Thursday, December 26, 2019

దేవుడు ఉన్నాడా!?

Dec 18, 2019 Karimnagar
"అమ్మా! దేవుడు ఉన్నాడా!?""
""ఉన్నాడు నాయనా!""
""ఉంటే నాకు కనబడు తా డా, అమ్మా?""
తప్పకుండా కన బడ తాడు కుమారా!"నీకే కాదు, ఆర్తితో ఎవరూ పిలిచినా వస్తాడు ప్రేమతో ,!""
""అమ్మా !, ఈ ప్రపంచం లో అందరికన్నా  ఎవరు గొప్ప ?"
"కుమారా! ధ్రువా!  తల్లి తర్వాత సకల భువనాలు పరిపాలించే ఆ భగవంతుడే గొప్ప ,!
"అమ్మా!  అతడు తండ్రి వలె, ప్రేమతో నన్ను తన తొడ పై కూర్చుండ బెట్టు కుంటాడా  చెప్పు ??
"నాయనా! మనిషికి ఉన్నట్టుగా , అతడికి చిన్నా పెద్దా ,నలుపూ తెలుపూ, ఉచ్చ నీచాల వంటి బేధాలు ఉండవు కుమారా!
తల్లికంటే వెయ్యి రెట్లు ఎక్కువగా  ప్రేమిస్తాడు రా నాన్నా !
నీకు ,నాకూ, నీ తండ్రికి, నీ తండ్రి తండ్రికి, లోకం లోని సమస్త ప్రాణులకు కూడా ఆ దేవదేవు డే తండ్రి రా కన్నా !""
"అమ్మా!, ఆ పిన్ని ,నన్ను "నీవు దిక్కు లేనివా డివి"" అంది,, కదా ! నిజంగా, నాకు అతడు నాకు దిక్కు అవుతాడా?"
""దృవా!, ప్రియ మైన తనయుడా, బంగారు తండ్రీ,! పుత్రా, !నీకే కాదు నాకు, అందరికీ కూడా ఆ శ్రీహరియే దిక్కు !తనపై నమ్మకం ఉంచితే చాలు,, నాయనా, కన్నతండ్రి లా ప్రేమతో తన అక్కున చేర్చుకుంటారు !!,ఈ ప్రపంచం లో తన కోసం ఎవరు కష్టపడుతు న్నా, చూడలేక ,పరుగున ప్రేమతో వచ్చి  ఆదరిస్తూ ఉంటాడు!, అతడు చాలా దయామయుడు,!ఆపద్భాందవుడు !అనాథ రక్షకుడు !
దిక్కు లేనివారికి ఆ దేవుడే దిక్కు , గా ఉంటాడు నాయనా ,!
నీకు ఎవరూ లేరని బెంగ పడకు_,! ఆ పరమాత్ముడు ఉన్నాడని నమ్ము! అమ్మ ఒడిలో హాయిగా, నిర్భయంగా బజ్జో రా కన్నా__!, నా ముద్దు కుమారా! అమ్మ అంటే ఎంత దయరా, నీకు!*నీ చిన్ని చిన్ని చేతులతో నా కంటి నీరు తుడుస్తూ ఉంటె, నాకు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా! నీవు బాధ పడుతూ కూడా, నీ బాధను ఈ అమ్మకు తెలియ నీకుండ, నన్ను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నావు, ధ్రువ కుమారా,! నిన్ను కన్న నా జన్మ ధన్యం! నిజంగా నేను అదృష్టవంతుడు రాలి ని, ఓ పరమాత్మా, ఏ దిక్కు లేదని  బాధ పడుతున్న నా కొడుకు నకు నీవు దిక్కై ఉండు స్వామీ, నారాయణా, పరత్పరా! ఆర్తులను కాపాడు! భక్త జన సంరక్షణ భారం వహించు! దీనులను కనికరిం చు! శరణు లక్ష్మీ రమణా శరణు కమల లోచనా, శరణు జగదీశ్వర శరణు!'" __________&_______
""దిక్కు లేని వారికి దేవుడే దిక్కు! దిక్కు లేని వారికి దేవుడే దిక్కు !!""
""ఎవరూ నీవు ? అలా ఎందుకు అరుస్తూ ఈ ఘోర అరణ్యం లో తిరుగుతూ ఉన్నావు బాలకా??"
"స్వామీ !మీరు ఎవరు ?""
"నన్ను నారదుడు అంటారు ,బాలకా ! చూస్తే నీకు ఐదు ఏళ్ళు కూడా లేవు,! తలిదండ్రుల వద్ద గారాబంగా పెరగాల్సిన చిన్న తనం నీది!!ఎవరు నీవు చెప్పు??"
""స్వామీ !మీకు సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తున్నాను !
నా తండ్రిగారు ఉత్తాన పాద మహారాజు గారు!!"
""ఓహో ! అయితే ,నీవు రాకుమారుడు దృవుని వి అన్నమాట!! నీ
తల్లి సునీ తి అవునా??""
""అవును, స్వామీ,! ఇవన్నీ మీకు ఎలా తెలుసు !
, అన్నీ చెబుతాను,,కానీ నీవు ఈ అరణ్యంలో ఎక్కడికి వెళ్తున్నా వు నాయనా?!"
""నేను దేవు ని చూడా లని వెదుకుతూ వెళ్తున్నాను,,!"'
""ఎక్కడ ఉంటాడో తెలుసా నీకు?""
"ఏమో  ?ఎక్కడున్నాడో? ఎలా ఉంటాడో,?, ఇవేమీ, నాకు తెలియదు  స్వామీ!""
""మరి ఎలా పట్టుకుంటావు, ధ్రువ కుమారా, ఆ దేవుడిని??""
""నా లాంటి "దిక్కు లేని వారికి దిక్కు "గా ఉంటాడని నాకు  మా అమ్మ చెప్పింది, స్వామీ!""
"ఏ దిక్కున దేవుడు ఉన్నాడని  వె దకుతావు బాబూ, ద్రువా??
""చూస్తూ వెదకు తూ, వెళతాను, స్వామీ! నాకు మాత్రం ఏం తెలుసు!""
"అమ్మ చెప్ప లేదా నాయనా?""
""అమ్మకు తెలిస్తే చెప్పేది కదా స్వామీ?"" దయచేసి ఈ బాలుడి పై  గురువు లా కనికరించి, దేవుడిని చూసే మార్గం చెప్పండి, స్వామీ!""
"ఎంత వినయం నేర్పింది,, మీ అమ్మ ,,నీకు దృవా! దైవం పై నమ్మకం, భక్తి ఇలా బాల్యం నుండి నేర్పిన  మొదటి గురువు ,మీ అమ్మ యే!! ఇలా బాల్యం లోనే నీకు చక్కని దారి చూపించిన మీ  తల్లి దన్యురాలు"! నాయనా నీవు అదృష్టవంతు డివి !!,,,,పోనీ,,నీవు వెళ్లే దారిలో ఆ దేవుడు కనిపిస్తే గుర్తు పట్ట గలవా?""
"ఏమో ,స్వామీ !అమ్మ చెప్పలేదు ,, దేవుడు ఎలా ఉంటాడో !
""ఆ దేవుడు
ఎక్కడా కనిపించక పోతే ఏం చేస్తావు ,ధ్రువ కుమారా??"తిరిగి ఇంటికి వెళతా వా?""
లేదు, వెళ్ళ ను గాక వెళ్ల ను,,  అతడు కనబడే వరకూ, !""అమ్మ చెప్పింది, దేవుడు ఉన్నాడు, !ఆర్తితో పిలిస్తే వస్తాడు,! తనకోసం బాధ పడుతూ ఉండేవారిని చూస్తూ ఊరుకోడు, !వచ్చి ఆదరిస్తా డు అనీ! అందుకే,
ఏ దిక్కూ లేకుంటే ఆ దేవుడే దిక్కు అని కదా వచ్చాను  ,స్వామీ!!"" దయచేసి,
నాకు ఆ దేవుడి ని చూసే మార్గం చెప్పండి స్వామీ దిక్కు లేనివాడి కి దిక్కు చూపండి! స్వామీ,, అంతవరకు, మీ పాదములు విడవను!""
లే నాయనా ! అమ్మ నీకు నిజమే చెప్పింది ! అయినా, నీలో, ఈ బాల్య దశలో,ఎంత అమాయకం,? ఎంత పట్టుదల ?, అమ్మ మాట పై ఎంత విశ్వాసం ?, ధ్రు వా!, దేవుడు కనిపించే మార్గం చెబుతాను విను!""
""చెప్పండి ,స్వామీ !మీరు దేవుడిలా కనిపించారు! దేవుడే నాకోసం మిమ్మల్ని పంపించాడు,!""
""నాయనా, !నేను చెప్పినట్టు చేస్తావా??""
""మీరు ఏం చేయమన్నా చేస్తాను , స్వామీ ఆ కనపడని దేవుడిని చూడటం కోసం!""
""ఓమ్ నమో భగవతే వాసుదేవాయ  !"" అంటూ మూడు సార్లు అను!""
""అంటే ఏమిటి ,స్వామీ??""
అది దేవుడి కి ఉండే  ఒక పేరు ,! ఆయన రావాలంటే, అతడిని
పేరు పేట్టి పిలవాలిగా!!"'
""అయితే సరే స్వామీ!,ఓమ్ నమో భగవతే వాసుదేవాయ
ఓమ్ నమో భగవతే వాసుదేవాయ! ఓమ్ నమో భగవతే వాసుదేవాయ!""
""చాలా చక్కగా అన్నావు, నాయనా, సంతోషం!, అలా కనీసం ఆరు నెలలు ఆ నామ జపం  చేయాల్సి ఉంటుంది, నీవు, అక్కడ, ఆ నదీ తీరంలో, ఏకాంతం గా, భయపడకుండా!"చేయగలవా??""
చేస్తాను స్వామి! చేస్తాను! మీ మాట పై నాకు విశ్వాసం పెరుగుతోంది! గురువాజ్ఞ గా పాటిస్తాను!""
, నాయనా ,ద్రువా!!మొదటి రెండు నెలలు పండ్లు  ఆకులు నీరు గాలి తీసుకోవాలి, ఆహారంగా!!"
""సరే స్వామీ!!"
""మూడవ ,నాల్గవ నెలలో ఆకులు మాత్రమే ఆహారంగా తింటూ నామ జపం చెయ్యాలి!!""
""మీ మాట శిరసా వహిస్తాను స్వామీ!""
""ఐదవ నెలలో నీరు, గాలి మాత్రమే గ్రహిస్తూ ఉండాలి!""
""అలాగే, స్వామి!""
అరవనెలలో కేవలం,ఒక్క గాలి ని మాత్రమే ఆహారంగా గ్రహిస్తూ, దేవుడిని ధ్యానిస్తూ, నామ జపం చేస్తూ ఉండాలి!
ధృ వా! నాయనా! నీ చిన్నారి పాదాలతో, ఒక కాలిపై మరొకటి అనిస్తు, నీవు ఒంటి కాలి పై నిలబడ గలవా ,??
""స్వామీ! ఆ భగవంతుడి ని చూడటానికి ఎంతటి కష్టమైన పని అయినా చేయగలను !, ఇదిగో చూడండి ,! ఇలాగేనా??""
"!ఆహా , నాయనా ! నీవు కుషాగ్ర బుద్ది గలవాడవు, వివేకం వినయం, పట్టుదల దైవభక్తి కలవాడవు, ఇది నీ యోగ్యతను సూచిస్తోంది! ,నీకు భగవంతుని గురించిన మార్గ దర్శనం చేసే అవకాశం అదృష్టం,ఆ దేవుడు నాకు అనుగ్రహించాడు!! భగవంతుడి పై , నీకున్న  అచంచల విశ్వాస మే నీకు తప్పకుండా దైవ సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది!;, ఇది గురు వాక్యం,! సత్యం అవుతుంది ,! నీ కోరిక ఫలిస్తుంది,! నీ జన్మ తరిస్తుంది, నాయనా ,! నేను గురువు స్థానం లో నీకు  నారాయణ ద్వాదశాక్షరి మంత్రాన్ని  ఉపదేశి స్తున్నాను,! నా మాట పై విశ్వాసం ఉంచి నేను చెప్పినట్టు చెయ్యి! ధ్రు వా!""
""నేను ధన్యు డిని, స్వామీ !దిక్కు తోచకుండ, పిచ్చివా డిగా ఈ కారడవి లో తిరుగుతున్న నాకు, మీరు దిక్కై సాక్షాత్కరించి కరునించారు ! నన్ను దీవించండి స్వామీ ,,!మీ పాదాల నంటి ప్రణామం చేస్తున్నాను!!""
""వత్సా! ధ్రు వా! తథాస్తు!
ఇష్ట కామ్యార్త సిద్ధిరస్తు!
భగవంతుని కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు!
దైవ సాక్షాత్కార ప్రాప్తిరస్తు!
జయొస్తు  !, శుభమస్తు,!! ఈ క్షణం నుండే నీవు దీక్ష వహించు! నాయనా! శుభమస్తు ! ఇక వెళ్ళి విజయం తో తిరిగి రా,!""
"""ఓమ్ నమో భగవతే వాసుదేవాయ , ఓమ్ నమో భగవతే వాసుదేవాయ!"",,,,,!"
""ఆహా !ధ్రువ కుమారా! ఇంత చిన్న వయసులో నీకు  దేవుని పై ఎంత గురి, ఎంత విశ్వాసము ఎంత పట్టుదల కు దిరిందయ్యా!
చిరంజీవ ,యశస్వి భవ!
నారాయణ !నారాయణ!  నారాయణా,, నీ చరిత, నీ రూపం, నీ  నామ స్మరణ మహిమ లు,,నీ లీలలు అద్భుతం ! స్వామీ, లోకేశ్వరా,ఎవరి పై ఎప్పుడూ ఎలా అనుగ్రహిస్తు ఉంటావో, అది నీకే తెలియాలి! , నిన్ను నీ లీలల ను, తెలియ తరమా, మాధవా కేశవా ముకుందా, అనంత, అచ్యుత, నమో నమః
తండ్రీ!ఈ పసి వాడు నీ శరణు కోరి వచ్చాడు,! కనికరించి నీ దివ్య మంగళ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించు స్వామి , శరణు శరణు శరణు

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...