Saturday, February 8, 2020

సుందిల్ల , గ్రామ లక్ష్మీ నరసింహ స్వామి వైభవం 6

సుందిల్ల , గ్రామ ,లక్ష్మీ నరసింహ స్వామి వైభవం 6
Jan 17, 2020
___________________
"నేనొక శాపగ్రస్తు రాలి ని,! ,దేవుడు నన్ను కష్టాల కడలిలో మునిగి తేలే గీతను  అదే "మహా భాగ్యం" అని తలచే అదృష్టాన్ని నా నుదుట  రాశాడు !
ఆ మాటకొస్తే అందరూ కూడా తమ ""పాప కర్మ"లనే శాపాల చే  బంధింపబడి బ్రతుకు తున్నవారే కదా !
అయినా ఎవరి కష్టాలు వారికే గొప్ప ,!;సీత కష్టాలు సీతకు , పీత కష్టాలు పీత కూ గొప్ప కదా!!
నేను పుట్టడం  ,మెట్టడం  భాగ్యవంతుల ఇండ్లలో నే అయినా , బాధలను అత్మ బందువులు గా చేశాడు ఆ పై వాడు ,!
కష్టాల పరంపర లో భాగంగా , ఒక్కొక్కటి చెప్పాలంటే,,
1 ,కరెంటు ,ఫోన్ రవాణా లాంటి సౌకర్యాలు రాని పాతకాలం రోజుల్లో 1915 సంవత్సరం లో ఆడజన్మ నిచ్చాడు ఆ కనపడని  వాడు,!
1) - ఎనిమిదేళ్ళ  వయసులో బాల్య వివాహం  చేశారు ,,,మొగుడు అంటే ఎవరో, అత్తారిల్లు అంటే ఏమిటో తెలియని అజ్ఞాన అమాయక  చిన్న వయసు లో నే ,నాకు ఇక ప్రారంభమై నాయి కష్టాల దొంతరలు !!
2', ) గోదావరికి ఈవల అత్తగారిల్లు ,ఆవల తల్లిగారి ఇల్లు మద్య   బండ్ల దారి ,అడవి ప్రాంతం , అంటే అమ్ముకున్న వస్తువు లా రాకపోకలకు నోచుకోలేదు నేను !అది నా దౌర్భాగ్యం !
3, ) లంకలో విభీషణుడు వలె ఉన్న  మొగుని మంచితనం తప్ప ,, రాక్షస తత్వం గల అత్తామామలు ఆడబిడ్డల పోరు , మరదు ల కోపాలు ,ఆస్తి గురించిన పోరు ల మధ్య నేను సమిధగ మారాను,!కనికరం రవంత కూడా నోచుకోని నేను కలవారి ఇంటి బిడ్డను కావడం మరింత నేరంగా ,మారింది !! చీటికి మాటికి రాచి రంపాన పెట్టే అత్తా ఆడబడుచుల హింసల మధ్య,,,తిండికి తిప్పలు పడుతూ ఘోర నరకంగా , దిన దిన గండంగా మారింది  ఆ ఇంటి నా పెద్ద కోడలు తనం!! 
4 ),దీనికి తోడుగా,నేను  ఐదుగురు బిడ్డల తల్లిని కావడం ,,మరెవ్వరికీ కాకపోవడం మరో చేయని నేరం  అయ్యింది !
5, ) నా భర్తను ఎన్నో సార్లు, అస్తి భూమి తగాదాల పట్టింపు తో ఇంటిలో నడిమి గుంజకు కట్టేసి దారుణంగా  నా ముందే హింసించిన పరమ కిరాతకులు మా మర దు లు ,!దాన్ని వినోదంగా చూస్తూ ఉన్నారు ఆడబిడ్డ లు అత్తామామలు !
6)  ,దాయాదుల పోరు ,కౌరవ పాండవులు ద్వేషం వలె ఉదృతం అయ్యి ,మమ్మల్ని మేము కట్టుకున్న ఇంట్లో నుండే పట్టపగలు ఊరివారు అందరూ చూస్తుండగా  నడిరోడ్డుపై తరిమి వేసిన కటినాత్ములు మా అత్తా మామలు  !
6,) దిక్కు లేని అనాథల వలె  అక్కడే చిన్న పూరి గుడిసెలో తలదాచుకున్నా ము , ఏ నిమిషాన ఏం చేస్తారో అనుకుంటూ మేము మా పిల్లలు ,,!
అప్పుడే దాపురించింది నా భర్తకు పక్షవాతం లాంటి ఘోర వ్యాధి ,! పల్లెటూరు ,లో ఆ రోజుల్లో వైద్య  వసతి లేక,, ఈ రాక్షసుల అమానుష కృత్యాలకు భయపడిన  ఊరివారి ఆదరణ కు ,కూడా  నోచుకోక ,తల్లిగారి పంచన చేరడం, తారస్థాయికి చేరింది మా కష్టం!!ఇదే  కష్టం ,, చివరకు కాష్టం గా మారింది
7, ) తలిదండ్రుల కోసం ,తోబుట్టువుల కోసం అంటూ దీనంగా విలపిస్తూ, చావు బ్రతుకుల మధ్య కొన ఊపిరితో  నా భర్త బాధపడుతూ ఉన్నా కూడా, ఎవరూ రాకపోతే అదే ఆవేదనతో అశువులు బాశాడు నా భర్త , చచ్చాక కూడా ఓదార్పుకు కూడా రాలేదు ఆ నర రూప రాక్షసులు !!
8) , చివరకు కన్నతండ్రీ శవానికి కూడా నిప్పు అంటించే వీలు లేకుండా , మా పెద్ద కొడుకును రానీయకుండా  దూరం చేశారు ఆ పాపాత్ములు !!,
9,) చెడి పుట్టింటికి పోవద్దు అని ఊరకే అన్నారా ,? భర్త ను కోల్పోయిన భార్య  జీవితం,, ఆ రోజుల్లో అయితే  నరక ప్రాయం  అయ్యింది
10 ) ఏదో నా తల రాత అనుకుంటూ ఉన్న తరుణంలో , నా రెండు కాళ్ల కూ రెండు పుండ్లను అంటగట్టి  కుష్టు వ్యాధి పేరు తో  బాధ పెడుతూ నాపై తన కసిని తీర్చుకున్నాడు ఆ దయలేని పై వాడు,!,
10, ) ఆ వ్యాధి పేరు చెబితేనే గజగజ వణికే రోజుల్లో నన్ను  మా వాళ్ళు అందరూ వెలివేశారు దూరంగా ఉంచారు నన్ను నా పిల్లల్ని
11) ,ఈ మానసిక శారీరిక బాధల తో భరించలేక ,బయటకు రాలేక ,ఎవరికీ మొహం చూపించలేక , అటు  విషం తిని చావలేక ,దగ్గరలో ఉన్న గోదావరిలో దూకలేక ,ఇటు నన్నుఅంటి పెట్టుకొని ఉన్న పసితనం వీడని ఇద్దరు అమాయక  కొడుకులను ఇంకా అనాధలుగా మార్చ లేక  , ఏం చేయాలో అర్థం కాక  రోదిస్తూ ,రాత్రీ పగలూ తల్లిగారి ఇంటి వెనక సిగ్గుతో  అనుక్షణం చచ్చి పోతూ ,ఎవరికీ కనబడకుండా మొహం దాచుకుంటూ,, కుమిలిపోతూ  ""ఇంకా ఎందుకు బ్రతికిస్తు ఉన్నావు రా దేవుడా"" అనుకుంటూ ఎంత  ఏడ్చా నో ఆ పరమాత్ముని కే ఎరుక !
12 ) నా బాధ చూడలేక , నా పెద తమ్ముడు ,నా దుస్తితి కి దుర్దశకు జాలిపడి ఏ , దిక్కూ లేని వారికి "దేవుడే దిక్క"ని , నన్ను ఇదిగో  , ఈ రామగుండం కు సుదూరంగా ఉన్న అడవి ప్రాంతం లో ,,గోదావరీ తీర ప్రాంతం లో స్వయంభువు గా  వెలసిన  ఈ సుందిల్ల గ్రామంలోని  శ్రీ లక్ష్మీ నరసింహు ని  సన్నిధానం లో చేర్చాడు .!
11 దూరంగా గ్రామం , గుడి చుట్టూ పొలాలు , నక్కలు ఎలుగు బంట్ల సంచారం,నిర్మానుష్యంగా పగటి వేళలో నే భయమనిపించే ఒంటరి వాతావరణంలో  నా సన్యాస ప్రస్థానం ప్రారంభ మైంది !
,,, అర్ధరాత్రి ,గర్భగుడిలో వెలిగే చిరు దీప కాంతులు తప్ప , కటిన శిలల పై ,. కరెంటు లేని ఆ చీకటి  రోజుల్లో  స్వామి సన్నిధానం లో రాత్రి చీకట్లో  పడుకోవడం ఒంటరిఆడ దాన్ని  ఇద్దరు చిన్న పిల్లలతో గడపడం దుస్సాహసం అయ్యింది కానీ నాకు వేరే గతి లేదు ! అక్కడ కూడా ఈ వ్యాధి కి భయప డ్డారు ,
వైద్యం లేదు, లక్ష్మీ నరసింహుని సేవయే వైద్యం ! అయ్యింది !!
  అలా ,, ఆ ఊరి వారి దయా దాక్షిణ్య రోజుల పై , స్వామి పై సంపూర్ణ భారం వేసి  స్వామి కృప పై అధారపడుతూ కష్ట పడ్డాం. !! ఇద్దరు పిల్లలతో  వండు కుంటు ,,ఒక పూట తింటూ,, కటిన శిలల పై పడుకుం టూ, చన్నీళ్లతో స్నానం చేస్తూ ,బ్రతకాలి కనుక ఏదో తింటూ,,ఉన్నాం !!ఈ విధంగా ,,ఇలా సన్యాసి జీవితం గడిపేందుకు, ఈ దేవుడు,నాకున్నవన్ని  అన్నీ లాగేసుకుని , ఈ శరణాగతి వ్యవస్థను. మాకు ఏర్పాటు చేశాడా అనిపించింది ,!
13)  ఇక్కడ ఉండడానికి వచ్చే వారు ,నా వలె  దిక్కు లేకుండా ,ఉండే మనస్తిమితం లేని వారు ,ఘోరమైన దీర్ఘకాలిక రోగాల బాధితులు ,,అనాధలు ,,వైద్య సౌకర్యానికి నోచుకోని పేదలు , అడా మగా, చిన్నా పెద్దా అనకుండా ,, నా వలె  స్వామిని శరణు కోరుతూ ఇక్కడికి  వస్తూ  పోతూ ఉండేవాళ్ళు ,,నాకు పరమ బాంధవులు  ,ఆత్మీయులు అయ్యారు ,!
14)  నా జీవిత పరమార్థం , నా బ్రతుకు కు . ఒక అర్థం   బోధపడింది ఇక్కడే ,!! నా మనసుకు  శాంతి దొరికింది ఇక్కడే ,!!, జరిగినదానికి కృంగకుండా ,,జరిగేదాని గురించి ఆలోచింపచేసింది ఇక్కడే !
నా  కర్తవ్యం ఏమిటి ? అన్న జటిల ప్రశ్న కు  మార్గ నిర్దేశం చేసింది ఇక్కడే ,!
,పడుతున్న కష్టాలను.  ఇష్టంగా ,దీక్షగా , అలవాటు చేసుకుం టూ , లక్ష్మి నార సింహుని దయ పై ప్రేమను  అమితంగా పెంచుకున్న ది ఇక్కడే!
, నా బ్రతుక్కుఒక  దశ ,దిశ నిర్దేశం జరిగింది ఇక్కడే. ,! ""దేవుడు ఉన్నాడు,, నన్ను , నా పిల్లల్ని  చూస్తున్నాడు, కష్టాలు ఇస్తూ,, గతజన్మ పాపాలను క్షాలనం చేస్తూ ఉన్నాడు, అనే ప్రగాఢ విశ్వాసాన్ని ,,నేను  పొందింది ఇక్కడే!!
పిలిస్తే పలికే ఈ నా ఇష్టదైవం ,అలా నా మనసును తేలిక పరచింది ఇక్కడే!
15)  , ఇక్కడి గ్రామ ప్రజల భక్తి భావాలు , గౌరవ మర్యాదలు ,స్వామి మూల మూర్తి వైభవం ,నాకు నా ఆవేదన ల నుండి విముక్తిని ప్రసాదించా యి ,!
,, రోజూ క్రమం తప్పకుండా, రాత్రీ పగలూ అనకుండా,నిత్యం భజన చేస్తూ ఉండటం ఇక్కడి గ్రామస్తుల  సంప్రదాయం గా ఉంది,, ! అలా,ఏటా ఈ స్వామి సన్నిధిలో,అద్భుతంగా  భజన సప్తాహా లు నిర్వహిస్తూ ఉండడం  ఈ లక్ష్మీ నారసింహ దేవాలయం ప్రత్యేకత ,విశిష్టత !.. భజన బృందాలు ,, సమూహాలుగా ,,స్వచ్చందంగా వచ్చి ,,పోటీలు పడుతూ ,,మేళతాళాలతో స్వామి సేవలో పాల్గొంటూ ఉండడం  స్వామి పట్ల వారికున్న నమ్మకానికి నిదర్శనం !! వారి భక్తిపూర్వ క కార్యక్రమాలను ప్రత్యక్షంగా దర్శిస్తూ ధన్యత చెందే అదృష్టాన్ని శ్రీ లక్ష్మి నరసంహస్వామి దయ వలన  నాకు ప్రాప్తించింది ,!! ఏకాదశి  లాంటి పుణ్య తిథి రోజుల్లో, భజన పరులు ఆనందంగా  భక్తి భావంతో రాగ తాళ యుక్తంగా ఆడుతూ, పాడుతూ గంతులు వేస్తూ స్వామి సుందర దివ్య మంగళ విగ్రహం ముందు గల విశాల ప్రాంగణం లో   నాట్యం చేస్తూ,, అనందిస్తువుంటారు. ,, ఎందరో దూర ప్రాంతం నుండి వస్తూ,  తమకు గల స్వామి భక్తిని చాటుకున్నారు , ఆ ఏడు రోజులూ ఆగకుండా,భజన నిముషం కూడా , ఆపకుండా స్వామిని కీర్తిస్తూ తమ గళ మాధుర్యాన్ని నైవేద్యంగా నివేదించి , తమ జీవితాన్ని అనంద మయం గా సార్థకం చేసుకున్న ఎందరో మహానుభావులు , లక్ష్మీ నరసంహస్వామి భక్తులు!!! నాకు భక్తి జ్ఞాన వైరాగ్య వైభవాన్ని అనుగ్రహించా డు స్వామి!!
,అలాంటి వారి పాద పద్మాల కు నా శిరస్సు తాటించి ప్రణామాలు సమర్పిస్తూ , నా శేష జీవితం కూడా ఇలాగే స్వామి వారి సేవలో తరించే విధంగా జీవించాలని కూడా సంకల్పిం చుకుంటున్నాను  కూడా ,!!
ఎవరికీ చీకట్లు కలకాలం  ఉండవు కదా !కష్టాలు కూడా లక్ష్మీ నరసంహస్వామి స్వామి అనుగ్రహమే, కదా !! స్వామి దివ్య ప్రసాదాలు , స్వామిని దరి జేర్చే అద్భుత సోపానాలు గా భావిస్తే. భగవంతుని కరుణ మరింత త్వరితంగా  మనల్ని దన్యుల ను జేస్తుంది , కదా
హరే కృష్ణ హరే కృష్ణా !
_____

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...