Jan 4, 2020
"ఎందుకు మీరు ఇలా చెప్పులు లేకుండా , బూట్లు తొడగకుండ వాకింగ్ చేస్తున్నారు ?"
"వాకింగ్ చేస్తే ఇలానే చెయ్యాలి మరి !"
"ఈ బండలు రాళ్ళు , మీ కాళ్లకు కుచ్చుకోడం లేదా ,?"
"అవును! ;పాదాలు కాస్తా నొస్తు ఉంటాయి కూడా !*"
""మరి ఎందుకు బాధ పడుతూ నడవటం ,?! హాయిగా ఎంజాయ్ చేస్తూ walking చేయకుండా !"
""కానీ , నాకు ఇలా నడవడం లో బాధ అనిపించడం లేదే? పైగా ఇలా నడవడం లో ఉన్న సంతోషం సంతృప్తి ,ఆరోగ్యం ,చెప్పులు వేసుకొని నడవడం లో లేదు అనిపిస్తూ ఉంది నాకు!""
""అవునా అదెలా !??""
""ఈ శరీరానికి మనం. ఎలా అలవాటు చేస్తే అలానే ఉంటుంది !, అంతా మనం అనుకోవడం లోనే ఉంది !"
"తెల్లారితే వేలమంది అలా చెప్పులు. షూ వేసుకొని వాకింగ్ చేస్తూ ఉంటారు ,వాళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటున్నారు కదా!!"అయినా కావాలని , ఇలా కష్ట పడాలి అని ఎవరూ అనుకుంటారు చెప్పండి ?""మీరు తప్ప !!""
""కష్టం అంటే ఏమిటో ముందు. చెప్పండి ??"
కష్టం అంటే మనకు ఇష్టం లేని ది అంతా కష్టమే !
కదా !"""
""ఇలాంటి నడక ఇష్ట పడాలి,, అంటే విషయం తెలియాలి కదా !""?"
""ఇందులో తెలియని గొప్ప విషయం ఏముంటుంది ?""
""ఉంది ,!చాలా ఉంది ,! కాంక్రీట్ రోడ్డు పై కాకుండా ,ఇలా నేల పై ,పాదరక్షలు లేకుండా నడవడం చాలా ఆరోగ్య దాయకం !""
""అది ఎలా ? చెప్పండి!??
"చెబుతాను ,!మీరు అంటున్న ఈ చిన చిన్న రాళ్ళు అరికాలు పాదాలకు గుచ్చుతూ ఉంటే, ఆ పాదాల ఉన్న వేలాది నాడులు ప్రేరేపిం ప బడి ,మొత్తం శరీరంలోని నాడీమండలం లో ఉన్న కోట్లాది నాడులు ఉత్తేజితం అవుతూ,మన దేహంలో ఉన్న గుండె,, కాలేయము,, ఊపిరితిత్తులు,, మూత్రపిండాలు, , మెదడు,వెన్నుపాము , కాళ్ళు చేతులు ,,ఇలా లోనున్న సమస్త అవయవాలు చైతన్యం పొంది ,శక్తిని సంపాదిస్తూ ఉంటాయి !, దాని వల్ల శరీరంలో ని కండరాలు ,బలంగా తయారవుతాయి!! ,అంతేకాదు ,రక్తప్రసరణ చక్కగా అవుతుంది , కొత్త రక్త కణాలు పుట్టుకొస్తాయి కూడా!""
""అమ్మో !;ఇన్ని లాభాలే ,!!ఇంత కథ ఉందా కాలి నడక వలన !"
""అవును ఉన్నాయి సైన్స్ పరమైన ప్రయోజనాలు ,ఆధ్యాత్మిక సందేశాలు !; అందుకే ,అయ్యప్ప ,హనుమాన్ ,భవానీ దీక్ష తీసుకున్న వారికి అంత శక్తి కలుగుతూ ఉంటుంది,,!వారు ఏటా అలా సంతోషం గా దీక్ష తీసుకుంటూ ఉంటారు !!""
"" అంటే ,అలా చెప్పులు లేకుండా నడిస్తే ,అంత శక్తి వస్తుందంటారు ,మీరు ?""
""అవును! ,నేనే అందుకు ప్రత్యక్ష సాక్షిని ! నాకు 72 ఏళ్ల వయసు లో కూడా ,అయ్యప్ప దీక్ష తీసుకోవడం ,పెద్ద పాదం 80 కిలోమీటర్ లు మట్టి నేలపై పాదరక్షలు లేకుండా నడవడం ,కరిమల నల్లమల కొండలు ఎక్కడం ,ఇవన్నీ నాకు దేహ దారుఢ్యం ఉంటేనే కదా నేను చేయ గలిగింది !?
""" చెప్పింది దీక్ష తీసుకున్న వారికి మాత్రమే !; ,,వాళ్లకు అది తప్పదు! అది ఒక దీక్షా నియమంకానీ ,ఇక్కడ ఆ అవసరం నియమం లేదు కదా ?,ఇలా వట్టి కాళ్ళతో నడవడానికి !""
,""నిజమే ,!;అపుడు అది అవసరం !!,,కానీ ఇలా నడవడం ఎప్పుడూ మనకు అవసరమే ,!;దీనికోసం దీక్షలు తీసుకోవాల్సిన అవసరం లేదు !""
""అయినపుడు ,,మెత్తగా షూజ్ బూట్లు వేసుకొని నడవకుండా ఎందుకీ బాధలు చెప్పండి ??!""
""కరెక్ట్ ,!,అదే నేను చెప్పేది!! బాధ ,సంతోషం అనేది మనం అనుకోవడం లో నే ఉంది !! ,మీరు ఓపికగా సంతోషంగా నాతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు ,మిమ్మల్ని స్నేహితుడిగా భావించాలని నా మనసు నాకు చెబుతోంది ,!!ఇదే మాట మీరు కోపంగా అంటే ,మీతో మళ్లీ మాట్లాడాలని నా మనసు అను కోదు కదా!""" ఇంతెందుకు ??
బోర్డర్ పై మంచు కొండల లో, శత్రువులతో పోరాడుతూ ,తాము పడుతున్న కష్టాన్ని లెక్క చేయకుండా,, దేశక్షేమాన్ని ,దేశ భక్తిని లక్ష్యంగా పెట్టుకొంటూ , తమ మనసుని నియంత్రిస్తూ ఉన్నవా రి కంటే ,,మనం పడే ఈ కష్టం ఈ పాటిది చెప్పండీ ! సాధన తో ఏదైనా సులభ తరం చేసుకోవచ్చు కదా!!"""
""మీలాంటి పెద్దవారిని కలవడం వల్ల మంచి విషయాలు తెలుస్తూ ఉన్నాయి,ఇంకా వినాలి అనిపిస్తూ ఉంది , అందుకే సత్సంగం ఉండాలి అంటా రేమో??""
""అవును !!,సత్సంగం లభించడం మనిషికీ ఉండే ఒక గొప్ప అదృష్టం ఇందులో కలిగే అనందాన్ని ఎంత పంచుకుంటే అంతగా పెరుగుతూ ఉంటుంది !,ఇంత విలువైన శరీరం , బంధు బలగం , అస్తి ఐశ్వర్యాలు జ్ఞానం ఇచ్చిన ఆ పరమేశ్వరు నిి ప్రతిరోజూ జ్ఞాపకం చేస్తూ కృతజ్ఞతగా మనం హృదయపూర్వక ప్రణామాలు సమర్పిస్తూ ఉండాలి!; ,మనసు చెప్పినట్టు ఈ శరీరం వినాలి కానీ ,,,శరీరం చెప్పినట్టు మనసు వినకుండా చేయడం కోసం,, సత్సంగం తోడ్పడుతుంది ,!""
""అంత కష్టమా,,ఈ మనసు తో ?""
""అవును ,! భగవద్గీత లో శ్రీకృష్ణ భగవానుడు బోధించింది ఇదే!! , ఊపిరి తీసుకోకుండా క్షణం ఉండవచ్చునేమో కానీ,, మనసు చలించకుండా ఉంచడం దుర్లభం!! నీ మనసే నీకు శత్రువు ,మిత్రువు కూడా !!
కాలినడక కష్టం అనుకుంటే ,కష్టంగానే తోస్తుంది ,కాదు ,ఇష్టంగా తీసుకుంటే,సంతోషంగా ఉంటుంది!""
""అబ్బా ;!ఇన్ని రహస్యాలు దాగి ఉన్నాయా , ఇలా నేలపై షూ లేకుండా నడవడం లో!""??"
""కష్టం అనిపించే ప్రతీ విషయం వెనుక సుఖం అనందం తృప్తివుంటాయి !చీకటికి వెలుతురు శోభించినట్టు గా !! ,రెండింటిని సమ భావం తో చూడటం జ్ఞానం కలిగిన మనిషి లక్షణం !"
""థ్యాంక్స్ ! నాకు తెలియని ఎన్నో ,మంచి విషయాలు
చెప్పినందుకు !మళ్లీ కలుద్దాం ,! నమస్కారం !"
""నమస్కారము !హరే కృష్ణ హరే కృష్ణా!""
Saturday, January 11, 2020
కష్టం అంటే?
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment