Saturday, February 8, 2020

సుందిల్ల లక్ష్మీ నరసింహ స్వామి వైభవం 3

సుందిల్ల లక్ష్మీ నరసింహ స్వామి వైభవం 3
Jan 15, 2020
_______
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి మహత్తు ఎంత అద్భుతం గా ఈ పవిత్ర క్షేత్రం ఉందంటే ,, ఈ దివ్య ధామం లో ఉన్నన్ని రోజులూ ఎవరికీ ఏ బాధ , కాలేదు !ఎటువంటి అవస్తకూడా  దేనివల్ల కూడా రాలేదు,!
అంతా అమ్మ దయ !, అయ్య కరుణ !
ఇది ఈ స్తలమహత్తు కావచ్చు! లక్ష్మీ నరసింహుని దివ్య ప్రభావం కావచ్చును!
,,ఏదైనా ,ఏమైనా ఇక్కడికి వచ్చి నమ్మి శరణాగతి చేసిన ఏ భక్తుడు కూడా ఖాళీ గా వేదనతో భాద తో తిరిగి పోలేదు,, వారు అందరితో బాటు,,నేను కూడా స్వామి పరమ పావన సాక్షాత్కారం భాగ్యానికి  నోచుకున్నాను
ఒక రోజు రాత్రి తెల్లవారు ఝామున ,నాకు దివ్యమైన పరంజ్యోతి స్వరూప పుంజ దర్శనం ,స్వప్నంలో సాక్షాత్కరిం చింది ,దయామయి , మహా లక్ష్మీ మాత  స్వామికి ,నా గురించి నివెదిస్తు ఉన్న మధుర మైన పలుకులు నాకు స్పష్టంగా  వినిపించాయి ,
""స్వామీ !ఆ దీనురా లి ఆక్రందన ,ఆవేదన తీరడానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది ?""
, మృదు మధుర స్వరం తో దరహాసం చేస్తూ ఉన్న తన పతి దేవుని అడిగింది అమ్మ !
దానికి జవాబు చెబుతున్న   స్వామి గంభీర స్వరం కూడా నాకు చక్కగా  వినిపించింది,
""త్వరలోనే స్వస్థత చేకూరుతుంది లే ! నీ దయకు నోచుకున్న వారి కి  బాధలు పారిపోకుండా ఉంటాయా చెప్పు !""
,,,అని నవ్వుతూ చెప్పడం అదంతా  కల వలె ఉన్నా నిజంగా   ఈ చెవులతో వింటున్నట్టు గా అమితానందాన్ని  కలిగింది నాకు ,!
నాపై అమ్మవారికి ఉన్న అపార మైన దయవలన ,స్వామిని కీర్తిస్తూ అద్భుతమైన అందమైన పాటను ,అప్పటికప్పుడు  నాచే పాడించింది ,అమ్మ! 
నాకు కనిపించింది గుడిలో వెలిగే దీప కాంతులతో ఒక జ్యోతి పుంజం ,!, బల్ల పై దీపపు ఇత్తడి చెమ్మె లు ,, ఆ కాంతిలో దేదీప్యమానంగా  ప్రకాశించే అమ్మ సుందర వదనా రవిందం ,,అమ్మ జడలో తెల్లని పూలు,చెవులకు స్వర్ణ కుండలాలు,చేతులకు బంగారు గాజులు, కాళ్లకు కంకణాలు, గజ్జెలు ఇవన్నీ దగ దగా మెరుస్తూ  నాకు అగుపించాయి
,, ఈ కమనీయమైన దృశ్యం , నా బ్రతుకును ఆనందంగా మార్చిన  అద్భుత మైన సన్నివేశం ! లక్ష్మీ నరసింహుని గురించిన అందమైన  ఆనందకరమైన  దివ్య మైన అమూల్యమైన పాట నా నోటితో  ఆండాళ మ్మ పాడించింది ,,
ఆ పాట  చెబుతూ, నాతో పాడించి నా జన్మ పావనం చేసింది లక్ష్మీ దేవి !
  స్వామీ రమణీయత ను కనబరిచిన ఆ పాట ఇలా ఉంది !,, అదేమంటే,,
1 ,""అమ్మ చూడవే ఆండాళ మ్మా !
అంబుజాత పత్ర నేత్రు డదిగో చూడూ !!
2, నందనందనా ,సుందరీ రావే,,!
నవనీత చోరుండ దిగో చూడూ !!
3, సిగ్గు పడి తలవంచకే అమ్మా,,!
చిరునవ్వులు చిందులు  త్రొక్కే శ్రీరంగ నాథుడ ది గో చూడూ !!
4,, శంఖ చక్ర పీతాంబర ధరుడే,!
, శరణాగత రక్షణ బిరుదులు గలవాడే !!
5,,వక్షమున శ్రీ తులసీ వన మాలలు గలవాడే,,!
,,,శ్రీ వత్స లాంచిత చిహ్నము గలవాడే !!
6,, కలువ రేకుల కన్నులు గలవే!
  ,,కందర్పుని మించిన సొగసులు గలవె !!
7,, తిరుమణి తిరు చూర్ణమ్ములు గలవె!
,,,సిరు లొలి కెడి భ్రూ యుగ్మము గలవాడే!!
8,,కోటి సూర్యుల కాంతులు కలవే,,!
,,,కోమలాంగిరో చూడవే అమ్మా !!
9,,అమ్మ చూడవే ఆండాళమ్మా !!
అంభోధి పత్ర శయనుండదిగో చూడూ !!!
,, అత్యంత మధురమైన , స్వామి స్వరూప దర్శనాన్ని తలపిస్తున్న  ఈ పాటను  మరచిపోకుండా రోజూ పాడుతూ తెలిసిన వారికి అందరకు చెబుతూ జీవితాన్ని ధన్యం చేసుకున్నాను , నా చివరి శ్వాస వరకూ  పాడుతూ అమ్మచూపిన కృపకు, అనుదినం అనుక్షణం అనునిత్యం కృతజ్ఞతతో  ధన్యవాదములు  సమర్పిస్తూ జీవించాను ,,
,, ఆలయం లో స్వామి సన్నిధానం లో, తెల్లవారి ఝామున ,,వచ్చిన ఈ నా స్వప్న వృత్తాంతం చెబితే ,,,విని పూజారి నా కంటే ఎక్కుగా సంతోషించా డు !!
తెల్లవారు శుభ ఘడియలు లో వచ్చిన స్వప్నం నిజమవుతుంది ,, అనీ,,శుభాన్ని ,జయాన్ని కలిగిస్తుంది అంటూ ,"" ఇక నీ వ్యాధి నయమవుతుంది , !స్వామి నీకు దివ్య ఔషధాన్ని ఇచ్చాడు  కదా !ఇక  నీ కష్టాలు, ఇబ్బందులు తొలగిపోయి , మంచి రోజులు వస్తాయి!"" అని దీవించాడు ఆ వేద మూర్తి ఆ ఆలయపూజారి గారు !,,
ఆ విధంగా నా  ఆలయం లో నా జీవితం ఒక అందమైన  మలుపు తిరిగింది  ,!కథ సుఖాంతం అయ్యింది !
""సుఖమంటే భోగ భాగ్యాలు కాదు ,,అస్తి ఐశ్వర్యాలు బంధు బలగం కాదనీ, శ్రీ లక్ష్మీ నరసింహుని నిరంతర హరినామ సంకీర్తన ,రామాయణ భాగవత పఠన  మాత్రమే జీవుడికి కావలసిన నిజమైన  శాశ్వత సుఖం అనందం,జీవిత ధ్యేయం , పరమావధి ""అని నాకు స్వామి సన్నిధిలో గడిపిన ఈ రెండేళ్ల సేవా భాగ్యం వలన  బోధ పడింది ,,!
పాలలో దాగిన వెన్నను కాచి తోడు పెట్టీ , చిలికి వెన్న తీసి తిరిగి కాచి నెయ్యి ని సంగ్రహి స్తూ చేసే  సాధన వలె,, పరమాత్ముని దయ  గురించిన ఇలాంటి సాధన దీక్ష తపస్సు ,సాగించిన  సాధనా ప్రక్రియ , నా లాంటి జీవుని పాలిట మహా భాగ్యం గా ప్రాప్తిస్తుంది కదా!!
ధర్మరాజు  వాసుదేవుని తో వినమ్రంగా తన మనవి ని విన్నవిస్తూ అంటాడు , ""కృష్ణా !! ధర్మ స్వరూపా ! ద్వారకా వాసా !!మా తండ్రి పాండురాజు గారు పోతూ పోతు ,,మమ్మల్ని నీ చేతుల్లో పెట్టీ పోయాడు , ఇక మా సంరక్షణా భారం నీదే సుమా ! అంటూ శరణాగతి చేస్తాడు,,
శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమల కొండల పై వెలిసినప్పుడు  భక్త జనం తో  అంటాడు"" ,ధర్మాన్ని పాటించే వారిని నేను , వారి వెంట ఉంటూ కాపాడు తాను !""అనీ ,!!!,,,
అందుకే త్రికరణ శుద్ధితో కొలిచేవారు స్వామి అపార కరుణా కటాక్షములు పొందకుండా ఉండరు కదా.!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...