Saturday, January 11, 2020

భీష్మాచార్యుడు,పరమ వైష్ణవ భక్తుని"" కృష్ణ ప్రేమ""

Jan 10, 2020
""శ్రీకృష్ణ భగవానుని ప్రియ భక్తుడు , విష్ణు సహస్ర నామస్తోత్రం  మనకు అందించిన పరమ భాగవతం తోత్త ముడు,, భీష్మాచార్యు డు,పరమ వైష్ణవ భక్తుని"" కృష్ణ ప్రేమ""గురించిన కవిత! అద్వితీయమైన ,అనుభవైక వే ద్య మైన,పరమానంద కరమైన  మధురానుభూతి!"
___________________
ఏమీ నా భాగ్యము ??,ఇంతింతని చెప్పరాని ,
ఏమీ నా భాగ్యం ?!"
____నా కోసమే పరమాత్ము డు
స్వయముగా  తా వచ్చు చుండె ,!!""
!!ఏమీ నా భాగ్యము !!
,,,ఉరుకులతో పరుగులతో, అతి రౌద్రా వే శము తో,
నను కడ తేర్చి  ,నాకు మోక్షం కరుణించు టకై,, స్వయముగా  అరుదెంచు శ్రీహరిని కాంచ , నా కనులు ,,
ఏమీ నా భాగ్యం !!!!!!
నీలమేఘ శ్యాముడు ,!
నీరజ దళ నేత్రుడు,!
సామజవర గమనుడు,!
సరసిజ దళ నేత్రుడు,!
సామ గాన లోలుడు,!
భక్తజన మం దారుడు ,!
జగదేక సుందరుడు ,!
షోడోశ కళా పరిపూర్ణుడు ,!
శంఖచక్ర పీతాంబరుడు,!
శిఖిపించ మౌళి  ,శ్రీకృష్ణుని ,
ఘనశ్యామసుంద రునీ  గన
ఏమీ నా భాగ్యం !_
______________1
ఎవడు శివుని మెప్పించెనో,!
పాశుపత ము సంపాదిం చి
సవ్యసాచి పేరు గాంచి ,
విజయు డని కీర్తి గాంచె నో,,
ఎవనికి తన చెల్లెి నిచ్చి
నిరతము కాపాడుచుండె నో,, ,
మహా భారత సంగ్రమాన ,
ఎవనికి రథసారథి యై జయము కట్ట బెట్టేనో,
ఎవని ధర్మ నిరతి చాట
తాను దీక్ష బూనే నో ,
తానే ప్రత్యక్షమయ్యి
తన విశ్వరూపమేచూపెనో,,
భగవద్గీత బోధిం చి యుద్దమే చేయించేనో,,
ఆ ప్రియ అర్జునుడే
నా  బాణాల ధాటి కోప లేక,
బేలగ నుండు ట జూసి,
వానిని గాచుట ,కొర కై,,
పగ్గాలను పారవేసి ,,
చెంగున రథము నుండి  కుప్పించి  దుమికి,,,కింద!
రుద్రుని వలె కోపముతో కన్నెర్ర జేసీ చూస్తూ,,
కొదమ సింహం వోలె వస్తూ,
"అర్జునా !ఈ భీష్ము జంపి ,
విజయము నొన గూర్తు నిపుడే ,
ఈ చక్రాయుధ మున ,. నే.!"
ననుచు  హుంకరించి,,పలికి,
నిశిత దృష్టి నను చూచు చు ,
వడి వడి నా దెస కేతెంచు
శ్రీ  లక్ష్మీ నారసింహ ,,రూపము తలపించు  శ్రీ
కృష్ణ పరమాత్ముని గాంచిన
ఏమీ నా భాగ్యము ??!_ఇంతింతని_చెప్పలేని,!
________________2
హరికి అంజలి ఘటిం చెద!
సాగిల పడి ప్రణమిల్లేద !
ఆత్మార్పణ గావించేద !
వేల వేల ఏండ్లు ఘోర తపస్సు లు చేసిన ను దొరకనిపరమాత్ముడు ,
  తానే సాక్షాత్కరించి 
ప్రత్యక్షమయ్యే గదా,!
నా జీవన సర్వస్వము !
నా పుణ్య తపః ఫలము!
నా జపము, నా తపము!
ఫలించు చున్న శుభ తరుణం!
అపబోకు అర్జునా,,!
ఆపద్భాం ధవు, దనాధ రక్షకు,!
ఆర్త జన సంరక్ష కు,!
నాపకు,! నాపాబోకు!
నను కటాక్షించి ,బ్రోచుటకై,,!
ఏ తెం చు పరాత్పరుని,!, జగన్మోహనాకారుని ,,!
మోమున సౌందర్యాన్ని,!
భువన మోహన రూపాన్ని,!
నా ఎదురుగా నడయాడే  సౌందర్య రాశి పరమాత్మను!
చూడనీ కనులారా,!,
గాంచనీ తనివారా,,!
దర్షించనీ మనసారా ,,!
వర్షించనీ భాష్ప ధారా,,!
మ్రొక్కనీ   ప్రేమ మీర,,!
ఏమీ, నా భాగ్యము !"". ఇంతిన్ తని చెప్పరాని
ఏమీ నా భాగ్యము! ,,3
______
"ప్రియ శిష్యుడవు నీవే!
నా మనసేరిగి న మనవడవు నీవే,,!
పంచప్రాణ ము  నీవే. సుమా,!
నా ఆరాధ్య దైవాన్ని,
నా పూజా ఫలాన్ని ,,
నా భాగ్య ము ,నాప్రాణము!
నా జీవము, నా భావమైన
శ్రీకృష్ణ పరమాత్ముని,,!
నా ఎదుట నిలబెట్టి ,,
నను ద న్యుని జేసితివి,!
విజయీభవ అర్జునా!
యశస్వి భవ ఫల్గుణ!
ఎక్కడ  కృష్ణుడు కిరీటి
జతగా కలిసి ఉందురో,
అచట విజయము తథ్యము సుమా!
అధర్మము నశించును !
ధర్మము వర్ధిల్లు నిజము!
మీ ఇద్దరినొకచోట గాంచి,
నా జన్మము ధన్య మయ్యే!
నా తపము ఫలి యించే !
శ్రీకృష్ణా ,!య దుభూషణా !
నినునే బాగుగ ఎరుగుదు !
నీ భక్తుడ ,,అనురక్తుడ  ,!
పరమాత్మ వు నీవే,! పరంజ్యోతి వీ నీవే!
లీలా మానుష విగ్రహ
రూప ధారి నీవే !!,
నటన సూత్రధారి నీవే!
కపట వేషధారి నీవే!
ఆది మద్యాంత రహిత
దేవాది దేవుడవు నీవే!
దుష్టులను పరిమార్చి,
శిష్యులను కాపాడగ,!
అధర్మ వర్తను ల  అణచి,
ధర్మము  నవ ని లోన! ఉద్దరింప  దీక్ష బూని
వసుదేవ  తనయుడిగ!
ఇల నవతరించిన  ఈ
దేవాది దేవుని గన !
ఏమీ నా భాగ్యము_
_______________4.
నీ రూప  సౌందర్యం ,,
నీ లీలలు , నీ గాథలు  నీగుణ గానం ,సర్వం
మధురాతి మధురం కదా!
చూచిన కన్నులు తనియవు,
పలికిన నాలుక తనియ దు
వినిన చెవులు తనియవు కదా
కృష్ణా నిన్నెం త జూచిన,
తీరదు ఈ తాపము!
తనివి తీర దీ మనస్సు!
చాలదు ఈ జీవితం,!
తీరదు కద ఈ వేదన!
యశోదా నందులకు ముద్దు
పట్టీవై పెరిగిన  ఓ
నంద గోపా లా!
గోవర్ధన గిరిని కేల,
నిలిపిన విభుడవు నీవేగదా!
గోకులం ,బృందావనం,!
గోవర్ధన ఉద్ధరణ మ్ ,!
గావించిన   గోవిం దా!"
పూతనాది రాక్షసులను ,
కంస జరా సం దాదుల,,
శిశుపాల దంత వక్ట్రుల,
హతమార్చిన  పరమాత్మ !
నా మనసు, నా భావన!
భరింపలేని ఆవేదన ,! తెలిసిన ఓ పరమ పురుషా!
నాకు ముక్తి నొసగి, అత్మ
శాంతి నొసగి బ్రోచవయ్య!
అల గజేంద్రుని గాచు శ్రీ
హరి వలె కనపడుచు నున్న   నాదెస కరుదెంచుచున్న
మాధవా ,,!నీకిదే శతకోటి ప్రణామాలు ఇవిగో!
ఏమీ నా భాగ్యము_
_______________5
తెలుసు నాకు నీవెవ రవో,,!
తెలుసు నాకు నేనె వరో,!
తెలుసు నాకు జరిగినది!
జరిగేది, జరుగ బోయేది! తెలుసు నీవు పరమాత్మ వని ,
తెలుసు నా కథ ముగియునని !!
తెలుసు. నీవు అవతార
పురుషుడవని ,దేవుడవని!
  తెలుసు నాతప్పిదములు!
అధర్ములను కాసిన నా,
అపరాధము లూ తెలుసు!
మానిని ద్రౌపది మాన
సంరక్షణ చేయలేని,
క్షమించరాని ఘోరమైన
ఆపరాధము తెలుసు!
భయంకర రణాంగణమున!
ఎందరో అమాయకులను !
బలి చేస్తున్న ఈ యుద్దాన్ని!
,, శక్తి ఉండి,ఆపలేని
నరమేధం , మారణ హోమం
కారకు డ నని తెలుసు !
నీ భక్తుడ నయ్యుం డి ,,
ధర్మ ము ,తెలిసి ఉండి
చేసిన నేరాలకు శిక్ష  ,
నీవే విధించ వయ్య!
క్షమించ కుండ నన్ను ,,
దండిగ శిక్షించు మయ్య!
కటినంగా దండించవయ్య! ఏదైనా  మహా ప్రసాదము !
నా పాప పరిహారంగా ,
సంతసించి స్వీకరింతు !నను
దయజూడకు ,జాలి పడకు! వృద్దుడు అని వెనుకాడ కు!
నీ చక్రాయుధ జ్వాల ల్లో
మండించి మసి చేయుమా! నీ క్రోధానల జ్వాలలో
ఆహుతి చేయుమయ్య!
రుద్రుని వలె ఏ తెంచిన,
ఓ,జ్వాలా నరసింహ ,
కరుణించి కడ తేర్చుము!
గోపాలా! పాలించు నన్ను !
నీలో ఐక్యము జేసీ,
నాకు శాంతి ప్రసాదించు !
ఇంతకన్న ఆనందము
ఇల లోనా ఉండదు కదా!
కనులారా నిన్నిటుల గాంచ
ఏమీ నా భాగ్యము_?
ఇం తింతని చెప్పరాని ?
_________________6
"స్వామీ !సర్వాంతర్యామి! నిను
కనులారా చూతామంటే ,!
కను రెప్పలు అడ్డమా యే,!
వృద్దాప్యం ప్రభలమాయే,!
పరమాత్ముని దర్శనమున
జారిన భాష్ప ధారలతో ,
మసక బా రె నూ  కళ్ళు,,!
గోవిందుని సుందర వదనార వింద సోయగాలు!
కనలేని నను, కనికరించి
రావేలా, మురళీలోలా!
గోపాలా! హే ,కృపాల!
నా దైన్యం కన వేెలా!
నా మొరనూ వినవేల!
నను నీలో చేర్చ వేల!
హృదయమ నే కమలములో ,
నీ సుందర వదనమును
పదిల పరచుకొందు  కృష్ణా!
కళ్ళ ముందు జరిగిన ,
ఘోర దౌర్జన్యాలు తలచి ,,
పశ్చాత్తాపంతో నామది,
రగులుతోంది నిరంతరము!
అది కాల్చుచుండె గుండెలను,
ఇకనైనా కరుణించి ,
ముగించుము ఈ జన్మము!
భవ్యమైన దివ్యమైన
నీ మంగళ కర రూపము /గన
ఏమి నా భాగ్య ము_
________________7
ఏ మా మోహనరూపము?
ఏమా సౌందర్యము , స్వామీ,!
నీవు రథం పై నుండి ,
కుప్పించి ఎగసిన పుడు,
ధరణి కాలు మోపినపుడు,
నీ కుండలాల కాంతి తో
నీలగగన భాగమంతా
మెరుపులతోవెలిగి పోయె !
కరిపై కి దుమికే ఒక
కొదమసింహము వోలె
,వేగముగా ఉరికినపుడు
నీ కుక్షిలో  దాగి ఉన్న,,
సకల భువన బ్రహ్మాండాలు
ఒక్కసారి కంపించే ,
భుజము పై నున్న పసిడి
చేలాంచలము జారుచుం డే,
కదలి వచ్చు కమలాక్షుని,
కాళ్లకు అడ్డం పడుతూ
""ప్రభో !దీన దయాలో !
పరమ కృపాలో !, నన్ను,
మన్నించి, మరలి రమ్ము!
నా చేతగాని తనాన్ని,
శతృవులకు చాటబోకు!
పదిమందిలో నన్నిలా,
నగుబాటు చేయబో కు!
పౌరుషము చూపించి ,
ప్రాణం ఫణంగా పెట్టీ ,
క్షాత్ర తేజం తో పోరాడే
కర్తవ్యం బోధించా వు,!! బావా,! నా మొరాలించు!
నమ్ముము,,!నా ప్రతినను!
నమ్మవయ్య ,,నీ పార్థు నీ!""
అనుచు  దీనంగా బ్రతీమి లాడుచున్న అర్జునునీ
లక్ష్య పెట్టక, చూపు దిప్పక !
""విడువుముఅర్జున,నన్ను ఇపుడు ఈ  ముసలి వాడి
అహంకార మ ణగించెద!
పరిమార్చే ద, నిపు డే !! నిన్ను
జగజ్జేత గ నిలిపించెద !!""
అనుచు  నీపై కోపమును!
నా పైఅపార వాత్సల్యము!
ఒకేమారు ప్రదర్శించు !
పరమాత్మా !నీవే దిక్కు!
పరంధామా  !నీవే గతి!
నీకే నా శరణాగతి!
నాకిక ఈ బ్రతుకు వద్దు!
వద్దు, వద్దు !ఈ దైన్యం!!
వలదు ,వలదు ఈ పాపం!
ఇన్నాళ్లూ నా కెదురుగా!
విజయ సారథి గా వెలిగిన!
నిను  దర్శించి పరవశించి!
పోందితి, పరమానందం!
గాంచితీ , నా జన్మా ధన్యం!
ఆర్పించితి ఆత్మార్పణ!
నా ప్రార్థన స్వీకరించి
దయ యించి బ్రోవవయ్య!
ఈ కన్నుల నీ రూపము!
చివరి వరకు నిలుపు మయ్య!
ఈ నోటితో నీ అద్భుత !
పవిత్రనామాలు వేయి !
పలికించి ఈ దీను ని!
పాపం కడిగేయు మయ్య!
తండ్రీ !ఇక చాలు చాలు!
చాలించు ఈ నాటకము!
చాలు నా జీవితము!
చాలు పడిన క్లేశములు!
పరంజ్యోతి,పరమ పురుష !
శతకోటి ప్రణామాలు !
సమర్పింతు సర్వేశ్వరా!
పాహి పాహి జనార్దనా!!
రక్ష రక్ష గోవిందా!
శరణు శరణు కేశవా!
శరణు శ్రీమన్నారాయణ!
శరణు శరణు శరణు !"
స్వస్తి!!""
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు !"
హరే కృష్ణ హరే కృష్ణా!!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...