Dec 5, 2019 Karimnagar
""స్వామీ, ! లీలా మానుష విగ్రహ రూపా ! అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ! జగన్నాథ !! నీవే మిటో,,?ఎక్కడుంటా వో,? ఏ రూపంలో, ఎలా ఉంటావో ?, ఏం చేస్తు ఉంటావో ??, నాకు తెలీదు గానీ,, జనార్దనా! నీవు సర్వాంతర్యామి వని ,,నీకు ఏవో అద్భుత శక్తులు ఉన్నాయని అందరూ అంటు ఉంటారు. ,
ఎన్ని ఉన్నా ,,నీకు ఎందరున్న , ప్రభూ !నీ కంటే నేనే మేల య్యా !
నీకంటే నేనే ఘనుడ ను, ! అహం కారం తో కాదు, ఆర్ద్రత తో ఆర్తి తో, నీవంటే నాకు ఉన్న ఇష్టం తో అంటున్నాను,,! ఎందుకంటే,, చూడూ!
నాకు దిక్కు నీవని నేను అందరికీ చెప్పుకో వచ్చు కదా,,! కానీ శ్రీకృష్ణా ,! నీకు దిక్కు ఎవరని ఎవరైనా అడిగితే ,,ఏం చెబుతావు చెప్పు ?
నాకు ఆధారము నిన్నుగా గుర్తిస్తా ను ,!
కానీ ,,రాధా మాధవా! , నీకు ఆధారము ఏది, ?అంటే ఏం చెబుతావు అనం తా ??
నిన్ను పూజిస్తే కొలిస్తే నా, జన్మ ధన్యం అవుతుంది,,! కానీ కమలాక్షా,! నీకు ఎవరున్నారయ్యా తనివారా కొలిచేందుకు ??
నేను కోరిన వరాలిచ్చే పెన్నిధి గా నాకు నీవు కామధేనువు గా ఉంటున్నావు !! కానీ,,
నీవు కోరింది ఇవ్వడానికి ఏ దైవం ఉన్నాడు సిద్దంగా ! చెప్పు గోపాలా ??
నాకైతే ,నా అంతరాత్మ లో నీవు కొలువుంటావు !, కానీ దేవకీ నందనా ,,, ఎవరున్నరయ్యా నీకు,, అంతరంగం లో నిలుపుకోవడానికి , ప్రభూ ?
నాకు స్వాతంత్ర్యం ఉంది ! స్వేచ్ఛ ఉంది , !ఇష్టం వచ్చి్నట్టుగా తిరగ నూ వచ్చు !తినవచ్చు,! తాగవచ్చు,! పడుకో వచ్చు,!
నన్ను అడిగే వా రే లేరు,!
సంతోష మైనా ,,బాధలైనా , రోగం వచ్చినా నొప్పి గా ఉన్నా , నాకు చెప్పు కోడానికి బంధువు బలగము, భార్యా, పిల్లలు, స్నేహితులు ఇలా ఎంతో మంది ఉన్నారు సుమా, ఓదార్చడానికి !! కానీ,
దేవదేవా ,! పరమాత్మా !! పరాందామా !,నీకు ఎవరున్నార య్యా ,, ""నావారు ""అని చెప్పుకోడానికి,?! నీ వు పడుతున్న కష్టం సుఖం ఆవేదన అనందం పంచు కోడానికి
నేనున్నాను,, భయపడకు,, బాధ పడకు !""అంటూ ఓదార్చే దిక్కు లేకుండా ఒంటరి బ్రతుకే గడుపుతూ ఉన్నావు గదయ్య స్వామీ నీవు ??
నిలవడానికి , నీడ లేదు,! విశ్రాంతి తీసుకుందామని అనుకుంటే ఒక ఇల్లు లేదు,! వాకిలి లేదు,!
పోనీ ఏమైనా అస్తి ఐశ్వర్యాలు ఉన్నాయా అంటే మచ్చుకు కానరావు!
కనీసం ,నంద నందనా ,! నిన్ను, దగ్గరకు పిలిచి ప్రేమతో, బుజ్జగిస్తూ ఇంత బువ్వ పెట్టే నాథుడే లేడు కదయ్యా! నాకు జాలి గా ఉంది,మధుసూదనా , నిన్ను చూస్తుంటే !,, నిత్యం నీ భక్తులు నీ ముందు నైవేద్యం ఉంచి ,నివేదిస్తు ఉంటారు,,కానీ, మురళీ మనోహర, !నీవు ఇలా చేయి పెట్టగానే, నైవేద్యం పళ్ళెం లాగేస్తుంటారు ,కదా! ఇక నీ ఆకలి తీరే దెలా, నంద గోపాలా??
""స్వామీ,,! నీకు లాలి పాట లు మధురంగా పాడేందుకు "అన్నమయ్య" లేడు,!"
""నీ సురుచిర సుందర సుకుమార లావణ్య వైభవ దివ్య మంగళ మూర్తికి , కళ్యాణ కరంగా , పరమానంద భరితంగా మంగళ హారతి పడదామంటే నీ ప్రియ సఖుడు "త్యాగ య్య "లేడు
తండ్రీ,, !!
నీకు చక్కని శ్రావ్యమైన భక్తి గీతాలు ఆత్మానుభూతి తో అనుభవిస్తూ ,వినిపించే నీ భక్తురాలు మీరాబాయి, ఇపుడు,, నీ వద్ద లేదు గదా కృష్ణా??"
""పోనీ, నీవే ప్రాణంగా,, నీవే తన కంటి దీపంగ భావిస్తూ,, ప్రేమతో , గోరు ముద్దలు పెట్టడానికి, వెన్న ముద్దలు ,మీగడ ,పెరుగు, జున్ను పాలు, త్రాగించ డానికి నంద యశోద లు , కూడా ఎక్కడా కనపడటం లేదురా ,,కన్నా!!
""కన్నతల్లి ఒడిలో సేద తీరాలని , కొంత అలసట, ఆయాసం ,తగ్గించు కొవాలని నీకు ఉన్నా గోవిందా !! ఆ దేవకీ దేవి కూడా అందుబాటులో లేదు కదా
అచ్యుతా, !!""
తాను పుట్టుక తో అంధు డైనా కూడా , నీవు తన ముందు కూర్చుని వుంటున్నవన్న తన్మయత్వం తో ,,మైమరచి నీగురించి న సు మధుర గీతాలు పాడే ఆ ""సూరదాసు" ",,ఎక్కడ వేదకినా అగుపించడం లేదురా కన్నయ్యా!!
ఏం చేయను ??
నీ ప్రియ సఖి, నీ ఆరాధ్య దేవత, అపర గోలోక వాసిని ఆ రాధాదేవి తో నీవు చేసిన రాసలీల వైభవాల ను అత్యంత మధురంగా,, శృంగార రస భరితంగా , అద్భుతంగా అష్టపదుల లో వర్ణించి చెప్పిన ఆ జయదేవుడు లేడ య్యా , నీ ఒంటరితనం పోగొట్టడానికి !!
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు చెప్పడం తప్ప నిన్ను ఆదరించి , స్వాగతించి, షోడశోపచార ముల తృప్తి పరిచే ఆత్మ బంధువు లు ఎంత వెదకినా ఆగుపించడం లేదు వేణుగోపా లా !! ఏం చేయను? ఎలా నీ సేవ చేయను ?
నాకు అంత భక్తి శక్తి శ్రద్ధలు లేవు గానీ,గోపాలబాలా, నీపై,కాస్త ఆర్తి ఆసక్తి,,ఉందయ్యా నాలో !""
నీకు ఇష్టమైన వారెవరూ నా పిలుపుకు అంద డం లేదు,,!
అందమైన కీర్తనలు రాసి పాడి అందరితో ఆడుతూ అందంగా అనందం తో పాడించిన నీ దాసుడు ఆ ""రామదాసు "కూడా నీ మాట విని వచ్చే వీలు లేదు కదా కేశవా!!
""రాధా మనోహర ,! గోపికా వల్లభ,! ఇక మిగిలింది ఆ గోప గోపికలు!! వారు నీ నామా స్మరణ ధ్యానం లో మత్తులై, తమను తామే మరచి ,ఈ లోకంతో ,నీతో ఏ సంబంధం లేకుండా ,నీ లీలా వినోద వైభవ స్మృతుల లో మునిగి లీనమయ్యారు ఆ గోప గోపీ జనాలు !"
అలా ఎందరో ఉన్నారు రా కృష్ణయ్యా ,నా వాళ్ళు అని నీవు చెప్పడానికి !!
కానీ ఇప్పుడు నీ అక్కరకు రావాలి కదా ,,నీ మంచి చెడు చూడాలి కదా
మాధవా, !!
అలాగే,, నేను కూడా నీ కోసం ఆరాటపడు తూ ఉంటానురా,, చిన్ని కృష్ణా ! నా ప్రాణమా ! నా ఆరాధ్య దైవమా ! నా జీవనాధార మా !! పరందామా !! పరాత్పరా !!
నీ వాళ్లంత ప్రేమను నేను కురిపించ లేను,! ఆత్మార్పణం చేస్తూ, జీవితాలను కృష్ణార్పనం చేశారు వారు, నీ భక్త బృందాలు, చేసే భక్తి జ్ఞాన వైరాగ్య సంపదలు నాలో అంతగా లేవు శ్యామసుందరా !! వారికున్నం త వాత్సల్యం త్యాగ నిరతి, అత్మ సమర్పణ భావం, భక్తి శ్రద్ధలు , సంకీర్తనలు చేసే సంగీతం సాహిత్యం , నీతో సాంగత్యం ,,నాకు లేవు రా నల్లనయ్య!"
కానీ ,నీ చిత్రాలు గీస్తూ, నీ గీతాలు పాడుతూ, నీ గురించిన దివ్య వైభవ గాథలు రాస్తూ, నిరంతరం ,నీ బంగారు శృంగార లీలలను చింతిస్తూ వుంటాను రా కన్నా!
నా ఈ దేహం ఆలయంగా,, హృదయం రత్న సింహాసనం గా , నా ప్రేమ దివ్య జ్యోతిగా భావిస్తూ ,,నిన్ను నా లో చూస్తూ, భావిస్తూ పూజిస్తూ ,నిత్య నైవేద్యంగా నీకు ఇష్టమైన జున్ను ,పాలు ,వెన్న మీగడలు ఆరగింపు చేస్తాను ,దేవాది దేవా!!
నీవు రాముడివో ,,కృష్ణుడువో,, శివుడ వో ,,లక్ష్మీ ,వాణి భవానీ, రూపాని వో, గణపతి వో ,ఎవరివో తెలియదు గానీ, నీవు మాత్రం ""ముద్దుగారే ఆ యశోద ముంగిట ముత్యము ""లా బాల కృష్ణు డి రూపంలో నన్ను అలరింప జేస్తూ అనందాన్ని కలుగజేస్తు వుండాలి రా ముద్దుకృష్ణా !
ఓ నటన సూత్రధా రీ !
, నీ వు ప్రసాదించిన వేణువు తో నీకువేణు గానం వినిపిస్తూ నిన్ను ఆనందింప జేస్తూ ఉంటాను! చిన్ని కృష్ణా!
నీవు రాధమ్మ తో విహరించిన చిత్రాలు నిన్ను రంజింప జేయగలవు అని అనుకుంటూ ఉన్నపుడు, నా లో మ్రోగే నీ వంశీ నాదం నాకు మధురా నందాన్ని కలిగిస్తూ ఉంటుంది గోపికా వల్లభ!!"
నీ లీలలను రాగ తాళ భావ యుక్తంగా పాడుతూ నిన్ను సంతోషిం ప జేసే ప్రయత్నం జేస్తూ ఉంటానురా బాల ముకుందా!!
యదు నందనా ,!
నీ వంటే నాకు చెప్పరాని ""పిచ్చి ప్రేమ,!"" నీ ముగ్ద మనోహర సుందర లావణ్య రూపాన్ని తలుచుకుంటూ ఉంటే ఆర్ద్రత తో కళ్ళు చెమ్మగి ల్లుతూ ఉంటాయి!
ఆనంద భాష్పాలు పొంగి పొర్లుతూ పోతుంటాయి! ఒక్కమాట లో చెప్పాలంటే,, వెన్నదొంగా, నీవు నాలో నర్తిస్తు, వేణువు వినిపిస్తూ, నన్ను మైమరపిస్తు, నాతో నీ గురించిన వర్ణ చిత్రాలు వేయిస్తు, నాచే నీ వేణువు పలికిస్తూ, నీ గాథలు వినిపిస్తూ, రమణీయంగా వాటిని తిరిగి నాచే రాయిస్తూ, ఇలా నీవు నన్ను ఎడబాయకుండ ,నీకోసం నన్ను ఏదో ఒక విధంగా వినియోగిస్తూ, నా జన్మను సార్థకం చేస్తూ ఉంటున్నా వు గదా శిఖి పించ మౌళి!
కృష్ణా! నీ రూపం మధురం, నీ పిలుపు తలపు వలపు, మధురాతి మధురం కదా ! జగతి పై నీవంటే ఇష్ట పడని వాళ్లుండరు కదా ! లీలా మృత గానం వింటూ ఉన్నప్పుడల్లా ,మనసు ఏరులా పరవళ్ళు త్రొక్కుతూ పరవశిస్తూ బ్రహ్మానందం కలుగుతూ ఉంటుంది
జగన్మోహన !!, నీ వర్ణ చిత్రాలు వేస్తున్నా, నీ లీలలను వేణు గానం చేస్తూ ఉన్నా, నీ పై పాటలు ఆనందంగా కీర్తిస్తూ ఉన్నా ,ఆకలి నిద్రా, సమయము , పరిసరాలు, ఏమీ తెలియ వు కదా ,,వాసుదేవా ! ఎంత దయ గల వాడవు, గోవిందా!
నిన్ను ఎప్పుడూ ఎడబాయ ని భావ సంపద ఇచ్చావు!
నీ మోహన రూపం తో మమేకం అయ్యే మనసును ఇచ్చావు!
తరగని పెన్నిధి లాంటి నీ సన్నిధి కి నన్ను చేర్చు కున్నా వు,,!
చాలు, భగవన్! ఇది చాలు!
"నిత్యం త్వచ్చరణారవింద యుగళ ధ్యానామృత స్వాది నామ్,. ,, అస్మాకం , సరసీ రుహాక్ష ,! సతతం,సంపద్యతాం ,, జీవితం !!"
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!
Sunday, December 8, 2019
నాకు నీవే దిక్కు, నీకు ఎవరు ?
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment