Saturday, February 8, 2020

భక్తి స్వరూపం ఎలా ఉంటుంది ?

భక్తి  స్వరూపం ఎలా ఉంటుంది ?
Jan 31, 2020
_______&___
"భక్తి ""ఒక అద్భుతమైన దైవాంశ !
అది ఒక అనుభవైక వే ద్యము ,పరమానంద భరితము ,,అద్భుతము ,,అపురూపమైన దివ్యా నుభవం,!
యోగ శక్తి కంటే, భక్తి కివున్న శక్తి చాలా గొప్పది!
ఎందుకంటే భక్తి లో అహంకారం ,మమకారాలు  ఉండవు ,! అది అద్వితీయమైన భావ సంపద !"
ప్రతీ ప్రాణి దైవ స్వరూప మే ! ,
తనను అంత హింసించినా కూడా ,, ప్రహ్లాదుడు వినమ్రుడై ,చేతులు జోడించి  తండ్రితో అంటాడు,!
""ఆహా తండ్రీ,! నేను నిద్రలో, ఏమరుపాటు తో ఆ శ్రీహరిని ధ్యానించడం మరచినా కానీ, ,మీరు మాత్రం అహర్నిశలు ఆ కమలా కాంతు నీ, ఆ శంఖ చక్ర ధారిని, ఆ భక్త పరిపాలుని , ఆ జగన్నాటక సూత్రధారి ని మరవకుండ , విడవకుండా , కోపం తో నైనా గానీ  ,,నా కంటే ఎక్కువగా శ్రీహరిని స్మరిస్తూ ,, తలచుకుంటూ ఆ, పరమాత్ముని కృపకు పాత్రులు ఔతున్నారు కదా,!,
! భాగ్యం అంటే మీదే,!!ధన్యులు తండ్రీ మీరు!!
అంటూ నమస్కరిస్తా డు
అంతే కాదు,! తనని  ఏనుగులతో త్రొక్కించడం ,విష సర్పాలతో కరపించడం , పర్వతాల పైనుండి అగాధం లో త్రోసివేయడం  , సముద్రం లో పారవేయడం  వల్ల తనకు మరింత విష్ణు భక్తి పెరుగుతూ. వస్తోంది !  పరమ కృపాకరుడు ,,బ్రహ్మాండ నాయకుడు ,, ఆ శ్రీమన్నారాయణుని పై అమితమైన విశ్వాసాన్ని ,, భక్తి శ్రద్ధలు , చిత్త శుద్ది నీ ,కలిగించింది అంటాడు ,!
""తండ్రి,!, శ్రీమన్నారాయణుడి పై నాకున్న భక్తి శ్రద్ధ లకు , అగ్నిపరీక్ష లాంటి శారీరిక కష్టాలను కలిగించి  ,,నా మనస్సును   శ్రీహరి పాద కమలాల పై  లగ్నం అయ్యేలా చేశావు కదా !
,,,ఆపద్బాంధవుడు ,భక్తజన హృదయ మందారుడు , ఆ లక్ష్మీ నారాయణుని దరి జేరువారికి ఆపదలు ఆవేదనలు ఉండవు కదా !
   ""తన తనయుని  హరి వద్దకు జేరు మని ఈ విధంగా నిర్దేశించి మార్గదర్శనం చేసే వాడే  నిజమైన తండ్రి"" అన్న మాట నిజం చేశావు  తండ్రీ !!"",
నిప్పుల్లో  కాలిస్తే , బంగారం లోని మలినాలు తోలగినట్టుగా,నాలోని అరిషడ్వర్గాలు దూరం చేసి,, ఆ కరునాలోలుని  వద్దకు నన్ను చేర్చడానికి  నీవు ఎంత శ్రమ పడ్డావు తండ్రీ !""
కొడుకు పై నీకున్న  మమకారం , పుత్ర వాత్సల్యం చంపుకొని,శాశ్వతమైన పరమాత్ముని కృపకు నోచుకునే లా నన్ను అనుగ్రహించా వుకదా ,,!
ఆహా.! ,ప్రహ్లాద వరదుడు,, ఆ లక్ష్మీ నరసింహుని  ఒడిలో  నేను కూర్చునే మహా భాగ్యం నాకు నీ వల్ల లభించింది కదా తండ్రీ ,!,,,
నా మూలంగా  విష్ణు ద్వేషి వన్న నిందలు పడుతూ ,నీవు,దుర్భర మానసిక నరక యాతన అనుభవించి ,,చివరకు  ఆయన  అమృత హస్తాల అనుగ్రహం తో ,, చివరి ఘడియల్లో ఆ నారాయణుడి  కారుణ్య దివ్య నేత్రాలను దర్శిస్తూ  వైకుంఠ ప్రాప్తి ని ,,సాయుజ్యాన్ని  పొందావు,
ఆ భక్త వాత్సలుని కారున్యాన్ని  నీ కుమారుడి కి కూడా అందేలా చేశావు !
నీ దయ కాకపోతే, నాకు అమోఘం అద్వితీయం అపురూపం అయిన ,, ఆ లక్ష్మీ నరసింహా స్వామి ఆవతార దర్శనం  అంత సులభంగా నాకు ప్రాప్తించే ది  కాదు కదా !
, సాక్షాత్తూ , నా  స్వామిని,, ఆ వైకుంఠ వాసుని ,, లక్ష్మీ రమనుని రప్పించి ,,మోక్ష ప్రదాత వైనావు  కదా  తండ్రీ ,,నీవు !!
ఏమిచ్చి నీ ఋణం తీర్చుకున గలను  పితృదే వా !!""
అంటూ  పరమ భాగవత వైష్ణవ భక్తుడు ప్రహ్లాదుడు,,తన తండ్రీ యెడల కృతజ్ఞతా భావంతో అంజలి సమర్పిస్తూ,ఆనందంగా  అంటాడు ,,,
,,అలా తమను హింసించినవారి పట్ల కూడా , ఏ మాత్రం  ద్వేషం భావం తో చూడకుండా, వారినికూడా  దైవ సమానులుగా చూడటం నిజమైన"" భక్తి "అనిపించు కుంటుంది కదా !!
నాద బ్రహ్మ త్యాగరాజు , భక్త పోతన లాంటి మహా భక్తులకు కూడా ఆ కాలం లో పాలించే రాజుల వల్ల  అనుకోని ఆపదలు  వచ్చాయి !
కానీ వారు భగవంతుని పరిపూర్ణంగా నమ్మారు! కనుక వారి బెదరింపు లకు  వెరవలేదు! శ్రీరామ చంద్రుని పాద కమలాల ను విడువలేదు !;
అందుకే ,వారి రచనలు ,కీర్తనలు శాశ్వత కీర్తిని ఆర్జించాయి ,వారు పరమాత్ముని లో ఐక్యమయ్యారు
కృష్ణ ప్రేమ ను  పొందాలంటే , కృష్ణా, జనార్దనా, అచ్యుత,అనంత , గోవిందా అంటూ ఏ పేరున పిలిచినా చాలు , తానే యోగక్షేమాలు చూస్తాడు
హరే కృష్ణా అన్న ఒకే ఒక నామ స్మరణ తో జీవన్ముక్తి ప్రాప్తిస్తుంది ,
స్వస్తి
హరే కృష్ణ హరే కృష్ణా

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...