శ్రీ సుందిల్ల లక్ష్మీ నరసింహ స్వామి వైభవం ,2
Jan 14, 2020
__________
,,,"కష్టాలూ ఎవరికీ శాశ్వతం కాదని,,"వెలుగు ప్రసాదించే అమృత ఘడియలు వచ్చేవరకు ఓపిక పట్టాలని ,నాకు ప్రత్యక్షంగా లక్ష్మీ దేవి ఉద్బోధించింది ఇక్కడే !
పరమాత్ముని దర్శించడం అంటే , ఇలా సత్సంగం లో ఉంటూ , అదే ధ్యాస గా అదే శ్వాసలో ఉంటూ పడే కష్టమే మహా ప్రసాదంగా అనుభవ పూర్వకంగా నాకు తెలిసింది ఇక్కడే !
భాగవత పద్యాల అర్థం ,వైభవం ,పరమార్థం నాకు బోధపడింది ఇక్కడే ,,!
అలనాడు గజేంద్రుడు మొసలి బారిన పడి ,,తమ బంధు బలగం సిరి సంపదలు ఎన్ని తన ప్రక్కన ఉన్నా కూడా తనవారి కనీస ఆదరణకు,సహాయానికి నోచుకోని దీన పరిస్తితి యే ఇపుడు నాకు దాపురించింది ,!! అన్న సత్యం నాకు బోధ పడింది ఇక్కడే !!
""లావొక్కింతయు లేదు.,,,, ధైర్యము విలోలంబయ్యే ,,,,!!"" అన్న పద్యం నేపధ్యం లో ,, ఆపదలో నిండా కూరుకు పోయిన తనను కాపాడమని ఆక్రందించే ఆ గజేంద్రుని వలె ,,నేను కూడా ఈ కాలసర్ప దోష పీడితు రాలినై, ఈ ఆశ్రయాన్ని పాప పరిహారంగా భావిస్తూ , ""నీవే తప్ప ఇతః పరం బెరుగ ,మన్నింపన్ దగన్ దీను నిన్ , రావే ఈశ్వర,!, కావవే వరదా.! సంరక్షింపు భద్రా త్మకా !""అంటూ ఎలుగెత్తి ఆ వైకుంఠ వాసుని పిలుస్తూ ఉండడం,,ఇప్పుడు , అది నా పాలిట పరమ భాగ్యం గా వరించింది ఇక్కడే !!
,,,అల ద్రౌపది , నిండు సభలో , తన మాన సంరక్షణ కోసం ,తన చుట్టూ అమేయ పరాక్రమ శౌర్య వంతులైన భర్తలు. ఐదుగురు ఉన్నా ,దాయాదులు తనను మానసికంగా శారీరికంగా అతి దారుణంగా పరాభ విస్తూ హింసిస్తూ ఉంటే, చేసేది లేక , వేరే దిక్కు కానరాక ,,తన రెండు చేతులూ పైకెత్తి విలపిస్తూ ""ప్రభో ! దీన దయాలో ! అత్యంత దయనీయ దుస్తితి లో ఉన్న ఈ అభాగ్యు రాలి ని, నీ చెల్లెలిని కృష్ణా ! పరందా మా పరాత్పర !పరమాత్మ ,నన్ను దయజూడు !నీ సోదరిని ఈ దౌర్జన్యం నుండి ,ఈ దుర్మార్గుల బారి నుండి రక్షిం చు ! హే , ఆర్తజన బాంద వా !, అనాథ రక్ష కా ! ఆపద్బాం ధ వా ! దేవాది దేవా !శరణు , నంద నందనా ,,శరణు !!"" దీన బాందవు డన్న పేరు సార్థకం చేసుకో అన్నా !!""అంటూ హృదయవిదారకంగా కన్నీరు మున్నీరుగా దుఖిస్తూ పరమాత్మ ను వేడిన ప్రార్థన , నా పాలిట కల్పతరువు గా ధ్యేయంగా గా మారింది ఇక్కడే!!
""నీ దిక్కు ఉన్న చోట చెప్పుకో ,,పో !""అంటూ కసిరి, కన్న తండ్రీ ప్రేమకు , తన వారికి దూరంగా, నిర్దాక్షిణ్యంగా తరిమివేసిన పిన తల్లి పుణ్యమా ,,అని బాల ధ్రువ కుమారుడు వాసుదేవుని పై మక్కువ,భక్తి పెంచు కొన్నాడు ,!! పరంధాముని సాక్షాత్కారం పొందాడు ,!
అలా ఈ శాపాలు, పాపాలు, కోపాలు ,తాపాలు ,కష్టాలు, కన్నీళ్లు,, బాధల సుడిగుండాలు ,, అన్నీ స్వామి కృపతో మాత్రమే పటా పంచలుగా మాయమై నాయి,,,ఆ స్థానంలో లక్ష్మీ నరసింహుని దివ్యానుగ్రహం వలన,, స్వామి సాక్షాత్కారం కోసం ఆయన సన్నిధానం లో కొనసాగించే ఈ సాధనా సంపత్తి సాధ్యం అవుతుంది కదా ! అని గ్రహించింది ఇక్కడే !!
దిక్కు లేని వారికే కాదు, భూమిపై పుట్టిన ప్రతీ జీవుడికి దేవుడే దిక్కు; అన్న విశ్వాసం ఏర్పడింది ఇక్కడే !!
స్వామి కరుణపొందడం అంటే ,, జన్మ జన్మల సాఫల్యం కదా !, హృదయాన్ని కదిలించే అమృత భాండం ఆతని అనుగ్రహం ,అనుబంధం !
ఈ విధంగా స్వామి సేవలో,స్మరణలో , అర్చన లో , భావన లో , భజన లో సత్సంగ ములో , భక్తుల నిరంతర సహవాసం లో స్వామి చింతన తో రెండేండ్లు పరమానందంగా ,, ముక్తి దాయకం గా, ఆధ్యాత్మిక జీవితం గడపడంఅంటే అది , నేను అనుకుంటే జరిగే పనేనా,?? నా వల్ల అయ్యే నా , అంతటి దీక్షా పర తంత్రత ,??
,, కాదు కదా !!కేవలం ,,అది స్వామి కరుణ వల్ల నాకు సాధ్యపడింది ,, !
ఎక్కడో, ఎప్పుడో చేసుకున్న పుణ్యాల ఫలం ఈ స్వామి సేవా భాగ్యం!! , ఎక్కడ పుట్టాను ?,!ఎక్కడ పెరిగాను ?, ఎక్కడి ఆ సంసారం? ఎక్కడి ఈ దివ్యమైన పరమానంద కరమైన ,పరమ పావన కరమైన ఈ క్షేత్ర దర్శన వైభవ అనుభవం ,,?? అన్నీ మరపించి ,తన సేవతో మురిపించే స్వామీ సన్నిధి, నా పాలిట పెన్నిధి కావడం, ఏమీ నా భాగ్యం ?!
ఆహా !నా కంటే అదృష్టవంతులు ఉంటారా ఈ ప్రపంచం లో?"" అనిపించింది ,,రోజు రోజుకూ ఇక్కడ పెరుగుతూ ఉన్న స్వామి ఆరాధనా అనందం అనుబంధం తో !!!
,, అలా అద్భుతంగా అలవాటు అయ్యింది లక్ష్మీ నరసింహుని దివ్య ఆలయ పరిచర్య !
,, స్వామికి అనుదినం పూలతో నిత్య దైవఅర్చనచేయడం,, నా నిత్యకృత్యం గా మారింది !
కోడి కూత తో మెల్కోడం , వంద గజాల దూరం పొలాల గట్టు మీదుగా, ,, ఆవల బురద దాటుకుంటూ వెళితే కనిపించే ,, ఊట లాంటి చిన్న చెలిమె నుండి నిరంతరం ప్రవహించే చల్లని తీయని నీరే, ఇటు మాకు అటు రైతులకు. జీవనాధారం గా అన్ని కాలాల్లో ప్రవహిస్తూ ఉంటుంది !
, దాని లో నుండి నిరంతరం నీళ్ళు ఊరుతూ వస్తూ కింద ఉన్న ఊరి పొలాల కు పంటలు వరి పండిస్తూ ఉంటుంది ,,! అవే నీళ్ళు స్నానం మాకు !, ఆ నీళ్ళే స్వామికి అభిషకం,కోసం నిత్యం పూజారి నర్సయ్య గారు వినియోగిస్తుంటారు. !
అవే మాకు అందరికీ, వంట కు త్రాగడానికి అన్నింటికీ ఆధారం గా ఉంటుంది !
, స్వామి మూల విగ్రహం తేజోవంతంగా , అద్భుత ప్రభావం చూపుతూ ఉంటూ,, ఆలయం మాత్రం సనాతనం , పురాతన కట్టడం కావడం , నాగరిక ప్రపంచానికి దూరంగా ,తెలియకుండా ఉండడం ,వల్ల , పునరుద్దరణ కు నోచుకోకుండా ఉంది! అంతా పెద్ద పెద్ద స్తంభాలతో ,రాళ్లతో ఏ కాకతీయుల కాలంలో లోనో నిర్మింప బడి చెక్కు చెదరకుండా ఉంది ,, కానీ,జన ఆదరణకు నోచుకోని విధంగా కనీస వసతులు లేకుండా,పరిసరాలు
చుట్టూ పొలాలు చేనులు ఉండడం తో పెద్ద పెద్ద సర్పాలు కూడా ఆలయం లో ఆలయ పరిసరాల్లో రాత్రీ పగలూ రోజూ కనిపించేవి,!!
మేము వాటికి నమస్కరిస్తూ దూరంగా వెళ్లి పోయేవాళ్ళం ,! చలికాలం గజగజ వణికే చలి రోజుల్లో,వర్షాకాలం భోరున కురిసే వానలో తడుస్తూ మండే ఎండల్లో మాడుతూ కూడా దేనికీ భయపడలేదు ,,
స్వామిని విడువని, ఆయన సేవ మరవని దీక్షా భావంతో ,,స్వామి మూల విగ్రహాన్ని దర్శిస్తూ,ఉదయం ,సాయంత్రం స్నానం చేసి, అవే తడి బట్టలతో ,ఆలయం చుట్టూ,, ప్రతి రోజూ,108 ప్రదక్షిణలు చేసేవాళ్ళం !; పూలతో పూజిస్తూ వచ్చిన భక్తి గీతాలు సామూహికంగా చదువుతూ భజన చేసే వాళ్ళం !!, వచ్చే పోయే భక్తజనాల సందడి తో ఆలయ పరిసరాలు నిత్య కళ్యాణం పచ్చ తోరణం గా విరాజిల్లుతు ,,మాకున్న ఈతి బాధల ను మరపించేవి ,,
,, ఇక్కడే స్వామి ఆశ్రయం లో ఉంటూ పలు వ్యాధులు నయం చేసుకోడానికి వచ్చిన అనేక భక్త జనాలే మా కుటుంబం అనుకుంటూ , వారే బందువులు గా భావిస్తూ, నా బాధలు , అన్ని మరచాను,
నా జీవిత ఉద్దేశ్యం ,ఒకటి కర్తవ్య నిర్వహణ అంటే నా మీద ఆధారపడి ఉంటున్న ఈ పిల్లల సంరక్షణ ,పోషణ, పెంచే బాధ్యత మొదటిది అయితే, నన్ను బ్రతికించి, బ్రతుకు మీద ఆశ కల్పించి,ఒక అర్థం పరమార్థం చూపించి,తన అభయ హస్తాన్ని దయ తో అనుగ్రహించిన ఈ లక్ష్మీ నరసింహుని ఆఖరు శ్వాస విడిచే వరకూ ఆరాధిస్తూ ఉండడం రెండవది !
ఇదే నా జీవితాశయం , అనుకుంటూ స్వామికి ఎడమ భాగాన ముందు కొలు వై పద్మాసనంలో కూర్చుని చిరునగవు తో ఆగుపించే,అమ్మవారిని ,అనుక్షణం భక్తిభావం తో వేడుకున్నాను
""అమ్మా !దేవీ,,! జగన్మాత !!తల్లీ !!నిన్ను నమ్ముకుని నీ పంచ న చేరాను!! నీ పాద ముల ను, నా కన్నీటితో అభిషేకిస్తూ నిన్ను అర్తిస్తు ఉన్నాను ! అమ్మలగన్న యమ్మ !, నాపై దయ రాదా,? ఈ చిన్నారి పసి కూనల పై జాలి చూపవా,,? నా దీన స్థితిని కనలేవా? ,, అమ్మా !లోక పావని! , నీవు చెబితేనే గానీ, స్వామి నా మొర వినడు గదా ,,? జగజ్జననీ,! ఎన్నాళ్లీ తీరని వేదన భరించ ను, ? ఇదిగో! ఈ పిల్లల బాధ్యత ఇక నీదే సుమా ,!, వీరు నా పిల్లలు కాదు ,,నీ బిడ్డలు !!నేను ఏమైనా ఫర్వాలేదు. అమ్మా ! మహాలక్ష్మి,,, విష్ణు పత్నీ !నీవు, స్వామి తొడపై కూర్చొని అతడితో సంతోషంగా సదా మాట్లాడుతూ ఉంటావు గదా !!ఒక్కసారైనా ,నా దీన గాథ అతడితో నీవైన చెప్పరా దా దయామయి ,??"",,
అంటూ విన్నపం చేస్తూ అమ్మ దయ కోసం ఆత్రంగా ఎదురు చూస్తు కాలాన్ని మరచిపోయాను ,!!
అదేం చిత్రమో కానీ ,భజన బృందం పాడుతూ ఉండే భాగవత పద్యాలు, మేల్కొలుపు పాటలు, భజన గీతాలు చాలా వరకూ కంఠతా వచ్చాయి , గుడిలో కూర్చున్న ,గుడి చుట్టూ ప్రదక్షణ చేస్తూ ఉన్నా కూడా ధారాపాతంగా పద్యాలు నోటినుండి దొర్లి పోతూనే ఉన్నాయి
అమ్మ చెప్పిందో ఏమో,, స్వామి అనుగ్రహించాడో అన్నట్లుగా , లక్ష్మీనరసింహ స్వామి పై అపారమైన భక్తి శ్రద్ధలు,, నమ్మకం అంకితభావం నా హృదయంలో స్థిర పడ్డాయి
చెప్పలేని అనందానుభూతి, మనో దైర్యం,ఆత్మానందం , గుండె నిబ్బరం అమ్మ అనుగ్రహించింది , చిత్రంగా,,
మొక్కవోని దైర్యం, దైవభక్తి, నాలో అలవడినాయి , తమను ఆశ్రయించి వచ్చిన బిడ్డలకు
ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో , అమ్మకు తెలినట్టుగా మనకు తెలియదు కదా !!
అమ్మ దయకు నోచుకునే యోగ్యత పొందేవరకు ఈ నిరీక్షణ తప్పదు కదా !!
అమ్మ ఒడిలో బాధలకు అతీతంగా ఉండే ఆనంద లోకం అనే "స్వర్గం" ఉంటుందని అనుభవం ద్వారా నాకు తెలిసింది !
స్వస్తి !"
హరే కృష్ణ హరే కృష్ణా !!
Tuesday, January 14, 2020
శ్రీ సుందిల్ల లక్ష్మీ నరసింహ స్వామి వైభవం 2
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment