Sunday, December 8, 2019

దిశ

Nov 30, 2019 Karimnagar
మొన్న దిశ కి జరిగింది అమానుషంగా అత్యాచారం మారణ హోమం
నిన్న జరిగిందిమరో స్త్రీ సజీవ దహనం
ఈ రోజు మరో అబల కు జరుగ వచ్చు
రేపు కూడా అడ కూతురు ఎక్కడో బలి కావచ్చు
మగాడి రాక్షస ప్రవృత్తి కి గురి కావచ్చు
ఈ రావణ కాష్టం ఇలా కాలుతూ
కార్చిచ్చు లా వ్యాపిస్తూ
అమాయక వనితల మాన ప్రాణాలను ఘోరాతి ఘోరంగా
పట్ట పగలు పదిమంది
నడి చే రహ దారుల్లో
అదనుకో సం కాపు కాస్తూ
అదే పనిగా పెట్టుకొని
ఒంటరిగా వెళ్లే అమ్మాయిలకు
ప్రత్యక్ష నరకాన్ని చూపుతూ
దారుణంగా హింసిస్తూ
కాలర్ ఎగరేస్తూ
గర్వంగా తల ఊపుతూ
ఏ మాత్రం సిగ్గూ లజ్జా అభిమానం ఆవేదన పడకుండా స్వేచ్చగా తిరుగుతూ ఉంటున్న ఈ చీడ పురుగులను
నల్లిని నలిపినట్టు
కాలితో నలిచే
నిలువునా కాల్చి పారేసే
కత్తితో గొడ్డును చీల్చిన ట్టు కోసే
బహిరంగంగా జరిగిన ఒక అన్యాయాన్ని
న్యాయం గా నిలదీసే
శుభ తరుణం ఎప్పుడొస్తుంది
ఎక్కడో శంషాబాద్ లో జరిగింది
ఈ రోజు నీ ఇంట్లో నీ ఇంటి ప్రక్కనే
నీ ఊరిలో నీ నగరంలో నీ వాడలో జరగొచ్చు
ఏదైనా తనదాక వస్తేనే తెలుస్తుంది కదా
కన్న కూతురిని జరిగిన
ఘోర అవమానం తలచుకుంటూ
కన్న వారు పడే దుర్భర మైన
మానస క్షోభ
ఎంత భయంకరం
ఎంత హింసాత్మకం
పైగా
దానికి కారకుడు దొరకడం ఇంకా ప్రాణాలతో ఉండడం
చీము నెత్తురు ఉన్న ఏ మనిషైనా సహించేనా
తిండి తినేనా
నిద్ర పట్టేనా
ఇదే ఏ ఇతర దేశమో అయితే ఎప్పుడో నరకాన్ని చేర్చేది
రాళ్లతో కొట్టి
నరికి పారేసే ది కదా
రామాయణం లో స్త్రీ జోలికి వెళ్ళిన ఒక్కడు
రాక్షస జాతిలో సహా హతమయ్యాడు.
భారతం లో స్త్రీ ని భంగపరచిన దుర్మార్గులు బంధు సమేతంగా
చచ్చారు
అడ పిల్ల జోలికి అలా అనవసరంగా వెళ్లే
మగాడి కి జీవించే ఈ
పవిత్ర భూమి పై జీవించే
అర్హత లేదు
అని ప్రకటన చేయాలి
గుండెలు పిండే ఇలాంటి
అకృత్యాలు, ఏ మానవ మృగం చేయకుండా
కట్టడి చేయాలి
చట్టం తేవాలి
ఆడపిల్లల కు న్యాయం చేయాలని లేకున్నా
అన్యాయం మాత్రం చేయకండి
వారి మానాన వారిని బ్రతక నీయం డి
సిగ్గుతో చచ్చి పోతున్న
మానవత్వం ఇంకా బ్రతికి ఉందనీ
దైర్యం చెప్పండి
రెక్కాడితే గానీ డొక్కాడని
పేద వారికి
మద్య తరగతి  సంసార కుటుంబాలకు
ఊరట కలిగించి
మేమున్నాం అంటూ మీ
సత్తా చూపించి
ఆదుకోండి
ఆదరించండి
ధర్మం న్యాయం నీతి నిజాయితీ లు
ఇంకా బ్రతికి ఉన్నాయని
నిరూపించండి
నేరస్తుల ను కటినంగ దండించే
తీర్పు చెప్పండి
ఉద్యోగాలు చదువులు
తప్పవు కదా ఏ రోజైనా
బయట తిరగక తప్పదు కదా ఏ రోజైనా
ఏ ఊరైన ఎవరైనా ఏనాడైనా
మేం కనబడితే చాలు
కాల రాచే తప్పులు ఏం చేశాం
స్త్రీ గా పుట్టడమే మా నేరమా
మీరూ ఒక స్త్రీ కే పుట్టారు గా
తల్లీ చెల్లీ అక్కా లేకుండా
మీ బ్రతుకు వుండే నా కలకాలం
ఎంతకాలం మేము భయం తో బాధతో సిగ్గుతో
అవమానం తో దాక్కుంటు  బ్రతకాలి
మాకు స్వేచ్చగా తిరుగుతూ బ్రతికే
హక్కే లేదా
మేం మనుషులం కాదా
మీలో మానవత్వం లేదా
చంపడం హింసించడ ఇది మనిషి మనిషికీ చేసే పనేనా
దీని కి పరిష్కారం చూపడం
అయ్యేవరకు చూడటం
మీ ధర్మం కాదా
ఇలా చూస్తూ పోతూంటే
ఆ  మానవ మృగాలు ఇంకా ఇంకా విజృంభించి
చెలరేగి పోవా
దేశం రాష్ట్రం ఊరూ వాడా
అప్రతిష్ట ల పాలు  కావలసిందే నా
నడవండి,
నడుం బిగిం చం డి
న్యాయం జరిగే వరకు పోరాడుదాం
మాకేం అనుకోకుండా
మద్దతు చూపుదాం,
ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం
ఆడపిల్ల లకు అండగా నిలుస్తు 
మానవత్వ విలువలు నిలుపుకుందాం

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...