Saturday, February 8, 2020

కృష్ణ ప్రేమ 4

కృష్ణ ప్రేమ 4
Feb 1, 2020
_____&_________"
మనిషి నిజంగా స్వార్థ జీవి ,!, మరొకరి పై ఆధారపడకుండా  స్వతంత్రంగా బ్రతకలే డు,!
బాల్యం లో తలిదండ్రులు ,యవ్వనం లో భార్యా పిల్లలు ,వృద్దాప్యం లో స్నేహితులు ,బంధువు లు ఇలా సంఘం లో తిరుగుతూ , గౌరవం ఇచ్చి పుచ్చు కుంటూ జననం నుండి మరణం వరకూ ,ఒకరికొకరు సహాయ సహకారాలు అందుకుంటారు ,,
తప్పదు !
అంటే ,బంధం పెంచుకుంటూ , అస్తి పంచుకుంటూ ,ఒక రకమైన సంబంధం తో   కలిసి ఉంటారు ,
కాని, ప్రతీ పనిలోనూ స్వార్థం ఉంటుంది ,! ఉండి తీరుతుంది !
""ఎప్పుడు ఎవరితో ఏ రకంగా అక్కర ఉంటుందో"" అని  అందరితో సఖ్యంగా ఉండే ప్రయత్న చేస్తూ ఉంటాడు మనిషి ,!
పరస్పరం గౌరవించు కొంటూ,అంకితభావం తో  సేవ చేసే భార్యా విధేయులు , భర్తా విధేయులు , కన్నవారి ప్రేమకోసం ,స్నేహితుల సాన్నిహిత్యం కోసం తపిస్తూ సత్సంబంధాలు నిలిపే వారు ,ఉన్నారు !
కానీ, నిస్వార్థం తో,,ప్రతిఫలం ఆశించకుండా ,ఎదుటివారిలో దైవాన్ని చూస్తూ సేవించే వారు ,,ఇందులో ఎందరు ఉంటారు ?
కుటుంబం లో కొనసాగే ప్రేమలు ,,శక్తి ,డబ్బు ఉన్నంతవరకు కొనసాగుతాయి !!
కానీ ఇదే ప్రేమ ను పరమాత్మ పై సారిస్తే ,జన్మకు  ఒక అర్థం ఉంటుంది! ,సార్థక మౌతుంది ,,!
""కృష్ణుడు ""అంటే రూపం ,స్వభావం ,స్వరూపం , ఉండదు కదా !మరి  ఏ సంబంధం లేకుండా కృష్ణయ్య ను  ఎలా ప్రేమించేది ??
దీనికి జవాబు ప్రశ్నలో నే ఉంది,
ఏ రూపాలను స్వభావాలను ,సంబంధాలను చూసి,నీవు  వారిపై ప్రేమ చూపుతున్నావో , అవన్నీ  కృష్ణుని ప్రసాదా లే కదా !;
వాటిని , ఈ భూమి పైకి వచ్చే టపుడు ,, ఏ ఒక్కటీ కూడా ,నీవు వెంట తెచ్చు కోలేదు కదా,,!
ఈ కన్ను,  ఆ కంటిలో చూపు,, ఆ చూపుతో అనందాన్ని ఇచ్చే అందమైన   ఈ ప్రపంచ దర్శనము,,ఇవన్నీ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం , ప్రసాదితం,శుభ ఆశీస్సులు , దయా వీక్షణాలు కదా ! ఎన్నో కోరని  అద్భుత వరాలు !
చెవితో  వినడం,! ఈ శరీరం తో అనుభవిస్తూ , మనసు తో  ఆనందించడం !,,మాట్లాడటం !,శ్వాసించడం!  జీర్ణ క్రియ,రక్తప్రసరణ ,,అవయవాల పనితీరు,, మెదడు తో ఆలోచన ,ముఖ్యంగా జ్ఞానము,,  ఇవన్నీ నిరంతరం జరిపిస్తూ,నీలోనే సాక్షిగా ఉండి గమనిస్తూ  ఉంటూ, నిన్ను చివరి శ్వాస వరకూ జీవింపజేస్తు ,ఉన్న ఆ పరందాము ని మరవడం, ద్రోహం  ""కృ త గ్న త "అనిపించు కో దా ??
,,ఎవరి అనుగ్రహం వల్ల  మనం ఇవన్నీ ఉపయోగిస్తూ ఆనందంగా ఉంటున్నా మో ఆ స్వామిని గుండెల్లో పెట్టుకోవాలి !!
ఈ ప్రకృతి సంపద ,ఆస్తులు  అంతస్తులు, ఈ జీవితం అంతా ఆ శ్రీకృష్ణుని అనుగ్రహమే !
అందుచేత ,కృష్ణానుగ్రహం తో  సంతోషంగా జీవించగలిగే మనం , అత్మ బంధువు అయిన కృష్ణుని తో విడదీయరాని అనుబంధం పెంచుకోవాలి ,,!!
""భక్తి ""అంటే ఇది!,,దీనిలో త్యాగం ఉంటుంది , !స్వార్థం ఉండదు ,భావనలో పవిత్రత ఉంటుంది ,కల్మషం ఉండదు ,;;
డబ్బు ,,అందం,ఒంట్లో  శక్తి  ఉన్నంతవరకు అందరూ చుట్టాలే , అప్తమిత్రు లే,! అందంగా కనిపించే ప్రతీదీ, ఆ అందాల ఘన శ్యామ సుందరిని ప్రతిరూపాలు అని  కృష్ణ ప్రేమికులు గ్రహించాలి !!
చేతగాని వృద్ధాప్య దశలో తెలుస్తుంది తనవారు ఎవరో ,? అప్పుడు ఇప్పుడు , ఎప్పుడూ మనవాడు  ఆ గీతాచార్యుడు గోపాలకృష్ణ భగవానుడే !!
అందుకే శ్రీకృష్ణ భగవానుని పై  తరగని  ప్రేమకోసం ప్రయత్నించాలి !
ఇహానికి ,పరానికి ,ముక్తికి మార్గ దర్శనం చేసే కృష్ణ భజన లు చేస్తూ ,కృష్ణ ప్రేమను పొందే ప్రయత్నం చేద్దాం ,!
""భక్తి  యొక్క శక్తి ""అంటే ఏమిటో శ్రీకృష్ణ భక్తులు ,తమ నిజ జీవితంలో  ఇబ్బందులు ,అనుభవిస్తూ  నిరూపించారు !
భక్త మీరా బాయి,, శ్రీ,కృష్ణ చైతన్యభక్త  పరాయణ   చిత్తు రాలు ,  రాజరిక కుటుంబం లో జన్మించడం వలన , సామాన్య స్త్రీ గా ,జన సమూహం తో మమేకం కావడానికి  బహు  బాధలు పడింది ,
అతి సామాన్యురాలుగా జీవిస్తూ,అత్యంత వైష్ణవ భక్తురాలు గా  ""ఆ,కృష్ణుడు తన వాడే ,!ఇంకెవరి వాడు కాదు !""
అన్నంత గొప్పగా ""కృష్ణ ప్రేమ"" భావ సంపద ను నిరంతర సాధనతో , అంకిత భావంతో ,పవిత్ర బంధం తో , పొందింది,
,,ఆ  నీల మేఘ శ్యామ సుందరు ని ,స్మరిస్తూ ,, హరి గుణ గానం  కీర్తిస్తూ  బ్రహ్మానందాన్ని పొంది, చివరకు ,శ్రీకృష్ణ పరమాత్మ లో తాను లీనమయ్యింది. !!
భక్తుల జీవితంలో అన్నీ కష్టాలే  ,అనుకుంటాం ,మనం !ఇది అజ్ఞానం ! కృష్ణ ప్రేమికుడు అది భాగ్యం గా తలుస్తాడు ,!
భగవంతుడు భక్తుని వద్ద   నుండి ,,"నాది"" అనబడే వన్ని తీసుకుని, మోక్ష దాయకంగా   దైవానుగ్రహం ప్రసాదిస్తాడు !!
భక్తి అంటే భగవంతుని పై ఇష్టం !!
కానీ భక్తులు  మాత్రం వాటిని  కష్టం అనుకోరు ,! వాటిని ఇష్టంగా , దైవ ప్రసాదంగా ,తరుణోపాయం గా స్వీకరిస్తారు !
ఎందుకంటే  అలా అనుకోడానికి ,వారిలో "అహం "లేదు ,
ఆ ""నేను"" అనే వాడు పరమాత్ముని. కి  దాసుడై,, దాసాను దా సుడై ఉంటున్నాడు. !!
అలాంటి నిస్సంగుల కు , సత్వ గుణ సంపన్నులకు ,,బాహ్యంలో భావములో అంతా గోవిందుడు , గోచరిస్తునే ఉంటాడు!
""ఇంతకన్నా ఘనము ,ఇక లేదు !
సంతత సౌఖ్యము , ఆ జనార్ధ ను డే. !! ఇది కృష్ణ తత్వ సారం !!
జీవితాన్ని ఫణంగా పెడితే తప్ప ఈ భక్తి భావన రాదు !
మనిషి జీవితంలో , కుటుంబం లో సంఘం లో నిత్యం నటిస్తూనే  ఉంటాడు 
సత్యం మాట్లాడాలి ఎప్పుడూ,,కానీ ,అబద్ధాలు చెబుతాడు ,
కన్నవారిని ప్రేమతో చూడాలి ,, కానీ వృద్ధాశ్రమం లో చేరుస్తాడు ,
,,, ఆ నటనాగ్రేసర చక్రవర్తి ,, ఆ జగన్నాటక సూత్రధారి ముందు ఈ నాటకాలు సాగేనా ??
భక్తుడు చేసే ప్రార్థన సహజమా, నటనా అనేది, కృష్ణయ్యకు తెలియదా ?? ఇతరుల కన్ను గప్పవచ్చు ,, కానీ ఆత్మ సాక్షిగా , అంతర్యామిగా మనలో ఉండి,,జీవనచక్రం తిప్పుతూ ఉన్న గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుని కి,మనం ఆడే నాటకాలు  తెలియకుండా ఉంటుందా ??
జగన్నాటక సూత్రధారి ముందు మన నటన సాగేనా,?ఇలా మనం చేస్తున్న మోసం కన్నయ్య క్షమించేనా ??
, ఫలితంగా ,,అబద్ధాలు ,  ఆధర్మాలు,అహింస ,అపరాధాలు   మన జీవితంలో చోటు చేసు కుంటా యి,,అంటే పాప పుణ్యాల పెంట కుప్పలు పోగు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాము ,
వచ్చింది రత్నాలు ఏ రు కోడానికి కదా ! కానీ పనికిరాని రాళ్ళు పోగు చేస్తున్నాం ,సమయం జన్మ వృధా చేస్తూ !!
తాను పడే ఈ కష్టాలను అలా ఇష్టాలుగా , దైవానుగ్రహం గా భావించేవారు ,చక్కగా భగవద్గీత సారం తెలిసినవారు అయి ఉంటారు !!
,,బృందావనం లోని గోప స్త్రీలు అలాంటి పుణ్య స్త్రీలు !!
,వారు ,,పూర్వజన్మ సంస్కార బలం ఉన్నవారు కనుక  ""శ్రీకృష్ణ భక్తి రసామృత ప్రవాహం"" లో పరమానంద భరితులై ,తన్మయులై , ఆ భావ జలధి తరంగాల లో ఓలలాడి తరించారు!!
,,అక్రూరుడు , భీష్మ ఆచార్యుడు ,విదురుడు ,రుక్మిణీ దేవి,, కుంతి, అర్జునుడు లాంటి  ఏ కొందరో ,,శ్రీకృష్ణుని తత్వ దర్శనం చేయగలిగారు
కానీ ,,తమ ముందు నడయాడే శ్రీకృష్ణుడే,,
సాక్షాత్తూ పరమాత్ము డు అన్న సత్యం అర్థం కాని, వారూ,,,
శ్రీకృష్ణ అవతార రహస్యం తెలియని పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం, కురు వంశం  , భారత యుద్దం లో అమాయకంగా, హతమయ్యారు ,!!
,,అలా అర్థ రహితంగా అమూల్యమైన మానవ జీవితాన్ని  వ్యర్థం చేయకుండా ,శ్రీకృష్ణ పరమాత్ముని  భజిస్తు,,అందమైన మానవ జన్మను  ఆనందమయం గా .చరితార్థం  చేసుకుందాం
  బ్రహ్మాది దేవతలకు.  కూడా సులభంగా  గోచరం కాని,కృష్ణయ్యను గుర్తించాలి అంటే,, "గీత"" లో  శ్రీకృష్ణుడు చెప్పినట్టు  బ్రతకవలసి  చేయాల్సి ఉంటుంది !!
,కృష్ణావతారం లో చేసిన
లీలలు కృష్ణ మాయలు ,కృష్ణ గారడీలు ,నాటకాలు మరే అవతారం లో లేవు,,!
ఎందుకంటే ,రాబోయే  కలియుగం లో ఎన్ని అకృత్యాలు ,చుట్టూ జరుగుతూ ఉన్నా ,మనిషి నిబ్బరం, ఉంటూ,దైవకృప వల్ల  అసాధ్యంగా కనిపించే పనులను సుసాధ్యం చేసుకోవాలని  శ్రీకృష్ణ పరమాత్మ,, ముందుగా సూచిస్తూ ,అందుకు ""భగవద్గీత ""అనే అమృత వాహిని లాంటి  మార్గ  దర్శిని ని సకల మానవాళికి అనుగ్రహించాడు
,,కృష్ణ తత్వం అర్థం చేసుకోవడం అంత సులభం కాదు! ,వేదాలకు కూడా  అతడి లీలలను వర్ణించడం సాధ్యం కాలేదు ,!
కృష్ణ ప్రేమకు నోచుకోని వారు,, కృష్ణ లీలల అంతర్యం గ్రహించలేరు కదా!!
""కృష్ణానుగ్రహం "" లభించాలంటే ,,నోరారా ""కృష్ణా ,,కృష్ణా  ""!"అని పిలవాలి
ఎదుట  అగుపించే దివ్యమైన నీల మేఘ శ్యామ సుందర కృష్ణ రూపాన్ని  తనివితీరా చూస్తూ ,ఇతర సమయంలో ,కళ్ళు మూసుకొని  ఆ సౌందర్య రాశి  ని ఆత్మలో నిత్యం  ధ్యానించాలి !!
ఇలాంటి భాగ్యాన్ని ఎల్లప్పుడూ కరుణించు అని నందనందనుని ప్రార్థించాలి ,!
"" ఓ కృష్ణయ్య ! నీ కృప అనుగ్రహించు తండ్రీ ! సచ్చిదానంద స్వరూపుడ వు, !!లీలా మానుష వేష ధారి ! మురారీ ! శంఖ చక్ర పీతాంబర ధారి,,! శౌరి !   సకల భక్త జనావళికి నీ దయా దృష్టిని  వర్షించు !
సర్వే జనాః స్సుఖినో భవం తు !""
శరణు ! అచ్యు త
శరణు ! అనంతా
శరణు ! గోవిందా !
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...