Saturday, February 8, 2020

నీపై బుద్దులు మాకు ఇమ్ము , కరుణ న్ నీరేజ పత్రేక్ష ణా !

నీపై బుద్దులు మాకు ఇమ్ము , కరుణ న్ నీరేజ పత్రేక్ష ణా !
Feb 6, 2020
________&_______
, ""నీల మేఘ శ్యామ సుందరుడు, మురళీ నాద విశార దుడు,, భక్త వత్సలుడు ,,  పరమాత్ముడు ,,ఆ గోవిందుని  ,తన బాల్య  స్నేహితుడిగా పొందిన సుదాముడు ,,నిజంగా ఎంత భాగ్యవంతు డో కదా !!
రెండు పిడికిళ్లు అటుకులు భక్తితో ప్రీతితో  ప్రేమతో, ఆ వాసుదేవుని కి సమర్పించి ముక్తి ధామాన్ని  పొందాడు  ఆ పేద బ్రాహ్మణుడు ,,
భగవంతుడు భక్తుని అంతరంగం లో కలిగే భావ సౌందర్యాన్ని గుర్తిస్తాడు, కరుణిస్తాడు , బాహ్యాడంబరాల కు లొంగ డు ,,పొగడ్తలకు పొంగడు !!
,,,  ఉదాహరణ . గా ,,చెప్పాలంటే  ఒక, చిన్న కథ !!
ఒక పేదవాడు చిరిగిన బట్టలతో,చెప్పులు లేకుండా, ఒక భిక్షా పాత్ర తో ,ఒకరోజు ఒక ఊరిలో భిక్షాటన  చేస్తూ ఆకలికి నకనక లాడుతూ ,గంపెడాశతో , ఒక ధనికుని ఇంటి తలుపు తట్టాడు !
,, ఇంటి యజమాని,,ఒక శ్రీమంతుడు   ,!ఆయన తలుపు తెరచి ,  దీనావస్త లో ,,దేహాన్ని కప్పలేని చిరిగిన మాసిన బట్టల తో నిలుచున్న ఆ   బిచ్చగా డిని  చూసి అసహ్యించు కొని ," చీ " పో ,"!"అంటూ , తలుపు వేశాడు ,,
పాపం ఆ పేదవాడు ,అలానే తిరుగుతూ ఉంటే,మరొక వ్యక్తి జాలిపడి, భోజనం పెట్టించి ,అతడి మాసిన  బట్టలను తీసేయించి ,కొత్త బట్టలను ధరింప జే సి,, బిచ్చగా డి మొహంలో కనిపించే అనందం  చూస్తూ ,, తాను తృప్తి చెందాడు ,,
,మరునాడు ఆ బిచ్చగాడు,, అదే శ్రీమంతుడు ఇంటి ముందు నిలబడి , ""అయ్యా ! ధర్మం చేయండి !"" అంటూ తలుపు కొట్టాడు !
అరుపు విని యజమాని వచ్చాడు ,చూశాడు , గుర్తించాడు ,, కానీ, వెళ్లగొట్ట లేదు,,
,,,చక్కని బట్టలతో  పరి శుభ్రంగా కనిపిస్తున్న  ఆ పేదవాడి ని  ఆగమని చెప్పి లోనికి వెళ్లి ఆహారం తెచ్చాడు ,,!!మొదట అన్నం పెడితే ,, బిచ్చ గాడు అన్నం ను
జోలెలో  వేశాడు , పప్పు, కూర ,పచ్చడి , ఇస్తే,వరుసగా అదే జోలెలోనే  వేశాడు,
చివరకు పులుసు ఇస్తే, అతడు చూస్తుండగానే  దాన్ని కూడా జోలెలో పోశాడు !!
అది చూసి ఆయనకు అసహ్యం వేసింది,
""ఏం మనిషివి ??,వేషం మార్చుకున్నా , నీ బుద్ది మాత్రం  మారలేదు కదా!""చీ !!"" అన్నాడు ,
అప్పుడు  ఆ పేదవా డు అతడికి  ఇచ్చిన  జవాబు  మనలను కొంత అలోచింపజేస్తు ఉంటుంది !!
""అయ్యా,!, నిన్న మీరు నన్ను చీత్కారం చేసి వెళ్ల గొట్టారు,, ! కానీ  ,,ఈ రోజు కమ్మని భజనం  పెట్టారు,!
ఎందుకు ,,,,?
నేను ధరించిన దుస్తులను చూసే  కదా !
అంటే ,మీరు పెట్టిన ఆహారం ,,ఈ దుస్తులను గురించి అయినపుడు , ఆ భోజనం ఆ బట్టలకే చెందుతుంది కదా !
శరీరం లో వెలిగే జీవాత్మ ను గుర్తించకుండా ,
బయట ఉన్న  బట్టల అడంబరాన్ని చూసి సంబరపడే ,,మీ ప్రవర్తన  పట్ల అసహ్యం ,,,మీ అజ్ఞానానికి జాలి వేస్తోంది సుమా !,
వచ్చే జన్మ లోనైనా,, నా వలె బిచ్చగాడు గా మీరు  పుట్టకుండా ఉండాలంటే మీ,,ఇంటికి వచ్చిన వాడిని ,,ఇకనైనా ,, దైవంగా భావించి ,మీకు   ఉన్నది పెట్టీ, మనిషిగా బ్రతుకుతూ ,,పుణ్యాన్ని సంపాదించు కొండి,,!" నమస్కారం !""
అంటూ జ్ఞానబోధ చేసి వెళ్లి పోయాడు
అలా భగవంతుని నమ్మి , చరించే వాడు  ,,పేదవాడు అయినా ,,తృప్తి తో ,ప్రశాంతంగా, ఆనందంగా ఉంటాడు !!
,,, ఇదే ధర్మం !, ఇదే న్యాయం !!ధర్మం అంటే,ఇతరులకు హాని, బాధ,కష్టం లాంటి వి కలిగించకుండా సహాయపడుతూ ,, సంతోష పెడుతూ  ,జీవించడం!!!
అందరితో సంతోషంగా ఉండడం ,!!నిజం చెప్పడం ,!! ఉన్న దాంట్లో,, కొంత ఇతరులకు దానం చేస్తూ బ్రతకడం !! తలిదండ్రుల సంరక్షణ  ప్రేమతో చేస్తూ ఉండడం!!!,దైవభక్తి ,  పెద్దవా రి యెడ  గౌరవమర్యాదలు ,,,గురువుల పట్ల వినయ విధేయతలు కలిగి ఉండడం ,!!,సనాతన ధర్మం పట్ల ,భాగవత ,భారత రామాయణ గ్రంధాల పఠనం ,అధ్యయనం చేస్తూ , ధర్మం న్యాయం సత్యం ,అహింస ,లాంటి ఆధ్యాత్మిక విలువలు తెలుసుకుంటూ,జ్ఞానాన్ని పెంచుకొంటూ ఉండడం !! ,అనాథలకు ,వృద్దులకు., మూగ జీవాలకు   తోచిన  ,సహాయం చేయడం ,,,  లాంటి ఉత్తమమైన ,ఉన్నతమైన ఉత్కృష్టమైన కర్మలే , ప్రతీ మనిషీ తన జీవితంలో క్రమం తప్పకుండా ఆచరించవలసిన  ధర్మాలు !!!,
ధర్మం తెలియాలంటే ,ఉండాల్సింది భగవంతుని పట్ల అచంచల విశ్వాసం ,! ప్రతీ క్షణం దైవాన్ని కృతజ్ఞత తో స్తుతిస్తూ స్మరిస్తూ, ఆరాధిస్తూ  బ్రతుకుతూ ,,చేయాల్సిన అత్మ సమర్పణ భావం !.
,, బంధువులు ,స్నేహితులు , రక్త సంబంధం గలవారిని ,,,ఎవరిని నమ్మినా నమ్మకపోయినా,గోవిందుని మాత్రం  నమ్మాలి!
,,,అలా నమ్ముతూ  జీవించేవారు గోవిందుని కృపకు పాత్రులు అవుతారు,!!అందరికీ ఆనందాన్ని అందజేస్తారు వారు !!
అంతటా తానై, అన్నీ తానై, అందరిలో తానై,, ప్రాణుల మనుగడకు, సృష్టి  స్తితి లయాలకు ,కాలచక్ర భ్రమనానికి  , కారణ భూత మై,, సూర్య చంద్రుల రూపంలో ,, కళ్ళ ముందు నిత్యం వెలుగొందుతూ దర్శన మిస్తు ఉంటున్న  ,,,ఆ పరాత్పరుని మరవకుండ ,,విడవకుండా మనవాడు గా చేసుకుందాం ,!!
అందుకు ముందుగా ముకుందుని ఆర్తితో వేడు కుందా ము ,,!
""శ్రీకృష్ణా, !!గోవిందా! పురుషోత్తమా ,పుండరీకాక్ష !!, మురారీ,!నిన్ను నేను కనలేను! , పట్టలేను,! ఊహించలే ను,! కొలవలేను!, తలవలేను కూడా!!
తండ్రీ !!, నిరంతరం నిన్ను  స్మరించడానికి  ఆశక్తుడ ను! అసమర్థుడను ,,! పైగా పాపాత్ముడ ను , అచ్యు తా
""నారాయణా!!,నవనీత హృదయా !!, మా  ఈ అసమర్థ జీవన విధానం పై జాలి చూపుము, దేవ దేవా !!
, కన్నులు ఉండి  కూడా ,,నిన్ను కనలే ని ,,మా గ్రుడ్డి బ్రతుకులపై దయ చూడుము
స్వామీ , !!నంద గోపాలా,,!
నిన్ను భజించే  స్ఫూర్తిని  ,భావ సంపదలను మాకు  అనుగ్రహించు ,!! కేశవా శరణు!! మాధవా , శరణు !!
వేణు గానలోలా శరణు !""
స్వస్తి !!""
హరే కృష్ణ హరే కృష్ణా !""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...