Wednesday, February 19, 2020

నిజమైన శత్రువు !

Feb 18, 2020
""నిజమైన శత్రువు !"
_______&______
"మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ  , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకుండా చేస్తూ శత్రు రూపంలో ,, ఆఖరు శ్వాస వరకూ నిలువునా ,,మనల్ని  కాల్చుకు తినేది దిగులు,! ఇదే చింత, !రంధి,,! బాధ,,!కష్టాలు కన్నీళ్లు,! రోగాలూ , నొప్పులు,,!,తీరని మనొవ్యధ !
""పక్షవాతం"" లాంటి దీర్ఘ కాలిక రోగాలు తెచ్చేది,డబ్బు నష్టం ,శరీర కష్టం ,, కలిగించేది ,మంచాన పడగొట్టి, ""వీడెప్పు డు పోతాడురా బాబూ!!"" అని బంధువులతో రోత పెట్టించేది , చిత్రమైన చింత అనే రోగమే!!"
""మనోవ్యా దికి మందులేదు ,!"" ఆయన సంతోషంగా ఉండే ది ఏదో అది చెయ్యండి !, ఇక ఇంటికి తీసుకెళ్లండి !!"",అని డాక్టర్లకు కూడా అంతు పట్టని వింత రోగం !!, ఈ చిత్ర విచిత్రమైన "చింత" అనబడే రోగం
మనిషి తనకు తానుగా ,స్వయంగా , ఏరి కోరి తెచ్చు కుంటున్న అంటు వ్యాధి , ఇది!!
బాధపడుతూ ఉండే వాడిని చూస్తు ఉంటే ,,ఇంట్లో ఎవ్వరూ సంతోషంగా ఉండలేరు కదా!
సుఖం ఒక్కరిదే! కానీ కష్టం అందరిదీ అవుతుంది ;!
  చావులు ,బ్రతుకులు ,, ఇవన్నీ కలిసిన  మనిషి జీవితం  నిజంగా ఒక హై డ్రామా !
ఎలా జీవించాలో తెలియకుండా నటిస్తూ బ్రతుకుతూ, మెదడు ను సమయాన్ని అక్కరకు రాని వాటి గురించి ఉపయోగిస్తూ ఒక మర మనిషి లా అవుతున్నాడు
ధ్యానం యోగం ,ఆరాధన ,లేకుండా , క్షణ కాలం కూడా తీరిక లేకుండా క్షణ క్షణం భయం తో చస్తూ బ్రతుకుతున్నారు నేటి ఆధునిక కాలంలో మనుషులు
ఎంత ఉన్నా తృప్తి లేదు, శాంతి లేదు, ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టుగా   రంధి!
పుట్టినప్పుడు ఏం తెచ్చాం ,పోయేటపుడు ఏం తీసుకెళ్తామని అని చింతిస్తూ ,, కొంత సమయాన్ని దైవారాధన కు ఉపయోగిస్తే , బ్రతికి ఉండగా నే ,మనిషికి ఈ నరక బాధ లు ఉండవు కదా !!"
ఒకసారి,"" చింత,, మరియు
చితి ""ఇవి రెండూ ,,,"" నేనే గొప్ప!! అంటే ,నేనే గొప్ప!"" అని వాదించు కున్నాయి , అట !!
చింత అడిగింది ,,""చెప్పు! నీ గొప్పదనం ఏమిటో??"" అని ,,
చితి అందట,,,""నేను  మనిషి  చచ్చాక అతడి శరీరా న్ని ,నామ రూపాలు లేకుండా  కాల్చి భస్మం చేస్తాను ,,తెలుసా ??"అంటే
""ఓసి పిచ్చిదానా,,!! ఇంతేనా నీ పస !!??
చూడూ !;నీవు మనిషి  చచ్చాక కాలుస్తావు ,!, కానీ ,,నేను  వాడు బ్రతికి వుండగానే కాల్చి తింటూ ,వాడు నా బాధ పడలేక  చచ్చేలా చేస్తాను ,!!
వాడి బ్రతుకంతా  నా ధ్యాసతో నే తెల్లా రుతుంది,!!
పైగా వాడికి తిండి పెడుతూ, తాగిస్తు, తందనాల నాడిస్తు , మజా చేయిస్తూ,, వాడి బుర్రను  టెన్షన్ తో, ఫోన్ ల తో, ప్రతీ నిముషం  తింటూ ఉంటాను,!
తాను , ఏం తింటున్నాడు,? ఏం తాగుతున్నాడు. ?? ఏదీ వాడికి  మనసున పట్టకుండా చేస్తాను,!
ఆఖరుకు ,,చెత్త ఆలోచనలతో నిద్ర కూడా  పట్టకుండా చేస్తాను ,, తెలుసా నా పవర్ ఎంతో ??
,, పాపం , ఒక్క నిముషం కూడా వాడిని ప్రశాంతంగా ఉండ నీయకుండ,,మెదడును పురుగు తోలిసినట్టుగా  , చేస్తూ, ఉంటే ,,తట్టుకోలేక ,,ఒక్కొక్కసారి  వాడి మెదడు నరాలు చిట్లి,,వాడి బ్రతుకు  ""డామ్ "అనేలా మట్టు పెడుతూ ఉంటాను !!
   వాడు ,దేవదాసు లా పిచ్చి వాడిలా ,,దెయ్యం పట్టిన వాడిలా ,విపరీతంగా ఆలోచిస్తూ ఎప్పుడు  ,ఏం మాట్లాడాలో , ఏం చెయ్యాలో ,అర్థం కాక జుట్టు పీక్కుంటాడు!
"" దిక్కు తోచక,గమ్యం లేక ,ఎందుకు బ్రతకాలో తెలియక ,మానసిక రోగులు అయ్యేవారు,,ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో మనస్తిమితం కరువై,, దయనీయమైన జీవితం గడిపే వారు,, టాంక్ బండ్ లో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, బస్సు కింద లారీ కింద రైలు కింద పడే వాళ్ళు,,
ఎవరూ లేకుండా చూసి ఇంట్లో  ఫ్యాన్ రాడ్ కు ఉరి పోసుకునే వాళ్ళు ,పురుగుల మందు తాగే వాళ్ళు ,,
ఇంట్లో పెళ్ళాలను కొట్టేవాళ్ళు,, తాగి రోడ్డు మీద సోయి లేకుండా పడి పోయె వాళ్ళు.!! అబ్బో !ఎన్న ని చెప్పాలే ,??, నా లీలలు! రోజూ వచ్చే ఏ పేపర్ అయినా చూడు ,!! నా అవతారాలు తెలుస్తాయి !! ఒక్కొక్కరిని వరుస పెట్టీ ,, డబ్బు ఉన్నోన్ని, లేనో న్ని ,, మెడలు  వంచేస్తా !!తెలుసా !
వాడికి మస్తు డబ్బు ఇప్పిస్తా!,,బంగళాలు , ప్లాట్స్, కార్లు, స్నేహితులు అందరితో కలుపుతూ,, కాలు కింద పెట్టకుండా జేస్తా,,!!
కాలు ఎక్కడా నిలవకుండా కూడా  చేస్తా!!
వాడికి ఎవ్వరితో నూ కలిసి ,మనసు విప్పి మాట్లాడుకోవడం కూడా , టైమ్ ఇవ్వకుండా ,, చేస్తా !,,
,,,,ఎవరి తో కలవకుండా మనః శాంతి లేకుండా చేస్తాను!!
చివరకు ఇంట్లో బయట,,వాడితో , అబద్ధాలు ఆడిస్తూ భార్యా పిల్లల వద్ద ,తల్లిదండ్రుల వద్ద డ్రామాలు అడిస్తా ను!
,,అంతెందుకు ??, చింత లేని వాడు ఈ భూమి మీద ఉండడు ! ఉండబో డు,,కూడా ! పుడుతూనే ఉండే  నా స్నేహంవాడి చావు వరకూ వర్డిల్లుతువుంటుంది,,!!
నా ప్రభావం తో వాడికి బీపీ, లు సుగర్ వ్యాధులు, గుండె జబ్బులూ, లేని పోని కొత్త కొత్త వి,,అసలు డాక్టర్ లకే అర్థం కాని రోగాలు తెప్పిస్తా ను,,!
దేవుని తోడు లేని వాడువుంటా డేమో,,
కానీ,, నా తోడు  లేని వాడు ఉండడు,,కదా !!
గుడికి పోని వాడు ఉంటాడె మో,, కానీ నా దెబ్బకు రోజూ బీపీ  గోలి వేసుకొని వాడు ,, హాస్పిటల్ కి పోని వాడు ఉండడు !""అని నీతో చాలెంజ్ చేసి చెపుతున్నా!
నీతో ఉండేది వాడు ఒక ఒక్క అరగంట నే!!
కానీ నేను వాడు పుట్టినప్పటి నుండి రంధి పడుతూ ,మరణం వరకు చింతించెలా .  జీవితాంతం నరకం  చూపిస్తూ  మజా చేస్తూ  ఉంటాను ,!!
అస్తి పోతే,అనుకున్నది కాకపోతే, తల్లి పోతే, తండ్రి పోతే, భార్య పోతే, భర్త పోతే,ఉద్యోగం రాకపోతే,ఎవరైనా తిడితే,అవమానిస్తే , పదవి పోతే ,పెళ్లి కాకుండా పోతే,వృద్దాప్యం వస్తె, కుష్టు,కాన్సెర్ లాంటి రోగాలు వస్తే,, హాస్పిటల్ లో పడితే , అబ్బో మనిషికి ఎన్ని తీర్ల బాధలో !""
, ఆలాంటి బాధ పడుతూ దిక్కు లేకుండా ,జీవచ్చవం గా బ్రతికే వారందరికీ  నేనే దిక్కు !
ఏ రాముడు ,,కృష్ణుడు కాదు ,,! ఏ దేవుడూ వారికి జ్ఞాపకం రాడు !,, తెలుసా !
నన్నే ఆశ్రయిస్తారు !
పాపం వాడికి తెలియదు,!, డబ్బు, అస్తి,బంగారం బలగం , ఎక్కువైనా కొద్దీ, రంధి కూడా అంతకంటే ఎక్కువైత ది అని !!
వాడికి తెలియదు ,!,జీతాలు, చదువులు ,నౌకర్లు, ఆదాయం ,వ్యాపారం  ఎంత  ఎక్కువై తే ,,తాను అందరికీ  అంత దూరమై, నాకు  దగ్గర అవుతాడు , అనీ !!,"
""ఇప్పుడు చెప్పు !,,ఎవరు గ్రేట్ !!నువ్వా ??నేనా.  ??""
అని చింతా దేవి తన విశ్వరూపం చూపగానే , గడ గడ వణకు పుట్టి ,
"చితి ""భయపడి పోయింది ,!!
,,,మనిషి దీన మైన బ్రతుక్కు జాలి పడుతూ ,, చింతా స్వరూప దేవతకు  దండం పెట్టింది "
"" ఇక చాలు ,,నేను వినలేను ,, చూడ లేను ,,నువ్వే నే తల్లీ, ది గ్రేట్ !! నీ మహాత్మ్యం పొగడ బ్రహ్మ తరం కూడా  కాదు,!ఇక  నేనెంత ,!""?
అంటూ అడుగుతూ ఉంది !
""మరి ,,ఇన్ని చెప్పావు  కానీ,, నిన్ను వదిలించుకునే మార్గం కూడా ఉంటే ,పాపం ఆ మనిషికి  దయచేసి  చెప్పరా దా ?? ప్లీజ్ ??,""
""ఓహ్. , చెబుతాను ,, కానీ అది అంత తేలిక విషయం కాదు, !!
అయినా అడిగావు కనుక  చెపుతున్నా విను ! రోగం ఉంటే మందు ఉండక పోతుందా??"
,! నా బారిన పడకుండా ఉండే ఉపాయం ఒకటి ఉంది !""
""ఏమిటది.?""
నా ""చింత ""వాడికి చావును తెస్తోంది కదా,!నూరేళ్ళు బ్రతికే టో డు, అరవై  కి "ఔట్ "అయి పోతున్నాడు!!
