Saturday, February 8, 2020

భజన అంటే 2

భజన అంటే 2
Jan 20, 2020
_______&_________
" 101 ,__"భజన అంటే ,అందరికీ సాద్యం కాని పరమార్థ చింతన !
, ఆ భాగ్యానికి నోచుకోవాలి ,,!అందుకు పెట్టీ పుట్టాలి!
102,_ ,"భజన  అంటే   ,అసాధారణం , అనుపమాన మైన విషయం  ,! మాటల్లో చెప్పలేని అపురూప అద్వితీయమైన స్వీయ అనుభవం !
103,,_"భజన అంటే, ఒక గంట, ఒక రోజు ఒక నెల,ఒక సంవత్సరం చేసే దీక్ష కాదు , అది జీవితాంతం వెంట ఉండి నడిపించే సత్సంగం ,భగవంతుని తో విడిపో ని  స్నేహం  !
104,_ భజన అంటే ,భగవంతుడు ,
105,_ భజన అంటే,భగవద్ భక్తుల వైభవం,జీవిత పరమార్థం తెలుసుకోవడం
  106,_"భజన అంటే దేవుని భజించడం ,అంటే భగవంతుని   ప్రేమించడం ,ఆరాధించడం ,మనసుతో  సదా ,సర్వకాలం ,తలుస్తూ  కొలుస్తూ ఉండడం !
107,_"భజన అంటే ,,బంధు ప్రీతిని వదిలించు కొంటూ , ఆ స్థానంలో పరమాత్మ పై ప్రీతిని పెంచుకొంటూ ఉండడం  !"
,107,_"భజన అంటే, మనసును  కుదురుగా నిలుపుకోవడం, ! నియంత్రించడం! ,
క్షణకాలం
శ్వాసను అపగల మేమో కానీ ,, మనసు ను చలించకుండా అపడం,,కేవలం మానవ ప్రయత్నం తో సాద్యపడని విషయం !"
108,_""భజన అంటే, అంతటా భగవంతుని స్వరూప దర్శనం చేస్తూ ఉండడం !", చీమలో, దోమలో ,ఏనుగు లో , క్రూర మృగాల లో ,పువ్వులో, ఆకులో ,చెట్టులో ,,పుట్టలో కొండలో, కొనలో ,, పరమాత్మ అద్భుత సర్వ వ్యాపక చైతన్య వైభవాన్ని ,తత్వాన్ని , కళ్ళారా తిలకిస్తూ, హృదయం లో ఆత్మానందం అనుభవిస్తూ  ,భగవంతుని లీలలు కీర్తిస్తూ ,,, సంతోషం తో ,,అతని అనుగ్రహం కోసం చేపట్ట వలసిన హరినామ సంకీర్తన అనబడే పరమాద్భుత ప్రయోగం !""
109,,__"భజన అంటే, భగవంతుని నిరంతర  పాద యుగళ చింతనామృత పానం ,!"
110,_"భజన అంటే ,అదే శ్వాస! అదే ధ్యాస !అదే జీవితం!అదే ధ్యేయంగా,ఎంచుకునే చెదరని ,తరగని శాశ్వత సంపద !""
111,__"భజన ఒక మహా ప్రసాదం ,! అమృత తుల్యముగా  భావిస్తూ అలాంటి శుభ తరుణంకోసం  పదే ప దే ఆ  అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఆ జగన్నాటక సూత్రధారి ని , నవనీత చో రునీ నంద నంద నుని అనవరతం ప్రార్ధిస్తూ ఉండడం !"
112,,_""భజన అంటే, మహాత్ములను భక్తి శ్రద్ధలతో సన్మానించడం !
113,,_"భజన అంటే ,సాధు పురుషులను సేవించడం ,!
114,,__"భజన అంటే ,తీర్థ క్షేత్రాల సందర్శన ఆపేక్ష!"
115,,_""భజన అంటే, ఓంకార ధ్యానం !"
116,,_"భజన అంటే ,గంగా జల ధారలాంటి ఒక పవిత్ర ప్రేమ! నిర్మల హృదయం తో  ,,హృదయ అంతరాళం లో నుండి  ఆగకుండా పొంగి  వచ్చే  పాట , ,సంగీతం,నృత్యం,వాయిద్యం,నటన ,ప్రవచనం !
117,__"భజన అంటే,,__"నృత్యాభినయం ద్వారా  ప్రదర్శింప బడుతూ  భక్తజన సందోహంను అనందపరచే సమ్మోహన అస్త్రం  !"
118,,_""భజన అంటే  పరమాత్ముని ప్రార్థించే విధంగా మసలుకోమని ,మనసును బ్రతిమిలా డుకోవడం !""
119,__"భజన అంటే, మనసుని అత్యంత  స్నేహితుడు ,పరమ ఆత్మీయుడు , హితాభిలాషి  గా  దిద్దుకోడం !""
120,__"భజన అంటే, రాజ స ,తామస గుణములు తొలగించు కోవడం !"
121,,__"భజన అంటే ,ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే  దృఢమైన సంకల్ప బలం ,భగవంతుని పై ప్రగాఢ మైన విశ్వాసం !"
122,__""భజన అంటే,  దీనంగా , అక్రందిస్తు , విలపిస్తూ , రోదిస్తూ త్రికరణ శుద్ధిగా పరమాత్మ అనుగ్రహం కోసం  తపించే  భక్తి మార్గం !"
123,__""భజన అంటే, పరమాత్మ ను  మనసారా భావిస్తూ ,,తనివారా   సేవిస్తూ , నోరారా పిలుస్తు ఉండడం !"
124,__"భజన అంటే, భగవంతుని తో " స్నేహం, దాస్యం  , అత్మ సమర్పణ భావం"" లాంటి   ఏదో ఒక బంధం ఏర్పరచు కోవడం;"
125,__"భజన అంటే, భావములో బాహ్యంలో భగవద్ వైభవాన్ని అంతరంగం లో దర్శిస్తూ బ్రహ్మానందం పొందడం !"
126,,_""భజన అంటే, అన్నమయ్య వలె సంకీర్తనలు రచించి గానం చేయడం !"
127,,_""భజన  అంటే, త్యాగరాజ స్వామీ వలె,పరమాత్ముని బాసి, క్షణం కూడా విడిచి ఉండలేని విరహ వేదన!""  ఆ దివ్యానుభవాన్ని అనుభవిస్తూ , ఆ తన్మయావస్త లో రాగ భావ తాళ యుక్తంగా కీర్తనలు రచించి ఆలపించ డం !""
,, "కీర్తనలు"" అనబడే భగవద్ ప్రసాదాన్ని , మానవాళి  జీవన్ముక్తి కోసం, సామాన్య ప్రజలకు అందించడం !"
128,,_""భజన అంటే ,,భక్త మీరాబాయి వలె కృష్ణుడు తనవాడుగా  భావిస్తూ కృష్ణానురాగ భావ అభినివశం తో ఆడుతూ, పాడుతూ, సంతోషంగా జీవితాంతం గడిపి శ్రీకృష్ణ   సాన్నిధ్యం లో గడపడం !! అతడి అంతరంగ పరిచారిక గా, ప్రియురాలిగా జీవిస్తూ కృష్ణ పరమాత్మ లో ఐక్యం కావడం !""
129,,__""భజన అంటే, అన్నమయ్య వలె అలిమేలు మంగ సహితంగా శ్రీ వేంకటేశుని ప్రత్యక్షంగా దర్శిస్తూ,  ఆ ఆత్మానందాన్ని ,తిరుమలేశుని దివ్య మంగళ స్వరూప వైభవాన్ని కీర్తిస్తూ,  చేసిన వేలాది అద్భుతమైన కీర్తనల ఆనందా మృత భక్తి జ్ఞాన  శృంగార వైరాగ్య సంగీత  ఝరి !""
130,__"భజన అంటే, అమూల్యం !,బ్రహ్మ కైన విలువ కట్టడం సాద్యం కాని , ఒక మధురానుభూతి   !"    ,,,,
131,,__""భజన అంటే ,,
జప ,తప ,యోగ ,యాగ, క్రతు ,యజ్ఞ దీక్షల కంటే అతి సులభమైన యోగం!""
132 ,,__"భజన అంటే ,, డంబం లేని , నయా పైసా ఖర్చు లేని ,ఎలాంటి సాంకేతికత ఉపయోగించని హృదయ ఆవిష్కరణ !""
133,,__""భజన అంటే, ప్రయాస లేని, ఏ మాత్రం కూడా కష్ట పడే అవసరం లేని అత్యుత్తమ సామాన్య సాధారణ సామాజిక,ఆధ్యాత్మిక,సామూహిక  ప్రక్రియ !"
134,,__""భజన అంటే, భగవంతుని పట్ల ఇష్టం ,!ఒక  అంకిత భావం ,! ఫలితాన్ని ఆశించని నమ్మకం ,! నిష్కామ కర్మ యోగం ,!
135,,__""భజన అంటే,, భగవంతుని చేర్చుటకు అత్యుత్తమమైన  మహోన్నత మైన ,,మహిమాన్విత మైన ,,పరమ ఉత్కృష్టమైన ,, నిత్య పారాయణ యుతమైన భక్తిమార్గం !""
136,,__""భజన అంటే,, సాటి లేని మేటి ముక్తి ,భుక్తి ,శక్తి ,యుక్తి , సాధనా  మార్గం !"",
137,,__""భజన అంటే, భగవంతుని కి ఆహ్వానం!"" సూర దాసు జన్మతః అంధుడు !కానీ అతడి కృష్ణ భక్తి కీర్తనలకు ముగ్ధుడై, చిన్ని కృష్ణుడు , ఆ వృద్ద భక్త శిఖామణి  ముందు కూర్చుండి, ఆనందంగా విన్నాడు
138,,___""భజన అంటే, భక్తునికి భగవంతుడు దాసుడు కావడం !, భక్తుడు కోరినట్టుగా భగవంతుడు చేయడం ,!""
ఎక్కడ ఎలా ఉండమంటే అలా పరమాత్ముడు ఉండ డం !
పుండరీకుని నిరుపమాన మైన భజన , భక్తి తత్పరత ,, ఒక ఇటుక పైన పాండురంగడు వెలిసెలా చేసింది !;
139,,__""భజన అంటే, భక్త పోతన వలె అమృత భరితమైన  భాగవత పద్యాలు రచించడం !!", ప్రతీ పద్యం లో భగవంతుని స్వరూప రూప గుణ వైభవాన్ని అనుభవించి భక్త జనావళికి అందించడం !! అద్భుతమైన భక్తి పూర్వక రచనా పటిమ చేస్తూ, ఆ శ్రీ రామ చంద్రుడే  దిగి వచ్చేలా చేయడం ,! వాగీ శ్వరి సరస్వతీ మాత యే తన భక్తుని ముంగిట నిలిచి,తనను దుష్ట రాజుల పరం చేయవద్దని  దీనంగా వేసుకొంటూ ఉంటే ఆమెను ఓదార్చడం !"
140,,__""భజన అంటే, భగవంతుని శక్తి పై , ఉనికిపై ,నమ్మకం కలగడం ! సకల ప్రాణుల చర్యలను సాక్షిగా గమని స్తు ,నియంత్రణ చేసే అతడి సార్వభౌమ అధికారం పై  ఏ మాత్రం  అనుమానం లేక పోవడం ,అంటే నూటికి ఒక పాలు కూడా తక్కువ కాకుండా నూటికి నూరు పాళ్ళు భగవంతుని విశ్వసించడం  ,
భజన అంటే రాగం భావం సంగీతం సాహిత్యంతో  మాత్రమే కీర్తన చేయడం కాదు , ఏ ది చేసినా మాధవుని పై  మనసు పెట్టీ చేయడం ముఖ్యం
భజన అంటే భక్తి ,, భక్తి అంటే శరణాగ తి
అత్మ సమర్పణ భావం!""
స్వస్తి !"
హరే కృష్ణ హరే కృష్ణా !""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...