Wednesday, February 19, 2020

బుద్ది లేని మనసు - 2

Feb 17, 2020
"బుద్ది లేని మనసు!" _2
_________&_________
గాయత్రీ మంత్రం లో ""ధియో యోనః ప్రచోదయాత్ !"
అంటూ బుద్ది  ,సర్వాంతర్యామి యొక్క  తత్వం ,, దివ్య త్వం తో నాలోని"" బుద్ది""భగవంతుని అనుగ్రహం కొరకు  ప్రకాశింప బడాలి ,,ప్రచోదనం కావాలి !!""అంటూ అనునిత్యం ,  కర్మసాక్షి ఆ సూర్యభగవానుని ఆరాధిస్తూ ఉంటాం  ! కానీ ,
మనసు జోలికి పోము !
అందుచేత ,,
""మనసు,, బుద్ది ""  ఈ రెండూ కలవడం కుదరని పని ,!!
, ఒకటి పని చేస్తున్నపుడు మరొకటి  నిలకడగా ఉంటుంది !! రెండూ ఒకే సారి ,ఒకే దైవం పై ,నిలపడ మే  సాధకుడు చేయాల్సిన ప్రయత్నం  !! ఇదే తపస్సు !
,,మనసు నిలకడగా ఉంటేనే  ,బుద్ది  పనిచేస్తుంది ,!!
దేవాలయం వెళ్తే , పురాణం వింటుంటే , చాగంటి లాంటి మహానుభావులు ప్రవ చనం చేస్తూ ఉంటే, అక్కడ మనసు  ఎక్కువ  సమయం సేపు  ఉం డనీయ దు !!"" పద,,ఇక చాలు ! లే ,పోదాం ,!"" అంటూ భక్తి కథలు విననీయకుండ , ,దైవాన్ని అంతరంగం లో ప్రతిష్టించి అనందపడకుండ ,,సన్నిధానం నుండి. ,బలవంతంగా , మెడ పట్టి ,  బయటకు తీసేస్తుంది !
""బంగారం కొనాలి, ఉన్నది చాలదు !! అస్తి డబ్బు ఇంకా ఇంకా సంపాదించాలి ,! సాదా బట్టలు వద్దు !! చీ ,చీ !!,మంచి ఖరీదైన బట్టలు వేసుకో,!! కార్లలో,విదేశాల్లో తిరుగు!! విలాసవంతమైన , బంగళా లు కట్టు,!!life,,is  wife !! ఎంజాయ్ చెయ్యి!  త్రాగూ ,, తినూ ! !""అంటూ
మనిషిని టెన్షన్ పెడుతూ, అశాంతి తో , అసంతృప్తి తో బాధపడే లా చేస్తుంది ఈ పాడు మనసు !!!
పరం గురించి కాకుండా ,ఇహాన్ని గురించే చింతిస్తూ, చితి కంటే ఘోరంగా చింత ను రగిలిస్తూ, దైవానికి దూరం చేస్తుంది ,, మనసు !!!
ఏనుగు లాంటి వాడిని పీనుగు చేస్తుంది ఈ మనసు,,!
దీనిని బుద్ది బలం తో దైవానుగ్రహం తో మాత్రమే నియంత్రణ చేయగలం ,!
త్యాగరాజు అంతటి నాద బ్రహ్మ , బ్రతిమాలు కున్నారు,
""ఓ మనసా! ఎటు లోర్తునే ?
నా మనవి చేకొనవే !!""
అంటూ శ్రీరామ చంద్రుని భజించే సమయంలో, నా బుద్దిని మరల్చ బోకు, ఓ మనసా,, నీ వు నిశ్చలంగా కదలకుండా ఉంటేనే,నాకు కీర్తన చేసే భాగ్యం కలుగుతుంది సుమా !""
అంటూ నుతించా డు,,!!
దీనికి భిన్నంగా బుద్ది ప్రభావం ఉంటుంది ,,,,
,,,జీవన్ముక్తి వైపు జీవుని త్రిప్పేది  బుద్ది!! స్థిరంగా,ప్రశాంతంగా ,ఏకాగ్రతతో ,  చెదరని ధ్యేయం తో,,శ్వాస పై ధ్యాసతో,, నిశ్చలంగా ,  ఒకే చోట నిశ్చల యోగ సమాధిలో  ఉంచేది బుద్ది,!;
""సత్వగుణ ప్రధానం కలది బుద్ది,!
,,!దైవాన్ని అంతటా దర్శించే స్వభావం కలది బుద్ది !!, యోగ సాధనలో,పరమాత్మ ధ్యానంలో  జప తప కీర్తన హోమ క్రతువుల్లో తృప్తి పడేది బుద్ది!!
మహాత్ముల సందర్శనం ,తీర్థ క్షేత్రాల దర్శనం లో ఆనందించేది బుద్ది !!
,  దీనికి వ్యతిరేకంగా కదులుతూ ,,అంతులేని కోరికల వలలో పడవేసి ,మనిషిని అధః పాతాళానికి తొక్కి పారేసేది మనసు ,!!
,,అనుకున్నట్లు కాకపోతే కసి కోపం తో హత్యలు , చేయిస్తూ,చివరకు. ఆత్మహత్య కు కూడా ఈ ""మనసే ""కారణ మౌతుంది !!
,,,""పవిత్రమైన దైవారాధన కోసం దేవుని మూర్తి పై కదలకుండా మనసు ను కట్టి పడేస్తే నే గానీ  , ఈ బుద్ది ఆత్మానందం పొందుతూ , చేసే పూజతో ,భజనలో ,స్మరణతో , పరమాత్మ సాక్షాత్కారము అనుభవాన్ని తృప్తిని ,ఆనందాన్ని  పొంద దు !!
ఊపిరి పీల్చడం క్షణ కాలం ఆపవచ్చేమో కానీ  కదలకుండా ""మనసు""ని కొన్ని సెకండ్లు కూడా  నిలపడం  అసాధ్యం !!
అందుకే,సత్వగుణం గల సత్సంగుల సహవాసం లో కానీ,భజనా నందం  లో గానీ, తీర్తక్షేత్ర దర్షణాల్లో, ఆలయాల్లో,మహాత్ముల బోధనలలో గానీ. ఈ.  మనసును   సదా నిలుపుతు ,,సదా కనిపెడుతూ ఉండాలి !!
అందుకే రోజూ పూజా ,జపం , ఆలయ దర్శనం చేస్తూ మనసును నియంత్రిస్తూ ,,కుదురుగా బుద్ది గా ఉండేలా ,,చెప్పినట్టు వినేలా ,,అభ్యాసం చేస్తూ ,, సాధన చేస్తూ , చేస్తూ వుంటే , ఫోన్ ను రీఛార్జి చేస్తున్నట్టుగా  దానితో సక్రమంగా పని చేయించు కోగలం !! అలా
అదే పనిగా  మనసు కు పదను పెడుతూనే ఉండాలి !!
మనసును అలా నిలుపగ,, నిలుపగా ధ్యేయం పై గురి కుదురుతుంది అంటే,బుద్ది పనిచేస్తుంది ,
Practice makes perfect !!
మనసును ధ్యేయం పై లగ్నం చేయడమే యోగం! ,ఇదే యాగం ,!ఇదే క్రతువు ,!
భరతుడు అనేఋషి ,, తపస్సు చేస్తూ కూడా, ఒక జింకను పెంచుకుంటూ ,దానిపైనే మమకారం తో , మనసు పెట్టీ,జపం తపం ,మాని ,చివరకు జింక చనిపోతే,,అదే దిగులుతో అతడు కూడా మరణించి ,మరుజన్మలో అదే జింక జన్మ ను పొందుతాడు ,!!
ఏ జంతువు ,లేదా వ్యక్తి, ,,లేదా  దేవతా తత్వం పై మనసు పడితే , పునర్జన్మ లో  అదే రూపాన్ని పొందుతాడు మనిషి !!
""రామ రామ"" అంటూ జపించిన వాల్మీకి రామాయణం రచించే స్థాయికి ఎదిగాడు !!
""హరే కృష్ణా ""అంటూ ,ఘన శ్యామ సుందరు డు ,కృష్ణుని పై ""మనసు ""ను క దలనీయకుం డా పెట్టి, బుద్ది తో కృష్ణుని  అర్చిస్తూ ,అతడే   తన  భర్త ,గురువూ , దైవం, తొడు నీడగా ,భావించి జీవించి, కృష్ణ పరమాత్మలో ఐక్యం అయ్యి , జన్మను సార్థకం చేసుకుంది శ్రీకృష్ణ భక్తురాలు  మీరాబాయి!!
""బుద్ది పనిచేయాలి ,,అంటే మనసుని తాత్కాలిక భౌతిక సుఖాల పై కాకుండా ,నిరాకార నిర్గుణ సచ్చిదానంద ధన రూపుడు పరమాత్ముడు అయిన శ్రీకృష్ణభగవానుని చరణ కమలాలపై   కదలకుండా ,వదలకుండా మనసు ని నిలుపగలగాలి !!
,,అంత శక్తి పొందడం ,, కేవలం  ఆ భగవంతుని కరుణ వల్లనే సాధ్యం అవుతుంది,!!
ఎందుకంటే, ఈ మనసు పూర్వజన్మ కర్మానుభవం  అనుసరించి ప్రవర్తిస్తూ, ఉంటుంది,!!
ఆ కర్మల పాల బడకుండ , ఉండాలంటే , సద్బుద్ధి తో శ్రీకృష్ణ పరందాముని ఆరాధనలో మనసు నిలపాలం టె, అది .కేవలం ,కృష్ణయ్య కృపతో నే,శ్రీకృష్ణ నామామృత పానం వల్లనే  సాధ్యపడుతుంది కదా!!
అందుకే గోవిందుని  పాదాలు విడవకుండా పట్టుకొని గోవిందుని  పదాలు అందాం ,
గోవింద భజన చేద్దాం మనసునూ కృష్ణయ్య కు అంకితం చేద్దాం ,
స్వస్తి !!""
హరే కృష్ణ హరే కృష్ణా !""
,

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...