Dec 4, 2019 Karimnagar
మా చిన్నతనం లో అంటే 60, సంవత్సరాల క్రితం, పల్లె గ్రామాలలో, స్త్రీలు, పొలాల లో స్వయంగా కష్టపడుతూ ,వరి ధాన్యం పండించిన ట్లుగా నే ,,తామే స్వయంగా వడ్లు దంచి దంపుడు బియ్యం తయారు చేసు కునే వారు,! పండగ, పెళ్లి రోజుల్లో అయితే అందరూ ఒక్కచోట చేరి , ఉచితంగా , ఉదార స్వభావంతో ఆ ఉత్సవాన్ని ,కలిసి మెలిసి ఆనందంగా చేస్తుండే వారు,!
ఇది వారి నిత్యకృత్యం గా ఉండేది ! ఇది కుటీర పరిశ్రమ , అంటే ఇంట్లో నే ఉండి కావాల్సిన పదార్థాలు తయారుచేసుకునే విధానం,
తర్వాత గిర్నీ లు అంటే కరెంటు తో నడిచే మర యంత్రం floor mill ద్వారా నేరుగా వడ్లగింజలను ఆ మర యంత్రం లో పోసి ఏ మాత్రం శ్రమ లేకుండా బియ్యాన్ని తీస్తున్నారు,
కానీ ఈ విధానంలో పొందే బియ్యంలో ఉన్న పోషక పదార్థాలు అన్నీ తొలగించ బడి, మనం పొందే బియ్యం నిస్సారమై పోతూ,, ఆ ది తినడం వల్ల నీరసం నిస్సత్తువ తో మనిషి బలహీనుడు గా తయారై రోగాల పాలౌతు ఉన్నాడు, అనే విషయం అందరికి తెలుస్తు ఉంది కూడా ! సరే , కుందెన అసలు విషయాన్ని తెలుసుకుందాం !,
,,,,,వడ్లు పోసే దానిని "కుందెన" అంటారు ! ఇది ఇనుప రేకుతో , స్తూపాకారం గా , పైకి ఎక్కువ వెడల్పుగా కింద తక్కువగా తయారు చేయబడి ఉంటుంది!, దీని అడుగున పెద్ద రోలును ఉంచుతారు . ఇప్పుడు అందులో వడ్లు పోస్తారు, అవి లోపల రోటిపైన, కుందెన లోపల కుప్ప లా పడి ఉంటాయి.
ఈ వడ్ల ను , బలంగా రోకళ్ళ తో దంచినపుడు వడ్లగింజల పై న ఉండే పొర ఊక తొలగి, తెల్లని బియ్యపు గింజ కనిపిస్తు ఉంటుంది, ఆ కాలంలో ఆడవాళ్ళకు ఇది చక్కని వ్యాయామంగా ఉంటూ , వారి మనో భావాలు చెదరకుండా ఉంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ ఉండేవాళ్ళు !!
ఈ విధంగా వడ్లు దంచడం ద్వారా లభించే బియ్యాన్ని "దంపుడు బియ్యం" అంటారు
ఈ బియ్యం పుష్టి కరం! శ్రేష్టం ,! పుష్కలంగా పోషక పదార్థాలు ఉండటం వలన అలాంటి భోజనం తో అప్పటివారు బలంగా దృఢంగా రోగాలు నొప్పులు లేకుండా హాయిగా దీర్ఘాయువు తో జీవించేవారు,!;
ఆ కాలంలో ఏది చేసినా అందరూ కలిసి చేసేవారు ,! కలిసి పంచుకొని తినేవారు,! కలిసి సుక్షేత్రాలకు వెళ్లే వారు కూడా,!
""పదిమందిలో పరమాత్ముడు ""ఉంటాడు అన్నట్టుగా అలా ఆడుతూ పాడుతూ కలిసి పని చేసే వారి ప్రక్రియ తో సమైక్యత భక్తి భావన వాతావరణం ఏర్పడేది అందరిలో..!!
ఈ వడ్లు దంచే విధానం లో కూడా ఒక పరమార్థం దాగిఉంది,! అది గమనించాలి మనం!!
ఆ పరమాత్ముడు ,,ఈ ,జీవులను హాయిగా కులుకుతూ సంతోషంగా ఉండనీయకుండా, బ్రహ్మాండం అనే ఈ కుందెన లో ,,"వడ్ల గింజల" వలె ఈ "జీవులను" వేసి, వారి "కర్మబందాలు"" అనబడే ""ఊక"" (ఉనుక )పొర ఊడే విధంగా," వ్యామోహం అనే రోకళ్ల తో ," జ్ఞానం" అనబడే తెల్లని స్వచ్చమైన ముత్యం లాంటి బియ్యపు గింజ బయట పడే వరకూ దంచుతూ ఉన్నాడే. !! అంటే కుందెన లో నే గుండ్రంగా త్రిప్పుతూ ఉన్నాడు కదా!!
ఆ జీవులకు ,,ఈ అజ్ఞానపుపొర ఎన్నడు ఊడేను? ఈ రోకటి పోటు వారికి ఎన్నడు తోలగేను పల్లె వనితలారా !!
అందుకే మీరు ,""హరీ హరీ, సువ్వీ సువ్వి !""అంటూ ఆ శ్రీహరిని కీర్తిస్తూ,, వేడు తూ మాకై, కోరుతూ, చేయండి శ్రమ!పొందండి సౌభాగ్యం! చూడండి సత్ఫలితం !; దారుణమైన ఆ రోకటి పోటుకు తాళ లేని అల్ప జీవుల మైన మాకు సత్వరంగా ముక్తిని ప్రసాదించ మని చెప్పండి,,దయగల ఓ తల్లుల్లారా !!"
మీరు కుందెన లో ఉన్న వడ్ల గింజల పై పోటు వేయడానికి ఒక చేతితో రోకలి ని మధ్య లో పట్టుకుంటూ పైకెత్తి,, రెండవ చేతితో బలంగా కుందెనలోకి దింపుతూ ఉంటారు కదా,!! ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా,
వేగంగా , మీ శక్తి కొద్దీ ,మీరు వేసే ఆ పొడవాటి రోకళ్ళ కర్ర దెబ్బ లకు తట్టు కొలేక వడ్ల గింజలు చెల్లా చెదురుగా ఎగురుతూ పడి పోతూ ఉంటాయి,!
ఓ పడతులారా !! రోకలి పట్టుకొని గట్టిగా పోటు వేసేముందు మీరు ,, మీ దృష్టిని అటూ ఇటూ పోనీకుండ , మీ రెండు కళ్ళూ సరిగ్గా కుందెన లోని వడ్ల గింజల వైపే కేంద్రీకరించి, ఏకాగ్ర చిత్తంతో రోకల్లు క్రమ పద్దతి లో వేస్తూ ,,వడ్లు దంచుతూ ఉంటారు కదా!!
అలాగే ఆ పరమాత్ముడు కూడా "రాత్రి పగలు" అనబడే తన రెండు కను రెప్పలను ఒకేసారి "సంగడి" చేసిజీవులనూ చూస్తూ,,"ఈ నాలుగు దిక్కులు ""అనబడే తన నాలుగు చేతులతో , రోకళ్ళ వరుస ఘాతాల కు ఓర్వలేక భీతిల్లు తూ, దూరం తొల గే, జీవు లు ప్రక్కలకు తప్పించుకు పోకుండా , సరిగ్గా పోటుకు గురి అయ్యేలా రోకలి కిందికి వచ్చేలా కదుపుతూ ,, పొర తొలగించే ప్రయత్నం చేస్తూ నే ఉన్నాడు ,,
కానీ జీవితం పై ఉండబడే వ్యామోహం అనబడే మాయలో గిల గి లా కొట్టుకుంటూ ,"" పునరపి జననం ,పునరపి మరణం,"" పునరపి జననీ , జఠం రే శయనం ,!!""అను రీతిలో , బావిలో కప్పల వలె, తమ వాస్తవ దుస్థితిని గ్రహించకుండా ఉంటున్నాయి కదా ఈ వడ్ల గింజ స్వభావం కల ఈ జీవులు,!
" అజ్ఞానం" అనబడే "మాయా పొర ""లాంటి అవరణ లో ఉంటూ "అదే లోకం ""అనుకుంటూ,, భరించలేని ఈ రోకటి దెబ్బ లు అనుభవిస్తూ కూడా,, ""అదే సౌఖ్యం! అదే మహదానందం!""గా భ్రమ పడుతూ ,, పిచ్చి అనందం తో ఎగిరెగిరి పడుతున్నా డు జీవుడు,!!
