సర్వజ్ఞుడు అంటే ?
Jan 30, 2020
________&___&______
సర్వజ్ఞుడు అంటే సర్వమూ ,తెలిసిన జ్ఞానము ఉన్నవాడు !
మనకు కనిపించే నక్షత్రాలు ,నవగ్రహాలు సూర్య చంద్ర భూమి మొదలగు కొన్నింటిని గురించి కొంత మాత్రమే తెలుసు కుంటున్నా ము,,
కానీ ఇలాంటి సూర్య కుటుంబాలు,నక్షత్రాల పుంతలు ,గాలక్సీలు ఎన్నో ఈ విశ్వంలో ఉన్నాయి ,
కనీసం ఊహించే జ్ఞానము కాలము ,లేని ఈ సర్వ సృష్టి, స్తితి లయ కార్యక్రమాల గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు ,,వేదాలకు కూడా గోచరం కాని అనంతుడు ఆ పరమేశ్వరుడు ఈ సర్వజ్ఞుడు !!
విశ్వమంతా నిండి ఉంటూ ,అందలి సృష్టి రహస్యాలు తెలిసి,వాటిపై నియంత్రణ చేస్తూ , సార్వభౌమ అధికారం కలిగి ఉండడం !!
,,ఒకసారి ,,చిన్నికృష్ణుడు యశోదా మాతను ""అమ్మా! నాకు ఆకలిగా ఉంది పాలివ్వు !""అంటూ ఆమె కొంగు పట్టుకొని గట్టిగా క దలనీయకుండ అపుతాడు !
యశోద నవ్వుతూ,తాను చేసే పని ఆపేసి ,,కృష్ణయ్య ను ఎత్తుకొని , తనివితీరా ముద్దాడుతూ ,,పాలిస్తూ,, పరవశిస్తూ ఉన్న దృశ్యం రేపల్లె వనితలు చూస్తారు !! ఆహా !! ఏమి
ఈ మె అదృష్టం ??, ఈ ముద్దు కృష్ణునికి మా చనుబాలు ఇచ్చే మహా భాగ్యం , మాకు కూడా ఉంటే ఎంత బావుండేది ??,మమ్మల్ని కూడా , ఈ కృష్ణయ్య ""అమ్మా'!! నాకు పాలివ్వవే!!"" అంటూ ,,మా కొంగు పట్టుకొని అడిగితే ఎంత ఆనందమో కదా ""!""!అని తలపిస్తూ ఇండ్లకు వెళతారు !!
భగవంతుడు సర్వజ్ఞుడు కనుక ఇది గ్రహిస్తాడు !;, వెంటనే ,,ప్రశాంతంగా ఉండే బ్రహ్మగారి మనస్సు చేదరెలా చేస్తాడు ,!
విష్ణుమాయ కు లోబడని వారెవరు ?!!"
, బ్రహ్మ దృష్టిలో కృష్ణుడు ఒక సాధారణ బాలకుడు అనిపించాడు,, అలా భావించి,అవులను లేగలను , గోప బాలురను అందరినీ మాయం చేయడం ,కృష్ణయ్య ఆ స్థానంలో తానే గొల్ల పిల్లలు, అవు లేగ దూడలు రూపంలో అదే రేపల్లె గ్రామంలో అవతరించడం క్షణం లో జరుగుతుంది !!
,, , అలా కృష్ణుడు ఆ రేపల్లె వనితల ముద్దు బిడ్డడు అయ్యి ,,వారికి మాతృ వాత్సల్యాన్ని అందిస్తాడు!!వారి కోరిక తీరుస్తాడు , అలా తన భక్తుల మనసు గ్రహించి,అనుగ్రహిస్తూ ఉంటాడు ,
సాక్షాత్తూ ,భగవంతుడు తమ సమీపంలో ,,తమ కన్న కొడుకు వలె. ,తమ ఒడిలో ఉంటుంటే ,,వారి ఆనందం చెప్ప తరం కావడం లేదు ,! తనివి తీరడం లేదు,, బిడ్డలని గోవులను విడిచి ఉండలేక పోతున్నారు ,,
వారు అడవికి వెళితే తిరిగి వచ్చే వరకూ పిచ్చి వారిలా గుమ్మం ముందు, పడి గాపులు పడుతూ రెప్పలు ఆర్పకుండా,ఎంత రాత్రి అవుతున్నా ఎదురుచూస్తూ ఉంటున్నారు
రేపల్లె వనితల్లో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పు చూసి బల రాముడు ఆశ్చర్య పోతాడు, కాస్తా నిశితంగా పరిశీలిస్తే , అంతా కృష్ణ మయం గా అగుపుస్తు ఉంటుంది ,దానికి
కృష్ణయ్య,, తన అన్నగారి సందేహాన్ని చిరు నవ్వుతో నివృత్తి చేస్తా డు!!
ఇలా ఒక సంవత్సర కాలం గడుస్తుంది!!
అక్కడ ,బ్రహ్మ గారు,, కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దామని ,, రేపల్లెలో తొంగి చూస్తే ,,ఒక్క కృష్ణుడు కాదు !,, వేలాది కృష్ణులు, బాలురు, అవులు ,లేగ దూడలు రూపంలో ఆగుపిస్తూ ఉన్నారు ఆయనకి !!
నాలుగు తలల బ్రహ్మ కు మతీ పోయింది!!
""స్వామీ !నారాయణా! శరణు !!గోవిందా శరణు ,!
క్షమించు అపరాధి నీ !!""
అంటూ స్తుతిస్తూ తిరిగి యధా ప్రకారం అవుల మందలని గోపాలురను. కృష్ణయ్యకు అప్పగిస్తాడు !!
""సర్వజ్ఞ త్వం ""అంటే ఇది , !!
భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన సర్వాంతర్యామి తత్వం !!, శ్రీమన్నారాయణుడు అంటాడు,,
""నారదా !! . నా భక్తుల నిర్మల హృదయాలలో , ఎల్లపుడూ కొలువై ఉంటాను ఆనందంగా !!
నా భక్తులు పరమానందం తో చేసే గాన భజన ,నామ స్మరణ స్థలాల్లో నెలవై ఉంటూ, వారి యోగక్షేమాలు చూస్తూ ఉంటాను !""
అంటాడు నారాయణుడు!!
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""
Saturday, February 8, 2020
సర్వజ్ఞుడు అంటే ?
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment