Jan 7, 2020
""తాతయ్యా , ఇంత ప్రొద్దున్నే ఎటు వెళ్తున్నారు ?""
""ఎవరూ ,ఓహో చిన్ని కృష్ణుడా ? ఆహా ఏమి నా భాగ్యము , శ్రీకృష్ణ దివ్య మంగళ ,ముగ్ద మోహన సుకుమార సుందర శ్యామసుందరుని దర్శనం లభించిన ఈ రోజు నా జన్మ ధన్యం కదా ! గోపాల కృష్ణా , నందనందన ఇవే నా సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తున్నాను , స్వామీ స్వీకరించు !!"" ఎన్నేళ్ళు గా ఎదురుచూస్తూ ఉంటే, ఇప్పుడు దొరికావు కదయ్యా ,వెన్నదొంగా !""
""నేను నీకు దొరకడం ఏమిటి తాతా? నేను నీ లోనే నీ తోనే ఉంటాను ,,అది నీవు గుర్తించక పోవడం ,అది నీ తప్పు కదా ! అయినా నన్నెందుకు జ్ఞాపకం చేసుకోడం ,,నాతో నీకేం పని ??
""కృష్ణా !రోజూ ఉదయం ఇలా ఈ గ్రౌండ్ లో నేను వాకింగ్ చేస్తుంటాను కదా ,!అపుడు నీవు నా ప్రక్కన ఉండి నాతో మాట్లాడుతూ స్నేహితుడి లా ఆప్యాయంగా నడుస్తూ ఉన్నట్టు హాయిగా ఎంతో ఆనందంగా భావిస్తూ ఉంటాను , సుమా!!"
""అదేంటి తాతా ??ఒక్క ఈ సమయంలో మాత్రమే నన్ను గుర్తు చేస్తున్నావా ?""
""లేదు , స్వామీ !!ఎపుడూ నీ రూపం ,మదిలో , నీ నామం హృదిలో మేదుల్తూ ఉంటుంది రా కన్నయ్యా ,!"" నిజం చెబుతున్నా గోపాలా! నీ వంటే నాకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను రా ,,!""
""నీవు చెప్పేది అంతా అబద్ధం తాతా ! ,నీవు నీ మనవడు , మనవరాలు స్నేహితులు ,బందువులు,,ఎందరితో నో ఎంజాయ్ చేస్తూ ,ఉండడం నాకు తెలియదు అనుకున్నావా, ఎమిటి?""
""కృష్ణా నా వరాల పంట !,నా బంగారు కొండ !,నా పుణ్య ఫలమా ,!ఎవరితో నైనా నేను సంతోషంగా ఉంటున్నాను ,అంటే వారిలో నిన్ను చూస్తూ ఉంటాను అన్న విషయం ,,నీకు ఎలా చెప్పను రా ,,గోపీ మానస చోరా !; ఇది నా పూర్వజన్మ, భాగ్యం కాకపోతే ,ఇలా మనసు విప్పి నీతో మాట్లాడే అవకాశం అదృష్టం నాకు ఇస్తావా తండ్రీ!! ,వేణుగానం లోల ,!భక్తజన పరిపాలా ,!""
"తాత గారూ "నాకు అన్నీ తెలుసు !,కానీ ఒక్కటే తెలియడం లేదు !""
""కృష్ణా ! రుక్మిణీ వల్లభ !!నీకు కూడా అర్థం కాని విషయాలు ఉంటాయా ,నారాయణా ?
"అదే తాతా !ఎందుకు ఈ మనుషులు నిత్యం అబద్దాలు చెబుతూ , వాటి మధ్య జీవిస్తూ ఉంటారో ,నాకు అర్థం కావడం లేదు !!""
""అంటే , కృష్ణయ్య,నన్ను కూడా అబద్దాల కోరు గా భావిస్తూ ఉన్నావా ??నేను కూడా నా??""
""కాదా తాతా ,?,వాకింగ్ చేస్తున్నపుడు నన్నుగుర్తు చేస్తావు ;,ఎందుకంటే నీకు తోడు అవసరం కనుక ,,కదా!!
అదే ఇంటికెళ్ళాక ,నీకు బోలెడు మంది ఉంటారు ,,అప్పుడు నాఅవసరం ఉండదు కదా,జ్ఞాపకం పెట్టుకునేందుకు ??""
""నీవు చెప్పేది నిజమే కృష్ణ , ! కానీ,వాళ్లను ప్రసాదంగా ఇచ్చింది నీవే కదా ముకుందా !??,గౌరవించక తప్పదు కదా గోవిందా !""
"",,చూశావా?? ఎలా తప్పులు కప్పి పుచ్చు కుంటారో ఈ మానవులు ??,,నా ముందే నీ తెలివి చూపిస్తువున్నావు కదా ??""
"లేదు స్వామీ ! నిన్ను జ్ఞాపకం చేయని క్షణం లేదు !"
""అదిగో మళ్లీ,, అదే భజన !"" పోనీ, రోజూ భోజనం చేస్తున్నప్పుడు,నన్ను తల చుకుంటు ,," కృష్ణార్పానం" అంటున్నావా ?""
""జ్ఞాపకం ఉన్నపుడు అంటూ ఉంటాను కృష్ణా!""
""మరి తాతా ,నీవు పడుకుంటున్నపుడు ?""
""కృష్ణా !నీ దగ్గర నిజం దాచలేను,కానీ ,ప్రయత్నం చేస్తుంటా ను నందగోప కుమారుని స్మరిస్తూ నిద్రించాలని !,,కానీ మరిచి పోతూ ఉంటానురా, నంద కిషోరా ,!""
""తాతా !ఇది చెప్పు !!ఉదయం లేస్తూనే నేను నీకు జ్ఞాపకం వస్తుంటానా ??"
""కృష్ణా !లేస్తూనే ,కళ్ళు తెరిచి నీ చిత్రాన్నే చూస్తూ ,నీ నామం జపిస్తూ నే మొక్కుతూ లేస్తాను ,కానీ అది కూడా నీవు జ్ఞాపకం వస్తేనే సుమా !""
""పది నిముషాలు నా స్వరూప దర్శనం కోసం, ధ్యానం చేస్తున్నావా?"స్నానం చేస్తూ ,మాట్లాడుతూ ,తీరిక సమయాల్లో , పూజ,జపం, చిత్త శుద్ధితో నా ధ్యాస నీకు ఉంటుందా ,,నిజం చెప్పు !?"
""ప్రభో ! కృష్ణా !;ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కటే,!,నీవు మా ఆనందం కోసం అనుగ్రహించిన ఈ సంసార సాగరంలో మునుగుతూ ,,తేలుతూ ,నిన్ను మరిచిపోతున్నాం పరమేశ్వరా !! అహంకార మమకారాలు అనే ఇనుప గొలుసులతో కృత్రిమ అనందం అనే ముసుగులో ,,అజ్ఞానంతో , మాకు మేమే బందీల మై , నీ గురించిన ధ్యాస లేకుండా ,నిన్నువిడచి మరచి, బ్రతుకుతున్నా ము రా నల్లనయ్య !""
""అదిగో ,చూశావా ??నీవు కూడా నన్ను ""నల్లనయ్య"" పిలుస్తున్నావు , కదా!పిలవకుండా వస్తె , అంత చులక నయ్యానా తాతా ?""
""కృష్ణా! నిర్గుణ నిరాకార సచ్చిదానంద స్వరూపుడైన నీకు , మా వలె రంగులు ,గుణాలు ఉంటాయా రుక్మిణీ మనో నాయకా, ? నీ
ఈ నలుపుదనం ఒక మాయా జాలం,అని మాకు తెలుసు లే!, ఆ భ్రమ తొలగించి, నీ సహజమైన ""సత్యం జ్ఞానం అనంతమైన ""నీ బ్రహ్మ స్వరూప సందర్శన భాగ్యాన్ని అందుకోవాలంటే , దేవకీ నందనా ,రాధా రమణా !,,నీ కృప లేకుండా సాధ్యం కాదు కదా?? మాధవా! ,ముకుందా ,! అచ్యు త ,!""
""మరి నా లో ఏమి చూస్తూ నాపై అంత ఇష్టాన్ని,, ప్రేమను పెంచు కుంటు ఉన్నావు తాతా?""
""కృష్ణా జనార్దనా !!" రాధా రమణా !!ఎల్లప్పుడూ ఇలా నిరతిశయ అనందంతో, శాంతాకారం తో, జ్ఞానజ్యోతిని వలె ప్రకాశిస్తున్న నీ రమణీయ కమనీయ ముగ్ద మోహన సురుచిర సుందర సౌందర్య లావణ్య వైభవ కాంతులను విరజిమ్ముతూ ఉండే దివ్యమైన పరమానంద కరమైన సుందర మనోహర స్వరూపాన్ని జగన్మోహన ఆకారాన్ని ,అంతరంగంలో దర్శిస్తూ పరవశిస్తూ ,తన్మయం పొందుతూ ఉంటానురా ,పురుషోత్తమా , పురాణ పురుషా , భక్తవత్సల !; గోవిందా !, మోక్షదాయకం ,,సకలపాప ప్రశమనం, భుక్తి ముక్తి దాయకం, ,అయిన నీ చరణార వింద ద్యానామృత పానంతో నా జన్మ ధన్యం చెయ్యి! నంద గోపాలా ! ఆ ఆనందానుభూతి తో తరించెలా నన్ను అనుగ్రహించు నంద నందనా! ,నవనీత హృదయా ,!""
""అబ్బో !చాలు చాలు! నీ పొగడ్తలు ! తాతా! ,,దొరికితే విడిచిపెట్ట వు కదా !ఇలా ఏదో ఏదో స్తోత్ర పాఠం చెబుతూ ,నన్ను మాట్లాడని వ్వవు కదా !!""
""కృష్ణా! క్షమించరా కన్నా!! నిన్ను చూసిన అనందం లో నేను ఏం మాట్లాడు తున్నా నో నాకే తెలియ డం లేదు!, అయినా నన్ను ఇలా పలికించి ,భారంగా , ఉన్న ఈ బాధితహృదయాన్ని తేలిక పరచింది నీవే కదా !!,నీవు లేని నేను,,లేనే లేను రా నాన్నా! నీవే నా అస్తిత్వం ! తల్లివి తండ్రివి , దైవాని వి, నీవే ! గతి, శృతి, దృతి, మతీ, శ్వాస,ధ్యాస, నా జీవన సర్వస్వం నీవే శ్యామసుందర ! , గిరిధారీ, మురళీ ధారి,, కృష్ణా,, కాళీయమర్దనా,, !!
నిన్ను ఒక్కటి అడగాలని ఉందిరా గోపీ మనోహర ?!""
"" నీకు నేను ఏం తక్కువ చేశానని , అడుగుతున్నావు చెప్పు?? నీకు నేను బాకీ ఉన్నానా ?? నీవు నాకు బాకీ ఉన్నావా ??
కృష్ణా ;, నీవు దాతవు ! ఙ్ఞానివి ! సర్వజ్ఞుడ వు నీవే ! మా అవసరానికి మించిన వసతులు భాగ్యం బలగం అన్నీ కోరకుండానే నీ ప్రసాదంగా ఇచ్చావు ,, కరుణా లోల! కారుణ్య మూర్తి ! అవి కావాలని కాదు !! నీ సాన్నిధ్యం లో నీ సన్నిధిలో ఉండాలని నా కోరిక !
నీవు ఎటు వెడితే నన్ను అటు తీసుకెళ్ళు అంతే !!"కృష్ణా !!""
""తాతా !ఆ మాట నీతో నేను అనాలి ,!నీవు కాదు!! అయినా ,నేను ఎటో వెళ్ళడం ఏమిటి ,??అంతటా ఉంటాను అని నీవే అందరికీ చెబుతూ ఉంటావు కదా !""
""సరే కృష్ణా !నీవు చెప్పినట్టే సదా నిన్ను స్మరిస్తూ ,అనుక్షణం గడిపే ప్రయత్నం చేస్తాను! ,కానీ అలాంటి భావ సంపద నీవే అనుగ్రహించా లి కదా!!నిరంతరం నిన్ను మరచిపోకుండా , ,నీవే నాతో నీ గురించిన ధ్యానం చేయిస్తూ ఉండాలి సుమా !;""
""ఓహో ;! ఏమి చాతుర్యం తాతా ! అనుభవ జ్ఞానం బాగానే అబ్బింది ! కానీ ,ఫలితం నీదీ ,,ప్రయాస నాదా ?""ఇదెక్కడి న్యాయం ?!
కృష్ణా నీకు తెలియని న్యాయం ధర్మం ఉంటుందా ?? వాసుదేవా ,,నాతో అందమైన వర్ణ చిత్రాలు వేయిస్తూ ఉన్నావు గదా ,! ఇలానే మీ రాధా కృష్ణుల రమ్యమైన చిత్రాలు వేస్తూ తరించే మహా భాగ్యాన్ని ప్రసాదించు నారాయణా !"",
""తాతా! ఇది నీమొదటి కోరిక!;
కృష్ణా !! యదు కుల భూషణ !; శ్రావ్యంగా పాడుకునే కంఠం ఇచ్చావు, జీవితాంతం సుమధురంగా , గానం చేయిస్తూ పాటలు పద్యాలూ పాడిస్తు ఉన్నావు , నాతో ఇలానే జీవితాంతం పాడిస్తూ ఉండాలి ,,అది కూడా కృష్ణా నీ కీర్తనలు మాత్రమే సుమా!!"
""రెండవ కోరిక తాతా ,ఇది !""
""దేవకీ పుత్రా ! గురువాయూర్ కృష్ణా !;, నీ పవిత్ర దివ్య ధామం లో నాకు రెండు వేణువు లు అనుగ్రహించావు ,వానిని అద్భుతంగా మృోయిం చే ప్రతిభను కూడా కరుణించా వు కదా మురళీధర !!, ఆ వేణుగానం నిరంతరం ఆహ్లాదంగా మధుర మనోహరంగా , ఉండాలి !!,అది కూడా నీ వేణు గానాన్ని తలపిస్తూ ఉండాలిరా ,,వంశీ ధరా !""
""తాతా నీ మూడవ కోరిక ఇది .!""
""కృష్ణా !నీ గురించిన లీలలు మధురాతి మధురంగా నాతో ఎన్నో రాయించావు కదా ,!,అదే సంపదను మహా భాగ్యం గా భావిస్తూ ఆనందిస్తూ, నీ గురించిన అనం దామృత భావ తరంగాలతో హాయిగా సంతోషంగా గడిపే మధురం అనుభవాలను జన్మ సాఫల్యం అయ్యేలా ఇలానే కొనసాగిస్తూ ఉండు స్వామీ!!""
""నాలుగో కోరిక కూడా ఉందా తాత గారూ ??""
""ఉంది కృష్ణా ! ఆదరించి అనుగ్రహించే సర్వాంతర్యామి వి ! దిక్కు నీవే దశ దిశ నీవే కదా కేశవా!; నీ , భక్తజన బృందం లో ,భజన సంగం లో,పురాణ శ్రవణం లాంటి సత్సంగం లో నాలుగు మంచి మాటలు పాటలు,భజన చేస్తూ వారి ముందు పలికే మహ దవ కాశాన్ని కూడా కరునించాలి దేవదేవా !!""
""అయినవా ,,ఇంకా ఉన్నాయా!
కృష్ణా ఇదంతా నిన్ను చేరే తాపత్రయం ఆవేదన ఆరాటం ఆతృత !; ,నిన్ను భజించే,స్మరించి ,భావించి ,సేవించి పూజించే అపురూపమైన దివ్యమైన భావ సంపదను స్ఫూర్తిని సంకల్పాన్ని అవకాశాన్ని మాకు ,ప్రసాదించు గోపికా మనోహర !;""
""అబ్బో ఎన్ని కోరిక లో కదా , ఈ మానవులకు?? ,,తీర్చే వాడు ఉండాలి గానీ, అంతు లేదు కదా మీ ఆశలకు.!!""
""నిజమే బాల ముకుందా !!,,చిన్ని కృష్ణా !, నీ గురించిన ధ్యాస భాష ,ఎంత కోరుకున్నా తక్కువే కదా !,, అయినా నీరజాక్ష ,!నీల మేఘ శ్యామ సుందరా,!ఎన్ని ఉన్నా ,,నీవు మాకు ఎన్ని ఇచ్చినా , మా అనుభవానికి తెచ్చు కునేది అందులో ఎంత ,,అన్నది మా ప్రాప్తం మా భాగ్యం !""
చేసుకున్నంత మహాదేవ అని ఊరకే అన్నారా కన్నయ్యా ??""
"" ఈ ఒక్క మాట మాత్రం చక్కగా చెప్పావు తాతా ! కానీ చెప్పడం వేరు,చెప్పింది చేయడం వేరు;సరే! నీతో walking చేస్తూ నీకు తృప్తి కలిగించాను కదా, నా కోసం ఎందరో నీ వలె, ఎదురుచూస్తూ ఉంటారు కదా!; నేను ఇక వెళ్లి రానా ??"" పాటల తాత! బొమ్మల తాత!రచనల తాత! ఫ్లూట్ తాత! ఈ వయసులో ఇంత బిజీ గా ఎలా ఉంటున్నావ్ తాతా ?.
అంతా నీ దయ , నీ కరుణ, నీ వాత్సల్యం , కృష్ణయ్యా! కన్నా ! నీ ఈ దివ్య సందర్శన భాగ్యాన్ని మరచిపోకుండా , హృదయంలో పదిలంగా భద్రపరచి చివరి శ్వాస వరకూ, నీ భువన మోహన రూప లావణ్యాన్ని , వేణు నాదం ను అనుభవం లోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ నీ సన్నిధానం లో ఉండే లా కరుణించు తండ్రీ !""
అయినా ,నా హృదయం లో ఇంత భద్రంగా చెదరని ముద్ర వేసి,నీవు ఎక్కడికి పోగలవురా నంద గోపాలా ?!,
""తాతా! ఇలా ఇంత గా నాపై అనురాగం చూపుతూ, నన్ను ఆరాధిస్తూ ఉండే నీ లాంటి భావుకులను విడిచి నేను మాత్రం క్షణమైనా దూరం ఉండగలనా, చెప్పు తాతయ్యా !?""
""చాలు కృష్ణా ! ఈ ఒక్క మాట ! చాలు పరందామా! పరా త్ప రా ! పరమేశ్వరా ! చాలు ,!
ఇంతకన్నా మహా భాగ్యము ఉండదు గాక ఉండదు! కదా ;!""
""తాతా ,నా పై ఎవరు ఎంత విశ్వాసం కలిగి ఉంటారో అంత ఫలితం వారికి అందిస్తూ ఇస్తూ ఉంటాను ,ఇది నా ప్రతిజ్ఞ!అని నీకు తెలుసు కదా ;!"" ""తెలుసు కృష్ణా ! శ్రీకృష్ణ భగవానుడు గా గీతాచార్యుడు గా అవతరించింది భగవద్గీత ను మానవ జీవన కళ్యాణానికి అందిస్తు,, ఆ పరమ సత్యాన్ని. మాకు చెప్పడానికి నీవు ఎంతో శ్రమించావు కదా విజయ సారథి నామ ధేయా, శ్రీకృష్ణా!!"
"గీతను అధ్యయనం చేస్తూ , నీ గీతను మార్చుకో తాతా! సరేనా ; ;ఇక నేను వెళ్లి వస్తాను!
""ధన్యుడను శ్రీకృష్ణా !నీకు జేజేలు !""
హరే కృష్ణ హరే కృష్ణా,,
కృష్ణ కృష్ణా హరే హరే!
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే!
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు !.
స్వస్తి !""
No comments:
Post a Comment