Dec 4, 2019 Karimnagar
""ప్రణామాలు,, గురుదేవా!!"
""ఎవరూ అర్జును డే నా?""
""మీకు సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నాను , స్వీకరించండి !""
""అభీష్ట ఫల సిద్ధిరస్తు ! అర్జునా ! విజయోస్తు!""
""",మహాత్మా ! మిమ్మల్ని చూసి, మీ పాద పద్మాలు తాకి ,,మీ పాద ధూళి శిరస్సు పై గ్రహించిన నేను, ధన్యుడ నయ్యా ను;!"" ,
""అర్జునా ! యుద్దం ఆరంభమయ్యే క అగుపించావు కదా ! పాతికేళ్ల క్రితం చూశాను , నిన్ను రాజసూయ యాగం సమయం లో,! ఇన్నాళ్ళ తర్వాతే నా ప్రియ శిష్యుని చూస్తున్నాను ,,! నాయనా! ఒకసారి నిన్ను అక్కున చేర్చుకోవాలని ఉంది ,! దగ్గరకు రా ,,, వత్సా!!""
""గురుదేవా !! ఇంతకన్నా మహా భాగ్యం ఉంటుందా ?? నాకు చాలా ఆనందంగా ఉంది !""
,""ఈ రోజు నా తపస్సు ఫలించింది! , నా లక్ష్యం నెరవేరింది. అర్జునా!""
""గురుదేవా !ఈ మాట నేను అనాలి, ! అపర మహేశ్వర స్వరూపం గా మూర్తీభవించిన మీ దర్శనం తో నా జన్మ తరించింది,!
పాద రేణువు లా మీ పాదముల చెంత ఉండాల్సిన నన్ను,, మీరు,,మీ హృదయానికి హత్తుకు ని నాకు మహదానందం కలిగించారు ,!! నిజంగా నా అదృష్టం ఫలించింది స్వామీ!;""
""ఆహా !అర్జునా ! నిన్ను చూసి ఒక గురువుగా గర్వంగా ఉంది, నాయనా !!నా శిష్యుడు అర్జున ఫాల్గుణ పార్థ కిరీటి ధనుంజయ సవ్యసాచి విజయ మొదలైన పది నామాల మహోన్నత బిరుదులతో భారతదేశం అంతా కీర్టింపబడుతున్నాడు!
పరమేశ్వరుని మెప్పించి, పాశుపత అస్త్రం పొంది, దేవేంద్రు నిచే సన్మానింపబడిన అస్త్ర శస్త్ర కోవిదుడు,!" సమరం లో విజయమే "తప్ప ఓటమి ఎరుగని నా శిష్యునికి ,, ,సాక్షాత్తు ఆ నారాయణుడే శ్రీకృష్ణ అవతారి యై ,,స్వయంగా, నా ప్రియ శిష్యునికి ,రథ సారథి గా "విజయ సారథి"" యై నీకు విజయాన్ని ,, ధరణి పై ధర్మాన్ని , నెలకొల్ప నిశ్చయించాడు,!! ఏ గురువు కైనా
ఇంతకంటే శిష్యుని నుండి ఆశించేది ఏముంటుంది చెప్పు! అయితే,
అంతటి మహనీయ త ,,గుర్తింపు తనకు ఉండి కూడా , మరచి పోకుండా తన గురుసంప్రదాయానికి గౌరవం ఇస్తూ , గురువు పట్ల తనకున్న వినయ విధేయతలు,, భక్తి శ్రద్ధలు ప్రదర్శిస్తూ గురుదేవుల ను దైవంగా భావిస్తూ ఆశీస్సుల కోసం స్వయంగా వచ్చి ప్రణామాలు సమర్పిస్తూ ఉండడం నీ గురువుగా నాకు, నా శిష్యుడు గా నీకు అత్యంత సంతోష దాయకం , అర్జునా!
ఏ శిష్యుడైన , ఎంతటి మహోన్నత పదవీ, యశస్సు పొందినా , తన ప్రతిభకు , విజయానికి తన గురు కటాక్షమే కారణంగా భావిస్తూ , గురువు పాదాలకు నమస్కరించి తన శిరస్సును తాటించిన శిష్యుడు నిజంగా ధన్యుడు.!! , అతడి ప్రతిభా పాటవాలు, గౌరవాలు శాశ్వత కీర్తిని పొందుతాయి,!!
ఇది నిశ్చయం !నా మాట వేద సమ్మతము !!""
"" స్వామీ, మీ ప్రేమ, వాత్సల్యము, మీ ఆశీస్సులను అందుకున్న నా జన్మ ధన్యం , గురువరా! వాస్తవానికి ,నేను వేసే ప్రతీ అడుగు మీ దీవ నా బలం తోనే ముందుకు సాగుతోంది !""
""అర్జునా ! ఇంతకూ నీ రాకకు కారణం ఏమిటి ,! యుద్దం మద్యలో అర్ధాంతరంగా వచ్చావు ,! నీవు వచ్చిన పనేమి టో నిస్సంకోచంగా చెప్పు నాయనా ??""
""గురుదేవా! నేను వచ్చింది, కేవలం మీ దీవన లు పొందడానికి మాత్రమే ,! అయితే,
స్వామీ ! ఒక్క అనుమానం నన్ను పీడిస్తోంది ,ఈ యుద్దం ప్రారంభం అయిన రోజు నుండి !
గురుదేవా !, భారత సమర సంగ్రామం లో శ్రీకృష్ణ సారధ్యం లో ,నేను భీష్మా ది ఆచార్య ప్రముఖులతో యుద్దం చేస్తున్నపుడు , కౌరవ సేన ముందు ఒక తేజోవంత మైన ఆకారం అటూ ఇటూ వేగంగా కదులుతూ నాకు గోచరిస్తుంది , ప్రతీ రోజూ ,!!
అది ఎవరు? అక్కడ ఏం చేస్తోంది ,? ఎక్కడినుండి వచ్చిందో, ఎందుకు వచ్చిందో ,తెలుసుకోవాలని ఉంది స్వామీ !!""
""అర్జునా! నీకు సారధ్యం వహించే గోవిందుని అడగ వచ్చు కదా ?""
గురుదేవా , ! నాకు ఏది అవసరమో అది మాత్రమే చెబుతాడు, చేయిస్తాడు కూడా,! అదీ గాక, ఇది చిన్న విషయం కావచ్చు, లేదా అనవసర అనుమానం కావచ్చు, అందుకే అడగ లేక పోయాను, !అదీగాక,,
మీ పక్షాన. మీ వైపు న ఉంటూ,,, మీకు అభిముఖంగా నిలుస్తు కనిపిస్తున్న ఆ విచిత్రమైన విషయం మీకు తప్పకుండా తెలిసి వుంటుంది ,! ఎందుకంటే మీరు బ్రహ్మ నిష్టా గరిష్టు లు ! మహా తపో సంపన్నులు,! పరమేశ్వరుని ఉపాసకులు ,!,మీకు తెలియ కుండా యుద్ధరంగం లో ఏదీ జరగదు కదా ,స్వామీ! దయచేసి నా సందేహ నివృత్తిి చేయండి !.""
""సరే అర్జునా ! కానీ , నీకు అగుపించే ఆ ఆకారం ఎలా నీకు కనిపిస్తూ ఉంటుం దొ చెప్పగలవా??"
""గురుదేవా ! అది లీలగా , అతి దూరంగా, ఒక ధూపం లా మాత్రమే చూస్తూ ఉంటాను!!""
""ఇంకా జ్ఞాపకం చేసుకొని చెప్పు ,నాయనా!!""
అది ఒక్క చోట ఉండదు ,! వాయు వేగ , మనో వేగాలతో యుద్ద రంగంలో తిరుగాడుతు ఉన్న ట్టు కనిపిస్తూ ఉంటుంది ,గురుదేవా!!"
""అర్జునా! ఈ సారి, ఆ ఆకారాన్ని అంతరంగం లో ,ధ్యానిస్తూ తిరిగి దర్శించే ప్రయత్నం చెయ్యి అర్జునా ,!!""
""గురుదేవా! మీరు చెప్పినట్టే ధ్యాన సమాధి లో వెళ్తున్నాను ! అదిగో,, అదే ఆకారం స్పష్టంగా కనిపిస్తోంది, !""
""అర్జునా!! చూడు,,! ఆ ఆకారం చేతుల్లో ఏమైనా ఉందా ?!!"
""ఉంది , స్వామీ ,! తేజోవంతమైన ఒక పెద్ద పొడవాటి త్రిశూలం,,!!""
""అర్జునా !ఆ ఆకారాన్ని ఇంకా పరిశీలించి చెప్పు,,!!"
""గురువరేన్యా ,! ఆ ఆకారం శిరస్సు పై నుండి జడలు దశ దిశల్లో విస్తరిస్తూ కాల సర్పం లా బుసలు కొడుతూ ,వేడి వేడి పొగలు గ్రక్కుతూ ఉన్నాయి,!!
""అర్జునా ! బాగా చూడు;, ఆ ఆకారం మెడలో ఏమైనా చూస్తున్నావా,??"
""అవును ,,గురుదేవా! అవును!! చూస్తున్నాను ,,!ఆ కంఠాన్ని చుట్టుకొని ఒక మహా సర్పం వ్రేలాడుతూ అగ్ని జ్వాలలు క్రక్కుతోంది ,! , అమ్మో! ఇంకా చూస్తుంటే భయమేస్తోంది !కళ్ళు తిరుగుతూ న్నాయి !, మహాత్మా !నేనింక చూడలేను ;!""
""అర్జునా,,అర్జునా! భయపడకు !!నీకు ఏమీ భయం లేదు !ఇక కళ్ళు తెరువు ,! నీకు శుభం జరుగుతుంది!""
,, ""గురుదేవా! ఏం జరుగుతుంది ?, ఎవరు అతడు ?""
""నీకు ఇంకా తెలియడం లేదా , అర్జునా,! మీ కు జయం చేకూర్చడానికి యుద్ధరంగం లో దిగి వీర విహారం చేస్తున్న వాడు ఎవరో కాదు ,, అతడు సాక్షాత్తూ ఆ పరమేశ్వరు డే !!"
ఏమిటి శంకర భగవానుడే ,!! మహాదేవు డే ,!కానీ ,,గురు వరా ;, మా కు జయం సమకూర్చాలంటే , అతడు మా వైపు నిలుచుం డి,, శత్రు సైన్య తో పోరాడాలి గానీ , కౌరవు సైన్యం వైపు ఉండి, ఎలా మాకు విజయాన్ని సమకూరుస్తారు స్వామి ?!!""
. ""అదే శంకరుల చిద్విలాసం,, అర్జునా! , కౌరవ వీరులు పాండవుల పై వేసే అస్త్ర శస్త్రాలను వారి ప్రక్కనే ఉంటూ , అక్కడి కక్కడే నిర్వీర్యం చేయ డం ద్వారా ఈశ్వరుడు మీకు పరోక్షంగా సహాయం చేస్తూ జయాన్ని అందజేస్తూ ఉన్నాడు,, ఆ పరమ దయాలువు పరమేశ్వరుడు , !
అర్జునా ,! ఈ విధంగా ఆ హరి హరులు ఇరువురూ కలిసి, యుద్ధంలో, ధర్మ బద్ధంగా పోరాడుతున్న మీకు విజయం కలిగించ డానికి సహకరిస్తూ ఉన్నారు ! జయీ భవ!""
"""మహాత్మా ! గురుదేవా నాకు పరమేశ్వర దర్శనం కలిగించి నన్ను దన్యుని చేశారు !!మహాదేవ మహాదేవ ! గౌరీ శంకరా నమో నమః ! పాహిమాం పరమశి వా ,,!రక్షమాం, సదాశివ !""
, గురువ రా !, మీకు శతకోటి ప్రణామాలు!ఇక నాకు సెలవు ఇప్పించండి !
రేపు యుద్ధరంగం లో కలుసు కుందాం,ప్రణామాలు!" ,,
""అర్జునా !విజయోస్తు , శుభమస్తు ! వెళ్ళి రా,నాయనా!
ధర్మం ఎక్కడో, అక్కడే భగవంతు డు !భగవంతుడు ఎక్కడో, విజయం అక్కడే!!
జయం ,శుభం,!""
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !!
Sunday, December 8, 2019
అర్జున
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment