Saturday, February 8, 2020

ప్రాణాయామం  అంటే ?

ప్రాణాయామం  అంటే ?
Jan 19, 2020
_______&_______&__
"ప్రాణం "అంటే మనం పీల్చే గాలి,,!
గాలి పీల్చకుండా క్షణకాలం కూడా ఏ ప్రాణీ భూమిపై  జీవించ లేదు కదా,,!అందుకే గాలిని "ప్రాణ వాయువు," అంటాము !,
"జీవికి "ప్రాణం" ప్రసాదించే వాయువు ,!  అంటే ఆ వాయువు ను  లోనికి, బయటకు పంపిస్తూ, జీవులను జననం నుండి మరణం వరకూ శ్వాసింప జేస్తూ,, బ్రతికిస్తున్న వాడు ఆ పరమాత్ముడు!
, , ఈ విధంగా , మనకు కనపడకుండా  మనలో ఉంటూనే ,  మనల్ని నడిపిస్తూ ,,శ్వాసను అందిస్తూ , జీవన క్రియలను భరిస్తూ ,మనల్ని  జీవింపజేస్తు ఉన్న ఆ పరాత్పరుని దర్శించడానికి , కృతజ్ఞత తో  చేసే  అద్భుతమైన ప్రయత్నం ,; ఈ ప్రాణాయామం !
"యామం  "   అంటే మనలో చలించే  గాలిని కాసేపు ఆపడం ,,!
అందుకే ,,మనం జీవించడానికి నిరంతరం మనం  శ్వాసించే వాయువును , కొన్ని క్షణాలు అంటే కొన్ని సెకండ్లు ఆపడం అనే ప్రక్రియను "ప్రాణాయామం" అంటున్నాము
""ఎందుకు అపడం ?"" అంటే ,, , జీవన చర్యలు నిర్వహించడానికి కావల్సిన శక్తికోసం ,మనం ,తినే ఆహారం,త్రాగే నీరు , సోకే సూర్యకిరణాల ద్వారా  మనం కొంత శక్తిని పొందుతూ ఉన్నాము!
,,అలా పొందే శక్తి  కన్నా ఎన్నో రెట్లు శక్తి పొందడానికి ,, ఈ ప్రాణాయామం వల్ల ప్రాప్తిస్తుంది !!
,,మనం పీల్చే ,విడిచే గాలిని ఆపడం , వల్ల ఆ అద్భుతమైన శక్తి , లభించి,,అసాధారణ ప్రజ్ఞా వంతుల ను చేస్తుంది !!
అలాంటి వినూత్న  పద్దతి ద్వారా , శ్వాస క్రియ ను నిరోధించే ప్రయత్నం చేస్తూ ఉండే ఒక యోగ స్థితి వల్ల ,,
పూర్వకాలం లో యోగులు , సిద్దులు, ఋషులు ,,దైవాన్ని ఈ లోకం లో ఉండే  దర్శించారు ,!
ఇదే ప్రాణాయామప్రక్రియ  చేస్తూ,పొందిన అద్భుతమైన శక్తి బలం తో వారు  తపస్సు చేస్తూ,, వందల, వేల ఏండ్లు  ధరణి పై జీవించ గలిగారు ,!!
,,,"ప్రాణాయా మం " యొక్క అమోఘమైన ఉపయోగం,, ఏమిటంటే , మనసును చలించకుండా  దైవం పై  నిలపడం ,!""
ఐదు సెకండ్ల పాటు ఊపిరి బంధిస్తేనే  ,ప్రాణం విల విల లాడుతూ ఉక్కిరి బిక్కరి అయి పోతూ ఉంటుంది ,,,ఇంకా కాస్సేపు అలాగే ఉంటే" ,ప్రాణం పోతుందా, !""?అన్న భయం తో వెంటనే ముక్కు ను వదలి  గాలి పీలుస్తూ ""అమ్మయ్య !" అనుకుంటూ ,ఎంతో హాయిగా ఉంటాం !"
