Saturday, February 8, 2020

సుందిల్ల లక్ష్మీ నరసింహ స్వామి వైభవం 5

సుందిల్ల లక్ష్మీ నరసింహ స్వామి వైభవం , 5
Jan 16, 2020
__________
స్వప్నంలో న్ స్వామి చెప్పినట్టుగానే ,, కల ఫలించింది,కష్టాలు గట్టెక్కాయి,, దయవలన ,నా ముగ్గురు పిల్లలు నా కు దక్కారు  !
,,మా స్వంత గ్రామ లోనే స్వంత ఇల్లు నిర్మించి నాకు నిలువ నీడను  ఊరిలో గౌరవ మర్యాదలను కల్పించారు !
దాయాదుల ప్రభావం వల్ల పూర్తిగా  అస్తి దక్కక పోయినా ,భయం పోకున్నా కూడా, మా  పిల్లల అభివృద్ది, పెళ్లిళ్లు చక్కగా  జరిగాయి , ముగ్గురు కొడుకులు  నేను తమకోసం పడిన కష్టాలు బాధలను అర్థం చేసుకొని , కన్నతల్లి పట్ల చూపవలసిన ప్రేమను , బాధ్యతను చక్కగా నిర్వహించారు ,
,,సమాజంలో మంచి పేరు తెచ్చుకొని , సంపాదిస్తూ తమ భార్యా పిల్లలతో హాయిగా ఉన్నారు!
,, వారి తో బాటు,, నా కూతురు కూడా తన కుటుంబం తో సంతోషంగా ఉండడం అంతా  స్వామి దయ ,అపారమైన కరుణా కటాక్షాల వలన  శేష జీవితం తృప్తిగా ఆనందంగా భగవంతుని సేవలో తరిస్తూ గడిపే మహదవ కాశం లభించింది,,! విషాదం తో ప్రారంభమైన ,,దుఖ భూయిష్టమైన నా దుర్భర దుస్సహ జీవితం  , స్వామి కృపచే కొత్త మలుపు తిరిగి ,, ఇలా సుఖాంతం అవుతుందని, కుటుంబం లో సుఖ శాంతిని  నా కళ్ళతో చూస్తానని గానీ,, కలలో కూడా నేను అనుకోలేదు ,!
ఎవరి జీవితాన్ని వాళ్ళు హాయిగా గడిపే అవకాశం లక్ష్మీ నరసింహుని దయ వలన లభించింది,,
ముఖ్యంగా అనుదినం భాగవత పద్యాలు పాడటం చదువుతూ ,ఉదయం లేస్తూనే స్వామికి మేల్కొలుపు పాటలు మంగళ గీతాలు పాడుతూ తరించే విధంగా స్వామి నాకు భక్తి శ్రద్దలని  అనుగ్రహించాడు !!
,, అదే ధ్యాస, అదే శ్వాస అదే జీవిత లక్ష్యంగా ,నన్ను  అనుగ్రహించాడు  చేశాడు ,!
దానం ధర్మం ,నిత్యం దైవారాధన ,, హర హర మహాదేవ అంటూ ,శివాభిషేకం చేస్తూ తరించే భావ సంపదను , జ్ఞాన వైరాగ్య భావాన్ని అనుగ్రహించాడు స్వామి !
ఉడుత భక్తి లా , చంద్రునికి నూలు పోగు లా సుందిల్ల లక్ష్మీ నరసింహుని కి స్వర్ణ ఆభరణాలు  కానుకలు చేయిస్తూ, సమర్పిస్తూ ,,నాకున్న దానితో కొంత స్వామికి కైంకర్యం చేసుకున్నా ననే సంతృప్తి ని, సమర్పణ భావాన్ని నాకు  ప్రసాదించాడు ,,
,,స్వామి దివ్య దర్శనం తర్వాత నాకు నా జీవితంలో ,దేనికీ  బాధపడే అవసరం లేకుండా ,, నా  కుటుంబ సభ్యుల మధ్య, ఆనందాన్ని  సంతృప్తిని  ,పొందాను , అలా నా అంతిమ ఘడియ వరకూ ఎవరి మోతాదు లో లేకుండా బ్రతికే అనందాన్ని లక్ష్మీ రమణు డు నాకు  మిగిల్చా డు  పరమాత్ముడు ..ఇప్పుడు
నా కళ్ళముందు అందరూ ఆనందంగా ఉన్నారు
సంతృప్తిగా సంతోషంగా ముగిసిన నా జీవిత చర మ దశలో ,,లక్ష్మీ నరసింహ స్వామి ని స్తుతిస్తూ , అదే ధ్యాసగా శ్వాస విడి చే మహద్భాగ్యం నాకు కలిగింది ,,
నా పెద్ద కొడుకు చేతుల్లో, తాను ఆ రోజున చేసిన  నమక చమక  సహిత రుద్రాభిషేకం తీర్థం తెచ్చి,నా నోటిలో   పోసి ,నాకు జీవన్ముక్తి ని ప్రసాదించాడు ,
ఆ పవిత్రమైన తులసీ తీర్థం, శివ లింగం అభిషేక తీర్థం తో ,,నాకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి  స్మరణ తో  నా జీవాత్మ ,,పరమాత్ముని లో ఐక్యం అయింది 
దైవం పట్ల ఎంత విశ్వాసం ఉంటే  మానవ జీవితం అంత శుభాన్ని జయాన్ని ఫలితంగా ఇస్తుంది అనడానికి  , కష్టాల కడలిలో కొట్టుకు పోతున్న నన్ను దయతో  పాలించి, ఏ దిక్కు లేని నాకు  తాను ది క్కై , ఇలవేలుపు అయ్యి , ముక్తిని శక్తిని బ్రతుకు పై ఆశనీ , పరమాత్ముని సేవించాలనే అనురక్తి ని దైవభక్తి ని అనుగ్రహించిన ఆ లక్ష్మీ నరసింహుని అపార కృపా కరుణా కటాక్ష వీక్షణా లే. అందుకు  ప్రత్యక్ష నిదర్శనం !!
తన దయను  నాపై కురిపించి బ్రతుకును ఆనందమయంగా చేసినట్లుగా నే ,,స్వామి సమస్త ప్రాణి కోటిపై తన ప్రేమామృతాన్ని వర్షిస్తు,, దేశంలో ధరిత్రి పై సుఖ శాంతులు వర్షించాలని  ఆ దయామయుడు ఆపద్బాంధవుడు , శరణాగత వత్సలుడు , దేవాది దేవుడైన ఆ లక్ష్మీ నారసింహ స్వామిని ప్రార్థిస్తూ న్నాను,
,,, ఆ విధంగా నేను  నా అత్మ కు శాంతిని  పొందుతున్నాను !!
ఈ నా ఆత్మకథ  ప్రబోధం తో ,,ఇది చదివిన వారిలో ,ఎవరికైనా ,ఏ మాత్రం  దైవభక్తి ని, దైవానురక్తి ని కలిగించినా నా అత్మ శాంతిని కలిగించడం తో బాటు,, ఆ దైవం ఆశీస్సులు కూడా వారికి వారి కుటుంబాలకు మెండుగా నిండుగా  ఉంటాయి అని దీవిస్తూన్నాను.
శ్రీ సుందిల్ల గ్రామ లక్ష్మీనరసింహ స్వామికి జై !
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా !!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...