Feb 9, 2020
""శుభ వార్త !""
_____&-_____
"24 వ ఫిబ్రవరి రోజున మా యువత"" వాలెంటైన్ నేస్తం,, యశోదా నందనుడు , ఆ గోవిందుడే,!""
_____&&_____'_____&__
"మేము భారతీయ ""యువ జన పౌరులం "" ,!
,,దేశాన్ని నడిపించే ""ధీర సైనికులం ,!,"" మంచుకొండల్లో ,రాత్రింబవళ్ళు ,దేశ సంరక్షణ చూస్తూ,, సరిహద్దుల పై గస్తీ చేస్తూ అప్రమత్తత తో ,శత్రువుల దాడిని అరికడుతు,వారిని మట్టి కరిపిస్తున్న ""వీర యువక జవానులం ,! ,"",,,
,గ్రామాల్లో పసిడి పంటలు పండిస్తున్న ""యువ రైతన్నల ము !""!,
నల్ల బంగారం వెలికి తీసే ""యువ శ్రామికుల ము,"",!!
,,విదేశాల్లో ,వైజ్ఞానిక , సాంకేతిక ,, విద్యా రంగాల్లో కూడా మన భారతీయత సత్తా చాటుతున్న ""యువ విద్యావంతుల ము,,""!!
అన్ని రంగాల్లో ప్రతిభ,ప్రావీణ్యత ప్రదర్శిస్తూ మనదేశ ఆధ్యాత్మిక,సాంకేతిక , పారిశ్రామిక ప్రగతిని ,చాటి చెప్పే "" నవ భారత
యువకులము "",,!
,,,,సనాతన హిందూ ధర్మానికి ""వారసులం !!"",
,,"",సత్యం ధర్మం న్యాయం ,అహింస "" విలువలు , కాపాడుతూ , ,, ఉన్నస్తితి నుండి ,ఉన్నతస్తితి కి ఎదిగే ప్రయత్నం నిరంతరం చేస్తున్న "సాధకులం "!
,మాత్రు భూమి సేవకై పరిశ్రమ చేసే దిశలో,దీక్షతో యువకులు గా మా " సత్తా"" చూపుతూ, మా వంతు గా క్రమశిక్షణ తో అభ్యుదయ వికాస ఉద్యమాలు నిర్వహిస్తూ ఉండాలని సదా ఆకాంక్షించే ""నవ యువకులం !!"
ముఖ్యంగా , విదేశీ సంస్కృతి సంప్రదాయాలను వెర్రిగా అనుసరిస్తూ,మన ధర్మాన్ని చెడగొట్టుకోకుం డా, ,,తగిన జాగరూకత తో వ్యవరిస్తున్నా ము!
ఇదే ఫిబ్రవరి నెలలో ,,రాబోయే ,24 వ తేదీన ,వాలెంటైన్ రోజున , మా యువ శక్తి , తమ ఆలోచనా ధోరణి లో ,ఒక వినూత్న మార్పు రాబోతుంది !!
ఏటా ,,ఇదే రోజున ,
మేము ,,మా స్నేహితులతో వినోదాలు,విందులు , చేస్తూ, మత్తు పానీయాలు త్రాగుతూ ,ఒళ్ళు తెలియకుండా రాత్రిళ్ళు గడుపుతూ, , ఊగుతూ, తూగుతూ , క్లబ్బు ల్లో గడిపాం , ! తోటి ఆడపిల్లల తో,అసభ్యంగా పిచ్చి గా డాన్స్ లు చేస్తూ, ఇంట్లోవారికి తెలియకుండా , దాస్తూ ,వికారంగా ప్రవర్తించేవాళ్ళం !!
,,, దేశ ఉజ్వల భవిష్యత్తు ను శాసించే మా యువత ,అలా , నైతికంగా దిగజారి ,, ప్రక్కదా రి పట్టకూడదని మాకు మే మే నిశ్చయించాము ,!!,
,,,మేము ఏం చేయాలో,,,దేశ ప్రగతిలో మా కర్తవ్యం ఏమిటో ,,సూచిస్తూ ,,మా యువతకు చక్కని మార్గదర్శనం చేశాడు స్వామీ వివేకానంద,,!
! మా యువతకు శక్తి , స్ఫూర్తి,,ధ్యేయం ఆయన వీరోచిత వ్యాఖ్యలే !!"
""అభ్యుద యం ,ఆశయం, జీవిత ధ్యేయం అనేది లేకుండా,,దానికి తగిన పరిశ్రమ చేయకుండా , వ్యర్థ సంప్రదాయాల క్రుళ్లు వ్యవస్థలో , మునిగి తేలుతూ, తమ అమోఘమైన తెలివితేటలను,,అద్భుతమైన శక్తినీ,,విలువైన తమ సమయాన్ని , దేశానికి వినియోగించకుండా , అలా నిర్వీర్యం చేసుకుంటున్న ఓ యువకు ల్లారా,చావండి !!" "అన్నారు ఆయన,
,,, భగవద్గీత ద్వారా , శ్రీకృష్ణుడు ,, మా యువత కు చక్కని జీవన విధానాన్ని,, బుద్ది బలాన్ని, శక్తి చైతన్యాన్ని,కర్తవ్యాన్ని సూచించాడు. ,!!
,"" తెలియక తప్పు చేసినవారి తో, బాటు ,,తప్పు జరుగుతూఉందని తెలిసి మౌనంగా చూస్తూ ఉన్నవారు కూడా నేరస్థులే !!""అంటూ, జీవితంలో తారసపడే అన్యాయాన్ని అక్రమాలను ఎదు ర్కొనే ధైర్యాన్ని ,జ్ఞానాన్ని ఆత్మశక్తి నీ మాకు అనుగ్రహించాడు గీతాచార్యుడు ,శ్రీకృష్ణ భగవానుడు,!!
,,ఇన్ని రోజులూ,మేము మూర్ఖత్వం తో అలా, విదేశీ సంస్కృతి ని మూర్ఖంగా అనుసరిస్తూ,, ఆ రోజున అమానుషంగా ప్రవర్తిస్తూ వచ్చాం ,!!
ఇకముందు అలా జరగదు !!
అది తప్పు అని మాకు , తెలుస్తోంది ,!!
ఇంత వరకూ ఆ రోజున ,,మేము మా స్నేహితులతో , ఎక్కువగా సమయాన్ని గడిపాము వారితో ,కేళీ విలాసంగా ,సినిమాలు , షికార్లు, హోటల్, క్లబ్ లు అంటూ త్రాగుతూ ,విచ్చలవిడిగా తెగ తిరిగాం !!
,,,అదే సంతోషం ,!అదే స్వర్గము ""అనుకున్నాం !కాని,,ఇప్పుడు ,అది ""తప్పుడు అభిప్రాయం ""అని . మాకు తెలిసింది !;
మా దేశ ప్రతిష్ట కుటుంబ గౌరవాన్ని భంగ పడేలా ఉన్న మా అసభ్య ప్రవర్తనకు ఇప్పుడు ,నిజంగా నే ,, మేం సిగ్గు పడుతున్నాం !!
బయట మేము అడే పాడే ""తాన తందాన"" విలాసాల ఖర్చులు ,కేరింతలు ,, మా తలిదండ్రుల కు తెలియనీయకుండ జాగ్రత్త పడుతూ,, వారిని మోసం చేశాం !!
నిజం తెలిస్తే , పరువూ పోతుందని , అయినవారికి ,ఆత్మీయులకు ,మొహం చాటే శాం !!
ఇకనుండి , ఇలా మాకు అలా ,మాకు మేమే ఆత్మవంచన చేసుకొని , కన్నవారికి,అవమానాలు తలవంపులు ,తెచ్చే నీతి మాలిన పనులు, ఇక ముందు చేయ బోమని నిశ్చయించా ము,,! ""
,, ,, అత్యంత పవిత్రమైన మన హైందవ ధర్మాన్ని అవహేళన చేయడం,మానవత్వం విలువలు మరచిపోవ డం ,మన సంస్కృతి సంప్రదాయాలు విస్మరించడం ,,ఇదంతా చూస్తుంటే , ,మేము ఎంత పెద్ద పొరబాటు చేశామా !! అనిపిస్తోంది. ,,,
Father's day, mother's day , valentine's day అంటూ మన తల్లిని తండ్రిని ,స్నేహితులను ప్రేమించడానికి ఒకే ఒక రోజును కేటాయిస్తు,,పవిత్రమైన వారి ప్రేమ వాత్సల్యా న్ని ,అప్రతిష్ట పాలు చేస్తుండడం బాధగా ఉంటోంది ,, దాని పేరు మీద పబ్బులు ,జల్సాలు,మజాలు, దానిపై వృథా ఖర్చులు చేసుకునే తుచ్చ మైన ఆంగ్ల సంస్కృతిని విడిచి పెట్టేస్తాం !!
పవిత్రమైన , ఆ స్నేహ బంధాన్ని , ఇంట్లోనే ఉంటున్న మన ఆపద్బాంధవుడు,, అనాథరక్షకుడు ,, , ఆ గోవిందుని తో ముడి వేసుకుంటాము అని మీకు తెలియజేస్తున్నాం .
,,అతడిని ,, మా ఆత్మీయుడు గా, ఆప్త మిత్రుడు గా, అత్మ బంధువుగా , అదే 24ఫిబ్రవరి రోజున స్వీకరిస్తూ, మా ఇళ్లలోనే ఆనందంగా ఉంటాం !!
,, , రోజుకు ఒక స్నేహితులను మారుస్తూ, "",,స్నేహం"" అనే పవిత్ర భావన కు అర్థంలేకుండా చేయడం నిజంగా సిగ్గు చేటు పని !!
""హరే కృష్ణ హరే కృష్ణా కృష్ణ కృష్ణ హరే హరే !,,,,"" అంటూ అంతర్జాతీయ స్థాయిలో మన దేశ ఆధ్యాత్మిక అమృతవాహిని వైభవాన్ని ,,చాటుతున్న హరే కృష్ణ ఉద్యమం ,చూస్తుంటే , మహోన్నతమైన మన దేశ సంస్కృతి ఎంత గొప్పదో తెలుస్తోంది !!
వారు మన ,కృష్ణ శక్తి చైతన్య ప్రభా వాన్ని, ఖండాంతర వ్యాప్తి చేస్తున్నారు,,
ఆ విధంగా ,,విదేశీయులే మనదేశ సంస్కృతి వైభవాన్ని , పాటిస్తూ ఉంటే,మన మే ,మన దేశ ప్రాభవాన్ని నిర్లక్ష్యం చేయడం"" ఘోర అపరాధం ""అని గ్రహిస్తున్నాం !!""
,,,జీవితాన్ని సుఖమయం చేసే ఆ గోవిందుని శరణాగతి మా యువతకు శ్రీరామ రక్ష !;! గా శిరసా వహిస్తూ,ఉన్నాం !!
ఇంతటి గొప్ప శుభవార్త ను మీకు తెలియజేస్తూ ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది!!
,,, అనుకోకుండా ప్రాణ స్నేహితుడిగా మారిన గోవిందుడు , ఇక ఎన్ని వాలెంటైన్ డే లు వచ్చినా కూడా, మారడు,!!
మా యువతకు వెన్నం టే ఉంటాడు !
గోవిందా,, నిన్నే నమ్ముకున్న మా యువత,,చేసుకున్న సంకల్పం సిద్దించెలా కరుణించు !
అంతే కాదు,,మేము నిన్ను తలవడం ,మరచినా ,నీవు మాత్రం మమ్మల్ని, మన స్నేహ బంధాన్ని మరవ కు!!మమ్మల్ని విడవకు స్వామీ ,! మా నిర్ణయం చెదరకుండా ఉండేందుకు ,, మనో బలాన్ని, అత్మ విశ్వాసాన్ని ,స్ఫూర్తిని అనుగ్రహించు ,గోవిందా !, మా కు హితుని వై,, స్నేహితుని వై , సర్వరక్షకు డ వై,, మోక్ష ప్రదాత వై,,,దౌర్యాన్ని ఇస్తూ ఉండు తండ్రీ !!""
ఎన్ని తరాలు ,యుగాలు మారినా ,మారని దైవం, ఆ గోవిందుడే !!
అతడే మా కుల దైవము ,,! ఇష్ట దైవం !కష్టాలు తొలగించే , పర దైవము !!, నీవే
గోవిందా! ,నీవే మా పాలిట దిక్కు,!నీకే శరణు !,
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!!""
Wednesday, February 19, 2020
వాలెంటైన్ నేస్తం
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment