Wednesday, February 19, 2020

ఎలా తెలుస్తుంది కృష్ణునికి ?

Feb 14, 2020
""ఎలా తెలుస్తుంది కృష్ణునికి ?"
_____&-______
,"" ఈర్ష్యా ద్వేషాలు"" మనిషి పతనానికి ఎలా దారి తీస్తాయో , మహా , పతివ్రత లు కూడా , ఆ దావాగ్ని లో  తాము తీసుకున్న గోతిలో తామే పడి ,,తమ  సమస్తమూ కోల్పో యారో ,  తెలుసుకుందాం !! ,,,
,గాంధారికి  కృష్ణుని పై కోపం , కసి ,రోషం లాంటివి ఏర్పడి , తన కొడుకు సుయోధనుని లక్ష్యానికి అడ్డుగా వస్తున్న అతడి పట్ల ,పగ పెంచుకుంది,!!
కొడుకును రహస్యంగా పిలిచి చెప్పింది ,,
""సుయోధన,! నా ప్రియ పుత్రా !! ఈ ఒక్క  విషయం  గ్రహించు , నాయనా !!
,మన పక్షాన ఉంటున్న ఈ భీష్మ పితామహుడు వాస్తవానికి  పాండవ పాతి,,!!
,వారికోసం ఆయన ఏమైనా చేయడానికి సిద్దపడుతూ ఉంటాడు సుమా !!"
అతడు సత్య వాక్ పరిపాలకుడు,!!దైవాంశ సంభూతుడు ,!
అతడి నోటి వెంట వచ్చిన ప్రతీ మాట సత్యమై తీరుతుంది ,!!
నీవు వెళ్లి అతని శరణు కోరు కొడుకా !!అతడిచే  , చిరంజీవి గా దీవన పొందు !!, వెళ్లు !!"" అని అఙ్ఞాపిస్తుంది  ఆమె!!
అతడువెళ్ళాడు,!
,ఆచార్యుని కాళ్లపై పడ్డాడు!! ,తల్లీ చెప్పిన విధంగా కోరాడు!!
శరణు కోరిన వారి ని అనుగ్రహించక తప్పదు కనుక ,, ఆచార్యుడు అన్నాడు
*""సుయోధన !  రేపు మంచి రోజూ ! జయం కలిగించే  శుభ దినం !;
,,నీవు కోరిన విధంగా జరగాలంటే ,,నీ భార్యను రేపు ఉదయం ప్రాతః కాలం సూర్యోదయానికి ముందే లేచి ,,శుచిగా ,ఒంటరిగా ఎవరూ చూడకుండా,,ఆమెను  నా వద్దకు పంపించు ! సరేనా !;
అప్పుడు ,,,ఆమెకు నేను ఇచ్చే ఆశీస్సులు,, నీకు చిరంజీవ త్వాన్ని  ఇస్తుంది !""ఇక వెళ్లు !!""
అని పంపించాడు , భీష్మా చార్యు డు,,
,సుయోధనుడు పరమ సంతోషంతో వెళ్ళాడు,,
మరునాడు పితామహుడు బ్రహ్మీ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు, జప తపా దులు ముగించుకొని , సుయోధనుని భార్య రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు !!
""అదిగో! , రానే వచ్చింది ఒక స్త్రీ మూర్తి,! రాణీ వాస వనితలు  , అంతః పురం దాటి వచ్చినపుడు ,,తమ ముఖం కనిపించకుండా , తల పైనుండి  జరీ అంచు మేలిముసుగు ధరిస్తు, ఉంటారు ,!
, అలా వచ్చి తన పాదాలను తాకు తూ, వంగి ప్రణామం చేస్తున్న కాంతామణి కి , సాద్వికి మనసారా  దీవించాడు ,పెద్దాయన,!!
""దీర్ఘసుమంగళీ భవ !జన్మ సావిత్రీ భవ ! విజయోస్తు !,శుభమస్తు!"" అంటూ సంతోషంగా ఆశీస్సులు అందజేస్తూ ,, తల వంచుకుని కిందకు చూస్తూ ఉన్న ,ఆమె రెండు భుజాలు పట్టుకుని పైకి లేపాడు  భీష్ముడు !
ఆమె లేచి రెండుచేతులు జోడించి నమస్కారం చేస్తూ ఉంటే,  , పరిశీలించి చూశాడు ,!
""ఆమె సుయోధనుని  ధర్మ పత్ని " భానుమతి ""కాదు,
వచ్చింది ,పాండవ పట్ట మహిషి,ద్రుపద రాజ పుత్రి, ద్రౌపది ,!
అతడు అయోమయం లో పడ్డాడు ,
""అమ్మా , ,నేను రమ్మని పిలిచింది  ఆ ,సుయోధనుని భార్యను ! కానీ  ఆమెకు బదులు నీవు రావడం ఏమిటి ?
ఇది ఎలా జరిగింది ?నాకు ఆశ్చర్యంగా. వింత గా ఉంది,, !!
నాకూ,  ఆ సుయోధనుని కి మాత్రమే తెలిసిన ఈ దేవ రహస్యం ,నీకు ఎలా తెలిసింది  తల్లీ !!
, నేను అఖండ సౌభాగ్య వతిగా ఆశీర్వదిస్తానని   నీకు
ఎవరు చెప్పారు , ??అత్యంత గోప్యం,మహనీయము. అయిన  నా ఆశీస్సులు పొందడానికి  , ఈ సమయంలో  ఇక్కడికి రావడం ,, నీకు ఎలా సాధ్యమయ్యింది తల్లీ,,?
,,అంటున్న పితామహుని సందేహానికి సమాధానంగా , ద్రౌపదీ దేవి, అంతవరకు తాను కనపడకుండా దాచిన తన మేలిముసుగును  తొలగించి  మరొక్కమారు భక్తితో వినయంగా మోకాళ్ల పై వంగి ,అతడికి పాద నమస్కారం చేస్తూ అంది !!
""ఆచార్యా  !, ఈ విషయంలో నన్నేమీ మాట్లాడవద్దని , చెప్పింది చేయమని మా అన్నగారు అఙ్ఞా  పించా రు !"
,,నాకు తెలియని మీ అన్నగారు ఎవరు తల్లీ ? ఏడి , ఎక్కడా   ??""
అంటున్న పితామహుని సమక్షానికి ,అంతవరకు చాటుగా నిలిచి,దృశ్యాన్ని ప్రత్యక్షంగా గమనిస్తున్న , జగన్నాటక సూత్రధారి, , ""సంభవా మి యుగే యుగే"" ,అన్నట్టుగానే , గీతాచార్యుడు, శ్రీకృష్ణ భగవానుడు ఆచార్యుని ముందుకు వచ్చి ,అమాయకంగా , ఏమీ ఎరుగని వాడిలా  అంజలి ఘటిస్తు  కనిపించాడు ,అతడికి !;,
,అంతేకాదు ,, ఆ కృష్ణయ్య చేతుల్లోంచి ద్రౌపది తన కాలి అందెలు, పాదరక్షలను తీసుకుంటూ ఉండడం , చూస్తుంటే ,అతనికి మతీ పోయింది,!!
""భగవంతునికి భక్తుల పట్ల దయ  ఇంతగా ఉంటుందా??""
,"" భక్తుల పాట్లు మాత్రమే కాకుండా వారి పాదరక్షల భారాన్ని కూడా మోస్తుం టాడా ?""
ఆహా ! నేడు ,,నేను , నా ఎదుట ,ఎంత రమణీయమైన దృశ్యం చూస్తున్నాను ??
ఎంత భాగ్యవంతులు తల్లీ మీరు !,?? సాక్షాత్తూ ఆ పరందాముడే మీ ఇంట సేవకునిగా పనిచేస్తున్నాడు కదా !!""
నా వద్దకు వచ్చే సమయంలో , వచ్చేది ఎవరో,నేను గుర్తు పట్టకుండా ఉండేందుకు, చప్పుడు కాకుండా ,,చెల్లెలి కాలి అందెలు,  పాదరక్షలు తొల గించి  బయట పరిచారకుని వలె ,తన చేతుల్లో పట్టుకొని ,,వాసుదేివుడు  నిలబడి ఉన్నాడన్న మాట !! ఏమి  నే అపార మైన కృప జగన్నాథ ?? ఆహా !!అనుకుంటూ
నల్లనయ్య  సురుచిర సుందర వదనార వింద లావణ్యాన్ని  తానివారా గ్రోలుతు , శిఖి పించ మౌళి నీ చూస్తూ సంభ్రమం అశ్చర్యాలకు లోనయ్యాడు ముసలి గాన్గేయుడు,,!!సామాన్యుడా అతడు !
పరశురాముని నిర్జించిన మహా పరాక్రమశాలి ,!
కృష్ణయ్య మందహాసం చేస్తూ అన్నాడు ,
,""పితామహ! , మీ మాట అసత్యం కాకుండా  ఉండేందుకు ,, మీ ఆశీస్సులు ,యోగ్యత గలవా రికే  లభించేలా చేసేందుకు ఇలా  చేశాను !
