భజన అంటే 3
Jan 25, 2020
______&______&&____
భజన అంటే దేవుని గురించి పలికే వాక్కు ,!,చక్కని మాట మనిషికి ఒక అమూల్యమైన ,అపురూపమైన భూషణం ,అంటే దివ్యమైన "అలంకారం "వంటిది !
అందుకే ,,"వాక్ భూషణం, భూషణం !" అన్నారు మనిషికి. అడగకుండానే
,దేవుడిచ్చిన అనేక సంపద లలో మాట్లాడే అవకాశం అమోఘం ,,అద్వితీయం ! ,,84 లక్షల జీవ రాశుల్లో మనిషికి మాత్రమే ,ఈ అద్భుతమైన వరాన్ని ప్రసాదించాడు భగవంతుడు !
"నరం లేని నాలుక ," తో అప శబ్దాలు పలుకుతూ , ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలు మాట్లాడుతూ ,తోటివారిని ప్రత్యక్షంగా నో,,పరోక్షంగానో తిడుతూ, ,అవమానిస్తూ ,పవిత్రమైన దైవ భజన చేసే నోటిని , సప్త స్వరాల ను పలకడానికి అందమైన శబ్దాలను స్వరాలను పలికించడానికి ,,దైవ ,జ్ఞానాన్ని బోధించడానికి ఉపకరించే అందమైన నాలికను , చక్కని మంచి మాటలు మాట్లాడుతూ మానవత్వం పెంచుకోవడానికి బదులు ,,దుర్వినియోగం చేస్తూ జంతువు లా ప్రవర్తిస్తూ ఉంటే ,, ఆ జీవుడి అజ్ఞానానికి , పాప కర్మ సంచితంగా శిక్ష తప్పదు కదా !
""అయ్యో! ఈ మూర్ఖుడి కి నేను ఎందుకు ఈ మాట్లాడే సౌకర్యం ఇచ్చాను ?, మూగ వాడిని చేసినా బాగుండేది కదా !""అని , భగవంతుడు విచారిస్తూ ఉంటాడే మో !
ఈ నోటిగుం డా మధురమైన ఆహార పదార్థాలు సేవిస్తూ ఉంటాం కదా!
మరి అదే నోటితో మధురమైన మాటలు మాట్లాడకుండా చెడు మాటలు అనడం ,నాలికను అదుపులో ఉంచకుండా నోటిని దుర్గంధ భూయి ష్టం చేస్తూ , అపవిత్రం చేయడం ,ఘోర అపరాధం అవుతుంది కదా ,! లోనవున్న కుళ్ళును , దుర్గంధాన్ని బయటకు పంపించే ద్వారం గా నోటిని ఉపయోగిస్తూ చేస్తూ ఉండడం విజ్ఞత అనిపించుకోదు కదా !!
భక్త పోతన భాగవతం రాస్తూ ,పలికేది పలికించే ది ,పలుకబడేది అంతా భగవంతుని ఇచ్చానుసారం ,అతడి కృప వల్ల మాత్రమే జరుగుతోంది "" అన్నాడు,,! ఆ సత్యం బోధ పడాలి అంటే, భగవంతుని లీల గా అతడి సర్వ వ్యాపకత్వాన్ని గుర్తిస్తూ , ఈ శబ్ద ప్రయోగాన్ని ఆచి తూచి వాడుకుంటూ , మాటలను మంచి కోసం ఉపయోగిస్తూ వాక్కు లను భూషణం గా,భగవద్ ప్రసాదంగా , భావించాలి
,, అప్పుడు ఆ నోటి గుండా వచ్చే ప్రతీ పలుకు భగవంతుని పిలుపు అవుతుంది ,!
,అలాంటి వాక్కులు హరి నామ ఉచ్చారణ తో"హరి నామ భజన "ను తలపిస్తూ ఉంటుంది!
ఆ విధంగా అనుక్షణం మనం విడిచే శ్వాసలో , అదే ధ్యాసతో , వేసే ప్రతీ అడుగులో హరి నామ స్మరణ అనుకుంటూ ఉంటే ,అది భజన అవుతుంది !
రామకృష్ణ పరమహంస లాంటి కాళీ ఉపాసకులు నిత్యం ఆ దేవతను స్మరిస్తూ భజిస్తు తమ హృదయ అంతరాళం లో బ్రహ్మానందం అనుభవిస్తూ ఉంటారు
భజన అసలు స్వరూపమే ఆ ""పరమానందం !"".
అనుక్షణం భక్త హృదయం తో అనుభవింపబడే అద్వితీయమైన బ్రహ్మానందం , ఆ అనుభవైక వే ద్యం అయిన మానవుని తాదాత్మ్యం స్థితి అది !!
భజన అంటే ఒక మధురానుభూతి !! శరీరంలో ని సర్వావయవా లను స్పందింపజేసే దైవిక శక్తి,,!
భజన అంటే దివ్యత్వం ,దేవలోకం , తత్వమసి అనబడే వేద ప్రమాణం ,,
దైవాన్ని దివి నుండి భువికి రప్పిం చే మహా యోగ స్థితి,!
భజన అంటే ఒక రుచి,,! అది పారమార్థిక సంపద అయితే ,ఇక మిగతావి అన్నీ రసవిహీనం అవుతున్నాయి !
,,,భగవద్గీత లో గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు సూచించింది ఇదియే !
10.9
""మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్ ।
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ !!"
మనస్సులు నా యందే లగ్నం చేసి, వారి జీవితాలని శరణాగతితో నాకే అర్పించి, నచో ,,నా భక్తులు ఎల్లప్పుడూ నా యందే సంతుష్టులై ఉంటారు.
,,ఒకరినొకరు నా గురించి తెలుపుకుంటూ మరియు నా వైభవాల గురించి చర్చించుకుంటూ అత్యంత తృప్తిని, పరమానందమునూ అనుభవిస్తుం టారు,
,,,మనస్సు యొక్క స్వభావమేమిటంటే దానికిష్టమైన దానిపై అది లగ్నమై పోతుంది.దైవం యందు గాఢమైన అభిమానం పెంచుకోవటం వలన భగవంతుని భక్తులు ఆయనను గుర్తుచేసుకుంటూ స్మరించటంలో నిమగ్నమై పోతారు.
,,ఆయన పట్ల భక్తియే వారి జీవితానికి ఆధారంగా ఉంటుంది, దాని నుండే వారి జీవిత పరమార్ధం, లక్ష్యం, బ్రతుకేందుకు శక్తిని పొందుతారు.
, ఒక చేపకు నీరు ఎలా అవసరమో వారికి భగవత్ ధ్యానము అలా అవసరము ,అని అనుభవం ద్వారా గ్రహిస్తారు ,
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా!"
No comments:
Post a Comment