అలా ముక్కు ద్వారా గాలి రూపంలో, బయటకు  వెళ్లిన ప్రాణం ,శ్వాసను ఆపడం వల్ల అక్కడే ఆగి,, ఎంత కాలం నీవు శ్వాసించ కుండా  ఉండ గలుగుతా వో అంతవరకు ఉండి,,తిరిగి శ్వాసించి నపుడు లోనికి వెళ్ళి జీవునికి ప్రాణం పోస్తుంది ,!
ఇక్కడ ,మనం గమనించాల్సిన విషయం  ఏమిటంటే ,,గాలి పీల్చడం ,ఆపితే  ఇక మనసు కదలదు ! ఏ ఆలోచనా చేయదు ,!
ప్రాణాధారం గా  ఉంటున్న ఆ" శ్వాస "పైనే  మనసు పూర్తిగా "ధ్యాస "పెడుతుంది ,,, మరో ఆలోచన చేయకుండా !!
అంటే   "ఏకాగ్రత" కుదిరిన ట్టే కదా ,!
,,ఇంతటితో ప్రాణాయామం ప్రక్రియ  పూర్తి కాలేదు !
ఇదే ధ్యాసను ,మనసును ,, ఏకాగ్రత ను" భగవంతుని స్వరూప"" ఆరాధన కోసం వినియోగిస్తూ ఉండాలి !
,,ఆ విధంగా  చేసే ప్రాణాయామ ప్రక్రియ  అద్భుతమైన ప్రయోజనాన్ని ,అనందాన్ని ఆరోగ్యాన్ని ,,ఆయువును ,దైవిక శక్తిని అనుగ్రహిస్తుంది !
అయితే,ఇది అనుభవైక వే ద్యం ,!,భక్తునికి మాత్రమే విదితం అయ్యే "పరమ రహస్య ముగా గోచరించే దైవానుగ్రహం !!
ప్రాణాయామం లో దశలు మూడు !
1,, ఊపిరి ఆపుకోవడం ,!
2, ,,,మనసును నిలుపుకోవడం ,,!
3,  ,చిత్తాన్ని దైవం పై కేంద్రీకరించడం. !,,
,, ఈ రోజుల్లో అయితే  చాలా మంది ఈ విధానాన్ని చిన్నా పెద్దా, ఆడా మగా, అనకుండా ,అందరూ అభ్యాసం చేస్తూ "",,ఓమ్ కార ప్రణవనాదం"" తో  ఆనందంగా ఉంటున్నారు ;
,, చిత్తశుద్ది కోసం  ఈ యోగాన్ని ,రోజూ నిరంతరం అధ్యయనం చేస్తూ ఉన్నారు , కూడా !
తమ శ క్తి మేరకు,,కొందరు 5, మరి కొందరు 10 ,సెకండ్లు శ్వాసను  ఊపిరి తిత్తుల లో బంధించి ,మనసును దైవం పై నిలిపే ప్రయత్నం చేస్తూ, నిరంతర సాధన కొనసాగిస్తూ  ఉన్నారు ,!
ఈ యోగ ప్రక్రియ ద్వారా, తమ  ప్రాణ శక్తి ని మరింత గా పెంచుకుంటూ ,ఎక్కువ బలాన్ని ,సామర్థ్యాన్ని ,ధ్యాన సంపదను పొంద వచ్చు ను ,!
,, పరమ భాగవతో త్తముడు పరీక్షిత్తు మహారాజు గారు ,ఒకరోజు   వేట కోసం అడవికి  వెళ్ళి , దాహం తీర్చమని తపస్సమాధిలో లీనమై న ఋషి ని అడుగుతాడు,, కానీ, ఆ రాజు మాటను వినలేని అద్వితీయమైన ప్రాణాయామ సాధన లో ఉండి, దేహ ధ్యాస మరచి ,  పరమాత్మ సాక్షాత్కార వైభవం లో ఉండడం ,,తనను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న ఉద్దేశ్యం తో,, కోపంతో ,చచ్చిన పామును అతడి మెడ లో వేసి వెళ్ళి పోతాడు
, కానీ, ,ఇదంతా ఆ మహర్షికి తెలియ దు ! అనిర్వచనీయ మైన ,ఆనందకరమైన , అద్భుతమైన అతడి   ఆ  ప్రాణాయామ ప్రక్రియ,అతడి యోగ సాధనా బలానికి పరాకాష్ట గా ,,మనం చెప్పుకోవాలి !
అదే,ప్రాణాయామం  స్థితి కారణం గా ,ఎందరో సిద్దులు ,సాధ్యులు ఇప్పటికీ కైలాస శిఖర ,మానస సరోవర తీరప్రాంతంలో  అదృశ్యరూపంలో  తమ ఆత్మలో పరమాత్మను అనుసంధానం చేసి,నిరంతరం అదే ధ్యాస గా, అదే శ్వాస గా,, శరీర భావంతో నిమిత్తం లేకుండా పరమేశ్వర రూప ధ్యాన చిత్తంతో తాదాత్మ్యం పొందుతూ అతడి సన్నిధానం లో బ్రహ్మానందం గా   ఉంటున్నారు  ! కేదార్నాథ్ బద్రీనాథ్ హిమాలయ ప్రాంతాల్లో ఇదే ప్రాణాయామం చేస్తూ , మంచు కొండల్లో గుహల్లో తపస్సు చేస్తూ, ఆహార పానీయాలు , దేహ భావాన్ని మరచి. , వందల ఏండ్ల తరబడి  ఉంటున్న ఎందరో సాధువులను మనం చూడవచ్చును !
,, , శివరాత్రి పర్వదినం లో ,కుంభమేళా ఉత్సవాలలో , గయ,ప్రయాగ , కాశీ క్షేత్రాల్లో పవిత్ర గంగా నదీ స్నానం కోసం మైళ్ళ పొడవునా , బారులు తీరుతు  ప్రత్యక్షమయ్యే  లక్షలాది, అఘోరా లను ,, నాగ సాధువులను మనం చూస్తూ ఉన్నాం !,వారు  తమ అతీంద్రియ శక్తులను ప్రదర్శిస్తూ ఉండడం , వాయు వేగాన్ని  మించి ,పరుగులతో  వస్తూ ఉండడం ,ఆశ్చర్యకరమైన విన్యాసాలు  చేస్తూ ఉండడం ,లక్షలమంది ఒకేచోట ప్రత్యక్షం కావడం ,,అంతలోనే  ఒక్కసారిగా , కనబడకుండా పోవడం , అంతా వారి ప్రాణాయామ సాధనా పటిమ గా చెప్పు కోవచ్చును ,,!!
అలా నిరంతర అభ్యాసం తో  ప్రతీమనిషి,తన  జీవన కాలాన్ని మరింతగా పొడిగించి కు నే స్వర్ణ అవకాశం  సౌలభ్యం ,అదృష్టం కూడా  భగవంతుడు మానవునికి ప్రసాదించాడు !
  ఆ విధంగా ఎంతో శ్రమ పడుతూ, యోగి వలె ప్రాణాయామం చేసినప్పుడు  పొందే  భావ సంపదను,సత్వ గుణాన్ని ,నిజ జీవితములో కూడా  అన్వయించి చూపాలి ,!
అనగా , జీవితంలో ఎదురయ్యే  ఈర్ష్యా ద్వేషాలు,పగలు ప్రతీకారాలు , బాధలకు కృంగడం ,సుఖాలకు పొంగి పోవడం వంటి వికారాలకు లోనూ కాకుండా మనసును చిక్క బట్టుకునే ఆత్మ స్థైర్యం , మనో వికాసం , నిత్య జీవితంలో , అనుభవ పూర్వకంగా ఆలవరచు కుంటే తప్ప,, ప్రాణాయామం ఎంత చేసినా కూడా , నిష్ప్రయోజనం ,,!
నిరర్థక మనే చెప్పాలి. !,,సమాజానికి ఉపయోగించని అభ్యాసాలు ఎన్ని చేస్తే మాత్రం ఏం లాభం ??
__స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...