Saturday, February 8, 2020

భజన అంటే ?

భజన అంటే ?
Jan 17, 2020
______'&________
1__"భజన అంటే ,,భక్తునికి, భగవంతునికి మధ్య ఉండే విడదీయరాని దివ్యానుబంధం ,!""
"2__"భజన అంటే , భగవంతుని పై మనకున్న ఎనలేని ప్రేమ!ఉత్కృష్టమైన ఈ, మానవ జన్మ ఇచ్చినందుకు, నోరు విచ్చి హరినామ కీర్తన చేసే యోగ్యతను అనుగ్రహించినందుకు, మనం   దైవం పట్ల చూపవలసిన కృతజ్ఞత ,!""
3,_"భజన ఆత్మ సాక్షాత్కార వైభవం !"
"4__"భజన అంటే ,,దైవ ప్రీతి, ! అద్భుతమైన పరమానంద స్తితి!!""
5__""భజన అంటే,,, ఈ సంసార సాగరం నుండి  వేరు పరచి,  జీవుడిని భగవంతుని సన్నిధికి చేర్చే నావ !""
6__"భజన అంటే,, బ్రహ్మానందం ,!
7,__""భజన అంటే,, తాదాత్మ్యం! పరవశత్వం ,!""
8,__"భజన అంటే,, మనసును శరీరాన్ని వేరు పరచి, చిత్త శుద్ది ని కలిగించే ఉత్తమ సాధనం!""
9,_"భజన అంటే ,,సత్సంగం !"
10,,_"భజన అంటే,, ఈశ్వరుని హృదయంలో నిలుపుకోవడం !"
11,_"భజన అంటే, భగవంతుని తో మమేకం కావడం !""
12,_"భజన అంటే, సర్వేంద్రియాలు , దేహంలో ఉన్న కోట్లాది నాడీ మండల సమూహాలను ప్రేరేపించే పరమ ఉత్కృష్టమైన సాధన !""
13,_""భజన అంటే ,యోగం !""
14,_"భజన అంటే ,ఏకాగ్రత నూ,, భగవంతుని పై అనురక్తి ని కలిగించే ఉత్ప్రేరకం!""
15,_"భజన అంటే , ఒక తపస్సు! "
16 ,_"భజన అంటే, జపము , !తపము!"
17,_"భజన అంటే ,,గత జన్మ పాపాలను క్షాళన చేసే ,ఇంధనం !"
18,_"భజన అంటే, నిర్మలమైన ,నిష్కల్మష మైన , నిష్ఫలా పేక్ష మైన సంస్కారం!""
19,_"భజన అంటే, మానవత్వ విలువలు పెంచే భావ సంపద !"
20,_"భజన అంటే ,దైవ సన్నిధిలో ఉండడం !"
21,_"భజన అంటే, భగవంతుని సాక్షాత్కారము!"
22,_"భజన అంటే ,తరగని నిధి ! ,భక్తుని పాలిట పెన్నిధి!""
23,_"భజన అంటే , భగవంతుని గురించి న జ్ఞానం !"
24,_"భజన  అంటే , ఇతరులకు ఎంత పంచినా  కూడా తరగని జ్ఞాన ఖని!"  , అంత కంత గా , ఇంకా ఎంతెంతో పెరిగే దివ్యమైన ,పరమానంద కరమైన ,అపురూపం, అమోఘం, అద్వితీయమైన. అఖండమైన , దైవిక శక్తి స్వరూపము.!"
25,_"భజన అంటే , మానసిక ,భౌతిక, ఆధ్యాత్మిక శక్తిని పెంచే కేంద్రం !"
26,_"భజన అంటే, పదిమందితో ప్రేమ ఆప్యాయతలు , చక్కని స్నేహం , మమతా నురాగాలు పెంపొందించు కునే ,  అందమైన మాధ్యమం !""
27,_"భజన అంటే , ఐకమత్యం !"
28,_"భజన అంటే,  ఎందరో మహానుభావుల,మహర్షుల రచనా వైభవ సుమధుర పరిమళాల అస్వాదన ,!""
29,_"భజన అంటే ,భూలోక స్వర్గాన్ని తలపించే , అద్వైతభావన !"
30,_"భజన అంటే ,మనసు, ఇంద్రియాలు,  బుద్ది ,ఆత్మ కలిసి పొందే  మధురానుభూతి !"
31,_"భజన అంటే , ఒక భక్తి సామ్రాజ్యం !"
32,"భజన అంటే,  ఒక ఉన్మాద స్థితి  !ఒక పిచ్చి!""
33,_భజన అంటే  తననుతాను మరచి పోవడం ,!"
34,_"భజన అంటే, అంతటా భగవంతుని సర్వ వ్యాపక తత్వాన్ని దర్శించడం !"
35,_"భజన అంటే, ఆత్మానందం !"
36,_"భజన అంటే ,దైవం పై ప్రగాఢమైన విశ్వాసం పెంచుకోవడం !""
",_37 ,"భజన అంటే, భగవంతుని ఉనికిని గుర్తించడం !"
38,_"భజన అంటే, నిర్గుణ నిరాకార సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ ను ధ్యానించడం !""
"39,"_"భజన అంటే, భగవంతుని తో  భక్తుడు నేరుగా అనుసంధానం చేసుకోవడం !"
40,_"భజన  అంటే, మనస్పందన ,!భగవంతుని భావన !""
41,_"భజన అంటే, భగవంతుని కరుణ ,ప్రేమ, దయ ,!"
42,__"భజన అంటే,, భగవంతుని లీలలు తెలిపే ప్రక్రియ ;"!"
43,_"భజన అంటే,, భగవంతుని సన్నిధానం !"
44,_"భజన అంటే ,సద్గతి కి త్రోవ !""
45,_"భజన అంటే, జీవన్ముక్తి!""
46,__"భజన అంటే , తిండి,నిద్ర ,కలిమిలేములు, కష్ట సుఖాలు , శీతోష్ణములు,, బంధు బలగాన్ని , అస్తి అంతస్తు లను  , శరీర అవస్థలను , మనిషి వయస్సును , దేశ కాల పరిస్థితుల ను ,,భార్యా పిల్లలను ,మరపించే ,,అనుభవైక వేద్యమైన    నిరంతర సాధన !""
47,_"భజన అంటే,, కుల మత వర్గ విచక్షణ కానరాని అపురూప భావ సంపద !"
48,__"భజన అంటే, భక్తులసహావాసం.!""
49,_"భజన అంటే, భక్తి గీతాలు పాడుతూ నృత్యం చేస్తూ ఆనందంగా ఉండడం!"
50,_"భజన  అంటే, మానవుని  గమ్యస్థానం !"
51,__"భజన అంటే ,  తిండీ నిద్రా పనీ ఉద్యోగ వ్యాపార వ్యవసాయ వృత్తి పనీ , సంచారము లో ఉన్నా కూడా  మరవకుండా, విడవకుండా సర్వకాలాల్లో, భగవంతుని పై చిత్తం ఉంచడం ,!""
52,__"భజన అంటే, కల్మషం లేని  ప్రేమ తత్వం !""
53,_"భజన అంటే ,,నిర్మలమైన పవిత్ర హృదయంతో భగవంతుని కి  సమర్పించే కైంకర్యం!"
54,_""భజన అంటే., భక్త మీరాబాయి,, త్యాగరాజ స్వామి  , భక్త రామదాసు,, భక్త పోతన , అన్నమయ లాంటి భక్తాగ్రే సరులు  ,, ప్రబోధించిన సన్మార్గ చింతన చేయడం !""
55,__"భజన అంటే రెండు చేతులూ,కలిపి చప్పట్లు కొడుతూ , తోటివారి తో కలిసి ఉత్సాహంగా ,పరమ సంతోషంగా ,బిగ్గరగా , తాళ వాయిద్య సంగీత సాహిత్య యుక్తంగా  హరినామ కీర్తన చేస్తూ ఉండడం!""
56,_""భజన అంటే, కాలాతీతమైన ,భావాత్మక మైన ,పరిశుద్ధమైన ,పరమాత్మ  గుణ గాన స్వరూపభరితమైన  మధురభావ సమ్మేళనం !""
57,_"భజన అంటే,, దైవీభావ శక్తి చైతన్య స్వరూప ధ్యానం !""
58,_"భజన అంటే , అనందనిలయం  !"
59,_"భజన అంటే ,భక్తి జ్ఞాన వైరాగ్య సమాహారం!"
60,__"భజన అంటే, భగవంతుని భావన ,!, రస రమ్య భరితమైన మనోజ్ఞమైన అనిర్వచనీయ మైన పరందామం !,,పరమాత్ముని సన్నిధానం !""
61,_"భజన అంటే, పూర్వజన్మ కృత సుకృత పుణ్య ఫలం !"
63,_"భజన అంటే, గురుదేవుని పరిపూర్ణ కటాక్షం !"
64,_"భజన అంటే, నిరంతరం కొనసాగే  అఖండమైన దీక్ష !"
65,_"భజన అంటే, భగవంతుని సేవనం ,అర్చన భావన ,స్మరణ , పూజనం,!"
66,_"భజన అంటే ,,"మానవ జీవన  ఉద్దరణ కు , సద్గతి కి , జన్మ రాహిత్యం జీవనము నకు  ,, సంసార భవ సాగర నిష్కృతి కొరకై ,సకల పాప దోష నివృత్తి  కొరకై పెద్దలు , ధర్మాత్ములు  ,విజ్ఞులు పండితులు మహర్షులు ,మహాత్ములు , భక్త శిఖామణి పుంగవులు ఎందరో సాధు పురుషులు , శృతి స్మృతి పురాణ ఇతిహాసము లు నిర్దేశించిన  ఏకైక, భక్తి మార్గం!""
"67,_""భజన అంటే , దైవం !"
68,_"భజన అంటే  సర్వం  !"
69,_"భజన అంటే ,సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంచే బంధం !"
70,,*భజన అంటే ,,సర్వ రోగ నివారిణి ,,పరమ ఉత్తమ మహోన్నతమైన దివ్య ఔషధం!""!"
71,_"భజన అంటే, భక్త జన సమూహం లో పొంగి పోర్లే అనందాన్ని స్వయంగా అనుభవిస్తూ వారితో పాటు దేవదేవుని బ్రహ్మోత్సవ సేవలో   పాల్గొన డం
72,__"భజన  అంటే, ఎవరికి వారే అనుభవించే ఆనందానుభూతి !"
73,,_"భజన అంటే, దైవంతో ప్రత్యక్ష సంబంధం !"
74,_"భజన అంటే, పరిసరాల ప్రభావానికి లోను కాకుండా, తనలో కేవలం  దైవాన్ని మాత్రమే దర్శిస్తూ ఉండడం !"
75,_""భజన అంటే,  భక్త పోతనామాత్యు ని భాగవత పద్య రచన వైభవ అమృత  చింతనమ్!
76,_ "భజన అంటే ,, సంకీర్త నా చార్యుడు వేంకటేశ్వర స్వామికి  అన్నమయ్య  గావించిన అత్మ నివేదన !"
77,_"భజన అంటే,, శ్రీ రామచంద్రుని పరమ భక్తుడు శ్రీ త్యాగరాజ స్వామి గారు స్వరపరచి రాగ తాళ  యుక్తంగా అద్భుతంగా ఆలపించిన
భక్తి భావన !"
77,_"భజన అంటే, రాధా దేవి కృష్ణ తత్వం !"
78,_"భజన అంటే ,, భక్త మీరా బాయి అత్మ సమర్పణ భావం !"
79, ,_"భజన అంటే , భగవద్గీత సారం !"
80,_"భజన అంటే, శ్రీరాముని పట్ల అతని తమ్ముడూ చూపిన సోదర భావం !"
81,__"భజన అంటే ,, ఎక్కడో తిరుమల కొండపై నెలకొన్న శ్రీ వేంకటేశుని దివ్య మంగళ విగ్రహస్వరూప దర్శనం ,కదలకుండా కళ్ళు మూసుకుంటూ ఆత్మలో అనుభవిస్తూ ఆనందిస్తూ ఉండడం !""
82,__"భజన అంటే,, అర్జునుని విషాద యోగం !"
83,_"భజన అంటే , భక్త ప్రహ్లాదుడు  పరమ  వైష్ణవ  భక్తి తో  శ్రీహరి పై పెంచుకున్న అనురక్తి ,!
84,_""భజన అంటే ఏకాంతం !"" అంటే తన దేహ చింతన మరచి, వైకుంఠ నిలయం లో పరమాత్ముని సన్నిధానం లో నివసించడం !
85,_భజన అంటే నాదం ,నాదం అంటే గానం తాళం ,వాయిద్యం వీణా వేణు మృదంగ వాయెలిన్ లాంటి వాయిద్యాల సంగీత భరిత స్వరాల ఆస్వా దన ,,అనగా ఎందరో మహానుభావులు అనబడే త్యాగరాజ స్వామి వారి శ్రీ రాగం లో మెలవింపబడిన కీర్తన అలకించడం
86,_భజన అంటే ,, హరినామ సంకీర్తన  మధురం గా గానం చేయడం
87,_" భజన అంటే, భక్తి గీతాల కు అనుగుణంగా అభినాయిస్తు, పరవశం తో ఆనందించడం !"
88,__"భజన అంటే ,,  భక్తి గీతాలు , నృత్యాలు పురాణ శ్రవనాలు  ప్రవచనాలు సదా, వింటూ భగవద్ చింతనతో శరీరం పులకించి పోతూ ఉండడం!
89, ,_"భజన అంటే ఆధ్యాత్మిక చింతనతో జీవితం గడపడం !"
90,_ "భజన అంటే, స్వామీ వివేకానంద యువత ను ఉద్దేశించి చేసిన ఉత్తిష్ఠ , ఉత్తిష్ఠ ప్రసంగాలు !"
91,_"భజన అంటే ,, రమణ మహర్షి ఉపదేశించిన తత్వ విచారం !""
92,_భజన అంటే , రేపల్లె గోపికా స్త్రీల ఆత్మ సమర్పణ భావం !"
93,_భజన అంటే తులసీదాసు గారి  తులసీ మానస రామాయణ కావ్య వైభవం !"
96,_భజన అంటే, హనుమ ,!హనుమ అంటేనే భజన, ఎక్కడ రామ భజన ఉంటుందొ అక్కడ హనుమ తన , కళ్ళ నుండి ఆనంద భాష్పాలు స్రవి స్తు ఉండగా నాట్యం చేస్తూ , రెండు చేతులతో తాళం వేస్తూ  తన్మయత్వం తో మైమరచి పోతూ , శ్రీరామ నామ గాన ధ్యాన భావ చిత్తంతో  రామచంద్రుని దివ్య మంగళ లావణ్య స్వరూప భావంతో లీనమై ,తన అస్తిత్వాన్ని మరచి పొందే పరమానంద మే భజన ;
97,,_"భజన అంటే భగవంతుని పై భక్తి విశ్వాసాలు పెంచుకుంటూ సుక్షేత్రాలు  , పుణ్య తీర్థాలు దర్శిస్తూ ,దేవాలయానికి నిత్యం వెళ్తూ , చేసే ప్రదక్షణ లో , స్వామిని దర్శించి చే చూపులో ,గ్రహించే ప్రసాదంలో భక్తుడు పొందే ఆనందానుభూతి  !
98__"",భజన అంటే, అనునిత్యం అనుక్షణం అనవర తం దైవాన్ని అనుసంధానం చేసుకోవడం !"
99,_ భజన అంటే , శ్రీ రామ చంద్ర ప్రభువు దర్శనం కోసం  తన జీవితం మొత్తం  వెచ్చించి భక్త శబరి   చూసిన ఎదురుచూపు !""
100,_"" భజన అంటే ,బాల  ధ్రువ కుమారుడు  వాసుదేవుని దర్శనం కొరకై పరమ నిష్టతో , గావించిన అకుంఠిత దీక్ష, !""
101,_  వామనుడి కి  భూమండలాన్ని మొత్తం  దానం గా ఇస్తూ బలి చక్రవర్తి గావించిన ,, సర్వం   "బ్రహ్మా ర్పనం!" ""కృష్ణార్పణం !"అన్న  ఉత్కృష్టమైన , పరమ పద భావన !""
""స్వస్తి !""
హరే కృష్ణ హరే కృష్ణా !!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...