మీకు నా చర్యలు నచ్చక పోతే,నన్ను క్షమించండి !"", అంటూ చేతులు జోడిస్తూ ఉన్న నందగోపాలుని  చూస్తూ , గద్గద కంఠంతో, అన్నాడు ,,
""కృష్ణా ! భక్త పరిపా లకా !!నీ చూపు పడినవారిని , చెనకడం బ్రహ్మాదుల తరం కాదు కదా !, , అల్పుడ ను ,!అజ్ఞానిని ! పాపిని ! పాండవులకు  నీ రక్షణ ఉందని తెలిసి కూడా,దుస్సాహసం చేస్తూ, నా గొప్పదనాన్ని ప్రదర్శించ బోవడం  నా,నిజంగా అపరాధమే ,అవుతుంది !
""కృష్ణా!! నీ లీలలు మాయలు సుర ఇంద్రాదులు కూడా  ఎరుగలేరు , కదా ! ఇక  ,   నేనెంత వాడిని ?గోపాలకృష్ణ ,!! క్షమించాలి ల్సింది ,,నేను కాదు ,, నీవు,!! జగన్నాథ!!,అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక,!! నారాయణా!!పాహిమాం , అచ్యుత, అనంత ,గోవిందా !! కృప ఉంచి, ఈ అఙ్ఞానిని క్షమించు , తండ్రీ !క్షమించు !!శరణు !శరణు ! హే జగత్పిత !;శరణు !జనార్ధన శరణు ,!"" అంటూ దీనంగా వేడుకొన్నాడు ,, శ్రీకృష్ణ సందర్శన మహా భాగ్యం ప్రాప్తి వల్ల కలిగిన అపరిమితాన నంద ముతో,,తన  కళ్లనుండి   ఆనంద భాష్పాలు  ధారగా  జాలువారుతూ ఉండగా భక్తి ప్రపత్తులతో వాసుదేవుని కి వంగి  ప్రణమిల్లుతు   , , తల ఎత్తి చూసేసరికి  ,,అక్కడ కృష్ణుడు కానీ , ద్రౌపది కానీ ఎవరూ   అతడికి కనిపించలేదు,! అంతా మాయ లా తోచింది అతడికి!!
సరికదా, అప్పుడే సుయోధనుని ధర్మపత్ని రావడం ,
తనకు ప్రణామం చేసి వెళ్తున్న  ఆ కురు సామ్రాజ్య పట్టపు రాణిని  కూడా గమనించ కుండా,, అంతరంగం లో, శ్రీ కృష్ణ సందర్శన   బ్రహ్మానందం అనుభవిస్తూ ,పరవశిస్తూ చిత్తరువులు లా నిలబడి పోయాడు, కురు పితామహుడు ,!! గాంగెయుడు,!!, అపర వైష్ణవ భక్తాగ్రేసరుడు!!నిరంతర  ,శ్రీకృష్ణ భగవానునీ   నిత్య దర్శన లాలసుడు !;, తన వద్దకే పరమాత్ముని తప్పించుకున్న భక్తవరెన్యుడు ,,!! శ్రీ cమహా విష్ణుసహస్రనామ పారాయణ చిత్త పుణ్య పురుషుడు,!!మహానుభావుడు , మన భీష్మా చార్యు డు,!!
అక్కడ ,తన అంతః పురం లో గాంధారి మాత  అనుకుంది ,తన పంతం నెగ్గింది, శ్రీకృష్ణుడి పని అయ్యిందని !""
సుయోధనుడు కూడా  సంతోషించాడు ,,తాను ఇక అజేయు డను అనీ ,!""
ఎవరికి వారే ఇలా భ్రమలో కృష్ణ మాయలో పడి,తామే కర్తృత్వభారం వహిస్తూ,అజ్ఞానం అనబడే  అగాధం లో  మునిగి పోతుంటారు
, ఈ విధంగా ,తమకు తెలిసి జరిగినా ,తెలియకుండా జరిగినా  ఆ"" శ్రీకృష్ణుని లీలలు ""ఊహించడం అసాధ్యం ! అతడి కన్ను గప్పి,మనం ఏదో నిర్వాకం సాగిస్తామని అనుకోవడం మూర్ఖత్వం ,అవుతుంది ! ఆ లీలలు  ,మానవాతీత ము ,అద్భుతము ,అమోఘం , లోక కళ్యాణ కరము,భక్తజన హృదయా నంద కరం, కూడా !!
ఎవరికి అంతుబట్టని శ్రీకృష్ణ తత్వ  స్మరణ సుధను అందుకునే ప్రయత్నం చేద్దాం !!
,, అనుభవైక వెద్యం,అయిన శ్రీ కృష్ణానందామృతాన్ని అందరం ఆస్వాదిస్తూ 
,మన జీవితాన్ని ఆనందమయం ,చేసుకుందాం !"
స్వస్తి !"
హరే కృష్ణ హరే కృష్ణా ,!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...