Wednesday, February 19, 2020

శబరీ!


Dec 1, 2019 Karimnagar
""శబరీ! , ఓ శబరీ !""అంటూ ఎవరో గట్టిగా నా  భుజం తట్టి పిలుస్తుంటే  ఉలిక్కి పడ్డాను !
రామ నామ ధ్యానం లో మునిగిన నాకు  ఆ పారవశ్యం లో నన్ను నేనే మరచి పోతుంటా ను ఇలా!!
ఎదుట ,ప్రక్క ఆశ్రమ స్త్రీలు కనిపించారు
ఏమిటీ  అంత ఆలోచన?? ఆ  రామయ్య గురించేనా,, నీ జపం తపం ?,,,
వారు అలా  అడుగుతూ ఉంటే నాకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు, చూస్తూ వింటూ ఉన్నాను
""ఎన్నాళ్ళు ఈ ఎదురు చూపులు ,చెప్పు ?
ఎంత కాలం ఈ ఒంటరి బ్రతుకు?
మాతో బాటు ఉందువు గానీ వచ్చేయ్ ,శబరీ!!"
అంటున్నారు వాళ్ళు .
నవ్వుతూ మౌనంగా ఉన్నాను నేను వారి ఆదరణ కు సంతోషం గా ఉంది
""నీకు వినబడుతోంది కదా, మా మాట!!
ఏమో!! ఎంత చెప్పినా వినవు కదా !!ఆ రాముడు ఎప్పుడొస్తా డో, అసలు వస్తాడో, రాడో ?! కానీ నీవు మాత్రం ఇలా రోజూ ఆశ్రమం శుభ్రం చేయడం,, ముగ్గులేయడం, పంపా నదికి కుంటుతు ,పడుతూ, లేస్తూ ,వణ క్కుంటు పోతూ, నిత్యం నీళ్ళు తేవడం, పూలు తేవడం, ఆ గద్దె ను అలంకరించడం,, ఇదంతా ఎన్నో ఏళ్ల నుండి  చేస్తున్న నిన్ను  చూస్తూ , చూస్తూ  మాకు విసుగు వస్తోంది ,తల్లీ !!
శబర మాతా ,!నిన్ను చూస్తుంటే బాధగా ఉంది సుమా !! వంద ఏళ్ల పైగా వయస్సు దాటి పోయింది నీకు!
కంటి చూపు మందగిం చింది!
చెవులు వినపడకుండా పోయాయి!
శరీరం శుష్కించి పోయింది! అయినా ఇంత శ్రద్ద !!
అమ్మా  ఆరోగ్యం జాగ్రత్త  ,!
అంటూ  చెబుతూ ఉంటే రెండు చేతులూ జోడించి దండం పెట్టాను వారి ప్రేమకు !! వారంతా వెళ్ళి పోయారు. ఇది రోజూ కనిపించే దృశ్యమే!!
వీరే కాదు,!! జింకలు,, లేళ్ళు ,పక్షులు ,చిలకలు వస్తూ మౌనంగా  నన్ను పలకరి స్తూ ,చూస్తూ పోతుంటాయి,,
,నిజమే వారు చెప్పింది,!! కానీ రామనామ ధ్యానం లో  కాలం తెలియడం లేదు నాకు!!
, రామా ,,రామచంద్రా!! ఎప్పుడు కరుణిస్తావయ్యా  నీవు?? ఇక్కడకు నన్ను వేదక్కుంటు వస్తావని మా గురువుగారు మాతంగ మహా ముని చెప్పిన "గురు వాక్యం ""ఇంకా గుర్తు ఉంది, లే !!"
""శబరీ , !!నీవు మాకు ఇన్ని రోజులూ, భక్తి శ్రద్ధలతో సపరి చర్యలు చేస్తూ, నీ జీవితం మొత్తం మా కోసం, మా సేవలో గడిపావు ,,
ఇప్పుడు మేము  పరమ పదం చేరుకు నే శుభ తరుణం వచ్చింది తల్లీ !; మాకు పరమాత్మ నుండి పిలుపు వచ్చింది శబరీ,!; వెళ్తున్నాం !!
వెళ్లే ముందు ,నీకు ఒక శుభవార్త చెబుతున్నాం!!
కొన్నేళ్ల తర్వాత నిన్ను వెదుక్కుంటూ మహావిష్ణువు పరమ పరి పూర్ణావతారం అయిన శ్రీరామచంద్రుడు ఇక్కడకు వస్తాడు!!
తన భార్యను రావణాసురుడు అపహరంచిన దుఖంలో శ్రీరాముడు, తన భార్య సీతమ్మ ను వెదక్కుంటు,, నీ చెంత కే  వస్తాడు! అప్పుడు
అతనికి నీవు  సకల ఉపచారాలు చేస్తూ మన ఆశ్రమ మర్యాదను కాపాడాలి !
వచ్చిన అతిథులు భగవంతుని  ప్రతిరూపాలు !అలాంటిది సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు అతిథి రూపాన మన ఇంటికి వస్తున్నాడు !
వారిని మనం రిక్తహస్తాలతో పంపకుండా , సకల ఉపచర్యలు చెయ్యాలి , ఈ బాధ్యతను , శ్రీరామ చంద్ర ప్రభువును సత్కరించి సంతోషిం ప జేసే మహాభాగ్యం నీకు  అప్పగిస్తూ ఉన్నాను ,! నీ చల్లని మాతృ వాత్సల్యం తో రాముని  వేదనా భరిత హృద యానికి  ఉపశమనం కలిగించాలి! శబరీ ! నీవు
దైర్యం చెప్పాలి !, ఆపదలో ఆవేదనతో తల్లడిల్లుతున్న రామ భద్రునికి మార్గదర్శనం చెయ్యాలి తల్లీ!;
నీవు చాలా అదృష్టవంతు రాలీవి ,,శబరీ !; ఎందుకంటే,
మేము ఎన్నో వేలఏళ్లు ఘోర తపస్సు చేసినా కనిపించని దైవం , ఇపుడు నిన్ను వెదుక్కుంటూ నీవున్న చోటుకు స్వయంగా వస్తోంది  !! ఏమి భాగ్యం నీది శబరీ!!
,, భగవంతు డే భక్తు రాలి కోసం, స్వయంగా కాలినడకన కష్ట పడుతూ వస్తున్నాడు ! అందరి ఆవేదనలు దూరం చేసే పరమాత్ముని  ఊరడించే భాగ్యం నీకు దక్క బోతోంది కదా !! శ్రీ రామ ప్రభువు పాద స్పర్శను పొందడం వలన,
నీ పేరు ,నీ శ్రమ, నీ జాతి నీ కీర్తి  , నీకు గురువైన భాగ్యం తో నా పేరు కూడా చిరస్థాయిగా," శ్రీమద్రామాయణం"" లో  నిలిచిపోయే శుభ తరుణం నీ తపోదీక్ష వల్ల లభిస్తోంది నీకు,, శబరీ !!ఇక  నాకు సెలవు ఇవ్వు తల్లీ !
అంటూ దీవిస్తూ మా గురువు మతంగ మహాముని తన శిష్యగణం తో బాటు ,చితిని పెర్చుకోని ప్రాయోపవేశం చేయడం , అదే అగ్ని గుండం లోనుండి దివ్య దేహాలు ధరించి అమరలోకం పోతూ ఉండడం నా కళ్ళ ముందే జరిగింది
మాగురువు గొప్ప  బ్రహ్మ వేత్త , !అతని మాట వేద వాక్యం ,! అది అక్షరాలా నిజ మై తీరుతుంది ! నాకు మా  గురు వాక్యం పై పరిపూర్ణ విశ్వాసం ఉంది!
వారి పట్ల ఉన్న  భక్తి శ్రద్ధలు  ఆచరణ లో చూపిస్తాను
అయోధ్యా రామయ్య తప్పకుండా ఇక్కడికి వస్తాడు !!నన్ను కరుణిస్తాడు,!
ఎంత కాలమైనా, ఎన్ని ఇబ్బందులున్నా , ఈ వృద్దాప్యం ఎంత బాదించినా ,,నాకోసం కాకున్నా, దీన స్థితిలో బేలగా ఉన్న ఆ  రామయ్యను ఓదార్చడానికి అయినా ,నేను బ్రతకాలి ,! ఎన్నేళ్ళు అయినా ,నా రాముని కోసం జీవిస్తూ ఎదురు చూస్తాను ,!
, ఇలా అనుకుంటాను గానీ, రామా , ఈ దైర్యం ,ఈ శక్తి, ఈ అవకాశం ,ఈ బుద్ది ఇవన్నీ ఆ దయాసాంద్రుడు రామయ్య నామ మంత్ర జప ప్రభావం వలన నాకు అనుగ్రహిం ప బడిన దివ్య మైన వరాలు కావా!,
లేకపోతే  దండకారణ్యం లో ఎక్కడో  ఉంటున్న ఒక ఆటవిక జాతి స్త్రీని ,, చదువు సంధ్య లేని అమాయక పేద ముసలి దాన్ని నేనె క్కడ? జగన్మోహన సుందరాకార  బ్రహ్మాండ నాయకుడు  సకల విద్యా పారంగతుడు, అరి వీర భయంకరుడు , సకల శస్త్రాస్త కోవిదుడు, దయాంతరంగుడు , భక్త జన హృదయ మందారుడు ,, ఆ రామచంద్ర ప్రభువు  ఎక్కడ  !?? అయినా గురువు ఆజ్ఞ కదా!
వస్తాడు!  వచ్చేస్తాడు! అదిగో  మాటల్లోనే నా మనసు గ్రహించి ,వస్తున్నాడు  కూడా !!
ఈ శబరిని ,, ఈ  పిచ్చి తల్లీని ,, నన్ను వెదుక్కుంటూ వచ్చేస్తూ ఉంటాడు ,
""అరే ! ఇదేమిటి ?, నా ఎడమ కన్ను ఎడమ భుజం అదురుతున్నాయి ,! అదిగో,, ఆ  పక్షులు వినువీది లో కిలకిలా రావాలు చేస్తూ ఎగురుతూ గుంపులుగా ఇటే వస్తున్నాయి!! అదిగో చూడండీ ,,!
ఆ జింకలు , ఆ లేళ్ళు  సంతోషంతో, గుంపులు గుంపులుగా ఎగురుతూ,, దుంకుతు ఆశ్రమం ముందు నుండే అటూ ,ఇటూ పరుగెడుతూ ఉన్నాయి!!
ఏదో శుభ వార్త  నాకు చెప్పాలని , మాటలు రాని ఆ మూగ జీవాలు  ఎంతగా  ఆరాట పడుతూ ఉన్నా యో ??
, అంటే ,,నా కల ఫలించ బోతోం ది !, నా అదృష్టం పండుతోంది!
నన్ను కన్నయ్య , నన్ను కాంచడానికి వస్తున్నాడు!!
ఆహా !!అవిగో,, అందమైన  ఆ నెమళ్లు చూడండి ఎంత ఆనందంగా పురులు విచ్చి అందంగా నృత్యం చేస్తూ తమ సంతోషాన్ని  తెలియ జేస్తూ ఉన్నా యో !!
అటు చూడండి ,!ఏమిటా ఆ చెట్ల అనందం ,?? చల్లగా, మెల్లగా, వీస్తు సుమధుర సౌరభాలు అందిస్తున్నాయి  !
ప్రకృతి మాత పులకిస్తోం  ది,! సూర్య భగవానుని అరుణ కిరణాలతో నీలాకాశం రంగు రంగుల్లో శోభిస్తోంది !!
ఈ లతలు , ఆ వృక్షాలు తమ కొమ్మలను సుతారంగా  ఊపుతూ సుగంధ పుష్పాలను దారిలో రాలుస్తు ,, రామయ్య కు ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి,,! శ్రీరామ చంద్ర ప్రభువు కు సుస్వాగతం పలుకుతూ తమ ఆనందాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి ఈ నింగి, నేల, గాలి,భూమి ,నీరు !
నా ఇలవేలుపు ,నా దైవం, నా ప్రాణం ,నా సర్వం, నా జీవం ,నా కలల పంట,, అయిన రామయ్యకు స్వాగతం పలకడానికి  అన్నీ సిద్దం చేసి ఉంచాను,
, అదిగో పుష్పాలు,, పూల దండలు ,! నా రామయ్య మెడ నిండా అలంకరించ డానికి!!
ఇవిగో ,, దోరగా పండిన పండ్లు, నా స్వామి అరగించడానికి !!
, ఇదిగో ,ఇప్పుడే తెచ్చిన   పంపా నదీ స్వచ్చమైన మధుర జలాలు , !నా రాముడు ఎంత దప్పి గొని ఉన్నాడో , ఆయన  దాహం తీర్చ డానికి !
ఇదిగో పుట్ట తేనె,! ఇవిగో గో క్షీరం, !నా రామునికి ఎక్కడా ఏ లోటూ రావద్దు కదా!!
అహో !ఏమీ నా భాగ్యం!! అదిగో ,నా  రామ చంద్రుడు! వెనక తమ్ముడు లక్ష్మణ స్వామి ,!ఇరువురూ దనుర్థారులై , శతకోటి సూర్య చంద్ర ల ప్రకాశంతో విరాజిల్లుతూ ,  ఇటుగా
నా వైపే నడిచి వస్తూ ఉన్నారు !
అందాల రామయ్య నా గురించి  ఏమని  అనుకుంటూ ఉన్నా డో కదా  "??
""పిచ్చి శబరి , ,! ఇంత వెర్రిగా ఇన్న్నేండ్లు కళ్ళు కాయలు కాసేలా , ఎదురు చూస్తూ ఉంది, !పాపం  !వృద్ధు రాలు! తల పండి పోయింది , నా కోసం ఎదురు చూస్తూ చూస్తూ. ! లేచి ఆహ్వానం చేయాలని ఉన్నా,, లేచే ఓపిక లేక, పలికే  చేత కాక ,,, అడుగులు  వేయ లేక  ఎంత అల్లాడి పోతుం దొ కదా ఆ తల్లిమనసు ? అంటూ !
""రామయ్యా  ! రావయ్యా నా స్వామీ ! నా బంగారు  తండ్రీ !ఎంత దయ గలవాడివి ,, రామా ,, నీవు !!ఈ దీనురాలిపై కరుణించి వచ్చావా  !!
ప్రభో !!ఈ అడివిలో నీవు, సీతమ్మ తల్లిని వెదకుతూ,, రాత్రి పగలూ నడ చీ,, నడచీ, నీ సుకుమారమైన పాదాలు ఎంత కంది పోయాయి తండ్రీ !! నా చేతులతో  నీ మెత్తని కోమలమైన పాద కమలాలను   , కాస్త స్పర్షించనీ,,రాఘవా !
నిన్ను స్పష్టంగా చూడాలని ఉంది,! కానీ ఈ పెద్దతనంతో , నీవు వచ్చావన్న అనందం తో  ఆనందభాష్పాలు కమ్మి,, కళ్ళు మసకబారి నీ ముగ్ద మోహన సుకుమార సుందర లావణ్య రూపాన్ని కనులారా కాంచలేక పోతున్నా ను
స్వామీ , !!
నీవు , సీతా వియోగం తో ఎంత  బాధ అనుభవిస్తూవో ,, చిన్నబోయిన ,నీ నగుమోమును చూస్తేనే తెలుస్తోంది !!
ఊరట చెందు రామచంద్రా ,!  బాధ పడకు !కష్టాలు తీరే శుభ సమయం వచ్చింది, రామభ ద్రా !!
నాయనా, లక్ష్మణా! అన్న కోసం, వదిన కోసం అహర్నిశలు ఆంటిపెట్టు కొని  , కంటికి రెప్ప వలె దీక్షతో కనిపడుతు సేవించు కొంటూ ఉన్న నీకు  శతకోటి ప్రణామాలు !!
రామయ్యా ! దీనంగా హృదయ విదారకంగా కనిపిస్తున్న నీ కు  స్వాగతం పలకడానికి  నాకు నోరు రావడం లేదు  సుమా!
కష్టాలు కలకాలం ఉండవు కదా !దర్మావతారుడివి ! సకల శాస్త్ర కోవిదుడివి !! నీకు తెలియని ధర్మ సూక్ష్మాలు ఏముంటాయి స్వామీ??
  ఈ స్వచ్చమైన జలాలను గ్రహిం చి సేద దీరు !! దశరథ తనయా! , ఈ పుష్పాల సౌరభం తో ,మీ అలసట  మార్గాయాసం తీర్చుకోండి !!
కౌసల్యా నందనా !సుమిత్రా నందనా !!ఈ సుమధురమైన ఫలాలను , ఈ రేగు పండ్ల ను తినండి!  రామలక్ష్మణుల కు ఆతిథ్యం చక్కగా ఇచ్చా నన్న తృప్తిని అనందాన్ని  నాకు అనుగ్రహించండి ! మా గురువు ఆజ్ఞ నెరవేర్చిన అనందాన్ని అనుగ్రహించండి సోదరులారా !;
అదేమిటి ,ప్రభో! నీ కంట ఆ నీరు ? , స్వామీ , ఈ బదరీ ఫలం చూస్తుంటే నీకు సీతమ్మ గుర్తుకు వస్తోం దా  నాయనా??,
రాదా మరి ! ?!ఆమె తో కలిసి తిరిగి  హాయిగా సంతోషంగా గడిపిన మధుర క్షణాలు గుర్తుకు వస్తూ , ఇలా  నిన్ను కలచి వేస్తూ నే ఉంటాయి!
ఆదర్శ దంపతులు  మీరు సీతా రాములు,!
చంద్రుని విడిచి వెన్నెల వుండన ట్టుగ ,మీరు
ఒకరిని విడిచి  ఉండలేరు కదా!
నాయనా !బాధ పడకు ! నిరాశ చెంద కు !!
ఇక్కడికి దక్షిణం దిశ గా వెళ్తే ,, మీకు కిష్కింధ ప్రాంతం కనబడుతూ ఉంటుంది,, అది
కొండలు గుట్టలు లోయలు సెలయేర్లు చక్కని పచ్చి క బయళ్ళ తో సస్యశ్యామలంగా అగుపిస్తుంది మీకు !!
అక్కడ సుగ్రీవుడు ఆనబడే
వానర రాజు తో మీరు స్నేహం చేయండి! అతడి వద్ద హనుమ అనే మంత్రి , నిన్ను తన ఆరాధ్య దైవంగా కొలిచే నమ్మిన బంటు, నీకు మేలు చేస్తాడు !
అతడు మీకు సీతమ్మ జాడ తెలియడానికి సాయం చేస్తాడు కూడా !
ఇది నా మాట కాదు గురువు వాక్యం ! అది ఎప్పుడూ పొల్లు పోదు !,మీకు  జయం  కలుగుతుంది !
శ్రీరామ చంద్ర ,!నారాయణా!! మా గురువు గారు చెప్పింది నిజమైంది! మీరు వచ్చారు ! నన్ను దన్యు రాలిని చేశారు ; ఇక ఈ జన్మకు ఈ భాగ్యం చాలు!
నా తపస్సు  ,నా నిరీక్షణ ఫలిం చాయి !;నీ దర్శన భాగ్యం పొందిన
నా జన్మ ధన్యం ఆయ్యింది!
అయోధ్య రామా ,! కళ్యాణ రామా !పావన రామా ,!
ఇక నన్ను అనుగ్రహించు సీతారామ !
మా గురువు మతంగ ముని అప్ప గించిన  దైవ కార్యం సుసంపన్నం చేశావు పరందా మా ! సుగుణాభిరామా! త్రిభువన జన నయనాభి రామా ! కోదండ రామా !
పరమాత్మా పరందా మా పరాత్ప రా!
నాకు ముక్తిని ప్రసాదించు;
నిన్ను చూసిన కళ్ళకు ఈ లోకం తో  పనిలేదు
నీ పాద పద్మాలను తాకిన అద్భుత క్షణాలను  , ఈ దివ్య దృశ్యాన్ని చరితార్థం చెయ్యి  !
గురు వాక్యాన్ని నమ్మి , గురు దీవన బలం తో నారాయణుని కూడా సాక్షాత్కరింప జేసుకోవచ్చు !! అన్న వేద మాత వాక్యాన్ని నిజం చేశావు రామచంద్రా ,!! ఇనకులభూషణా ,!రఘుకుల తిలకా !
పాహిమాం !ఆపద్బాందవా! , దీనజనశరణ్య ,!
రక్షమామ్! హే సీతాపతి ! అంటూ ఆర్తితో   మోకరిల్లి తన చరణ కమలాల పై శిరసు ను తాకించగానే , కోమల నీల సరోజ శ్యాముడు, శ్రీరాముడు  దరహాసవదనం తో  ,దయామృతాన్ని వర్షిస్తూ "" శబరీ ! నీవు దయగల తల్లివి !, చల్లని నదివై ఆర్తులకు దాహాన్ని తీరుస్తూ, కలకాలం  కీర్తి తో వర్ధిల్లు !!"అంటూ తన హస్త కమలం తో నా శిరస్సు ను మృదువుగా తాకాడు ! మరు క్షణంలో నే, తక్షణం నా భౌతిక శరీరం మాయమై, నేను  స్వచ్చమైన నదీ ప్రవాహం లా మారి ,   నా పేరున శబరిమల గా ప్రసిద్ది చెందిన ఈ అడవిలోని కొండ ప్రాంతం లోయల్లో ప్రవహిస్తూ  , ఈ అడవి ప్రాంత ములో నివసించే సకల జంతువులకు , పల్లె వాసులకు స్వచ్చమైన తీయని జలాలను అందిస్తూ ఆనందిస్తూ తరిస్థూ ఉన్నాను
రాముని నమ్మిన వారికి మళ్లీ ఇతర కోరికలు ఉంటాయా? మరో జన్మ అంటూ ఉంటుందా! ఉండదు! రామ ప్రభువు అరుణ చరణాల కమలాల సన్నిధిలో పరమానంద భరితమై తిరుగాడుతూ వుంటుంది
జై శ్రీ రామ్ ! జై జై సీతారామ్ ! పవనసుత హనుమాన్ కీ జై!
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !! 
రామ భక్తురాలు శబరీ  మాత భక్తితన్మయత ను, మా అమ్మ  ధన్య జీవనం గుర్తుకు తెచ్చు కొంటూ రాశాను
ఎంతనీ వర్ణించ గలను ఆమె భక్తి తత్పరత ను ,
శబరీ లాగా జీవించింది నిరంతరం రామ నామ గాన స్మరణతో పూజలతో
అదే విధంగా ఎదురు చూసింది ,, ఆపెక్ష తో , ఆరాధనతో,
శబరికి రాముడు ఆరాధ్య దైవం అయితే  అమ్మకు లక్ష్మీ నరసింహుడు
శబరి అడవిలో ఉండి ఒంటరిగా ఉంటూ తరిస్తే, అమ్మ విరాగిని యై, నిద్రాహారాలు నియంత్రించి
ఎందరు బంధువు లున్నా
లక్ష్మీ రమణ స్వామి యే నిజమైన ఆప్త బంధువు గా కాపద్బాందవుడు గా భావించి జీవించి సేవించి తరిం చింది అంకిత మై ,

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...