Dec 6, 2019 Karimnagar
"సీతాపహణం "చేసిన దుష్ట రావణాసురుడి ని , వాడిని సమర్థించిన ప్రతీ ఒక్కరినీ ఏరుకుంటూ ,,హతమారుస్తూ తన క్రోధాగ్నికి బలిచేశాడు శ్రీరాముడు,!
,నిండు సభలో, అందరూ చూస్తుండగా,
ద్రౌపది "వస్త్రాపహరణం" చేసిన వాడు, చేయించిన వాడు, చేస్తుండగా చోద్యం లా చూస్తూ ప్రేక్షక పాత్ర వహించిన వాళ్ళ ను ఘోర సంగ్రామం లో నిర్దాక్షిణ్యంగా చంపించాడు శ్రీకృష్ణుడు!
ఇలా మన పురాణాలు, ఇతిహాసాలు స్త్రీ ల గౌరవాన్ని , వారు ప్రత్యక్ష దేవతల వలె పూజింపబడే సంస్కారాన్ని , వారిని అవమా నించిన అధములకు విధించే దారుణమైన శిక్షా విధానాల ను , గురించి అందిస్తూ ఉన్నాయి !
, అలా,అనాటి యుగ ధర్మం ప్రకారం స్త్రీ లను వెన్నంటి కాపాడటానికి దీక్షా కంకణ దారులై ,కొందరు పురుషులు ముందుకు వచ్చారు,
ఇప్పుడు స్త్రీలకు జరిగే, లేదా జరుగుతున్న అన్యాయాలకు అక్రమాలకు , దౌర్జన్యాలకు ఏ పురుషు డో ముందుకు రావాల్సిన అవసరం లేకుండా , స్త్రీ లే సంఘటితంగా ఒక్కటై, నిలదీయాల్సిన చైతన్యం పరిజ్ఞానం, రావాలి!
ఇంట్లో బయటా మోసగాళ్ళు ఉంటారు. ఎక్కడా ఎవరినీ నమ్మ వద్దు
తలి దండ్రులు తమ పిల్లలకు వీరి పట్ల జాగ్రత్త సూచిస్తూ ఉండాలి,
ముఖ్యంగా మగపిల్లల ను కన్న తలిదండ్రులు , సమాజంలో వారు నిర్వహించాల్సిన బాధ్యత, ఉండాల్సిన సంస్కారాన్ని బోధిస్తూ వుండాలి. ఇంట్లోనే కాదు, బయట వాడు చేస్తున్న నిర్వాకం పనులు, చెడు సహవాసం, మత్తు పానీయాలు త్రాగడం , గుట్కాలు తినడం, జులాయిగా పని లేకుండా తిరుగుతూ ఉండడం గమనిస్తూ ఉండాలి.!
నేటి యువకులకు మంచి చెడూ తెలుసుకునే వివేకం ఉండటం లేదు, కారణం,,బయట చూసే సినిమా పోస్టర్లు, స్మార్ట్ ఫోన్లో చూసే అసభ్య వీడియోలు,, చెడు అలవాట్లు , చెడు స్నేహం ,, సినిమాలు కూడా !!!,,
వీటి దుష్ప్రభావం తో వారు అనాగరికంగా ప్రవర్తించే అవకాశం ఏర్పడుతుంది
తప్పు ఎవరిదీ? అంటే, కొడుకు ముళ్లకంప దారిలో పోకుండా చూడాల్సిన బాధ్యత గల ,కన్నవారి దే అవుతోంది !
వాడి కిచ్చిన స్వేచ్చా అవకాశం, ఇతరుల మనుగడకు ఇబ్బందికరంగా కాకూడదు కదా!!
మేక వన్నె పులులు మన చుట్టూ ,ఉండి దాడి చేసే దుద్దేశ్యం తో సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి.! జాగ్రత్తగా
కనిపె డుతు ఉండాలి.!
ఎప్పు డై నా,, ఎక్కడైనా పొరబాటున కూడా వారు ఒంటరి ప్రయాణం చేయ వద్దు!
బజారు కెళ్తే తోడు తీసుకొని వెళ్ళాలి!
వెంట ఫోన్ ఎలానూ ఉండాలి, !అందులో పోలీస్ శాఖ వారి ఫోన్ నంబర్ లు ఉంచాయి !
కావాల్సిన ఆప్ లు రెఢీ గా ఉంచాలి,!
నేరుగా తలదించుకుని పోకుండా, ప్రక్కల ఎవడైనా చూస్తూ తన చర్యలను కనిపెడుతూ ఉన్నాడా ""అని పరిశీలిస్తూ వెళ్ళాలి!
సిటీ కి, ఊరికి దూరంగా వెళ్తే మాత్రం వెంట ఒక మనిషి, ఫోన్, ఒక చిన్న కత్తి నీ కూడా అత్మ రక్షణ నిమిత్తం హ్యాండ్ బ్యాగ్ లో వేసి ఉంచాలి! తప్పు లేదు! ఏం చేద్దాం !
మన జాగ్రత్త లో మనం తప్పనిసరిగా ఉండాలి కదా!!
రోజూ వెళ్లే దారి అయినా , తమ రాకపోకలు గమనిస్తూ నక్కల్ల వలె సమయం కోసం పొంచి ఉంటారు ,,కొంతమంది దుర్మార్గులు ,,అని మాత్రం మరచి పోవద్దు!
ఎట్టి పరిస్తితుల్లో అయినా ,,సాధ్యమైనంత వరకూ ,,రాత్రి వేళల్లో , ఆడపిల్లలు ఒంటరిగా బజారు కెళ్ళడం మాని వేయాలి,,;
తప్పని సరిగా వెళ్లాల్సి వస్తె, తోడుగా ఒకర్ని లేదా మరో బైక్ వాలా ను తీసుకెళ్లాలి!
అనుమానము వస్తె ఇంట్లో నూ, పోలీస్ స్టేషన్ లో చెప్పి ఉంచడం మరచి పోకుండా చెయ్యాలి!
ముఖ్యంగా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని తెలి స్తే అందరికీ తెలియజేయాలి!!
,,,నేటి మహిళ సామాన్య స్త్రీ కాదు, ! తెలివి తో బాటు దైర్యం ,, సాహసం ,, నిర్భయత్వం తోడు గా తీసుకెళ్లాలి,
అవసరం అయితే తెగించి, పోరాడ టానికైన సిద్దంగా ఉండాలి!
సాంకేతిక జ్ఞానం చక్కగా ఉపయోగించాలి ,!
ఇతర విషయాల గురించిన జ్ఞానం తో పాటు, తమల్ని తాము కృషి రక్షించుకునే అత్మ స్థైర్యం తో తిరగాలి!!
""దిశ ""కేసు విషయంలో నేడు పోలీసులు చూపిన చొరవకు, సత్వర పరిష్కార మార్గానికి ధన్యవాదాలు !
ఆడపిల్లకు జరిగిన అన్యాయానికి వారు సంపూర్ణ న్యాయం చేశారు
న్యాయ దేవత ఇంకా బ్రతికి ఉంది,, మనిషిలో మానవత్వం ఇంకా మేల్కొనే ఉంది ! అమ్మాయిల రక్షణ కవచం గా మేమున్నాం !, భయ పడవద్దు !, అని అభయ హస్తం తో సూచిస్తున్న దైవం వలె ఈ రోజు పోలీస్ వారు వ్యవహరించిన తీరు , యావత్ భారత దేశం లో సంతోషాన్ని కలిగించింది,!!,
శభాష్ ! పోలీస్ ,! అంటూ మన బోర్డర్ పై వీర జవాబులు, అక్రమ దారుల ను పని పట్టినట్టు గా , వారు తీసుకున్న తక్షణ చర్య, దుష్టులకు బుద్ది చెప్పే విధంగానూ ,సభ్య సమాజానికి గర్వ కారణంగా నూ ఉంది,!
నిజంగా,రక్తం మరిగి పోతోంది ,ఆడపిల్లకు జరిగిన , ఘోరం తలచుకుంటే,!!
దానికి ప్రతీకారం తీసుకున్న పోలీస్ వ్యవస్థ కు సాష్టాంగ ప్రణా మాలు ,హృదయ పూర్వకంగా అంద జేస్తున్నాము!!
అలాంటి దుశ్చర్యలకు పాల్పడే ""దొంగనా కొడుకులకు"" అలా అక్కడి కక్క డే, ఎవరి ఆజ్ఞ ల కోసం, ఎదురు చూడకుండా , ఏ మాత్రం దయా దాక్షిణ్య ము లు చూపకుండా, నిర్దాక్షిణ్యంగా, మీరు న్యాయం చేస్తూ నే ఉండాలని కోరుకుంటూ , ఉన్నాము!
ఇదే అన్యాయం తమ కూతుళ్ళకు జరిగితే కన్నవారికి ఎంత బాధాకరంగా, ఉంటుందో తెలిసి రావాలి ! నలుగురిలో తలెత్తు కోకుండ , అలా అవమానం తో బ్రతకడం కన్నా చావడం మేలు అనుకుంటూ బ్రతికి నన్నాల్లు రోజూ చస్తు బ్రతుకుతూ ఉంటారు కదా !! పాపం. , వాళ్ళు !!
ఆడపిల్లగా పుట్టడం నేరమా?
చదువూ విజ్ఞానం నేరుస్తు బ్రతుకు దెరువు కోసం ఉద్యోగం చేయడం దోషమా??
, సమాజం లో ఉన్న ఈ పిల్లి నక్క పులి లాంటి స్వభావం ఉండి స్త్రీల పట్ల అమర్యాదగా అసభ్యంగా ప్రవర్తిం చే జులాయి వెదవలకు మన పోలీస్ వారు నిర్వహించిన తీరు తీర్పు ఒక చక్కని గుణపాఠం కావాలి!!
అందుకు వారికి మనం సంపూర్ణ మద్దతు, సహకారం అందిస్తూ ఉండాలి కూడా ,!!
నల్లులను నలిపి నట్టుగా ఆ దుర్మార్గులను కాల్చి పారేస్తెనే ధర్మం న్యాయం నిలుస్తాయి!!
ఆడపిల్ల దైర్యం గా మనుగడ సాగిస్తుంది!!
మరొక్కసారి మన తెలంగాణ పోలీస్ న్యాయవ్యవస్థ కు జోహార్లు తెలియజే స్తూ , కృతజ్ఞత లు సమర్పించు కుందా ము !!"'
జై తెలంగాణ!!"
జై భారత్ !'
Sunday, December 8, 2019
విలువలు
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment