Feb 24, 2020
భగవంతుడు పరమ దయాలువు ,!!
దయతో అతడు ప్రసాదించిన దివ్యమైన శరీర సంపద తో బాటు ,, దానికి అనుకూలంగా వేలాది నాడులతో ,స్పందించే భావ సంపద ను కూడా అనుగ్రహించి నందుకు మనిషి కృతజ్ఞతా భావంతో దైవం పై అనురక్తి తి జీవించాలి ,, ,
మెదడులో జ్ఞానం ప్రకోపింపజీసే కోట్లాది నాడులు ఉన్నాయి ,
కానీ అన్నీ హృదయాన్ని తాకలేవు కదా !!
ఎక్కడుంది హృదయం?? అంటే గుండెను చూపిస్తారు కొందరు !;
కానీ హృదయం అత్మ గతం! , ఆత్మానందం అనేది,, హృదయాను భూతి ని తెలుపుతూ ఉంటుంది !!
ఎక్కడుంది అత్మ ??
,,అంటే పురుషసూక్తం లో చెప్పినట్టుగా చాతీ క్రింద వరి ముల్లు కన్నా వంద రెట్లు చిన్నగా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుందట !!
మనిషి శరీరం లో ని జీవన చర్యలను నియంత్రిస్తూ , ప్రాణ వాయువు ,,ఉచ్వాస నిశ్వాస క్రియల ద్వారా నిరంతరం ,మనలో బయటకు లోపలికి కదులుతూ ,ఉంటుంది,,!
ఆ వాయువే గొంతులో ఉన్న స్వరపేటిక ను పలికిస్తూ , నోటి ద్వారా మాట,లేదా పాట రూపంలో బయటకు ప్రకటిత మౌతోంది ,
ఆ వాయు వే వేణువు లో ఊద బడి, వాని కున్న రంధ్రాల ద్వారా సప్త స్వరాలను వివిధ రాగాలలో అద్భుతంగా మధురంగా మనోహరంగా పలికిస్తూ ఉంటుంది,,; అనగా,
లోన కదిలే భావాన్ని బట్టి వాయువు స్వరపేటిక పై కదులుతూ ,తదనుగుణంగా ధ్వనినీ లేదా , స్వరాన్ని పుట్టిస్తూ ఉంది,;;
""ఏడుపు ""కూడా ఒక రాగమే నట ,!సత్యభామ కృష్ణుని ప్రియ సఖీ, కృష్ణ విరహానలం భరించలేక రోదిస్తూ ఉంటే,, అది ""కాంభోజీ ""రాగం లా సుస్వరం లో వినిపించేదట !;
"శివరంజని ,,తోడి ""లాంటి అనేక రాగాల లో ,విషాద గీతాలు,,ఆనందము , ఆరాధనా,భావంతో మోహన హిందోళం లాంటి సంతోషం కలిగించే రాగాలలో, మధుర గీతాలాపన చేయాలి అంటే,, అలాంటి భావావేశం ,, స్పందన అవిర్భవించాలంటే హృదయం ద్రవించి అలా భావ గర్భితంగా పాడుతూ ఉండాలి,!
,,దీనికి వేలాది నాడులు సహకరిస్తే నే గానీ , ఆ అనుభూతి కలుగదు !,పాటకు మాధుర్యం లభించదు ,!,,
,,అలవోకగా ,,సున్నితంగా ,సుతారంగా ,వేణువు పై కదిలే చేతి వేళ్ళు ,,వేణువు రంద్రాలను కొంత మూస్తు, తెరుస్తూ కదులుతూ ఉంటే , వేణు గానం సుమధురంగా వినిపిస్తూ ఉంటుంది
దానికి ఆధారం ,గొంతు నుండి ధారా పాతం గా వెలువడే ప్రాణ వాయు వే కదా !! ఆ విడిచే గాలి యే,
పాడే,పాటకు ప్రాణాధారం అవుతోంది !
ఈ వాయువు ,, హృదయం లో మెదిలే భావాలకు అనుగుణంగా ,స్వరపేటిక ను వాయిస్తూ ,స్వరాలను సృజిస్తూ ఉన్నాయి
ఇలా వాయువు తో ఇటు గాత్ర సంగీతం ,అటు వేణు నాదం రెండూ మధుర సంగీతాన్ని వినిపించడానికి వీలవుతు ఉంది,,
గాయకుడు ఆలపించే సంగీతము ,ఇలా అతడిలో ఉన్న భావ సంపద ను బట్టి ప్రభావితం అవుతూ ఉంటుంది
, మురళీ నాదం వినిపించే శ్రీకృష్ణుడు,రేపల్లె వాసులను , యమునా తీర ప్రకృతిని , కాంతను,మూగజీవాలను , గోప గోపీ జనాలను సమ్మోహన పరిచే విధంగా ఆకర్షించాడు కదా ,,! కారణం ,,అతడి ఆరాధ్య దేవత రాధారాణి యే కదా !!
అతడి దైవత్వాన్ని జాగృతం చేస్తున్న రాధాదేవి ,, గోలోక పర దేవత,,తన సంతత దివ్య ప్రేమామృత రసధార ను ప్రవహింప జేస్తూ , కృష్ణుని అంతరంగం లో ఉండటం వల్లనే కదా !!
రాధా దేవి శ్రీకృష్ణుని పరి పూర్ణ మైన ,ప్రేమ రసైక దేవతా,శిరోమణి ,,!
ఆమె కు శ్రీకృష్ణుని పైన గల ప్రేమ అపారం !
,,అది నిరంతర జలపాతం లా ,,ఆగకుండా ,తెగిపోకుండా , హెచ్చు తగ్గులు లేకుండా తరగని మమతా నురాగాలూ కురిపిస్తూ ధార లా ,, హృదయా నంద భరితంగా సముద్ర కెరటాల వలె,,ఉవ్వెత్తున లేస్తు ఉంటుంది !!
ఆ రాధా మానస విహారు డు, లీలా మానుష వేష ధారి, నీల మేఘ శ్యామ సుందరుడు ఆ శ్రీకృష్ణుని పై గల ప్రేమాతి శయం వల్ల రాధా దేవిలో ఉప్పొంగే తీయని , మధురా మృత ప్రేమ రస దారలే ,కృష్ణునికి. ఊపిరి కి జీవమై , ప్రాణ వాయువు లా మారి, అతడి భావ సంపద ను జాగృతం చేస్తూ ఉండటం వలన శ్రీకృష్ణ స్వామీ వేణు గానానికి అంతటి గొప్ప మహత్తును మాధుర్యాన్ని ప్రాప్తించింది
ఆమె శక్తి అయితే అతడు చైతన్యము,ఆమె జీవము అయితే ఆతడు ప్రాణము
ఆమె శ్వాస అయితే అతడు నాదము,,
""యద్భావం తద్భవతి ,,!""అన్నట్టుగా , లోపల కదిలే భావ సంపదను బట్టి బయట కు వచ్చే మాట పాట పనీ,ఉంటాయి
,,, నాద బ్రహ్మ
త్యాగరాజు,సంకీర్తనా చార్యులు అన్నమయ్య లాంటి మహానుభావులు , తమ మధురమైన సంకీర్తనలను భగవద్ అర్పనం చేస్తూ ఎన్నో రాగాల లో మధురంగా రాగరంజిత ముగ,, ఎంతో తమ హృదయాన్ని , ఆవిష్కరించారు అంటే ,,వారికున్న భక్తి భావ సంపద పరంపర , యే కారణం !
సిరి వెన్నల సీతా రామ శాస్త్రి గారు, వేణు మాధవా ,,అంటూరాసిన , మధుర గీతం , వారికున్న అద్భుత భావ సంపదను తెలియజేస్తూ ఉంది
""ఏ శ్వాసలో చేరితే,గాలి గాంధర్వ మౌతున్నదో ,,
ఏ మోవిపై వాలితే,, మౌనమే మంత్ర మౌతున్నదో,,
ఆ పాటలో నే లీనమై,,
ఆ మోవి పై నే గానమై,, నిను చేర నీ మాధవా,,,!"
ఈ పాట శ్రీకృష్ణుని వేణు గాన మాధుర్యానికి రాధా దేవి, ఆరాధనా భావం , భావ సంపద ఎలా ఆలంబన, ఆధారం అయ్యిందో మనకు తెలియజేస్తూ ఉంది,
శక్తి లేకపోతే చైతన్యం లేదు,, రాధ లేనిది కృష్ణుడు ఉండడు
ఉమ తోడు ఉంటేనే , ఉమా పతి శక్తి వంతుడై ,చైతన్యం తో ప్రకాశిస్తూ ఉంటాడు అగ్ని లేనిదే
వేడిమి లేదు ,
కాంతి లేనిదే ప్రకాశం లేదు
శబ్దం లేనిదే స్వరం రాదు,
ఇలా ఎన్నో రాగాలూ భావాలతో స్పందించే హృదయం ,, దీనితో పరమానందాన్ని ,,పరమాత్ముని గురించిన జ్ఞానాన్ని భావ సంపదను ,అనుగ్రహించిన ఆ పరమాత్ముని కి వేణు గాన విశార దుడు, మురళీ గానలోలుడు ,గోపాలకృష్ణ భగవానుని కి ,సమస్త జగత్తు, మానవాళి రుణపడి ఉంటుంది ,
పరమాత్మా నీకు శతకోటి ప్రణామాలు తండ్రీ
కృష్ణం వందే జగద్గురుమ్!""
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా!"
Monday, March 2, 2020
వేణు మాధవా!
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment