Saturday, February 8, 2020

శ్రీ సుందిల్ల లక్ష్మీ నరసింహ స్వామి వైభవం 4

శ్రీ సుందిల్ల  లక్ష్మీ నరసింహ స్వామి వైభవం ,_4
Jan 15, 2020
__________&________
శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి అంటే నాకు ఎనలేని  గురి, విశ్వాసం , భక్తి శ్రద్ధలు ఎందుకు కలిగాయో,స్వామిని  ఇష్టదైవంగా ,ప్రాణ సమానంగా కొలుస్తూ, ఆరాధిస్తూ ఉంటున్నానో , దేవాలయం లో జరిగే భజనలు ఉత్సవాలు ఎందుకు నన్ను అమితంగా  ఆకర్షిస్తూ ఉన్నాయో,, నాకు స్వామి వారి దివ్య మంగళ విగ్రహం ముందు  కూర్చుని ,, స్వామి పాద కమలాల ను చూస్తూ , ఉండగా పొందిన భక్తి భావంతో స్వామి వైభవాన్ని నోరారా స్తుతించా ను ,!
"" ,నరసింహ ! నీ దివ్య నామ మంత్రము చేత,,బలువైన రోగ ముల్ బాప వచ్చు!,,, అంటూ శ్రీ నారసింహ శతకము పద్యాలు వరుసగా తన్మయత్వం తో  పాడుతూ ఉంటే ,,అప్పుడు బోధ పడింది!!
స్వామి వారి దివ్యమైన నామమే ,,నా భర్త కు  కూడా లక్ష్మీ నరసింహ రావు అని ఉండడం నా కు మహా భాగ్యం  అయ్యింది !!
అంతే కాదు,, నా పెద్ద కొడుకు ,""నరసింహ జయంతి """రోజున నే జన్మించడం కూడా స్వామీ అనుగ్రహమే!  నరసింహు డే నా పెద్దకొడుకు రూపంలో వచ్చి, నాకు పునర్జన్మ ను ,బ్రతుకు పై ఆశను , ఆధారాన్ని అనందాన్ని అనుగ్రహించాడు , తన సంరక్షణ లో నన్ను ఇద్దరు తమ్ముళ్ళను ,, చెల్లెలిని ,, ప్రేమానురాగాల తో కనిపె డుతూ, అనుబంధం అందించి, తన కుటుంబం తో బాటు, వారి కుటుంబాల యోగక్షేమాలు కూడా  నిర్వహించి,నాకు మనః శాంతిని కల్పించాడు ,,
ఇదంతా ఈ దీనురా లి ప్రార్థన ను మన్నించి, స్వామి చేయించిన ఒక లీల !! 
,,స్వామి అనుగ్రహం వలన 
అలా రెండూ కలిసి వచ్చాయి,
,,అందుకే,,అనుకోని విధంగా, స్వామీ సన్నిధానం లో ఆశ్రయం పొందుతున్న నాకు ,"" శ్రీ లక్ష్మి నారసింహ స్వామి "" అంటే ఇంకా ఎక్కువ గా విశ్వాసం, గురి, ప్రేమ, భక్తి భావనలు  ఏర్ప డ్డాయి!!,
,, స్వామి భజన ,సేవ, అర్చన  అంటే ప్రాణం గా మారింది ,!ఎందుకంటే  మరొక కారణం , నా భర్త శ్రీరామచంద్రుని పరమ భక్తుడు కావడమే !! ,
ఆయన ,, కూడా తన భక్తికి చిహ్నంగా ,తన ఇష్ట దైవంగా భావించిన 12 సీతారాముల అందమైన  పెద్ద పెద్ద తైల వర్ణ చిత్రాలకు ,చక్కగా ఫ్రేమ్ కట్టించి ,తాను నిర్మించుకున్న  స్వంత ఇంటిలో  ముందు గల పెద్ద హాలులో గోడలకు  వ్రేలాడ దీసి  ,వాటిని చూసేవారికి భక్తి భావన ఏర్పడేలా చేశాడు!!
,అంతేకాకుండా ,,అనుదినం ప్రభాత వేళల్లో  మేల్కొని ,,ఆయన అమితానందం తో రామదాసు కీర్తనలు ,,మేలుకొలుపులు ,, భాగవత రామాయణ పద్యాలు  పరవశిస్తూ రోజూ గానం చేసే వాడు !!
దానికి తోడుగా  ,,తొక్కుడు హార్మోనియం వాయిస్తూ ,, వివిధ రాగాలలో అద్భుతంగా  తాళబద్దంగా  పాడుతూ ఉండేవాడు
ఆయన కంఠ,స్వరం, భజన, భక్తి పూర్వక కీర్తనలు అనుదినం సుప్రభాత సమయం లో  ఊరంతా వినబడేది ,, అంత బిగ్గరగా తనను తాను మరిచి పోతూ, రామ కీర్తన చేస్తూ, ఆ మాధుర్యం లో లీనమై పోయె వాడు ఆయన,,!
శ్రీ రామ నవమి, దసరా నవరాత్రి  లాంటి పండగ రోజుల్లో అయితే, రాత్రి 8 గంటలకు భజన ప్రారంభించి ,ఉదయం పొద్దు పొడిచే వరకూ నిద్ర పోకుండా , అలుపు ఎరుగ కుండా  కొనసాగించే వాడు !!
తనకు తోడుగా తబలా సహకారంకోసం ఒకరిని ,తాళం వేయడానికి మరొకరిని  ఊరివారిని ఎంచుకొని , వారితో బాటు తాను   , రామ భక్తి సారం తన్మయత్వం. లో  తాదాత్మ్యం పొందుతూ , అపర రామ దాసు వలె , దైవ భక్తి యే లక్ష్యంగా , భోగ భాగ్యాలు , అస్తి తగాదాలను లక్ష్య పెట్టకుండా కేవలం శ్రీరామ చింతనతో కాలం  గడిపాడు ,
తాను  ఒక సంగీత కారుడే కాకుండా ,చక్కని కవి కూడా ,.
స్వంతంగా ""ఆనంద రామాయణం"" గేయ కవిత సంపుటి రాశాడు కూడా!!
ఆయన రెండు చేతులతో అందమైన దస్తూరీ తో  సవ్యసాచిలా రాసేవాడు,! కుడి చేతితో ఎంత అందంగా ముత్యాల వరుస వలె గుండ్రంగా రాస్తూ ఉంటాడో , అంతే అందంగా ఎడమ చేతితో అక్షరాల లిపి రాసేవాడు,
నా భర్త గొప్పదనం గురించి చెప్పేంత భాష నాకు రాదు , ఆ యోగ్యత, చదువు, సంగీత జ్ఞానం తెలివి తేటలు , కూడా నాకు  లేవు,,!
రసభరితంగా పద్యాలు గేయాలు రాయడం ,వాటిని రాగరంజితం గా  మధురంగా పాడుతూ ఉండడం   ఆయన భక్తి ప్రపత్తులకు అది "" పరాకాష్ట ""అని చెప్పవచ్చును!
, త్రోవలో నడుస్తూ ఉండగా,, ఎ వరైన  ఆడవారు  తనకు ఎదురైతే , వారు కనుమరుగయ్యే. వరకూ తాను తలదించుకొని ఉండేవాడు !!అందుకే
ఆయన కి  ఊరువారంద రూ ఎనలేని గౌరవం , మర్యాద  చూపే వారు !!
అందుకేనేమో , తలిదండ్రులు తమ్ముళ్లు చెల్లెళ్ళు అందరూ ఒక్కటై , అస్తి కోసం  తనని కొట్టి నా తిట్టినా , మాటలతో ,చేతలతో బాధ పెట్టినా ,చివరకు తన ఇంటిలో నుండి తననే,పట్టపగలు అందరూ చూస్తూ ఉండగా, బయటకు నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టినా కూడా,ఆయన వారికి ఎదురు తిరగలేదు! కాని మాట  ఒక్కటి కూడా అనలేదు ,,! ఊరి లో గానీ బంధువులకు గానీ తన బాధ చెప్పుకోలేదు !,
ఆయన చాలా తెలివైన వాడు, !జ్ఞాని! మితభాషి ! గంభీర స్వభావి !!, అన్నిటికీ మించి భగవద్ భక్తుడు ! పెద్దల యెడ గౌరవం పిల్లల యందు ప్రేమ కలవాడు ! శత్రువు కూడా భరించలేని అంత, బాధను ,దుఖాన్ని, కష్టాన్ని కూడా , అంత సులభంగా  సహించే ఓపిక ఉన్న మనిషిని  బహుశా ఎవరూ ఎక్కడ కూడా. , చూసి ఉండరేమో ,అనుకుంటాను అంతటి స్థితప్రజ్ఞత ఉండటం,, ఏ రోజుల్లో అయినా  చాలా అరుదైన విషయం  కదా !!
""ఆయన మానవత్వం ముందు అతడి పాలివాండ్ల రాక్షసత్వం ఓడిపోయింది"' అని అతడి భార్యగా అందరి ముందు, సగర్వంగా తలెత్తుకు  చెబుతాను ; ఆయన భక్తి విశ్వాసం నాకు వరం గా మారినా,, కానీ, అతడి వినయ విధేయత లే అతడి బలహీనత అయ్యింది ,!, చేతగాని తనంగా మారింది,,!అతడి కుటుంబాన్ని బజారు పాలు చేసింది !!అతడి  భార్యాపిల్లలను  అనాథలను చేసి , దిక్కు లేని వారిని చేసింది!!
అందుకు నేను నా భర్తను తప్పు పట్టడం లేదు,!ఎందుకంటే ఇప్పుడు నేను కూడా నా భర్త అడుగుజాడల్లో నడుస్తూ,, అదే భక్తి సంప్రదాయాన్ని పాటిస్తూ,,  సహనం తో ఎట్టి విపత్కర పరిస్థితుల నైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం , గుండె బలాన్ని  ,స్వామి సన్నిధిలో అలవరచు కొన్నాను !
,,కష్టాలను ఇష్టంగా ,భగవంతుని ఆశీస్సులు గా ప్రసాదంగా భావి స్తు, నా కర్మకు సంపూర్ణ బాధ్యత నేనే వహిస్తూ ,, ఉంటాను,!
""స్వామీ ! లక్ష్మీ నృసింహ ! ఎన్ని కష్టాల నైనా ఇష్టంగా నీ ప్రసాదంగా నిన్ను స్మరించి సేవించి తరిం చే శుభ తరుణంగా, కర్మ ఫలితం అనుభవించే మహద్భాగ్యం గా ,,  చక్కని అవకాశంగా భావిస్తూ ఆ బాధలను సంతోషంగా  స్వీకరిస్తాను !
కానీ ,, పరందామా  ! పరమాత్మ ! పరాత్ప రా ! లక్ష్మీ నృసింహ !! నిన్ను కోరేద ,, వేడుకునేది,, ఒక్కటే!;
,,అదేమంటే ,, నీ సన్నిధిలో ఉంటూ, నిరంతరం కొనసాగే  నీ గురించిన భక్తి భావ సంపద ను మాత్రం ఎన్ని జన్మల కై నా సరిపోయే భక్తి జ్ఞాన వైరాగ్య భావ సంపదను మాత్రం  అనుగ్రహించు ! చాలు !
శరణు  లక్ష్మీనారాయణా !
శరణు లక్ష్మీ నరసింహ !
శరణు లక్ష్మీ రమణా !
శరణు! శరణు! శరణు !""
స్వస్తి !""
హరే కృష్ణ హరే కృష్ణా !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...