Saturday, January 11, 2020

కృష్ణ ప్రేమ 2

Jan 5, 2020
________&&&___
  శ్రీకృష్ణ భగవానుని పరమ భక్తుడు భీష్మ పితా మహుడు ,!ధర్మ స్థాపన కొరకై మహావిష్ణువు ,, శ్రీకృష్ణుడిగా అవతరించిన దేవ రహస్యం అతడికి తెలుసు ,!!
అదే సమయంలో ,తాను అధర్మ పక్ష పాతి గా ఉంటూ,తన అండ చూసుకొని దుర్యోధనుడు ఇంకా ఇంకా గర్వంతో విర్రవీగుతూ దౌర్జన్యాలు సాగిస్తూ ఉన్నాడని కూడా అతడికి తెలుసు !
అయినా, ఎన్నో సార్లు చెప్పి చూశాడు ,లాభం లేకుండా పోయింది , ""వినాశ కాలే విపరీత బుద్ది !""అనుకుంటూ ,,భారం పరమాత్ముని పై విడిచి, తాను ప్రేక్షక పాత్ర నిర్వహిస్తూ మౌనంగా ఉండి పోయాడు,!
తన కర్తవ్యం  కురు వంశ రక్షణ ,మాత్రమే ! ప్రతిజ్ఞా బద్దుడై  ,అయిష్టంగా కురు సామ్రాజ్య సంరక్షణ భారం వహించాడు !!
, కానీ  ధర్మంగా నిర్వహించడం లో తన శక్తి ,సామర్ట్యం పని చేయలేదు ,!!పైగా పాప భారం పెరిగి పోతోంది,!
అందుకే ,ఇక యుద్ధంలో మరణించడం ఒక్కటే ,తన పాపానికి నిష్కృతి అనుకొంటూ ,,""అధర్మము, ధర్మానికి ఎలా తల వంచుతుందో ""అలా తనను తాను పరమాత్మకు సమర్పించి ,వీరోచిత మరణాన్ని ,ఉత్తరాయణ పుణ్యకాలం లో స్వచ్ఛందంగా ,పరమాత్మ సాక్షాత్కారం చేస్తూ ,ఉత్తమగతిని పొందాడు,!!
అతడి  భక్తి తత్పరత కు ఫలితంగా , అంత్యకాలంలో ,సకల  పాప హరణము ,మోక్షదాయకం అయిన శ్రీ విష్ణు సహస్రనామాలు భీష్మా చార్యులు తో చెప్పించాడు ,, శ్రీకృష్ణ పరమాత్మ ,!!
!అయితే ఇంతటి బృహత్ కార్యాన్ని చేపట్టే ముందు ,భీష్ముడు ముకుం దుని స్తుతిస్తూ ,,,"" ఓ పరమాత్మా  !గోవిందా! పుండరీకాక్ష ! అమోఘమైన అపురూపమైన , దివ్యమైన,అద్భుతమైన  నీ స్వరూప గుణ  నామ సంకీర్తన చేయుటకు నేనెంత వాడిని  ప్రభూ!అది కూడా నీవు నా సమక్షం లో నా కెదురుగ ఉండగా చెప్పే దుస్సాహసం చేయగలనా ,పరందామా,?పరాత్పర !నీ అనుగ్రహం ఉంటే నే తప్ప , ఈ అర్భకుడికి , అజ్ఞానికి వృద్దుడికి  ఆ యోగ్యత , ఆ మహా భాగ్యం సిద్దించేనా మహానుభావా !!"",??,అంటూ దీనంగా శ్రీకృష్ణుని ప్రార్ధిస్తూ ఉంటె,శ్రీకృష్ణుడు చిరునవ్వు  తో భీష్మునికి ఆ  వరాన్ని ప్రసాదించాడు,!భీష్ముని భక్తి తత్పరత ,అకుంఠిత నిష్టా గరిష్టత వాసుదేవుని కి తెలుసు !! అతడికి తనపై గల అనిర్వచనీయ మైన కృష్ణ ప్రేమ తెలుసు !అందుకే అతడిని అనుగ్రహించాడు పరందాముడు. !!
ఆ వెంటనే మహదానందంగా విష్ణువును ,వేయి నామాలతో స్తోత్రం  చేశాడు గంగా తనయుడు..!!
భీష్మునికి కృష్ణుడు అంటే అమితమైన  ప్రేమ ,భక్తి గౌరవం ,!కృష్ణ లీలలందు ప్రగాఢమైన  అనురక్తి కూడా !! అందుకే అతడుమహా మహా మునులు గానం. చేసిన విష్ణువు నామాలను ,పరమాత్మ ముందే ,,స్తుతించే అంత  గొప్ప భాగ్యానికి   నోచుకున్నాడు   ,!!
ఆ పవిత్ర గంగా ధార ,విష్ణు సహస్ర నామ స్తోత్ర వైభవం,కృష్ణుని దివ్య అంశగా  మన కళ్ళ ముందే నడయాడే దైవంగా భాసిస్తు,ధర్మాచరణ ఉద్యమంలో నిమగ్నుడై ,, సాకేతపురి నిలయుడై,, అన్ని దేశాలు కలయ తిరుగుతూ ,,సనాతన ధర్మాన్ని వ్యాపింప జేస్తూ,, పలు,సామాజిక  ,ధార్మిక ,ఆధ్యాత్మిక ప్రయోజనాలను సామాన్యులకు కూడా అందజేస్తూ ఉంటున్న ""శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ""వారి అనుగ్రహం వలన,  ఆ స్తోత్ర వైభవం విశేష జనాదరణ పొంది, తాము స్వయంగా ,శ్రీకృష్ణ భగవానుని సహస్ర స్తోత్ర గానం చేస్తూ ,పరమానందం పొందే మహాభాగ్యం  సకల జనావళికి  ఇప్పుడు  లభించింది ,,!
అట్టి భీష్మాచార్యుని కి శతకోటి ప్రణామాలు చేద్దాం !
. .__ కురుక్షేత్ర యుద్ధంలో, విజయ సారథి గా వ్యూహ రచన చేస్తూ ,చక్రం తిప్పుతున్న శ్రీకృష్ణ భగవానుని సూచన మేరకు ,,,అర్జునునితో నిహతుడై , కదలకుండా పడుకొని హరినామ జపం చేస్తూ ఉన్న భీష్మునికి తానే ముక్తిని ప్రసాదించాడు . కృష్ణ పరమాత్మ !!
జరిగిన దౌర్జన్యాలకు పశ్చాత్తాపం  పొందుతూ ,కుములుతూ ఉన్న తన భక్తునికి ఈ విధంగా మనశ్శాంతి ని అందించాడు కృష్ణయ్య !!
భీష్ముడు అలా తన కళ్ళ కెదురుగా  ఉన్న భగవంతుని తనివారా చూస్తూ ,ఆయన లీలలు గానం చేస్తూ ,ఉత్తరాయణ పుణ్యకాలం లో ,కృష్ణపరమాత్మలో  ఐక్యం అయ్యాడు  !
"మరణం" అంటే అలా భీష్ముడు కోరుకున్నట్లు ఉండాలి ,!జీవుడు ఇలాంటి వరమే కోరుకోవాలి కూడా!!
సునాయాసే న మరణం అనుకుంటాం కానీ,బాధపడకుండా మరణిస్తే ,,పరమాత్ముని జ్జ్ఞాపకం చేసేది ఎలా??గతజన్మ పాపాలు పోయేది ఎలా ?? అందుకే ,అలా అనుకోకుండా ,, దైవాన్ని అంతరాళం లో దర్శిస్తూ బాధలు కష్టాలు,కన్నీళ్లకు వెరవకుండా ,,,జీవిస్తూ ,
చావు అంటే భయపడకుండా ఉండాలి !;బాధపడుతూ ఉండే చావు వద్దు,అని అనుకోకుండా ,బ్రతికినన్నాళ్ళు , దైవాన్ని విడవకుండా మరవకుండ ఉండాలి అని కోరుకోవాలి. మనం !!
నిజానికి ,మరణమే కాదు, ఏది కూడా మన చేతుల్లో లేదు,అనుకున్నట్టు జరగడానికి ,కేవలం కోరుకోవడం మాత్రమే మనం చేయగలిగింది ,చేయ వలసిన ది కూడా !! అలా  అంతరంగం లో హరిని నిలుపుకొని ఆనందంగా ,హరి భజన ,చేస్తూ, రోజూ చేసుకునే దైనందిన కార్యక్రమాలలో,ప్రకృతిలో ,పరిసరాల్లో దైవాన్ని దర్శిస్తూ ,ఉంటే , ఏ నాటికైన,ఎవరికైనా  తప్పని ఈ  "చావు ""అంటే భయం ఎవరికీ ఉండదు కదా !
""హరి నామం కడు ఆనందకర ము ,! మరుగ వో ,, మరుగ వో ,ఓ మనసా !!""
అలా  ,హరి రూపాన్ని హృదయం లో దర్శిస్తూ ,,చివరి శ్వాస విడిచిన అదృష్టం పక్షి రాజైన
జటాయువు కు  కూడా దక్కింది  !.
చూడటానికి ,పక్షి అయినా ,రాముని కోసం ,,రాముని భార్య అయిన సీతమ్మను ,రావణాసురుడి బారి నుండి రక్షించడానికి ,శాయశక్తులా,ప్రాణాలకు తెగించి పోరాడాడు !, కానీ అతడి శక్తి ,,రావణుడి శౌర్యం ముందు సరి పోలేదు ,!పాపం,,,రేక్కలు విరిగి నేల కూలాడు  జటాయువు!;
అతడు , రక్తం ఓడుతూ కూడా ,,రాముడు వచ్చే వరకు బాధను భరించాడు ,!
రామునికి సీత వృత్తాంతం  చెప్పాడు! ,రాముని చూస్తూ,రాముని చేతుల్లో కన్ను మూశాడు ,జటాయువు !ఇంతకంటె గొప్ప అదృష్టం, ఏ జీవుడికైనా ఉండదు కదా !!
ఇలా భగవంతుని సేవలో తరించి ,భగవంతుని ధ్యానం ,భావం తో జీవించి ,చివరకు తన కళ్ళ ఎదురుగా భగవంతుని  చూస్తూ ,బ్రహ్మానందం పొందుతూ , మరణించే వారు మహాత్ములు ,మహానుభావులు  కూడా !
కృష్ణ ప్రేమ అంటే  ఇదే ! తమ ప్రేమను సేవ ,,భజన,,తత్వ విచారణ ,ద్వారా త్రికరణ శుద్ధిగా  బహిర్గతం చేస్తూ అనందం పొందుతూ ఉండడం ! ,అంటే జీవితంలో లభించే ప్రతీ అవకాశాన్ని  త్యాగం  చేయడం ,,జీవితాన్ని అంకితంచేయటం ,ఆత్మార్పణం  చేసుకోవడం ,సంపూర్ణ శరణాగతి చేయడం" కృష్ణ ప్రేమ ""గా భావిస్తాం !!,,
నవవిధ భక్తుల్లో ,అత్మ సమర్పణ భావం చాలా  ఉత్కృష్టమైనది ,,!అలాంటి భావ సంపద తో ,
శ్రీకృష్ణుని చూస్తూ గాంగేయుడు చేసిన భీష్మ స్తుతి అద్భుతం ,!,నిత్య !; పఠనీయం,!భుక్తి ముక్తి దాయకం !
భీష్ముడు,తన కళ్ళ ముందే శ్రీకృష్ణుని  దర్శిస్తూ, పది రోజులు అర్జునుడి తో యుద్దం చేశాడు  నిష్కల్మషమైన  అతడి కృష్ణ ప్రేమ ,, భీష్మునికి ""చిరంజీవత్వం " అనుగ్రహించింది ,,,
మరణసమయంలో జీవుడు ,మనసును ఈ బందుజాలం ,ఐశ్వర్యాలు వైపుకి పోనీకుండ ,కేవలం ఆ కృష్ణుని పై మాత్రమే ,మనసును నియంత్రించడంతో ,, ఆ అనుబంధం పవిత్ర "కృష్ణ ప్రేమ" అవుతోంది
ఒక్కసారి  ఆ జగన్మోహన ఆకారాన్ని , ఆ భువన మోహన సుందర రూపాన్ని ఆత్మలోదర్శిస్తే,చాలు ,,సకల పాప హరణం తో బాటు ,జన్మ పావనం అవుతోంది ,!"
హరే కృష్ణ హరే కృష్ణా
కృష్ణ కృష్ణా హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే!;!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...