిలుపుతూ, తనివా రా, ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ,,తమ హృదయంలో భావిస్తూ ,ఆ మూర్తి ని ఆపాదమస్తకం చక్కగా పరికించి చూస్తూ. నిరంతరం పొందే బ్రహ్మానంద భరిత మైన అనందామృతాన్ని కళ్ళతో గ్రో లు వారు నిజంగా ""మహానుభావు లే " కదా! అని అంటారు త్యాగరాజ స్వామి గారు,
,,,, అలా తమ ఆత్మలో సాక్షాత్కరించిన పరందాముని దివ్య పాద పద్మాలను చూడగానే, ఎదలో పొంగిన అనందం తో,, ఆనంద భాష్పాలు రాలుస్తూ, పట్టరాని సంతోషం తో, వెంట నే "స్వాంతం ""అనే హృదయ పుష్పాన్ని ప్రీతి తో స్వామికి సమర్పణమ్ చేస్తూ బ్రహ్మానందం పొందేవారు ""మహానుభావులు "కదా !!
ఇది అత్మ సమర్పణభావం, !!
అనగా మనసు అత్మ యందు లగ్నం చేయడం!, ,,ఇంద్రియాలకు మనసుతో సంబంధం లేకపోవడం !!, బాహ్య స్మృతి లేక పోవడం, ద్వారా ఒక సమాధి స్థితి, ని సాధించడం , ఆనందానికి పరాకాష్ట త !!
అత్మ పరమాత్మలో లీనం కావడం, అంటే ఆత్మలో అదొక మధుర అనుభవ స్వరూప దర్శనము,,!! పరమాత్మ పై మనసు పడి, మనసుపొందే ,అద్భుత మైన బ్రహ్మానంద స్థితి!!
,,పరత్పరుడూ,, పతిత పావనుడైన , ఆ తారక రాముని చింతిస్తూ, ఆ తత్వం జీవిత పరమార్ధంగా ,కీర్తిస్తూ, అలా సంకీర్తనలు సుమధురంగా ఆలపి స్తూ, శ్రీరామ చంద్రుని ఆనందింప జేయుటకు,, స్వర లయాది తాళము లను తెలుసుకొంటూ
సాధన చేస్తూ ఉండే వారు నిజమైన"" మహానుభావు లు,,"మరియు"మధుర సంకీర్తనా చార్యులు కూడా!
అదే విధంగా ,,శ్రీహరి గుణగణాలను ముత్యాలను హారముగా తమ కంఠం లో ధరించి తమ భక్తితో కరుణతో,అనుగ్రహంతో, చక్కని ఆధ్యాత్మిక ప్రవచనాలతో జగాన్ని, జనాన్ని సదా మంగళ కరంగా చేస్తూ ఉంటున్న మహానుభావులు సాధువులు,సత్పురుషులు, సద్గురువులు ఎందరో కదా!! అలాంటి పుణ్య పురుషులు ""అందరికీ వందనాలు ""అంటూ కీర్తించిన ఆ త్యాగరాజ స్వామీ వంటి ఎందరో మహానుభావుల కు వినమ్రత పూర్వకంగా హృదయపూర్వక వందనాలు సమర్పిం చు కుందా ము !
ఇంతకన్నా జీవుడు పొందే ""మధురానుభవం ,, బ్రహ్మానందం "" మనిషి జీవితంలో ఇంకా ఏముంటుంది కనుక!!"
జై శ్రీ రామ్!
జై జై శ్రీరామ్ !
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!""
Thursday, December 26, 2019
బ్రహ్మానంద పరిస్తితి, అంటే, భాగము ,,3
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment