Saturday, February 8, 2020

మనసును జయించడం ఎలా ?

మనసును జయించడం ఎలా ?
Jan 18, 2020
_______&________
"మనస్సును ప్రశాంతంగా ఉంచడం  మనిషికి జీవితంలో. అత్యంత  కష్టమైనా పని, అవుతోంది !
మనసు లేని మనిషి ఉండడు కదా ,,! పిచ్చివానికి కూడా మనసు అనేది ఒకటి ఉంటుంది !!
,,,కానీ, అది వాడి అదుపులో ఉండదు ,!
సక్రమంగా పని చేయదు !!
,,సాధారణంగా మనసు చెప్పినట్టు మనిషి వింటూ ఉంటాడు!!
,, ,తినగూడనివి తింటూ ,వినగూడనివి వింటూ , చేయగూడనివి చేస్తూ ,అనకూడనివి అంటూ ,, చూడకూడనివి చూస్తూ  ,ఇలా ఇంద్రియాలకు వశుడై  ఇష్టం వచ్చి్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు ,,
,,,అంటే మనసును నియంత్రించే సామర్థ్యం కోల్పోయి,, జంతువువలె ,,, మంచీ చెడూ  విచక్షణా రహితంగా ఆలోచిస్తూ ఉంటాడు.
ఈ కోతి లాంటి చంచల స్వభావం కలిగిన మనసు,,  భౌతిక పదార్థం గురించిన విజ్ఞానం తెలుసుకోడానికి ,ప్రాపంచిక సుఖాలు అనుభవించడానికి ,,నిరంతర ప్రాకులాడుతూ ఉంటుంది .
  ""అసలు ఈ ""మనసు అంటే ఏమిటి ?,,దాని స్వరూపం ఎలా ఉంటుంది ?, మనిషిలో  ఎక్కడ  ఉంటుంది ,??""అన్న ప్రశ్నలకు  జవాబు నేరుగా దొరకదు ,,!
కానీ , ఆ మనస్సు స్వభావం మాత్రం ,,ఆలోచనల రూపంలో బయటకు వ్యక్తమౌతు ఉంటుంది !!
,ఒక నిముషం లో , ఈ మనసు ఎన్ని ఆలోచనలు చేస్తూ ఉంటుందో ,అన్నీ రూపాల్లో ఉంటుంది ,,దాని అవతారం !
,, జిలేబీ చూస్తూ చేసే ఆలోచనతో అది జిలేబీ స్వభావం గా రూపంలో కి మారుతూ,, వెంటనే కుక్క ను చూస్తూ చేసే  ఆలోచనతో కుక్క స్వరూపా నికి  క్షణం లో మారుతూ ఉంటుంది ,,
ఇలా మనిషి చేసే , చూసే ,, తినే,,వినే ,,పనుల ను  బట్టి ఒక మనిషి మనస్తితి ని కొంత అంచనా వేయవచ్చును ,,!!
,,కానీ యదార్థం గా ఒక మనిషి మంచి తనాన్ని, చెడు గుణాలను ఖచ్చితంగా  చెప్పడం కష్టం !
ఎవరూ పూర్తిగా మంచీ, లేదా పూర్తిగా చెడూ అని నిర్ధారించలేము కదా!
పరిస్థితిని బట్టి, గతజన్మ కర్మ ఫలితాన్ని బట్టి  వాడి మనసు మారుతూ ఉంటుంది!
,మంచివాడు అకస్మాత్తుగా చెడ్డవాడు కావచ్చు !,అంటే వాడిని నడిపించే  మనసు,, వాడికి చెడ్డ ఆలోచనలు పుట్టించి , చెడు పనులు చేయిస్తూ ఉంటుంది !!,,
అంటే మనసును అదుపులో ఉంచలెని దుర్దశ  వాడికి దాపురించింది అనుకోవచ్చు !!
మరి ఎలా  మనిషిని  నడిపే ఈ చిత్రమైన అతి విచిత్ర స్వభావం కలిగిన  మనసును  గెలవడం??"" ఇది చాలా, చాలా జటిలమైన ప్రశ్న  !!
,,,దానికి భగవద్గీత లో గీతాచార్యుడు ,,శ్రీకృష్ణ భగవానుడు చక్కని తరుణోపాయం సూచించాడు ,,!
""ముల్లును ముల్లు"తోనే తీసివేస్తూ బాధను నివారించి నట్టుగానే  ,మనసును మనసుతో నే గెలవాలి , అని బోధించాడు !!,,
అంటే మనసులు రెండు ఉండవు,!
,, ఒకే మనసు చేసే అనేక ఆలోచనలను  అభ్యాసం తో , గురు కృపతో , దైవానుగ్రహం కోరుతూ  ,,మనస్సును పిచ్చిగా తిరగకుండా , అదుపు చేయవచ్చును !,
,, విశాలమైన ప్రపంచం లో విజ్ఞాన శాస్త్రం అపరిమితం , !ఎంత తెలిసినా , తెలియాల్సిన విషయాలు అనేకం ఉంటాయి,.!
వాటిని" జ్ఞానం "అనబడే భగవద్ చింతన ద్వారా మాత్రమే నియంత్రణ చేసే వీలు ఉంటుంది,!
భగవద్ అర్పితమైన పనులు ,అంటే పూజ, జపం ,నామ సంకీర్తన చేయడం ,స్మరణం ,సేవనం లాంటి సద్భావన , చేస్తూ,, వేరే ఇతర ఆలోచనలు చేయకుండా మనసును జయించవచ్చు ను ,!
""ఓమ్ నమో వేంకటేశాయ ,! ఓమ్ నమో నారాయణాయ,,! ఓమ్ నమః శివాయ , !""అంటూ మనకు నచ్చిన భగవన్నామ స్మరణం ఆత్మలో  చేస్తూ ,, మనసు చెడుదారిలో పోకుండా హద్దుల్లో పెట్టవచ్చును ,!
ఈ సాధనా  ప్రక్రియ, నిరంతరం అంతరంగం లో సాగుతూనే ఉండాలి ,
అప్రమత్తంగా ఉంటూ దైవ చింతన చేస్తూ ఉండేవారికి ,మనసు బానిసలా పడి ఉంటుంది ,, ఇలాంటి  సత్వ గుణభావ సంపద  అలవడిన మనస్సు,,ఇక  తామస రాజస ఆలోచనలను దరి దాపు లోనికి  రానీయవు ,!
,,మనిషికి  నిత్య జీవితంలో ఎదురయ్యే  ఇలాంటి    అనేక సమస్యలకు  మన ""భగవద్గీత "" గ్రంథము ,,చక్కగా విశ్లేషించి సమాధానాలు చెపుతుంది !
అపురూపమైన ఈ మానవ జీవన విధానాన్ని సరిదిద్దుతూ ,మనసును  ఎప్పటకప్పుడు సద్గతి మార్గాన్ని. అనుస  రింప జేసే అద్భుతమైన , ఆధ్యాత్మిక జీవన ప్రమాణాలు కలిగిన భగవద్గీత ను అందరం  , సద్భావన తో ,సత్సంగం తో  అధ్యయనం చేద్దాం !!ఆ వైభవాన్ని , దివ్యానుభవాన్నీ  అందరికీ అందజేద్దాం !"
స్వస్తి !"
హరే కృష్ణ హరే కృష్ణా !""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...