ఏనుగు లెక్క ఉండె టోడు,, ,,పాపం !!పీను గు లెక్క అయితున్నడు పాపం !"
ఈ మనుషులను చూస్తుంటే నాకే జాలి వేస్తున్నది సుమా !!""
""ఈ ఉత్తుత్తి జాలి ఎందుకు గానీ ,విషయం చెప్పు  తల్లీ ??
""ఏముంది , ?
!ఈ మనిషి,, ఈ బాహ్య ప్రపంచం లో తన సంతోషాన్ని ,, మనః శాంతిని  వెదుక్కుంటూ అదే చింతిస్తూ ఉన్నాడు !
నిజానికి ,,కానీ అవి బయట కనపడే వస్తు ప్రపంచం లో లేవు, అని వాడికి తెలియడం లేదు ! ఏం చేయను ??
తన అంతరంగం లోనే ,, నిశ్చలంగా ఉంటున్న ఆత్మానందం లోనే ఉన్నాయి,, ఆ దైవ గుణ సంపదలు నిక్షిప్తం అయి ఉన్నాయి
జీవుడే దేవుడు
మనిషి దేహం ఒక దేవాలయం ,జ్ఞానం తో చూడాలి పరమాత్మను !
మనిషి  కళ్ళు మూసుకొని పరమాత్మ ను ధ్యానం చేస్తూ ,,తన చూపును బయటకు కాకుండా అంతః కరణ లోకి  పంపిస్తూ అంతరాత్మ లో వెదికే  ప్రయత్నం నిరంతరం సాధన చెయ్యాలి ,!;
మనసును నియంత్రించాలి !!
,గీతాచార్యుడు ,,పరమ కృపాలువు , ఆ శ్రీకృష్ణ భగవానుడు, దయతో అందించిన"" భగవద్గీత ""ను  అధ్యయనం చేయాలి!!
వేద శాస్త్ర  పురాణాలు, ఆధ్యాత్మిక చింతన ,దైవ భక్తి,, ఇంద్రియ నిగ్రహం ,అత్మ విచారణ ఇవి  లోపించిన  ఈ మానవాళి నిజంగా దురదృష్ట వంతులు !;
వారు, తన చింతను అంటే నన్ను ,, పదార్థ జ్ఞానం వైపు కాకుండా యదార్థ జ్ఞానం వైపు , ఆ,పరమాత్ముని వైపు మళ్లించి ,,,పరమాత్మ తత్వ చింతన చేస్తూ బ్రతకాలి !!
అలా  మనిషి ,తన వ్యక్తిత్వాన్ని ,జీవన శైలిని ,మలచు కోవాలి,! సన్మార్గంలో, సత్సంగం తో , , సకల ప్రాణుల సేవలో భగవంతుని దర్శించే  రీతిలో , తపన ,సాధన, భావ సంపద ఆలవరచు కోవాలి,,!;
గమ్మత్తు ఏమిటంటే,""కనపడని ఆ  భగవంతుడే తన జీవితానికి ముఖ్య కారకుడు !!""అంటే ,,వాడు , విశ్వసించడు,,
కానీ కనిపించే పదార్థాన్ని భ్రమతో వెర్రిగా  విశ్వసిస్తూ ఉంటాడు!
యదార్థం తెలుసుకునే జ్ఞానం వాడికి భగవంతుడు ఇచ్చినా , ఉపయోగించు కునె , వివేకం వాడికి  కొరవడింది !!చెప్పడం వరకే కానీ,,
,నేనైనా  ఏం చేస్తాను  చెప్పు ,,!?
"" నా డ్యూటీ నేను ,, నీ డ్యూటీ నీవు చేయక తప్పదుగా  మనకు !!అంటూ , పక పక నవ్వుతూ చూస్తుం డ గానే, పబ్లిక్ లో దూరి,కనపడకుండా పోయింది  మన చింతా దేవి !! ఇంకా ఎంత మంది పై తన అపార కృపను ప్రదర్శించ వలసి ఉందో , ఆ పరమాత్ముని కే ఎరుక !!""
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...