కానీ, భగవంతుని ఈ" దంపుడు విధానం" తమను ఉద్ధరించడానికి , తనలో బియ్యం గింజ వలె మెరిసే జ్ఞానం ఆనబడే రత్నాన్ని వెలికి తీసే ప్రయత్నం అని గ్రహించడం లేదు !! జీవితంలో నిరంతర సంఘర్షణ సమస్యలు, ఆటు పోటు లు ఇవన్నీ పరమాత్ముని సృజనలే అనీ, తట్టుకొడానికి తన సామర్థ్యం చాలద నీ, పరమాత్మ ధ్యానం వల్లనే మాయావరణం పొర తొలగి ముక్తి లభిస్తుందని జీవునికి తెలియాలి, ఇదే అత్మ దర్శనం, ఆత్మలో పరమాత్ముని దర్శించడం ,! అలా చేస్తే , రోక లి పూల మాల అవుతుంది , కుందెన భగవంతుని కోవెల అవుతుంది ,,, అపుడు ఈ బియ్యపు గింజ కు పరంధాము ని ప్రసాదంగా వినియోగించే యోగ్యత. సిద్ధిస్తుంది. !! తమను ఈ విధంగా "ఆడించే ""వాడు తమకు మేలు చేస్తున్నాడు,, అని భావించడం లేదు ఈ జీవులు ,!!
అందుకని ఓ పల్లె పడుచు లారా,, !! మీరు వడ్లు దంచడానికి , రెండు చేతులూ ఎత్తి, చెమట పడుతూ ఉన్నా , ఎంతో శ్రమిస్తూ, కూడా, స్వామి కార్య దీక్షతో, నిరంతరంగా రోకల్లను కదుపుతూ , ఏకాగ్ర చిత్తము తో ,కుందెన లో సామూహికంగా పోటు వేస్తూ, స్వచ్చమైన బియ్యాన్ని పొందుతారు. ! దానినుండి, పరిశుద్ధమైన, భగవద్ నివేదన కు యోగ్యమైన ఆహారం తయారు చేసుకునే క్రమంలో ,,మీరు అంతా కలిసి ""హరి నామం గానం"" తో , శుద్ది చేస్తూ ఉత్తమ పౌష్టిక పోషక పదార్థం గా రూపొందిస్తూ ఉన్నారు ,,
ఆ పరందాముడు కూడా ఇలాగే , జీవులను ఉద్దేశించి ఇదే పరమార్ధాన్ని సూచిస్తూ ఉన్నాడు !
ఓ జీవులారా!, మీలో ""అణిముత్యం "లా అంతరంగం లో మెరుస్తున్న తెల్లని బియ్యపు గింజను నాకు ప్రసాదంగా. భావిస్తూ సమర్పించండి !!
మీకు "జీవన్ముక్తి" అనుగ్రహిస్తాను !!,,అనగా ఈ " సంసారం"" అనబడే కుందెన నుండి తప్పిస్తాను !,
ఎన్నాళ్ళ నుండో ,ఇలా వరుస దెబ్బలు తింటు ఉన్నా కూడా, నా గురించిన ధ్యాస లేకుంటే,, ఇక మీ గతి ఇంతే !"ఇదంతా నేను అనీ, నా అనుగ్రహం అని, మీరు అనుభవిస్తూ ఉంటున్న కర్మ బంధాల నుండి, నా దయ లేనిదే విడి వడ లేరనీ తెలుసుకోండి !!
"హరి నామం '""పలకండి , మీరు తినే దెబ్బలు పుష్పాలు గా మారుతాయి!
మీలో జ్ఞానం వికసించి, ఉడికిన బియ్యపు గింజ రక్తం లో జీర్ణం అయినట్టుగా, మీరు నాలో ఐక్యం అవుతారు!! అని భగవంతుని గీతా వాక్యం!!
ఇదిమానవ జీవన రహస్యం!!
ఈ విధంగా ,,మన సనాతన హిందూధర్మ శాస్త్ర జీవన చర్య లను, ఏ కోణం నుండి చూసినా ,,"అడుగడుగునా ""దైవ భావన" ప్రస్ఫుటంగా కనిపిస్తుంది!
అందుకే చూసే కన్నులు ఉండాలి గానీ, ""ఎందెందు వెదకి చూచిన ,,అందందే కలడు పరమాత్ముడు ,!""
""యద్భావం తద్భవతి !"అంటుంది వేదం ! అందుచేత , అలాంటి చక్కని భావ సంపదను ప్రసాదించమని , ఆ లీలా మానుష వేషధారిని, ఆ జగన్నాటక నటన సూత్ర ధారి ని,, ఆ శ్రీహరిని, ఆ సర్వేశ్వరుని , ఆ దీన జన బాందవుని,, కోరుకుందాం !;
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!!
Sunday, December 8, 2019
బియ్యపు గింజ
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment