Saturday, February 8, 2020

శ్రీకృష్ణ ప్రేమానుభవం

శ్రీకృష్ణ ప్రేమానుభవం
Feb 5, 2020
_______&_______
మనకు ఏది అవసరం అనిపించినా, కష్టం వచ్చినా ,నేరుగా వెళ్లి  దేవుణ్ణి అడుగుతా ము,,! కోరికలు  కోరుతూ ఉంటాము,!సంతానం , అస్తి ఐశ్వర్యం , ఇలా ఎన్నో మొక్కులు , ,!ఉన్నదానితో తృప్తి పడకుండా !;
కానీ, ""ఓ పరమాత్మ ,! నాకు నిన్ను సేవించుకునే భాగ్యం ఇవ్వు,,! దానం చేసే బుద్దిని ఇవ్వు !""
అని  ఎన్నడూ సత్సంకల్పం చేయము కదా!
,,ఎందుకో ,,మనసుతో దైవ ధ్యానం ,మాటతో భజన ,చేతలతో ఆలయ దర్శనం  కైంకర్యం లాంటివి చేయడానికి మనసు పోదు,,!!
24 గంట లు, ఈ ,ప్రపంచం గురించి ఆలోచిస్తూ ఉంటాం,,!!బంధువు కుటుంబం ,ఆదాయం లాంటి వాటి కోసం తెగ తాపత్రయం ,,ఆవేదన, ఆరాటం ఆతృత పడుతూ ఉంటాం,!
""ఇన్ని ఇచ్చిన ఆ భగవంతుని కోసం ఒక రోజులో ఎంత సమయాన్ని కేటాయిస్తు ఉంటున్నాం అనేది  ఆలోచన చెయ్యం !!
,,ప్రపంచం గురించి వెచ్చించే సమయాన్ని దైవం కోసం వినియోగిస్తే అద్భుతమైన అనుభవం ఫలితాలు జీవితంలో కలుగుతూ ఉంటాయి !!
అలా చేయడం  వల్ల ,,భగవంతునికి  చేస్తున్న సేవకు ,రెట్టింపు ఫలితాన్ని పొందవచ్చు కూడా !!, అలా పొందే మధుర అనుభవాన్ని
మాటల్లో చెప్పలేం !
మత్తు మందు తాగేవారు అంటూ ఉంటారు
,,,""ఏముంది , ఆ పురాణం లో , అన్ని గంటలు కూర్చుండి వినడానికి ?!
ఏం వస్తుంది
,భజన చేస్తే ,??
ఏం లాభం ,జపాలు ,కీర్తనలు , విష్ణు సహస్ర నామ స్తోత్రం చేస్తే ?
ఇలా  హాయిగా మందు వేసుకొని ఎంజాయ్ చేయకుండా ,??""
అని అంటారు,,అనుకుంటారు,,, చాలా మంది!!
,,ఇక్కడ ఈ రెండు మత్తు లలో ఉండే
తేడా గమనించాలి , తలకెక్కిన ఆ మందుమత్తు  కాస్సేపటికి అదే దిగి పోతుంది,!,ఆరోగ్యం చెడుతుంది;, బుద్ది మందగిస్తుంది, !ఆయువు క్షీణిస్తుంది, ! మనిషి తాగుడు కు బానిసై , విచక్షణా జ్ఞానం మరచి ,,ఒక పశువు లా ప్రవర్తిస్తూ ఉంటాడు,!జ్ఞానం కోల్పోతాడు ,!అందులోనుండి తిరిగి బయట పడటం అసాధ్యం,!!
కుటుంబ నాశనం అవుతుంది తాగడం అలవాటు వలన, డబ్బు, నష్టం, , బ్రతుకు కష్టాల మయం అవుతోంది !!
,,,తినడం ,తాగడం ,తిరగడం  పడుకోవడం ,మైధునం అనేవి   పశుధర్మం ,!
కానీ , ఈ ""భగవంతుని పై ఇష్టం ""అనే మత్తు  మాత్రం ,,మనిషి ని దైవత్వం వైపు ఎదిగే ఉన్నత స్థాయి కి చేరుస్తుంది !
"బంగారం లాంటి  మనిషి జీవితం ఇచ్చిన ఆ దేవునికి ఏమిచ్చి రుణం తీర్చు కొనగలం చెప్పండీ ??
,""దైవం పై భక్తి ""అనేది ,,,దిగి పోయె ,, దిగ జార్చే నిషా లాంటి వస్తువు కాదు !!,అది అద్భుతంగా ఇంకా  దైవం పై  భక్తి శ్రద్ధలు పెంచుతూనే ఉంటుంది !!
మనిషి  ఇప్పుడు చేసే కర్మలు,వచ్చే జన్మకు బీజం వంటివి, అని గ్రహించాలి,,
పునర్జన్మ కు అంకురార్పణ చేస్తున్నట్టు గా భావిస్తూ, శ్రీహరి ప్రసాదంగా ,కష్టమైనా ,సుఖమైనా ఆనందంగా గడపాలి,,!
ఈ  భక్తి పూరితఅనందం శాశ్వతం ,! ముక్తి దాయకం ,! ఇలాంటి జీవిత ధ్యేయం ,జన్మ సార్థకం చేసుకోవడం ,అన్న మాటే !;
""మనిషి ,మనిషికీ  ఉన్న బంధాన్ని ఎప్పుడైనా   తెగిపోతుంది !;,
కానీ , భగవంతుని తో  ఏర్పడ్డ బంధం  మాత్రం జన్మాంతర సంబంధం ,!అది అఖండం !అపురూపం ,అమూల్యం !! ఒకసారి మనసు దైవం తో ఏర్పడే బంధం ,,, ఎన్నడూ తెగి పోదు !!
కృష్ణ భగవానుని ప్రేమలో  ఎంత మహత్తు ,మాధుర్యం , మధురా నుభవం ఉంటుందో ,  చూద్దాం !
బాల ముకుందుడు ,,మన గోవిందుని వద్దకు ,ఒకసారి  మన్మధుడు గర్వం తో మిడిసి పడుతూ వచ్చాడు,
""కృష్ణా ! నీవు నాతో యుద్దం చెయ్యాలి !!"
కృష్ణుడు నవ్వుతూ,అన్నాడు ,,""ఎవరవు నీవు  ??""అని
నన్ను మన్మధుడు అంటారు , మూడు లోకాల్లో నన్ను జయించే వారు లేరు,; శివ బ్రహ్మ ఇంద్రాదులు కూడా నాకు వశులై పోయారు!!తెలుసా ??""
కృష్ణయ్య గ్రహించాడు , అతడి పైత్యాన్ని ;;
""కానీ, నేను గొల్ల కాపరిని!,చిన్న పిల్లాడిని,! అసలు నాకు యుద్దం చేయడం రాదు!""
అయినా సరే ,నీవు నన్ను  ఎదుర్కొనాలి ! అని మొండిగా. అంటుంటే.
""ఎవరు చెప్పారు నీకు ,, నా విషయం ??""
""నాకు నారద మహర్షి చెప్పాడు !""
""ఓహో ! అదా సంగతి ;;అయితే సరే !""
""ఎప్పుడు ముహూర్తం, ఏర్పాటు చేస్తావు ??""
""ఇక్కడే బృందావనం లో ,,రాసలీల ఏర్పాటు చేస్తాను ,వేలమంది గోపికలు వస్తారు
అప్పుడు నీవు నాలో కామ వికారం కలిగిస్తే నీదే జయం!""
ఇక వెళ్ళి రా !"""
అన్నట్టుగానే
వచ్చాడు, !చూశాడు,
జగన్మోహన ఆకారం తో విరాజిల్లుతూ ఉన్న కృష్ణు ని ,,చూశాడు
అతడు మధురంగా మ్రోగించే భువన మోహన వేణు గానానికి పరవశిస్తూ ఉన్న  దేవతా స్త్రీలు, గౌరీ, వాణి, రాధా దేవి, గోపికలతో బాటు, దేవతల ను చూశాడు !
,,వారితో పరమేశ్వరుడు కూడా స్త్రీ రూప ము ధరించి ఆ రాసలీల లో తన్మయులై నృత్యం చేస్తూ పరమానంద భరితు డై ఉండడం చూసి,మన్మధు ని గర్వం తొలగి, అందరూ స్త్రీలే,, ""శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషోత్తముడు ""పరమాత్ముడు !""అని గ్రహించాడు ,
అనందం పట్టలేక ,,, తాను కూడా స్త్రీ వేషం ధరించి శ్రీకృష్ణుని అద్భుత సౌందర్యాన్ని , బృందావన సుందర దృశ్యాన్ని చూసి పరవశిస్తూ నాట్యం చేయడం లో లీనం అయ్యాడు ,, మన్మధుడు !
ఏ స్త్రీ  అయినా,,తమ భర్తను, మరే ఇతర స్త్రీ ప్రేమిస్తే  సహించదు !పైగా కోపంతో బాటు ఈర్ష్య ద్వేషం పెంచుకుంటారు  కూడా !!
కానీ , బృందావన స్త్రీలు అలా సాధారణ స్త్రీల వలె కాకుండా,, అందరూ  సమానంగా ఒకే శ్రీకృష్ణుని దర్శిస్తూ ఆరాధిస్తూ , కూడా ఎవరూ ఎప్పుడూ  అలాంటి ఈర్ష్యా భావం పెట్టుకోలేదు !
కారణం ,అందరికీ తెలుసు శ్రీకృష్ణుడు పరమాత్ముడు అని,!
శ్రీకృష్ణుడు అన్నాడు,వారితో,,
""మీరు వివాహిత స్త్రీలు! ,, కుటుంబం తో ,బాధ్యతలు చేపట్టి సంతోషంగా ఉంటున్నారు
అలాంటి మీరు, ఇలా మీ భర్తను విడిచి ఒంటరిగా ఈ అర్ధరాత్రి నా వద్దకు రావడం ఉచితం కాదు, తిరిగి వెళ్ళిపొండి !""
దానికి గోపికలు అన్నారు
""కృష్ణా,! నంద నందనా,!,, మాకు గల సందేహం నివృత్తి చేస్తావా ??""
""అడగండి ,?""
వారు అడిగారు
""ఒక స్త్రీ,, తన భర్త ఏదో పని మీద ఒక రెండు రోజులు ఊరికి వెళ్ళినపుడు, ,ఇంటిలో ,ఆమె అతని చిత్రాన్ని చూస్తూ  అతడు దగ్గర ఉన్నట్టుగా భావిస్తూ ఉండగా ,
భర్త వచ్చాడు, తలుపు తట్టాడు,,!
ఇపుడు ఈవిడ తలుపు తీయాలా ,,అసలు భర్త కోసం,??
, లేదా భర్త  నకిలీ  చిత్రాన్ని చూస్తూ ఉండాలా ??""
కృష్ణయ్య నవ్వాడు
,"" భర్త ,తన సమక్షం లో  ఉండగా ,ఇక అతడి చిత్రాన్ని పూజించడం , ఆమె  తప్పు  అవుతుంది !""
""అవును కదా,! ఆ ధర్మాన్ని మేము  ఇప్పుడు పాటిస్తూ ఉన్నాం, కృష్ణా !! నీవు జగత్పతి విc! నీవు,పతులకు , పతివి!! నీవు, మా ప్రాణం !, మా జీవం!,భావం , !మా సర్వస్వం నీవు కృష్ణా !!,
నీ వేణు గానం మా హృదయాల్లో బ్రహ్మానందాన్ని కలిగిస్తూ, ఏ పనీ, ఏ ఆలోచన చేయనీకుండ నీ స్వరూప చింతనా భావం లో లీనమై, నీవు లేకుండా శ్వాస కూడా విడవలేని ,దుర్భర విరహ వేదనను పొందుతున్నాము కృష్ణా !""మా యందు దయ ఉంచి, మా మొర ఆలకించి,,
మాకు గల ఈ సంసార భవ బంధాలను తొలగించి, నీ అపురూపమైన పరమధామాన్ని  అనుగ్రహించు!! పరమాత్మా మమ్మల్ని ,కటాక్షించు స్వామీ,, పరాత్పర !"" ,అని కోరుకుంటారు ,
ఆ నింగిలో చంద్రుడు క్షీనిస్తాడు ,,కానీ మా కృష్ణ చంద్రుడు మాత్రం ,, కోటిచంద్ర ప్రభలతో విరాజిల్లే పరమాత్ముడు ,! శతకోటి మన్మధాకారుడు ,! జగన్మోహనాకారుడు  !
అని ప్రణమిల్లుతారు గోపికా స్త్రీలు ,గోవిందుని చరణ కమలాల ముందు !!
ఇలాంటి పవిత్ర భావన ,,నిర్మలమైన వారి ప్రేమకు,, యశోదా నందనుడు వారికి తరగని , శాశ్వత ఆనం దాన్ని అనుగ్రహించాడు. 
భగవద్గీత లో శ్రీకృష్ణ భగవానుడు అంటాడు,
""నా భక్తుని విడిచి  నేను ఉండ లేను,,!"అని,,,!
,"" జీవన దాత ,,మోక్ష ప్రదాత ,,విధాత, ,అయిన అలాంటి  కృష్ణభగవానుని ,మరచి , అతని తోడు విడిచి ,, ఆనందంగా ఉండాలని అనుకోవడం  అపరాధం కాదా,,??
,,మేలు చేసిన వాడి పట్ల కృతజ్ఞత చూపడం, విజ్ఞత అనిపించు కుంటుంది కదా !
కృష్ణా! నిన్ను నిరంతరం తలచి తరించే భావ సంపద ను అనుగ్రహించు తండ్రీ!,రాధా మాధవా ! గోపీ మనోహర! జనార్దనా! ముకుందా! మురారీ,! యమునా తీర విహారి!
శరణు!శరణు !శరణు !
స్వస్తి ;
హరే కృష్ణ హరే కృష్ణా

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...