Feb 29, 2020
"మహాభాగవతం " అనే గ్రంథ రాజం సమస్త ఇతిహాసాలు పురాణాల్లో కెల్లా" రాజు "లాంటిది ,!
స్మృతి శృతి పురాణాల శ్రవణం తో ధర్మ అర్థ కామ మోక్ష ములు సాధించే విధానం తెలుస్తుంది ,!
,తాను మరణించాక మోక్షం ప్రాప్తి కోసం అవి ఉపయోగపడితే ,, భాగవత శ్రవణ మహత్తు ఫలం ,మాత్రం తాను ,జీవించి ఉండగా నే , భగవత్ సాక్షాత్ కారాన్ని దర్శింప జేస్తుంది !!
జీవితంలో ప్రతీ వాడు తాత్కాలిక సుఖాన్ని అపెక్షిస్తు శాశ్వతం, జీవన్ముక్తి దాయకం అయిన ఆనందాన్ని , పరమాత్మ అనుభవాన్నీ దూరం చేసుకుంటున్నాడు ,!
,,,"సుఖం అనేది భ్రమ ,ఒక మాయ !అది పూర్తిగా పరిమిత మైన దేహానుభవం
!,ఒక స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసినట్లు గా ఉంటుంది అది!
""అనందం "అనేది ఆత్మానుభవం ,!
గంగా, యమునా, నర్మదా వంటి పవిత్ర పావన జీవనదుల్లో స్నానం చేస్తే కలిగే మధురానుభూతి లా ఉంటుంది, , ఇది దివ్యత్వం ,దైవత్వం , మానవాతీత మైన పరమాత్మతో అనుబంధం ,!
"సుఖం" అనేది మనం ఏర్పాటు చేసుకున్న పరిమిత వ్యవస్థ వల్ల మనం పొందే తాత్కాలిక అనుభవం !! అయితే ,అనందం అనేది దైవానుగ్రహం వల్ల , కలిగే ఆత్మానందం అవుతుంది !!,.
భక్తి అనే సంబంధం తో భగవంతుని అనుగ్రహం కలుగుతుంది,దానికి వారధి లాంటిది భాగవత కథా శ్రవణం !!
మనిషికీ తన సహజ "రూపం" అనేది శక్తి అయితే ",స్వరూపం" అనేది చైతన్యం!! ,
లోన దాగిన శక్తి ప్రకటించడం అన్నమాట ,!,మబ్బు తొలగిన సూర్య కాంతి వంటిది , చైతన్యం ,!
భాగవతం శ్రవణం చేస్తూ ఉంటే,నిద్రాణంగా ఉన్న శక్తి చైతన్య వంతమై , వేగం తో ,తేజ స్సు తో ,దివ్యమైన ,ప్రకాశంతో దశ దిశల్లో ప్రసరిస్తూ సర్వాంతర్యామి అయిన పరమాత్మ తత్వాన్ని దర్షిస్తుంది !!
,,భగవద్ స్వరూ పాన్ని, మూడు రకాలుగా దర్షిస్తాము ,
అదే "సత్ ,చిత్ ,ఆనంద స్వరూపాలు ,!""
భాగవతం విన్నవారికి చావు భయంవుండ దు !
ఎందుకంటే భగవంతుడే స్వయంగా తన భక్తునికి తోడు ఉంటాడు!!
డబ్బు తో కథ చెప్పించు కొనవచ్చును కానీ భాగవత కథ కు మూల్యం కట్టలేము ,, అది అమూల్యం,అమరం ,అమోఘం ,అద్భుతం ,అద్వితీయం , ఆనంద నిలయం , అమృత సాగరం ! భవ బంధ విమోచన కారణం !""
,,,భాగవత కథా శ్రవణ ప్రాంగణంలో ఉన్న చిన్న కీటకం నుండి మొదలుకొని , అందరూ ""సచ్చిదానంద"" స్వరూపులు గా ""బ్రహ్మానంద స్థితి "ని అనుభవిస్తూ ఉంటారు,!!
సంసారంలో బాధలు కష్టాలు ఒకరికొకరు జీవితాంతం చెప్పుకోవడం ఉంటుంది!!
కానీ, భగవద్ చింతన చేస్తూ శ్రవణం చేసే భాగవత సప్టాహ కార్యక్రమాల యందు భగవంతుని గూర్చి అద్భుతంగా వింటూ, అమితానందాన్ని పొందుతూ ఉండడం మాత్రమే ఉంటుంది !!
భాగవత కథా శ్రవణం చెయ్యాలంటే భక్తులకు కొన్ని అర్హతలు తప్పనిసరి !;
1_ఉత్కంఠ ఉండాలి !,అంటే భగవంతుని ఔదార్యం కరుణ , , వినాలనే ఆసక్తి ,ఆరాటం ఆర్ద్రత కలగాలి
2_జిజ్ఞాస , ఉండాలి !అంటే భగవంతుని వ్యాపకత్వం గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనే కోరిక ఆతృత తపన , లోన పెరుగుతూ ఉండాలి !
3,,,భాగవత కథలు వినడం లో ఆసక్తి లేనివారిని త్యాగం చేస్తూ ఉండాలి !!,సత్కర్మలు చేస్తుంటే అవరోధాలు కలిగించేవారు కొందరు ఉంటారు,! న కారాత్మక భావన కల
వారికి దూరంగా ఉండాలి!!
,,భాగవతం శ్రవణం ""అమృత పానం ""కన్నా మిన్న అయినది !
స్వర్గం నుండి దిగి వచ్చి ,దేవతలు శుకమహర్షి తో అన్నారు ,
""మహర్షీ ;,,మీకు మేము అమృతకలశం తీసుకొచ్చి ఇస్తాం !మాకు మీ భాగవతం ఇవ్వండి !"" అంటే ,,
"" మీరు నిజంగా పిచ్చి వారు !,అమూల్యమైన ఈ మహా భాగవత గ్రంథానికి వెల కట్టాలనుకోడం,, మీ ""మూర్ఖత్వం" అన్నారు !
భాగవతం అంటే సాక్షాత్తూ భగవంతుడే !అతడికి విలువ కట్టగలరా ??""అంటాడు శుకబ్రహ్మ !!
ఈ కథమృతం గ్రోల డం వలన జీవునికి జన్మరాహిత్యం అవుతుందీ !
""భక్తి ""అనేది అంతర్లీనంగా ప్రవహించే సరస్వతీ ప్రవాహం లాంటి జ్ఞాన స్రవంతి !
ఇది అందరిలో ఉంటుంది!!
, ,కానీ జ్ఞాన వైరాగ్య భావాలు తోడు లేకపోవడం వల్ల భక్తి కలిగే అవకాశం లేకుండా పోతోం ది,!
భాగవతం వింటే కూడా తనలో "" అహంకారం"" తొలగక పోతే ఇక వాడికి ,"జ్ఞానం"" రానట్టే ,, లెక్క !!
రావణాసురుడు ప్రముఖ శివ భక్తాగ్రేస రుడు అని మనకు తెలుసు !!
అతడు బుద్ధితో మాత్రమే జ్ఞాని!
కానీ మనసుతో రాక్షసుడు ,!; బుద్దిని వక్ర మార్గంలో నిలిపి,ఎదురుగా ఉన్న జానకీ దేవిని, సాక్షాత్తూ మహాలక్ష్మి మాతగా గుర్తించలేక పోయాడు !ఎందుకు పనికి వచ్చిన విద్వత్తు అతనిది?? వైరాగ్య భావన రావణుడి లో లేశమాత్రం లేకుండా పోయింది ,!
అందుకే , భక్తి క్షీణించి ,అతడిలో రాక్షస ప్రవృత్తి ప్రకోపించింది ,! బుద్ది మందగించింది !
అంతటి రావణ బ్రహ్మ, అపర బ్రహ్మ రాక్షసుడిగా అవతరిం చి ,,ఘోరంగా తన వంశ నాశనానికి కారకుడయ్యాడు !
తన అహంకారానికి తానే బలియై సకుటుంబం తో సర్వ నాశనమ య్యాడు,
కానీ,భక్తి తో బాటు జ్ఞాన వైరాగ్యం గల విభీషణుడు ,,జన్మతః రాక్షసుడు అయినా కూడా , తన శరణాగత భావంతో,ప్రభువు శ్రీరామచంద్రుని చేరి , అతడి కృపతో ,చిరంజీవి గా వర్ధిల్లుతూ నే ఉన్నాడు,
"నిజానికి ""వైరాగ్యం"" అంటే వస్తు పరిత్యాగము , కుటుంబాన్ని విడిచి అడవిలో తపస్సు చేస్తూ , ఒంటరి జీవితం గడపడం కానే కాదు,!
ఈ సంసారం లో ఉంటూనే, దేనిపై కూడా , ఆసక్తి ,అభిమానం ,మమకారం లేకపోవడం" మాత్రమే " వైరాగ్యం" "అనిపించుకుంటుంది ,,!
పెళ్లి చేసుకోకుండా ""బ్రహ్మచారి" వలె జీవించడం కూడా వైరాగ్యం అనిపించుకోదు !!
తన చుట్టూ ఎంతమంది స్త్రీలలో ఉంటూ ఉన్నా,మధుర పదార్థాలు ఆకర్షిస్తూ ఉన్నా , చెక్కు చెదరని మనస్సు కలవాడే "విరాగి," అనగా
ఏ రకమైన రాగము అనగా అభిరుచి ,కోరిక , ఆసక్తి ,లేనివాడు అని భావించాలి !,,,
భాగవతం ఆర్తితో c,ఆర్ద్రత తో విన్న తర్వాత ,,భక్తుడు,భగవంతుని ఒక కింకరుని వలె ,భర్తను అమితంగా ప్రేమించే స్త్రీ వలె , అంకిత భావంతో ,భగవంతుని ఆరాధించాలి ,!
ఒక్క శ్రీ మన్నారాయణుడు తప్ప అందరూ స్త్రీలే,!!, అతడు ఒక్కడే పురుషోత్తముడు ,గా భావిస్తూ , పూజిస్తూ స్మరిస్తూ , కొలుస్తూ ఉండాలి!
,,పరమ పావనమైన "మహా భాగవతం " , మన తెలుగు వారికే స్వంతమైన గ్రంథం గా రచించి ,అందించిన భక్త పోతనామాత్యుడు నికి తెలుగు ప్రజలు అందరూ శాశ్వతంగా ఋణ పడి ఉంటారు!!
పోతన, అన్నమయ ,త్యాగరాజు , మీరాబాయి వంటి భక్తులు వీరంతా ,నిజమైన భాగవతులు ,,!
తమ శరణాగతి భావంతో, అత్మ సమర్పణ చేస్తూ , జీవించి ఉండగా నే,వారు పరమాత్మ సాక్షాత్కారం పొంది,తమ జన్మ ధన్యం చేసుకున్నారు !!
, అంతటి సుకృతం పొందాలంటే ,భాగవత కథ అనే అమృతాన్ని అనుదినం ,అనుక్షణం అనవర తం ఆస్వాదిస్తూ ఉండా లి !!
భాగవతం వినడానికి మనకు పెద్ద పెద్ద దోనెలు వంటి చెవులు ఇచ్చాడు , భగవంతుడు !
చెవులు కథ ను వినడానికే కానీ , కథామృత పానం చేయడానికి పనికి రావు కదా !""
,, భాగవత కథ అనే అమృతం గ్రోల డానికి ఏ అవయవం పని చేయాలి,,?
అంటే,దానికి , సమాధానం మాటల్లో చెప్పలేం ! అది భగవద్ అనుభవ పారవశ్యం తో ,,ముడివడి ఉంటుంది ,!అద్భుతమైన సాధనా సంపత్తి ఆ మధురానుభవం !,
,,, శరీరంలో ని పంచేంద్రియాలు,కర్మేంద్రియాలు , , మనసు బుద్ధి ఇవన్నీ కలిసి ,అంతరాళం లో నిక్షేపించు కున్న పరమాత్మ సుందర సురుచిర,సౌందర్య లావణ్యాన్ని దర్శిస్తూ, ఆత్మలో రమిస్తూ పొందేది ,భాగవత కథా మృత పాన అనుభవం ! ఉదాహరణ కు,,
,,తన ఆత్మీయుల కోసం ఎన్నో రోజులనుండి ఎదురుచూస్తూ చూస్తూ ,నిజంగానే వారు ఎదురుగా కనబడితే , కట్టలు తెగిన కాలువ వలె ఎలా తన హృదయంలో నుండి ప్రేమ పొంగుకొని వస్తుందో, అలా భాగవత కథలు వినడం వల్ల,మనసు పరమాత్మ పై నిలిచి,,హృదయం దైవ భావంతో లీనమై, అనందం తో స్పందిస్తూ , ఉంటుంది !! శ్రీమన్నారాయణుడు తన దివ్య మైన అపార కరుణా మృత మును అనుగ్రహిస్తూ ఉంటే పొందే అనిర్వచనీయమైన మధురానుభూతి తో ,ఆత్మానందం తో,, లీనమై ,,రెండు,కళ్ళనుండి ఆనంద భాష్పాలు స్రవిస్తూ ఉంటే,,తన ఆస్తిత్వం మరచి, చుట్టూ ఉన్న పరిసరాలు , వ్యక్తులు వాని సంబంధాలు విడిచి,కేవలం ఆ పరందాముడే, తప్ప అన్యము ఏదీ ఆత్మకు ఆగుపించని , అద్భుతము అమోఘం ,అద్వితీయమైన ,, అనుభవైక వెద్యమైన భావ సంపద యే ,భాగవత కథామృత పాన వైభవము
అది అనిర్వచనీయం
మరియు అనుభవైక వేద్యం కూడా !
భాగవతం శ్రవణం చేద్దాం! భాగవత పద్యాలు చదువుదాం !"
బ్రతుకులు బాగు చేసుకుందాం !"
అలాంటి స్ఫూర్తిని,, భావ సంపదను అనుగ్రహించమని గీతాచార్యుడు ,శ్రీకృష్ణా భగవానుని వేడుకుందాం !""
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!""
Monday, March 2, 2020
శ్రీమత్ మహా భాగవత కథామృతం -1
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment