Wednesday, February 19, 2020

శ్రీకృష్ణుడు అంటే ఎవరు ?

Feb 11, 2020
""శ్రీకృష్ణుడు అంటే ఎవరు ??""
______&______
శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు ,అంటే సర్వం ఎరిగిన వాడు,పరమాత్ముడు ,భగవంతుడు ,, అనే జ్ఞానం ధర్మం న్యాయం సన్మార్గం , తో జీవనం గడిపే వారికే ఉంటుంది  !!
""ఊరకే ఎవరికి డబ్బులు  రావు !"",,అన్నట్లుగా ,జీవితం ఎవరికి వడ్డించిన విస్తరి కాదు,!
బ్రతుకు దారిలో ,గులాబీలు ఉంటాయి ,అక్కడే  కనపడకుండా ముళ్ళు  కూడా ఉంటాయి,,!!
""జీవితం అంటేనే కష్టం సుఖం !!,చీకటి వెలుతురు,,!!రాత్రి అయ్యాక పగలు కూడా వస్తుంది ,!
,అందుకే ఎవరికి కష్టాలు కలకాలం ఉండవు,అలాగే సుఖాలు కూడా ,,
నీటి లో అలల వలె వస్తుంటాయి,, పోతుంటాయి,!
కానీ గమ్మత్తు ఏమిటంటే, ఈ " విష్ణుమాయ""ను అర్థం చేసుకుంటూ తట్టుకునే ఆత్మస్థైర్యం  ఉండడం అంత సులభం కాదు , సాధన చేస్తూ ఉంటేనే అది  ""వ్యక్తిత్వం"" అనిపించు కుంటుంది!!
సంయోగం లో అనందం !, వియోగం లో దుఖం !, ఈ విధంగా రెండూ కలబోసిన  జీవితం అనబడే చదరంగం లో  మనల్ని పావులు గా చేసి ఆడిస్తున్న ఆ పైవాని లీల, అని  ప్రతివాడూ అనుకోక తప్పదు కదా !!
  పడుచు భార్య నూ, కొడుకు లను విడిచి ,,శాశ్వతంగా వెళ్లి పోయె భర్తలు ,,,,
భర్తను సంతానాన్ని ,, విడిచి కళ్ళు  మూసిన భార్యలు,నిన్న సంసారం ఈ రోజున స్మశానం ,ఎందరో అనాధలు ,వికలాంగులు , , ఎంతో మంది ని చూస్తున్నాం ,
బాధ పడని వారు లేరు,దేవాలయానికి పోని వాడు ఉండవచ్చు, కానీ, హాస్పిటల్ కు వెళ్లని వారు ఉండరు కదా !!
ఎవరూ బాధలు కోరుకోరు,కానీ బాధలు అవే వస్తూ పోతు ఉంటున్నాయి ,!!
సంతానం విడిచి చావలేక, ఒంటరి జీవితాన్ని భరించలేక ,దినదిన గండంగా ,బ్రతుకు భారంగా ఈడుస్తున్న నిర్భాగ్యు లు ఎందరో ఉన్నారు,,
ఏదైనా తనదాకా వస్తేనే తెలుస్తుంది ,
చిత్రం ఏమిటంటే ,సుఖాన్ని పంచుకోవచ్చు కానీ,కష్టాలు మాత్రం ఎవరికి వారే అనుభవించకుండా తప్పించు కోలెం కదా !!
అందుకే ,జీవితాన్ని నటిస్తూ గడిపే కన్నా ,,బ్రతుకులో జరిగే ,ఇలాంటి దారుణాలు అర్థం చేసుకునే స్తిత ప్రజ్ఞత ను,, ""భగవద్గీత ""లాంటి ఉత్తమ గ్రంధాలు చదువుతూ పొందే ప్రయత్నం  ప్రతివారు చేయాలి!!
ఏది చేసినా , చేస్తున్నా,చేయబోతున్న కూడా"",మనం చేసే సంకల్పాన్ని భగవంతుని కి తెలుస్తోంది  !!""అని  మనం గ్రహించాలి ,,
మనం చేసే ఉన్నతమైన ఆలోచన కు,, ఆచరణ కు దైవం ,కొంత పరీక్ష లాంటిది పెడుతూ భగవంతుడు  అనుకూలి స్తూ వుంటాడు,!!,
కానీ ,,అదే చెడు మాటలు,, పనులు , వాటి ఫలితాలు  మాత్రం మనమే భరించాల్సి వస్తుంది !!,
అనగా  ""భావన లోనే,జీవన మాధుర్యం"" ఉంటుంది ,!
""మనసు పడితేనే మాధవుని ప్రేమ కరుణ  అనుగ్రహం""" కలుగుతుంది,! ఇందుకు తార్కాణంగా
భారతం లో ఒక సంఘటన చూద్దాం ,!!
,, భారత మహా సంగ్రామం ఆరంభంలో,, పతివ్రతా శిరోమణి గాంధారి,  ఒకనాడు తన కొడుకు సుయోధనుని దగ్గరకు  పిలిచి "",,నాయనా! రాబోయే  యుద్ధంలో నీవు అజేయుడుగా ఉండాలి అంటే  , నీ ది వజ్రశరీరం కావాలి !అది నేను చేస్తాను  , నా కంటి చూపు ద్వారా,,,!!
,, అందుకు నీవు,, రేపు ఉదయం ప్రాతః కాలం ,,చీకటి తొలగ క ముందే ,స్నానం చేసి దిగంబరంగా , నా వద్దకు వచ్చెయ్యి!!,, నీ  శరీరం పై ఎక్కడా,  ఏ రకమైన  ఆచ్చాదన  ఉండకూడదు సుమా ,!!""అని పంపిస్తుంది
సుయోధనుడు సంతోషంతో వెళ్తాడు ,!!
అనుకున్నట్టే తెల్లారి  తన తల్లి ముందుకు వచ్చి ""అమ్మా ! నీవు చెప్పినట్టే చేశాను,వచ్చాను!"" అంటాడు
గాంధారి , , దృతరాష్ట్రుని తో  వివాహమైన  రోజునుండి  తన కళ్ళకు గంతలు ధరిస్తూ వచ్చింది,!!, ""నా భర్తకు లేని చూపు నాకు అవసరం లేదు!"" అంటూ, పతివ్రతా ధర్మం పాటిస్తూ,భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఉండడం వల్ల ""ఆమె చూపు ""కు  అమోఘమైన శక్తి ప్రాప్తించింది !!
,ఇప్పుడు , యుద్ధంలో తన కొడుకు విజయం కోసం ,ఆమె ఈ సంకల్పం చేస్తోంది!!
,గాంధారి ,, అమితమైన అనందం తో,,  తన కళ్ళకు కట్టుకున్న గంతలను ,తొలగించి ,సుయోధనుని ఆపాదమస్తకం పరికించి చూసింది ,,!!
ఆమె చూపు పడిన అతడి శరీర భాగం అంతా ,,వజ్ర సమానంగా,, దుర్భేద్యంగా ,, కటినంగా తయారైంది !!
కానీ,అతడి కటివద్ద మాత్రం చిన్న గోచీ లాంటి బట్ట,మాత్రం ,అతడి మాన సంరక్షణ చేస్తూ  ఉండడం చూసి ,,
ఆమెకు పట్టరాని కోపం వచ్చేసింది !!,ఉగ్ర రూపంలో ఊగిపోతూ,
""సుయోధన !,నేను చెప్పింది  ఏమిటి  ?? నీవు చేసింది  ఏమిటీ ? """ అంటూ ,  గట్టిగా అరిచింది
,, తల్లి కోపం చూసి సుయోధనుడు భయపడుతూ ,"",అమ్మా ! మరీ నగ్నంగా కనిపించకుండా ఇలా చిన్న బట్ట అడ్డం పెట్టుకున్నాను!"" అన్నాడు
""ఈ బుద్ది నీకే పుట్టిందా ??లేక ,,
ఎవరైనా  నీకు చెప్పారా?? అని గద్దించింది !!
""లేదు అమ్మా !!  నీవు చెప్పినట్టే స్నానం చేసి వస్తుంటే , తోవలో కృష్ణుడు కనిపించాడు ,,నాకు మానం గా ,,అవమానంగా ,, అనిపించింది  సిగ్గు పడుతూ ,చేతులు అడ్డం పెట్టాను,!
""రాత్రి వేళ , చీకటి పూట , ఇలా నగ్నంగా ,ఎక్కడికి వెళ్ళడం??  ఇంత బరి తెగించా వేమిటి !!??ఏమిటీ విషయం బావా??"",అని పరిహాసం చేస్తూ ఉంటే నేను అసలు విషయం కృష్ణయ్యకు  చెప్పాను, అమ్మా !!
దానికి అతడు నవ్వుతూ ,, ""ఆడవారి మాటలకు అర్థాలే వేరు, అంటూ,, ""ఎంత కన్న తల్లి అయినా ఆమె అడది కదా. !పురుషులు కన్న కొడుకైన సరే ,, ఇంత వయసులో ,ఇలా నగ్నంగా  ఆమె ఎదుట పడటం , సిగ్గు అనిపించడం లేదూ !!, కాస్త కను చాటు ఉండాలి కదా బావా !; అయినా,,
ఎక్కడైనా ఇలాంటి విడ్డూరం ఉంటుందా చెప్పు !"""అంటూ గేలి చేస్తూ,"" బావా !!కనీసం నడుము వద్ద తొడలు కనిపించకుండా  ఒక చిన్న బట్ట  అయినా అడ్డం పెట్టుకొని వెళ్ళ రాదూ !"" అంటూ సలహా ఇచ్చాడు !!
నేను నిజమే కదా అనుకున్నాను అమ్మా !"", అంటూ అసలు విషయం చెప్పాడు సుయోధనుడు,,
""నల్లవాడు కనిపించా డా,?? నల్లపిల్లి లా శకునం  గా దాపురించాడా ,సుయోధన ???.మన   కొంప ముంచాడు కదరా కొడకా,,!!
అయినా ఇంత ప్రొద్దున ,మన అంతః పురంలో , ఇక్కడ నా అంతరంగిక మందిరం లో  ఆ మాయదారి   కృష్ణునికి ఏం పని రా,,నాయనా ??
ఎందుకు వచ్చినట్టు  అతడు ఇక్కడికి ??
ఎవరు చెప్పారు , ఈ విషయం  అతడికి ??
నీకూ నాకూ మాత్రమే తెలిసిన ఈ  దేవ రహస్యం ,ఎక్కడో ఉన్న ఆ నల్లవాడికి ఎలా తెలుస్తుంది ??
ఎవరు చెప్తారు?""
ఎలా వచ్చాడు ,,??""
నా మనసులోని ఆలోచన అతడికి ఎలా తెలుస్తుంది ??
,,గాంధారి తల పట్టుకుంది,, పుత్ర వ్యామోహంతో,,అధర్మాన్ని  అక్రమా లని, అన్యా యం తలపెడుతు ,చేయరాని దుర్మార్గాలు చేస్తున్న  పాపాత్ముడు తన  కొడుకును అజేయుడుగా , విశ్వ విజేతగా  చూడాలని దురాశ  పడిన  గాంధారి  సంకల్పం , పరమాత్ముని కి  తెలియకుండా ఉంటుందా??
ఒక్క గాంధారి మాత్రమే కాదు ,మనం అందరం అంతే, ఎవరూ లేరని,రోజుకు ఎన్ని నాటకాలు అబద్ధాలు అక్రమాలు అన్యాయాలు చేయడం లేదు !!?? ,
కళ్లముందు నడయాడే శ్రీకృష్ణుని పరమాత్ముడు గా తెలుకొలేని  గాంధారి లాంటి  దుర్మార్గులు ఆ రోజుల్లో  ఎందరో   కదా !!
అందరూ అగ్నిలో పడే మిడత ల వలె, కృష్ణార్పనం అయ్యారు !!
""పరిత్రాణాయ సాదూనాం ,వినాశాయచ దుష్కృతాం!!
,ధర్మసంస్థాపనార్థాయ ,,సంభవామి యుగే యుగే !""
అంటూ శ్రీకృష్ణ పరందాము డు,, స్వయంగా  తన అవతార పరమార్థాన్ని వివరించాడు,,!
అప్పుడే కాదు ,,ఇప్పుడు కూడా,,ఇక్కడ ,, మన ప్రక్కన ఉంటూ ,మన చర్యలను నియంత్రిస్తూ ఉంటున్నాడు శ్రీకృష్ణుడు ,,!అని జాగ్రత్త పడుతూ, ఆ ధ్యాసతో  ,బ్రతకాలి ,!;
మనం చేసే ఆలోచనలు కృష్ణయ్య కు తెలుస్తూ ఉంటాయి అనీ,చక్కగా లేకపోతే, వంకర మార్గంలో నైనా సరే,,చక్కపెట్టి తీరుతాడు !!""అన్న పరమ సత్యాన్ని గ్రహిస్తూ ,జీవితాన్ని శ్రీకృష్ణ ధ్యానంలో , శ్రీ కృష్ణ భావంతో   సాధన చేస్తూ బ్రతుకును  ఆనంద మయం చేసుకుందాం !""
""కృష్ణాయ వాసుదేవాయ ,, దేవకీ నందనాయచ ,,! నంద గోప కుమారాయ,, గోవిందాయ నమో నమః  !""
""స్వస్తి !""
""హరే కృష్ణ హరే కృష్ణా!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...