Feb 18, 2020
""నిజమైన శత్రువు !"
_______&______
"మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకుండా చేస్తూ శత్రు రూపంలో ,, ఆఖరు శ్వాస వరకూ నిలువునా ,,మనల్ని కాల్చుకు తినేది దిగులు,! ఇదే చింత, !రంధి,,! బాధ,,!కష్టాలు కన్నీళ్లు,! రోగాలూ , నొప్పులు,,!,తీరని మనొవ్యధ !
""పక్షవాతం"" లాంటి దీర్ఘ కాలిక రోగాలు తెచ్చేది,డబ్బు నష్టం ,శరీర కష్టం ,, కలిగించేది ,మంచాన పడగొట్టి, ""వీడెప్పు డు పోతాడురా బాబూ!!"" అని బంధువులతో రోత పెట్టించేది , చిత్రమైన చింత అనే రోగమే!!"
""మనోవ్యా దికి మందులేదు ,!"" ఆయన సంతోషంగా ఉండే ది ఏదో అది చెయ్యండి !, ఇక ఇంటికి తీసుకెళ్లండి !!"",అని డాక్టర్లకు కూడా అంతు పట్టని వింత రోగం !!, ఈ చిత్ర విచిత్రమైన "చింత" అనబడే రోగం
మనిషి తనకు తానుగా ,స్వయంగా , ఏరి కోరి తెచ్చు కుంటున్న అంటు వ్యాధి , ఇది!!
బాధపడుతూ ఉండే వాడిని చూస్తు ఉంటే ,,ఇంట్లో ఎవ్వరూ సంతోషంగా ఉండలేరు కదా!
సుఖం ఒక్కరిదే! కానీ కష్టం అందరిదీ అవుతుంది ;!
చావులు ,బ్రతుకులు ,, ఇవన్నీ కలిసిన మనిషి జీవితం నిజంగా ఒక హై డ్రామా !
ఎలా జీవించాలో తెలియకుండా నటిస్తూ బ్రతుకుతూ, మెదడు ను సమయాన్ని అక్కరకు రాని వాటి గురించి ఉపయోగిస్తూ ఒక మర మనిషి లా అవుతున్నాడు
ధ్యానం యోగం ,ఆరాధన ,లేకుండా , క్షణ కాలం కూడా తీరిక లేకుండా క్షణ క్షణం భయం తో చస్తూ బ్రతుకుతున్నారు నేటి ఆధునిక కాలంలో మనుషులు
ఎంత ఉన్నా తృప్తి లేదు, శాంతి లేదు, ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టుగా రంధి!
పుట్టినప్పుడు ఏం తెచ్చాం ,పోయేటపుడు ఏం తీసుకెళ్తామని అని చింతిస్తూ ,, కొంత సమయాన్ని దైవారాధన కు ఉపయోగిస్తే , బ్రతికి ఉండగా నే ,మనిషికి ఈ నరక బాధ లు ఉండవు కదా !!"
ఒకసారి,"" చింత,, మరియు
చితి ""ఇవి రెండూ ,,,"" నేనే గొప్ప!! అంటే ,నేనే గొప్ప!"" అని వాదించు కున్నాయి , అట !!
చింత అడిగింది ,,""చెప్పు! నీ గొప్పదనం ఏమిటో??"" అని ,,
చితి అందట,,,""నేను మనిషి చచ్చాక అతడి శరీరా న్ని ,నామ రూపాలు లేకుండా కాల్చి భస్మం చేస్తాను ,,తెలుసా ??"అంటే
""ఓసి పిచ్చిదానా,,!! ఇంతేనా నీ పస !!??
చూడూ !;నీవు మనిషి చచ్చాక కాలుస్తావు ,!, కానీ ,,నేను వాడు బ్రతికి వుండగానే కాల్చి తింటూ ,వాడు నా బాధ పడలేక చచ్చేలా చేస్తాను ,!!
వాడి బ్రతుకంతా నా ధ్యాసతో నే తెల్లా రుతుంది,!!
పైగా వాడికి తిండి పెడుతూ, తాగిస్తు, తందనాల నాడిస్తు , మజా చేయిస్తూ,, వాడి బుర్రను టెన్షన్ తో, ఫోన్ ల తో, ప్రతీ నిముషం తింటూ ఉంటాను,!
తాను , ఏం తింటున్నాడు,? ఏం తాగుతున్నాడు. ?? ఏదీ వాడికి మనసున పట్టకుండా చేస్తాను,!
ఆఖరుకు ,,చెత్త ఆలోచనలతో నిద్ర కూడా పట్టకుండా చేస్తాను ,, తెలుసా నా పవర్ ఎంతో ??
,, పాపం , ఒక్క నిముషం కూడా వాడిని ప్రశాంతంగా ఉండ నీయకుండ,,మెదడును పురుగు తోలిసినట్టుగా , చేస్తూ, ఉంటే ,,తట్టుకోలేక ,,ఒక్కొక్కసారి వాడి మెదడు నరాలు చిట్లి,,వాడి బ్రతుకు ""డామ్ "అనేలా మట్టు పెడుతూ ఉంటాను !!
వాడు ,దేవదాసు లా పిచ్చి వాడిలా ,,దెయ్యం పట్టిన వాడిలా ,విపరీతంగా ఆలోచిస్తూ ఎప్పుడు ,ఏం మాట్లాడాలో , ఏం చెయ్యాలో ,అర్థం కాక జుట్టు పీక్కుంటాడు!
"" దిక్కు తోచక,గమ్యం లేక ,ఎందుకు బ్రతకాలో తెలియక ,మానసిక రోగులు అయ్యేవారు,,ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో మనస్తిమితం కరువై,, దయనీయమైన జీవితం గడిపే వారు,, టాంక్ బండ్ లో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, బస్సు కింద లారీ కింద రైలు కింద పడే వాళ్ళు,,
ఎవరూ లేకుండా చూసి ఇంట్లో ఫ్యాన్ రాడ్ కు ఉరి పోసుకునే వాళ్ళు ,పురుగుల మందు తాగే వాళ్ళు ,,
ఇంట్లో పెళ్ళాలను కొట్టేవాళ్ళు,, తాగి రోడ్డు మీద సోయి లేకుండా పడి పోయె వాళ్ళు.!! అబ్బో !ఎన్న ని చెప్పాలే ,??, నా లీలలు! రోజూ వచ్చే ఏ పేపర్ అయినా చూడు ,!! నా అవతారాలు తెలుస్తాయి !! ఒక్కొక్కరిని వరుస పెట్టీ ,, డబ్బు ఉన్నోన్ని, లేనో న్ని ,, మెడలు వంచేస్తా !!తెలుసా !
వాడికి మస్తు డబ్బు ఇప్పిస్తా!,,బంగళాలు , ప్లాట్స్, కార్లు, స్నేహితులు అందరితో కలుపుతూ,, కాలు కింద పెట్టకుండా జేస్తా,,!!
కాలు ఎక్కడా నిలవకుండా కూడా చేస్తా!!
వాడికి ఎవ్వరితో నూ కలిసి ,మనసు విప్పి మాట్లాడుకోవడం కూడా , టైమ్ ఇవ్వకుండా ,, చేస్తా !,,
,,,,ఎవరి తో కలవకుండా మనః శాంతి లేకుండా చేస్తాను!!
చివరకు ఇంట్లో బయట,,వాడితో , అబద్ధాలు ఆడిస్తూ భార్యా పిల్లల వద్ద ,తల్లిదండ్రుల వద్ద డ్రామాలు అడిస్తా ను!
,,అంతెందుకు ??, చింత లేని వాడు ఈ భూమి మీద ఉండడు ! ఉండబో డు,,కూడా ! పుడుతూనే ఉండే నా స్నేహంవాడి చావు వరకూ వర్డిల్లుతువుంటుంది,,!!
నా ప్రభావం తో వాడికి బీపీ, లు సుగర్ వ్యాధులు, గుండె జబ్బులూ, లేని పోని కొత్త కొత్త వి,,అసలు డాక్టర్ లకే అర్థం కాని రోగాలు తెప్పిస్తా ను,,!
దేవుని తోడు లేని వాడువుంటా డేమో,,
కానీ,, నా తోడు లేని వాడు ఉండడు,,కదా !!
గుడికి పోని వాడు ఉంటాడె మో,, కానీ నా దెబ్బకు రోజూ బీపీ గోలి వేసుకొని వాడు ,, హాస్పిటల్ కి పోని వాడు ఉండడు !""అని నీతో చాలెంజ్ చేసి చెపుతున్నా!
నీతో ఉండేది వాడు ఒక ఒక్క అరగంట నే!!
కానీ నేను వాడు పుట్టినప్పటి నుండి రంధి పడుతూ ,మరణం వరకు చింతించెలా . జీవితాంతం నరకం చూపిస్తూ మజా చేస్తూ ఉంటాను ,!!
అస్తి పోతే,అనుకున్నది కాకపోతే, తల్లి పోతే, తండ్రి పోతే, భార్య పోతే, భర్త పోతే,ఉద్యోగం రాకపోతే,ఎవరైనా తిడితే,అవమానిస్తే , పదవి పోతే ,పెళ్లి కాకుండా పోతే,వృద్దాప్యం వస్తె, కుష్టు,కాన్సెర్ లాంటి రోగాలు వస్తే,, హాస్పిటల్ లో పడితే , అబ్బో మనిషికి ఎన్ని తీర్ల బాధలో !""
, ఆలాంటి బాధ పడుతూ దిక్కు లేకుండా ,జీవచ్చవం గా బ్రతికే వారందరికీ నేనే దిక్కు !
ఏ రాముడు ,,కృష్ణుడు కాదు ,,! ఏ దేవుడూ వారికి జ్ఞాపకం రాడు !,, తెలుసా !
నన్నే ఆశ్రయిస్తారు !
పాపం వాడికి తెలియదు,!, డబ్బు, అస్తి,బంగారం బలగం , ఎక్కువైనా కొద్దీ, రంధి కూడా అంతకంటే ఎక్కువైత ది అని !!
వాడికి తెలియదు ,!,జీతాలు, చదువులు ,నౌకర్లు, ఆదాయం ,వ్యాపారం ఎంత ఎక్కువై తే ,,తాను అందరికీ అంత దూరమై, నాకు దగ్గర అవుతాడు , అనీ !!,"
""ఇప్పుడు చెప్పు !,,ఎవరు గ్రేట్ !!నువ్వా ??నేనా. ??""
అని చింతా దేవి తన విశ్వరూపం చూపగానే , గడ గడ వణకు పుట్టి ,
"చితి ""భయపడి పోయింది ,!!
,,,మనిషి దీన మైన బ్రతుక్కు జాలి పడుతూ ,, చింతా స్వరూప దేవతకు దండం పెట్టింది "
"" ఇక చాలు ,,నేను వినలేను ,, చూడ లేను ,,నువ్వే నే తల్లీ, ది గ్రేట్ !! నీ మహాత్మ్యం పొగడ బ్రహ్మ తరం కూడా కాదు,!ఇక నేనెంత ,!""?
అంటూ అడుగుతూ ఉంది !
""మరి ,,ఇన్ని చెప్పావు కానీ,, నిన్ను వదిలించుకునే మార్గం కూడా ఉంటే ,పాపం ఆ మనిషికి దయచేసి చెప్పరా దా ?? ప్లీజ్ ??,""
""ఓహ్. , చెబుతాను ,, కానీ అది అంత తేలిక విషయం కాదు, !!
అయినా అడిగావు కనుక చెపుతున్నా విను ! రోగం ఉంటే మందు ఉండక పోతుందా??"
,! నా బారిన పడకుండా ఉండే ఉపాయం ఒకటి ఉంది !""
""ఏమిటది.?""
నా ""చింత ""వాడికి చావును తెస్తోంది కదా,!నూరేళ్ళు బ్రతికే టో డు, అరవై కి "ఔట్ "అయి పోతున్నాడు!!
ఏనుగు లెక్క ఉండె టోడు,, ,,పాపం !!పీను గు లెక్క అయితున్నడు పాపం !"
ఈ మనుషులను చూస్తుంటే నాకే జాలి వేస్తున్నది సుమా !!""
""ఈ ఉత్తుత్తి జాలి ఎందుకు గానీ ,విషయం చెప్పు తల్లీ ??
""ఏముంది , ?
!ఈ మనిషి,, ఈ బాహ్య ప్రపంచం లో తన సంతోషాన్ని ,, మనః శాంతిని వెదుక్కుంటూ అదే చింతిస్తూ ఉన్నాడు !
నిజానికి ,,కానీ అవి బయట కనపడే వస్తు ప్రపంచం లో లేవు, అని వాడికి తెలియడం లేదు ! ఏం చేయను ??
తన అంతరంగం లోనే ,, నిశ్చలంగా ఉంటున్న ఆత్మానందం లోనే ఉన్నాయి,, ఆ దైవ గుణ సంపదలు నిక్షిప్తం అయి ఉన్నాయి
జీవుడే దేవుడు
మనిషి దేహం ఒక దేవాలయం ,జ్ఞానం తో చూడాలి పరమాత్మను !
మనిషి కళ్ళు మూసుకొని పరమాత్మ ను ధ్యానం చేస్తూ ,,తన చూపును బయటకు కాకుండా అంతః కరణ లోకి పంపిస్తూ అంతరాత్మ లో వెదికే ప్రయత్నం నిరంతరం సాధన చెయ్యాలి ,!;
మనసును నియంత్రించాలి !!
,గీతాచార్యుడు ,,పరమ కృపాలువు , ఆ శ్రీకృష్ణ భగవానుడు, దయతో అందించిన"" భగవద్గీత ""ను అధ్యయనం చేయాలి!!
వేద శాస్త్ర పురాణాలు, ఆధ్యాత్మిక చింతన ,దైవ భక్తి,, ఇంద్రియ నిగ్రహం ,అత్మ విచారణ ఇవి లోపించిన ఈ మానవాళి నిజంగా దురదృష్ట వంతులు !;
వారు, తన చింతను అంటే నన్ను ,, పదార్థ జ్ఞానం వైపు కాకుండా యదార్థ జ్ఞానం వైపు , ఆ,పరమాత్ముని వైపు మళ్లించి ,,,పరమాత్మ తత్వ చింతన చేస్తూ బ్రతకాలి !!
అలా మనిషి ,తన వ్యక్తిత్వాన్ని ,జీవన శైలిని ,మలచు కోవాలి,! సన్మార్గంలో, సత్సంగం తో , , సకల ప్రాణుల సేవలో భగవంతుని దర్శించే రీతిలో , తపన ,సాధన, భావ సంపద ఆలవరచు కోవాలి,,!;
గమ్మత్తు ఏమిటంటే,""కనపడని ఆ భగవంతుడే తన జీవితానికి ముఖ్య కారకుడు !!""అంటే ,,వాడు , విశ్వసించడు,,
కానీ కనిపించే పదార్థాన్ని భ్రమతో వెర్రిగా విశ్వసిస్తూ ఉంటాడు!
యదార్థం తెలుసుకునే జ్ఞానం వాడికి భగవంతుడు ఇచ్చినా , ఉపయోగించు కునె , వివేకం వాడికి కొరవడింది !!చెప్పడం వరకే కానీ,,
,నేనైనా ఏం చేస్తాను చెప్పు ,,!?
"" నా డ్యూటీ నేను ,, నీ డ్యూటీ నీవు చేయక తప్పదుగా మనకు !!అంటూ , పక పక నవ్వుతూ చూస్తుం డ గానే, పబ్లిక్ లో దూరి,కనపడకుండా పోయింది మన చింతా దేవి !! ఇంకా ఎంత మంది పై తన అపార కృపను ప్రదర్శించ వలసి ఉందో , ఆ పరమాత్ముని కే ఎరుక !!""
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !"
Wednesday, February 19, 2020
నిజమైన శత్రువు !
బుద్ది లేని మనసు - 2
Feb 17, 2020
"బుద్ది లేని మనసు!" _2
_________&_________
గాయత్రీ మంత్రం లో ""ధియో యోనః ప్రచోదయాత్ !"
అంటూ బుద్ది ,సర్వాంతర్యామి యొక్క తత్వం ,, దివ్య త్వం తో నాలోని"" బుద్ది""భగవంతుని అనుగ్రహం కొరకు ప్రకాశింప బడాలి ,,ప్రచోదనం కావాలి !!""అంటూ అనునిత్యం , కర్మసాక్షి ఆ సూర్యభగవానుని ఆరాధిస్తూ ఉంటాం ! కానీ ,
మనసు జోలికి పోము !
అందుచేత ,,
""మనసు,, బుద్ది "" ఈ రెండూ కలవడం కుదరని పని ,!!
, ఒకటి పని చేస్తున్నపుడు మరొకటి నిలకడగా ఉంటుంది !! రెండూ ఒకే సారి ,ఒకే దైవం పై ,నిలపడ మే సాధకుడు చేయాల్సిన ప్రయత్నం !! ఇదే తపస్సు !
,,మనసు నిలకడగా ఉంటేనే ,బుద్ది పనిచేస్తుంది ,!!
దేవాలయం వెళ్తే , పురాణం వింటుంటే , చాగంటి లాంటి మహానుభావులు ప్రవ చనం చేస్తూ ఉంటే, అక్కడ మనసు ఎక్కువ సమయం సేపు ఉం డనీయ దు !!"" పద,,ఇక చాలు ! లే ,పోదాం ,!"" అంటూ భక్తి కథలు విననీయకుండ , ,దైవాన్ని అంతరంగం లో ప్రతిష్టించి అనందపడకుండ ,,సన్నిధానం నుండి. ,బలవంతంగా , మెడ పట్టి , బయటకు తీసేస్తుంది !
""బంగారం కొనాలి, ఉన్నది చాలదు !! అస్తి డబ్బు ఇంకా ఇంకా సంపాదించాలి ,! సాదా బట్టలు వద్దు !! చీ ,చీ !!,మంచి ఖరీదైన బట్టలు వేసుకో,!! కార్లలో,విదేశాల్లో తిరుగు!! విలాసవంతమైన , బంగళా లు కట్టు,!!life,,is wife !! ఎంజాయ్ చెయ్యి! త్రాగూ ,, తినూ ! !""అంటూ
మనిషిని టెన్షన్ పెడుతూ, అశాంతి తో , అసంతృప్తి తో బాధపడే లా చేస్తుంది ఈ పాడు మనసు !!!
పరం గురించి కాకుండా ,ఇహాన్ని గురించే చింతిస్తూ, చితి కంటే ఘోరంగా చింత ను రగిలిస్తూ, దైవానికి దూరం చేస్తుంది ,, మనసు !!!
ఏనుగు లాంటి వాడిని పీనుగు చేస్తుంది ఈ మనసు,,!
దీనిని బుద్ది బలం తో దైవానుగ్రహం తో మాత్రమే నియంత్రణ చేయగలం ,!
త్యాగరాజు అంతటి నాద బ్రహ్మ , బ్రతిమాలు కున్నారు,
""ఓ మనసా! ఎటు లోర్తునే ?
నా మనవి చేకొనవే !!""
అంటూ శ్రీరామ చంద్రుని భజించే సమయంలో, నా బుద్దిని మరల్చ బోకు, ఓ మనసా,, నీ వు నిశ్చలంగా కదలకుండా ఉంటేనే,నాకు కీర్తన చేసే భాగ్యం కలుగుతుంది సుమా !""
అంటూ నుతించా డు,,!!
దీనికి భిన్నంగా బుద్ది ప్రభావం ఉంటుంది ,,,,
,,,జీవన్ముక్తి వైపు జీవుని త్రిప్పేది బుద్ది!! స్థిరంగా,ప్రశాంతంగా ,ఏకాగ్రతతో , చెదరని ధ్యేయం తో,,శ్వాస పై ధ్యాసతో,, నిశ్చలంగా , ఒకే చోట నిశ్చల యోగ సమాధిలో ఉంచేది బుద్ది,!;
""సత్వగుణ ప్రధానం కలది బుద్ది,!
,,!దైవాన్ని అంతటా దర్శించే స్వభావం కలది బుద్ది !!, యోగ సాధనలో,పరమాత్మ ధ్యానంలో జప తప కీర్తన హోమ క్రతువుల్లో తృప్తి పడేది బుద్ది!!
మహాత్ముల సందర్శనం ,తీర్థ క్షేత్రాల దర్శనం లో ఆనందించేది బుద్ది !!
, దీనికి వ్యతిరేకంగా కదులుతూ ,,అంతులేని కోరికల వలలో పడవేసి ,మనిషిని అధః పాతాళానికి తొక్కి పారేసేది మనసు ,!!
,,అనుకున్నట్లు కాకపోతే కసి కోపం తో హత్యలు , చేయిస్తూ,చివరకు. ఆత్మహత్య కు కూడా ఈ ""మనసే ""కారణ మౌతుంది !!
,,,""పవిత్రమైన దైవారాధన కోసం దేవుని మూర్తి పై కదలకుండా మనసు ను కట్టి పడేస్తే నే గానీ , ఈ బుద్ది ఆత్మానందం పొందుతూ , చేసే పూజతో ,భజనలో ,స్మరణతో , పరమాత్మ సాక్షాత్కారము అనుభవాన్ని తృప్తిని ,ఆనందాన్ని పొంద దు !!
ఊపిరి పీల్చడం క్షణ కాలం ఆపవచ్చేమో కానీ కదలకుండా ""మనసు""ని కొన్ని సెకండ్లు కూడా నిలపడం అసాధ్యం !!
అందుకే,సత్వగుణం గల సత్సంగుల సహవాసం లో కానీ,భజనా నందం లో గానీ, తీర్తక్షేత్ర దర్షణాల్లో, ఆలయాల్లో,మహాత్ముల బోధనలలో గానీ. ఈ. మనసును సదా నిలుపుతు ,,సదా కనిపెడుతూ ఉండాలి !!
అందుకే రోజూ పూజా ,జపం , ఆలయ దర్శనం చేస్తూ మనసును నియంత్రిస్తూ ,,కుదురుగా బుద్ది గా ఉండేలా ,,చెప్పినట్టు వినేలా ,,అభ్యాసం చేస్తూ ,, సాధన చేస్తూ , చేస్తూ వుంటే , ఫోన్ ను రీఛార్జి చేస్తున్నట్టుగా దానితో సక్రమంగా పని చేయించు కోగలం !! అలా
అదే పనిగా మనసు కు పదను పెడుతూనే ఉండాలి !!
మనసును అలా నిలుపగ,, నిలుపగా ధ్యేయం పై గురి కుదురుతుంది అంటే,బుద్ది పనిచేస్తుంది ,
Practice makes perfect !!
మనసును ధ్యేయం పై లగ్నం చేయడమే యోగం! ,ఇదే యాగం ,!ఇదే క్రతువు ,!
భరతుడు అనేఋషి ,, తపస్సు చేస్తూ కూడా, ఒక జింకను పెంచుకుంటూ ,దానిపైనే మమకారం తో , మనసు పెట్టీ,జపం తపం ,మాని ,చివరకు జింక చనిపోతే,,అదే దిగులుతో అతడు కూడా మరణించి ,మరుజన్మలో అదే జింక జన్మ ను పొందుతాడు ,!!
ఏ జంతువు ,లేదా వ్యక్తి, ,,లేదా దేవతా తత్వం పై మనసు పడితే , పునర్జన్మ లో అదే రూపాన్ని పొందుతాడు మనిషి !!
""రామ రామ"" అంటూ జపించిన వాల్మీకి రామాయణం రచించే స్థాయికి ఎదిగాడు !!
""హరే కృష్ణా ""అంటూ ,ఘన శ్యామ సుందరు డు ,కృష్ణుని పై ""మనసు ""ను క దలనీయకుం డా పెట్టి, బుద్ది తో కృష్ణుని అర్చిస్తూ ,అతడే తన భర్త ,గురువూ , దైవం, తొడు నీడగా ,భావించి జీవించి, కృష్ణ పరమాత్మలో ఐక్యం అయ్యి , జన్మను సార్థకం చేసుకుంది శ్రీకృష్ణ భక్తురాలు మీరాబాయి!!
""బుద్ది పనిచేయాలి ,,అంటే మనసుని తాత్కాలిక భౌతిక సుఖాల పై కాకుండా ,నిరాకార నిర్గుణ సచ్చిదానంద ధన రూపుడు పరమాత్ముడు అయిన శ్రీకృష్ణభగవానుని చరణ కమలాలపై కదలకుండా ,వదలకుండా మనసు ని నిలుపగలగాలి !!
,,అంత శక్తి పొందడం ,, కేవలం ఆ భగవంతుని కరుణ వల్లనే సాధ్యం అవుతుంది,!!
ఎందుకంటే, ఈ మనసు పూర్వజన్మ కర్మానుభవం అనుసరించి ప్రవర్తిస్తూ, ఉంటుంది,!!
ఆ కర్మల పాల బడకుండ , ఉండాలంటే , సద్బుద్ధి తో శ్రీకృష్ణ పరందాముని ఆరాధనలో మనసు నిలపాలం టె, అది .కేవలం ,కృష్ణయ్య కృపతో నే,శ్రీకృష్ణ నామామృత పానం వల్లనే సాధ్యపడుతుంది కదా!!
అందుకే గోవిందుని పాదాలు విడవకుండా పట్టుకొని గోవిందుని పదాలు అందాం ,
గోవింద భజన చేద్దాం మనసునూ కృష్ణయ్య కు అంకితం చేద్దాం ,
స్వస్తి !!""
హరే కృష్ణ హరే కృష్ణా !""
,
బుద్ది లేని మనసు - 1
Feb 16, 2020
"బుద్ది లేని మనసు !"1_
____&_______
""మనిషికి మనసే తీరని శిక్ష !
దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష ,!""
అన్నట్టుగా ,మనిషికి నిజమైన శత్రువు మనసే ,!మిత్రుడు అనుకున్నా కూడా కష్టమే !!
,, , ఏ విధంగానూ ఈ మనసు వల్ల మనిషికి సద్గతి లభించదు !!,
""మనసు చెప్పినట్టు మనిషి వినాలి కానీ , ఆ మనసు మాత్రం మనిషి చెప్పు చేతుల్లో ఉండదు కదా !!
, ఒక వ్యక్తిని ""తండ్రి "" అని పిలిచేది కన్నతల్లీ చెబితేనే ,కదా ,!
దానికోసం ఒక certificate అంటూ ఒకటి ఉండదు ,!!బాల్యం నుండి అతడిని తండ్రీ అని పిలుస్తూ,, పిలుస్తూ ఉండగా అతడు తన "" తండ్రీ :""గా చెలామణి అవుతున్నాడు
తల్లీ విషయంలో మాత్రం ఎవరికి కూడా ఈమె ""తల్లీ"" అని చెప్పే అవసరం లేదు,,ఎందుకంటే జననం నుండి ఆమె వద్దనే పెరుగుతుంది కాబట్టీ!!
అదే విధంగా , ఈ మనసు తో ఒకరిని అదే పనిగా స్నేహ భావంతో చూస్తూ ఉంటే,అతడు ప్రాణ స్నేహితుడు అవుతాడు!
లేదా ఒకరిని ద్వేశభావం తో చూస్తూ ,,అదే పనిగా మనసుతో కక్ష పెంచుకుంటే ,అతడు "బద్ద శత్రువు ""అవుతాడు
ఒక పిల్లిని , లేదా కుక్క ,జింక లాంటి వాటిపై తమో గుణ సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటే ,మనసు వాటి పై పడితే,,వచ్చే జన్మలో వాటికి కొడుకై ,లేదా తండ్రి గా అదే జన్మ ఎత్త వల్సి ఉంటుంది!!
ఈ విధంగా మనసు తో ఎవరిని అధికంగా ప్రేమించినా , ద్వేషించినా కూడా ,తర్వాత జన్మలో కూడా ఆ బంధం కొనసాగించా క తప్పదు కదా !!
అభిమన్యుడు పోయాక , ""హా,,!!నా ""కొడుకా ,,కొడుకా !""అంటూ నిద్రాహారాలు మాని ,చేస్తున్న యుద్దం మాని అర్జునుడు దిగాలుపడి, ఏడుస్తూ అంతటి మహా వీరుడు , పరాక్రమ శాలి అయిన కుమారుడు చనిపోయాక ఇక చావే మేలు అనుకుంటూ,,మనసును కొడుకు పై పెడుతూ దిగాలు పడి పోతుంటే ,శ్రీకృష్ణుడు తన ప్రభావంతో చని పోయిన అభిమన్యుని ఆత్మను రప్పిస్తా డు !
అతడిని చూసి ""కొడుకా అభిమన్యు !"" నిన్ను విడిచి బ్రతకలేను రా !""అని ఏడుస్తూ , ఉంటే ,,
,ఎవరయ్యా నీవు,,? నేను నీకు కొడుకును కాదు,,!నీవు నా తండ్రివి కాదు !"" తెలుసా !""
నేను ఒక పవిత్రమైన ఆత్మను అంతే !! ,,దీనికి ఏ బందాల్లు ,సంబంధాలు ఉండవు ,,!!
ఇప్పుడు నేను భగవంతుని బిడ్డను!""" అంతే ,,అంటూ వెళ్ళి పోతాడు !!
అర్జునిన కు జ్ఞానోదయం అయ్యింది అపుడు !!!
అందువల్ల, మనసు దేని మీద. విపరీతంగా పెంచుకుంటే ,వచ్చే జన్మలో దానికోసం, తండ్రీ ,తల్లీ బిడ్డా ఇలా , ఏదో ఒక బంధం తో ముడివడి పునర్జన్మ ఎత్తల్సి ఉంటుంది ,జీవుడికి !;
రజో తామస గుణాలతో మోహం లో పడి "",జీవన చక్ర భ్రమణం"" అనే రంగుల రాట్నం ,, లో గమ్యం లేకుండా తిరుగుతూ ఉండడం ,, స్థిరమైన బుద్ది లేని ఈ మనసు వల్లనే కదా!!
అదే మనసును సత్వ గుణ ప్రధానం గల జంతువు ,లేదా మనిషి ,లేదా మూర్తి,పై ఉంచి పదేపదే అదే ఆలోచిస్తూంటే , ఆ సత్వ గుణం అలవడుతుంది జీవాత్మ కు !!
భక్తులు , పరమ హంసలు ,ఋషులు మునులు ,మహాత్ములు తమ మనసుని కేవలం పరమాత్ముని పై, సద్గురువుల పై ఉంచి , అదే భావంతో జీవించి. తరించారు!!
మనసు తన ప్రభావం చూపేది పంచేంద్రియాల ద్వారానే !!
1,,రుచికరమైన పదార్థాలు కనిపించగానే నోటిలో లాలా జలం ఊరుతూ
""తినా లి "" అని మనసు పీకుతూ ఉంటుంది
2,,సినిమా, టీవీ, ఆకర్షణీయ ప్రదేశాలు అశ్లీల దృశ్యాలు చూడటానికి కళ్ళు తెగ ఆరాటప డుతు ఉంటాయి!!
3,,చెవులు ముచ్చట్ల కోసం ఎగిరి గంతే సే పాటలు ,చెప్పుడు మాటలు,వినడానికి ఎప్పుడూ రిక్కిస్తూ ఉంటాయి చెవులు ,!
4,,కమ్మని సుగంధ ద్రవ్యాల పరిమళాన్ని ,వంటకాల , మిర్చీ, మసాలా వంటి వాసనను పసిగడుతూ ఉంటాయి ముక్కు రంధ్రాలు !!
ఇక 5,, స్పర్శ , ,,__శరీర సుఖం కోసం ,చల్లని నీరు ,గాలి నీడ ,వెచ్చని పడక ,,మైథునం వాటినీ పొందడం కోసం ఎప్పుడూ తహ తహ లాడుతు ఉంటుంది !
అత్యంత చంచల మైన స్వభావం కలది ఈ మనసు , !!ఒకకొమ్మ విడిచి మరొక కొమ్మ మీద గెంతుతూ ఉండే కోతివలె , తాత్కాలిక సుఖాల కోసం నిరంతరం కదులుతూ, దానితో రగిలే కోర్కెలు పొందడానికి మనిషిని పరుగు లు పెట్టిస్తూ ఉంటుంది !;
పగ్గాలు లేని గుర్రాల్లా ఇంద్రియాలు , అదుపుతప్పి , మనసు చెప్పినట్టల్లా చేస్తూ పోతాయి !! అందుకు ఒక ఉదాహరణ చూద్దాం !! ,
దుర్యోధనుడు ధర్మా ధర్మాలు , న్యాయా న్యాయాలు అన్నీ చదివిన వాడు ,,తెలిసిన వాడే !! ఎప్పుడూ గురువుల మద్య ఉన్నవాడే !!
,కానీ అతడి లో ఉన్న బుద్ది నీ పనిచేయనీయడు !! తన , మనసు చెప్పినట్టుగా వింటూ పోతాడు ,! అంతే !!
మెదడు లో ఉన్న బుద్ది సాక్షిగా చూస్తూ ఉంటుంది ,!!
అతడు తన బుద్దిని ఉపయోగించకుండా మనసు ఆడించినట్టు ఆడుతూ గొప్ప"" శాడిస్టు"" గా తయారయ్యాడు
పెద్దలు భీష్ముడు ,ద్రోణుడు ,చివరకు శ్రీకృష్ణుడు ఇలా ఎందరు చెప్పినా వినకుండా,మూర్ఖంగా ప్రవర్తిస్తూ ,ఒక స్త్రీని నిండు సభలో వివస్త్రను చేసే దుర్మార్గం తలపెట్టాడు !!
ఆమె ఏడుస్తుంటే వీడికి పరమానందం ,!!
పాండవులు వనవాసం చేస్తుంటే వీడికి బ్రహ్మానందం !!,పంచభక్ష్య పరమాన్నాలు భుజించిన సంతోషం !! వాళ్ళు చావాలని యుద్దం సంకల్పించాడు,, అంతగా కసి ,కక్ష ,ద్వేషం పెంచుకొని ,5 ఊళ్లు కూడా ఇవ్వలేదు !
అందుకే శ్రీకృష్ణుడు వాడిని నరునితోనే చంపించాడు !తాను మాత్రం కేవలం రాక్షసులను మట్టు పెట్టాడు !
,ఎందుకంటే దుర్యోధనుడు , ఆ రాక్షసుల కంటే కిరాతకుడు ,!!
రావణుడు జన్మతః రాక్షసుడు ,!!అతడు చేసే పనులు రాక్షసంగా ఉంటే, అది సహజంగా తోస్తుంది !!
కానీ ఈ దుర్యోధా నాదులు ,మనుషులుగా పుట్టినా ,చేసింది రాక్షస కృత్యం !!, వీళ్ళు రాక్షసుల కన్నా ఘోర ప్రమాద కరమైన క్రూర మృగాలు !!
మానవత్వం నశించిన మృగాలు , !!నర రూప రాక్షసులు!! వారు పద్దెనిమిది అక్షౌహిణుల మానవ మారణ హోమానికి ఒడి కట్టింది , ఆ దుష్ట చతుష్టయం !!
, ఎదుటి వాడు ఎంత బాధపడితే అంత ఆనందపడే శాడిస్టు తత్వం ఉన్నవాళ్లు ,, వారు!!
అలాంటివారికి బుద్ది పనిచేయదు ,,!!
"న్యాయం ధర్మం ,దైవం ,మానవత్వం , విచక్షణా జ్ఞానం ,వివేకం ,విజ్ఞత ,పెద్దలు , మహాత్ములు,పురాణాల పట్ల భక్తి భావం ,ఇహ, పరాల గురించిన ఇంగిత జ్ఞానం , ఇలాంటి పట్ల ఆసక్తి ,అనురక్తి ,బుద్దిని ఉపయోగిస్తే గ్రహించవచ్చు ను !!
కానీ మనసు,మనిషిని అటు వైపు బుద్దిని పెట్టనీయ దు, పెట్టినా గానీ, మరచి పోయేలా చేస్తుంది, ఆచరణ లోకి అస్సలు రానీయ దు,
బొడి పురాణాలు ,అక్కరకు వచ్చేవా,time waste !"అంటూ తేలికగా కొట్టి పారేస్తుంది మనసు,
బోర్డర్ పై పాక్ సైనికులు అడుగడుగునా అడ్డు తగులుతూ ప్రమాదాలు తెస్తున్నట్లు గా,,మనసుతో కూడా గంటకు 120 మైళ్ళ స్పీడుతో,, ""పోనీ, ఇంకా పోనీ !""అని రెచ్చగొడుతూ , బైక్, కార్ నడిపిస్తూ, మనిషి ప్రాణాన్ని కూడా బలి తీసుకుంటుంది ,కనపడకుండా లోన ఉన్న శత్రువు ఈ మనసు!!""
ప్రహ్లాదుడు అంటాడు ,, తండ్రీ !; నీ మనసే నీకు ప్రథమ శత్రువు!!,అది కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల రూపంలో ఉండి,నిన్ను తప్పు ద్రోవ పట్టిస్తూ ఉంది, బుద్ధితో ఈ పరమ రహస్యాన్ని గ్రహించు తండ్రీ !
అంతటా,నిండి ఉన్న శ్రీహరిని గుర్తించు !"" వినమ్రత తో నమస్కరిస్తూ అంటాడు !
అందుకే ఈ మనలో శత్రువు రూపంలో దాగి ఉంటూ ,అకృత్యాలు చేయిస్తూ ఉంటున్న ఈ మనసు గురించి జాగ్రత్తగా ఉండాలి అని భగవద్గతలో గీతాచార్యుడు చెప్పనే చెప్పాడు !
""నన్ను మనసుతో పూజించు !, మనసు పెట్టీ భావించు ! నీ,మనసును నా కివ్వు!చాలు ,! ,, ఆ బుద్దిని అలవరచు కో అర్జునా !""అన్నాడు,,,,
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!!""
________&____________
,
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...