Dec 30, 2019
___________
శ్రీకృష్ణ పరమాత్ముని తో విడదీయరాని అనుబంధం ఏర్పరచుకొని అనుక్షణం ,ఆనందంగా. ఉండడానికి జీవుడు పడే తాపత్రయాన్ని ,,మధురాతి మధురమైన అనుభూతి ని ""కృష్ణ ప్రేమ ""అంటారు
కృష్ణ ప్రేమ అంటే భక్తుని పవిత్ర భక్తి భావనను, నిష్కల్మషమైన ప్రేమను కృష్ణయ్య గుర్తించడం !!,
,,, ఏ కృష్ణ భక్తు ని కథను చూసినా కృష్ణుని పై భక్తుని కి గల అపార విశ్వాసాన్ని శరణాగత భావాన్ని గ్రహించ వచ్చు ను ! ,,,
జన్మతః అంధుడైనా, కృష్ణ భక్తుడు , సూరదాస్ ,తన బాల్యం నుండి కృష్ణుణ్ణి ధ్యానిస్తూ, అలానే జీవిస్తూ,చివరకు అంతటా కృష్ణుణ్ణి దర్శిస్తూ ,ఉంటాడు ,, అమోఘము ,,పరమాద్భుతం గా శోభించే "" శ్రీకృష్ణ తత్వం ""తో తన ఎదుట చిన్ని కృష్ణుడు కూర్చున్నట్టుగా భావించి కృష్ణ గీతాలు పాడుతూ ఆనందంగా జీవితం గడిపాడు.
నిజంగానే కృష్ణుడు శైశవ రూపంలో అతడికి. దర్శనం ఇస్తూ అతడి ముందు కూర్చుండి వింటూ ఉండేవాడు
దీనినే "కృష్ణ ప్రేమ"" అంటాము ,,
,కర్ణాటక రాష్ట్రంలో ని ఉడిపి కృష్ణ మందిరంలో కొలువై ఉన్న శ్రీకృష్ణుని దివ్య సుందర రూపాన్ని దర్శించాలంటే , ఆ గర్భ గుడి గోడలకు ఉన్న తొమ్మిది కన్నాలు ఉన్న ఒక కిటికీ ద్వారా మాత్రమే చూసే వీలు ఉంటుంది ,,ఈ తొమ్మిదికన్నాలు ,మనిషికి ఉండే నవ రంద్రాలను సూచిస్తూ ఉంటాయట !
మనలో కొలువై ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ కరుణ వల్లనే ఈ తొమ్మిది రంధ్రాలు ఉత్తేజాన్ని పొందుతూ, దేహాన్ని చైతన్య వంతం చేస్తుంది ,,
ప్రతీ జీవాత్మ , పరమాత్మ అంశమే కాబట్టి ,,జీవుడు తన జీవన చర్యలు సాఫీగా నిర్వర్తించే విధంగా ,,,లోన గల శ్రీకృష్ణుడు తన సంకల్పం తో జీవుడి బుద్దిని మనసును ప్రకోపింపజేస్తు ఉన్నాడు
దీనినే కృష్ణ ప్రేమ అంటాము,,
భారత సంగ్రామానికి ముందు దుర్యోధనుడు కృష్ణుని ఒక అక్షౌహిణి సైన్యాన్ని కోరితే ,,,అర్జునుడు కృష్ణుని మాత్రమే కోరుకున్నాడు,,
"" అందుకు కృష్ణుడు అన్నాడు అర్జునుని తో, ""అర్జునా !!ఎంత అవివేకం నీది,! నేనా ఒంటరిని ,,!పైగా ఆయుధం పట్టన ని కూడా చెప్పాను కదా !!అలాంటి నన్ను ,నీవు కోరుకోవడం వల్ల ,,నేవుభీకరమైన ఆ యుద్దం లో ఎలా విజయం పొందుతావు చెప్పు !""
అన గా అర్జునుడు కృష్ణుని ముందు మోకరిల్లి అంజలి ఘటిస్తూ ,""పురుషోత్తమా ! పరంధా మా ! నీవు ఒక్కడవు మా పక్షాన నిలబడితే చాలు!!,మాకు విజయం తథ్యం ,! పరమాత్మా !!నీవు ఎవరివో ,,నేను ,ఎరుగుదును,, కృష్ణా ,సాక్షాత్తూ నీవు జగన్నాథు నివి ,! స్వామీ , నీ కరుణకు నోచుకున్న వారికి అపజయం ఉండదు కదా!"" అంటాడు
ఇదీ ""కృష్ణ ప్రేమ ""అంటే!
ఈ ప్రేమలో సంతృప్తి ,సంతోషం , పరమానందం ఉంటాయి !
ఏది ఉంటే, మన జీవితంలో ఇక మరేదీ అవసరం లేకుండా ఉంటుందో దానినే "కృష్ణ ప్రేమ ""అంటారు
ప్రతీ మనిషిలో,పుట్టుకతో ప్రేమ,కరుణా , జాలి, వాత్సల్యం భావాలు సహజంగా ఉంటాయి,, అవి పుష్కలంగా ఇతరులకు పంచుతూ ఉంటాడు.
నిజానికి ""కృష్ణ ప్రేమ ""అంటే అదీ!
కానీ,వానికి బదులు, కోపం,ఈర్ష్య , అసూయ, ల తో, కోరికలు పెంచుకుంటూ మాత్సర్యము కలిగి ఉంటూ మానవత్వం మరిచిపోతున్నారు. ,,
,, కృష్ణ ప్రేమ కావాలంటే,, ప్రతీ జీవుడూ ఒక ""అర్జునుడు "కావాలి!!,అంటే అతడి వలె ధనుర్విద్య నేర్వాలని కాదు ,,! అతడు కొరుకున్నట్టుగా ,,కేవలం కృష్ణుణ్ణి మాత్రమే ఎల్లప్పుడూ కోరు కొంటూ ఉండాలి అనీ! అనగా ,,
ఇంట్లో కృష్ణ విగ్రహం అందరికీ కనబడేలా పెట్టుకోవాలి,,! ఎప్పుడూ పూజిస్తూ ఉండాలి,!
ఎటు చూసినా,కళ్ళకు కృష్ణుడే అగిపించాలి,!, ఇలా చేస్తూవుంటే మనసులో అదే కృష్ణ స్వరూపం దర్శనం అగుపి స్టూ వుంటుంది ,
కృష్ణుణ్ణి కోరుకోవాలి అంటే,అతడు ఎక్కడ ఉన్నాడని కోరుకుంటాం ??, అతడే కావాలి అంటాం కానీ,,కృష్ణుణ్ణి పట్టుకోవడం ఎలా ??!
అనవర తం ,కృష్ణుణ్ణి గురించిన ధ్యానం, గానం ,సేవనం ,భాషణం , చేస్తూ ఉండాలి
ఇదే అర్జునుడి చేసినపూజ విధానం !;
అదే కృష్ణ తత్వం!!
అదే ""కృష్ణ ప్రేమ""!"
,,ఒక ఇంట్లో అత్తా కొడుకు కోడలు ఉంటున్నారు అనుకుందాం !!పెద్దావిడ అత్తయ్యను కోడలు ప్రేమగా చూస్తూ ఆదరిస్తూ ఉంటే ,అత్తగారు,కట్టుకున్న భర్త, ఆమె పవిత్రప్రేమను గుర్తిస్తే చాలు అదే కృష్ణ ప్రేమ అవుతుంది ! ఆ కోడలు జన్మ ధన్యం అవుతుంది !!
ప్రేమ వుండగానే సరిపోదు,దానిని గుర్తించే నాథుడు , గుర్తింప బడటానికి యోగ్యత కూడా ఉండాలి !;
నిష్కల్మష మైన,నిశ్పలాపెక్ష గల ప్రేమ ను గుర్తించడం అందరికీ సాధ్యపడదు ,,అది అంత సులభం కాదు!గ్రహించేవారికి కూడా పరిశుద్ధమైన అంతః కరణ ఉండి తీరాలి !!
తల్లీ కొడుకులకు ఒకే రక్త సంబంధం ఉంటుంది.! ,,కనుక వారికి అనుబంధం సహజం !
కానీ ఏ పూర్వ సంబంధం లేకుండా కేవలం తాళి బొట్టు తో మాత్రమే ఉండే అత్తా కోడలు సంబంధం లో ప్రేమను వాత్సల్యాన్ని నిస్వార్థ భావంతో అంకితభావం తో పెంచుకునే ఈ అనుబంధం "", కృష్ణ ప్రేమ""ను తలపిస్తూ ఉంటుంది
ఇలా ప్రపంచమంతా కృష్ణ ప్రేమతో నిండి పోవాలంటే ,, ,స్వార్థం ప్రతిఫలాపేక్ష భావం ఉండకూడదు !!
ఇతరుల అవసరానికి ఇవ్వడం అనేది గొప్ప విషయం!!, నిజమే,,, కానీ తన యోగ్యతను గుర్తిస్తూ ఎదుటివారు ప్రకటించే ఆదరణ కృతజ్ఞతా భావం, పవిత్రమైన ""కృష్ణ ప్రేమ "ను తలపిస్తూ ఉంటుంది
ఒకప్పుడు మన వల్ల సహాయం పొందినవాడు గుర్తు పెట్టుకొని, తర్వాత కొన్నాళ్లకు మనకు కృతజ్ఞత ప్రకటించే వాని మొహం లో కృష్ణప్రేమ తొనకిస లాడుతూ ఉంటుంది,,
దీనినే శాశ్వతం చేసుకుంటే ,,కృష్ణ సాయుజ్యాన్ని ప్రసాదిస్తు ఉంటుంది,,,
, మహారాష్ట్ర నివాసి ,,నామదేవుడు పండరి విఠల్ భగవానుని పరమ భక్తుడు,!! ఒకరోజున ,,అతడిని కాపలా దారులు ఆలయం లోనికి అనుమతించక పోతే, అతడు విలవిల లాడిపోయాడు ,,,భక్తు ని ఆవేదన చూడలేక భగవంతుడు. , స్వయంగా ఆలయం బయటకు కదిలి వచ్చాడు,,
ఇదీ ""కృష్ణ ప్రేమ" అంటే!!
అలనాడు ,గజేంద్రుని మొర ఆలకించి ,,భగవంతుడు ఎలా ఉన్నాడో ,అలానే దిగివచ్చి ,,మొసలిని దునుమాడి ,కరిని కాపాడటం గజేంద్రుని పవిత్ర"కృష్ణ ప్రేమ"" అనవచ్చును.
,,, ఆ విధంగా ",కృష్ణ విరహం"" భరించలేని గోపికల విరహవేదనను కృష్ణుడు కూడా అనుభవించి , వారికి రాసలీల వైభవాన్ని అనుగ్రహించాడు ,,
,కృష్ణ పరమాత్మ వియోగాన్ని క్షణమైనా భరించలేని భక్తుడు పడే పరితాపాన్ని "" కృష్ణ ప్రేమ"" అంటారు ,అనగా కృష్ణుని గురించిన ప్రేమ !!
ముద్దు ల తనయుడు ,,చిన్ని కృష్ణుణ్ణి విడిచి క్షణమైనా ఉండలేని , ఆ యశోదా మాత మాతృ హృదయం పడే ఆరాటం ఆవేదన ను ""కృష్ణ ప్రేమ ""అంటా ము,,!
ఆ నీలమేఘ శ్యామ సుందరుని ముగ్ద మోహన సౌందర్య రూపాన్ని హృదయారవింద ము లో దర్శిస్తూ,బ్రహ్మానందం పొందే మీరాబాయి తన్మయ స్థితిని కూడా ""కృష్ణ ప్రేమ ""అంటా ము,,
కృష్ణుడే ప్రాణం!, కృష్ణ ప్రేమ యే జీవం ,!!కృష్ణ రూపమే ధ్యానం !;,కృష్ణ భావమే ఆశ్వాసం గా ,సేవిస్తూ , పూజిస్తూ ,స్మరిస్తూ ,పరవశించే జీవుని అద్భుత అలౌకిక అనుభవైక వేద్య పరమానందం స్థితిని కృష్ణ ప్రేమ"" గా భావిస్తూ ఉన్నాము !!
""నల్లని వాడు ,పద్మ నయనమ్ముల వాడు,కృపారసంబు పై జల్లేడు వాడు, మౌళి పరిసర్పిత పించమువాడు నవ్వు రాజిల్లె డు మోము వాడు, భువన మోహనం గా వేణు గానం చేయువాడు ,, పీతాంబర ధారి,గోపీజన హృదయమందారుడు ,బృందావన విహారుడు ,మునిజన మానస చోరుడు , ఆ శ్రీకృష్ణ పరంధాముడు తన అపార కరుణా కటాక్ష వీక్షణా లను అనుగ్రహిస్తూ కృష్ణ ప్రేమా సక్తులను ,,కృష్ణానురక్తుల ను కరుణిం చా లని ,,అంతటి భావ సంపదను ,యోగ్యతను పొందేందుకు తగిన స్ఫూర్తిని , శక్తినీ,సంకల్పాన్ని, కృష్ణుని ఆరాధించే పరమ పావన ""శ్రీకృష్ణ ప్రేమ"ను ప్రసాదించమని , దేవాది దేవుడూ,,దివ్య ప్రభావుడు ,, కరుణాలోలుడు , ఆ నందనందనుడు , గోవిందుడు ,,గోపాలుడు ,, ఆ వేణుగాన వినోదుని ,, భక్త వత్సలుని ప్రార్థించు కుందాము,,!""
హరే కృష్ణ హరే కృష్ణా !"',
Saturday, January 11, 2020
కృష్ణ ప్రేమ
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment