Monday, March 2, 2020

శ్రీమత్ మహా భాగవత కథామృతం -2

March 2, 2020
భగవంతుడు మనిషికి చెవులు వెడల్పుగా రెండు వైపులా  బయటకు కనపడేలా,సున్నితంగా స్పందించేలా ,ఒకటికి రెండు పెట్టింది ఎందుకు ??
,, శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన భాగవత కథలను శ్రవణం చేయడానికే గానీ ,అలంకారానికి కాదు,
భాగవత కథా శ్రవణం చేసే
చెవులకు మాత్రమే   స్వర్ణ కుండలాల తో శో భించే యోగ్యత ఉంటుంది!
అంతే కానీ,
! రంగుకళ్లద్దాలు పెట్టడానికి కానీ,అసభ్యకరమైన సంభాషణ ,పాటలు ,వినడానికి కాదు ,!
భక్తి యుతమై న అన్నమయ్య త్యాగయ్య రామదాసు , జగద్గురువు ఆదిశంకరులు  లాంటి మహానుభావులు , భక్తులు భజనలు సంకీర్తనలు, వివిధ స్తోత్రాలు  గానం చేసి , , పరమాత్మను దర్శిస్తూ  , తాము తరించి గానం చేసి మనకు అందించారు ,,,!
""భాగవతం వింటే బాగవుతాం !,
బ్రతుకు సార్థకం అవుతుంది !
  సద్బుద్ధి కలగడం వలన  ,సమాజం , బాగుపడుతుంది !
మనిషి తాను ,మరణించాక కాకుండా ,పరీక్షిత్తు వలె,జీవించి ఉండగా నే  పరమాత్మ సాక్షాత్కారం తో బాటు ముక్తి  కూడా లభిస్తుంది ,!
భాగవతం,భగవంతుని  కథ,,!
శ్రీకృష్ణ భగవానుని దివ్య తత్వం !
వ్యాస మునీంద్రుని  మహా ప్రసాదం !
శుక యోగీద్రుని అమృత గానం ;!
బమ్మెర పోతనామాత్యుని మకరంద భరితమైన భక్తి రసామృతం !
పరమహంస లకు పరమానందం ,!జగద్గురువు శంకరాచార్యుల భజ గోవింద సారం ,!
శ్రీహరి అవతార వరుస క్రమం !;
జ్ఞాన వైరాగ్యాలకు నిలయం !
భక్త జనులకు బ్రహ్మానందం !!
భవ భయ హరం ! నవరసాల కు ఇది నిలయం !
ధర్మ సుమాల మణిహారం ,!
భాగవత కథా మహాత్మ్యాన్ని ఇంతింత అని తెలుపడం బ్రహ్మ రుద్రా దులకు కూడా తరం కాదు,!
మహా భారతం  తో బాటు  పద్దెనిమిది పురాణాలు ,ఉపనిషత్తులు ,రచిం చాక , వ్యాస భగవానునికి , ఏదో తెలియని ,వెలితి అసంతృప్తి ,నిర్వేదం , పరితాప ము ,కలిగాయి !,
,,, నారద మహర్షి సూచన మేరకు ,మానవ జన్మ ఉద్దరింపబడెలా , దివ్యమైన  భక్తుల కథల సమాహారం   గా ""మహాభాగవతం"" రచించి ,మానవాళికి భగవంతుని లీలలు శ్రీహరి గుణ గానాలు ,దశావతార విశిష్టత నూ ,, దుష్ట శిక్షణ , శిష్ట రక్షణ ,వైభవాన్ని  వర్ణిస్తూ, మహా ప్రసాదంగా మనకు  అనుగ్రహించాడు !!,,
""భాగవతం"" వింటూ ఉంటే ,పరమాత్ముడు మన అంతరంగం లో ,మన ప్రక్కన ,ఎదురుగా , ఎటు చూస్తే అటు , అంతటా , నిండి ఉన్నట్టుగా అనుభూతుని పొందుతూ ,భక్తుడు పరమానంద భరితుడౌతాడు !!
మహా భారత సంగ్రామం ప్రారంభం కు ముందు ,  జరగబోయే  యుద్ధంలో సహాయం అర్తించడం  కోసం ,శ్రీకృష్ణుడి వద్దకు  దుర్యోధనుడు అర్జునుడు
వచ్చారు
తన  సఖుడు , బంధువు , ఆప్తుడు ,భక్తుడైన అర్జునుడి కోసం ,శ్రీకృష్ణుడు చిన్న ప్రణాళిక చేస్తాడు!!
"""ఆయుధం పట్టని నేను ఒకవైపు, ,, సర్వ శస్త్ర దారులైన వేలాది నా సైన్యం మరో వైపు ఉంటాం !!.
, ఈ రెండు భాగాల లో , తలా ఒకటి, మీకు ఇష్టమైనది తీసుకోండి  ,!""
అంటాడు,
మొదట అర్జునుడు తన పాలుగా శ్రీకృష్ణుని కోరగా ,   దుర్యోధనుడు పరమానందం పొందుతాడు ,!
ఈ అర్జునుడు ఎంత మూర్ఖుడు !??
ఆయుధం పట్టని వాడిని  కోరాడు ,పిచ్చివాడు !, యుద్దం లో  ఉత్సవమూర్తి గా  ఈ కృష్ణుని ఊరేగింపు చేయడం  కోసమా ??, అంటూ అహం కార భావంతో, తన పాలుగా, సైన్యము ఇవ్వమని చెప్పి వెళ్తాడు దుర్యోధనుడు!!
,,అప్పుడు శ్రీకృష్ణుడు పరిహాసం చేస్తూ అంటాడు అర్జునుడి తో,!!
"" ఏమయ్యా అర్జునా !,,నేను ఆయుధం పడితే, నన్ను దుర్యోధనుడు కోరితే ,, మీరెవరు గెలవలేరని మీ కోసం ఒక యుక్తి ని పన్ని ,, ""నేను ఆయుధం పట్టను!"" అన్నాను ,!
అపుడు
నీవు నా సర్వ సైన్యాన్ని కోరుకుంటావని  నేను అలా చేశాను!!"కానీ ఎంత అమాయకం పని చేశావు ??
వట్టి చేతుల తో  , మహా సంగ్రామం లో, నీకు  ఏ సహాయం చేస్తానని నన్ను కోరావు  చెప్పు??
,నిజంగా నీవు పిల్ల వాడిలా  ప్రవర్తించావు సుమా !
మాకు అన్యా యం చేశాడు  ఈ కృష్ణుడు !"అని  మీ సోదరులు నన్ను ఆడిపోసు కోరా చెప్పు ?""
అంటాడు
ఇప్పుడు  అర్జునుడు చెప్పిన  సమాధానం పరమ భాగవతోత్త ముని   శీల సంపదను తెలియజేస్తూ ఉంది
"బావా !  నేను వచ్చింది ఇక్కడికి కేవలం నిన్ను దర్శించడానికి ,మాత్రమే !! దానిని మించి ఏ కోరి కా నాకు లేదు!
నీవు  అధర్మాన్ని అణచడానికి అవతరించిన శ్రీమన్నారాయణుడి  అవతారమని  నాకు తెలుసు!
నీవు మా ప్రక్కన ఉంటే చాలు ,ఎన్ని అక్షౌహిణుల సైన్యం  ఎదురు వచ్చినా భయం లేదు,!శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడో ,అక్కడ ధర్మం ఉంటుంది !
విజయం వరిస్తుంది !!
మా  జీవన సర్వస్వం నీవే, కృష్ణా!
మా రక్షణ భారం నీదే ,!
నీకే శరణు!
,నిన్ను నమ్మి  యుద్దాన్ని సంకల్పం చేశాము!
మనసా వాచా కర్మణా మేము  నిన్నే నమ్ము కున్నాము !
నిన్నే పరిపూర్ణంగా విశ్వసిస్తూ , నీవే దిక్కుగా భావించి , నిన్ను కోరాను!
విజయ సారథిగా , రథం నడుపుతూ,మాకు విజయాన్ని అనుగ్రహించు ,!
నమో శ్రీకృష్ణా ! నమో నమః !
అన్యధా శరణం నాస్తి
త్వమేవ శరణం మమ !""
అంటూ  దాస భావంతో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని  ముందు  వినమ్రుడై ,సంపూర్ణ శరణాగతి భావంతో మోకరిల్లి ,తన  రెండు చేతులతో  శ్రీకృష్ణుని పాదాల ను పట్టుకొని ఆర్తితో వేడుకుంటాడు !;
అంతే!పాండవుల రక్షణా భారం వహించాడు ,,జయాన్ని ,రాజ్యాన్ని , కీర్తిని , గీతోపదేశం చేస్తూ వారికి  అందించి, ధర్మ స్థాపన చేశాడు ,
ఆ విధం గా  మనం సంకల్పించిన పనుల నిర్వహణ భారాన్ని ,ఫలితాన్ని  భగవంతుని అనుగ్రహం పై వదిలి వేయాలి,
,,  ,,భక్తి అనేది హృద యాంత రాళం నుండి  పాల పొంగులా  ఉప్పొంగాలి!
భగవంతుని పట్ల ప్రేమానురాగాల తో వెల్లువలా ఉబికి వచ్చే అనం దామృత భావ తరంగాల తో పరమాత్ముని చరణ కమలాలు అభిషేకించాలి !;
అందుకే భక్త పోతన చెప్పాడు , పద్య రూపంలో,,
""పలికే డి ది భాగవత మట,
పలి కించెడివాడు రామ భద్రుం డట,,
నేపలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా .!""
అంటూ ,,భాగవత గ్రంథ రచనలో ,తాను నిమిత్త మాత్రునిగా ప్రకటించు కున్నాడు,
శరీరము సంపదలు, ప్రజ్ఞ, తెలివి తేటలు, బందు బలగం అన్నీ ఇస్తూ,ఆనందించే అవకాశాన్ని ,మనం కోరకుండానే ప్రసాదించిన ఆ పరాందాముని కరుణా వైభవం వర్ణించ వశమా ??
""అయం ఆత్మా బ్రహ్మ ! ""
నాలోని అత్మ ,, పరబ్రహ్మ స్వరూప మే !!"అనగా
,నేనే బ్రహ్మ ను!""
అని తెలిపే ఈ  పద్య సారం  అద్భుతం !, పరమానంద భరితం !!
""ఇందు గలడు అందు లేడని
సందేహము వలదు ,, చక్రి సర్వో పగతుం డు,,
ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే !"
అంటూ" అణువణువునా  కూడా శ్రీహరి నిక్షిప్తమై ఉన్నాడు!" అన్న సత్యాన్ని భగవద్ భక్తులకు విశద పరిచాడు ,వైష్ణవ భక్తాగ్రేస రుడు,, పరమ భాగవతోత్తముడు , ప్రహ్లాద కుమారుడు !!
జీవుడు దేవుని  చేరడానికి  ,జీవాత్మ పరమాత్మ తో అనుసంధానం కావడానికి , భాగవతం , మార్గదర్శనం చేస్తుంది మనకు !
బాల భక్తులు ప్రహ్లాదుడు ధ్రువుడు ,  భక్తి అంటే తెలియని ఒక మద గజం,, అంబరీషుని వంటి విష్ణు భక్త చిత్త పరాయణుడు ,,, అజామీలుని వంటి పాపాత్ముడు , ఇలా ఎందరో భక్తులు త్రికరణ శుద్ది భావంతో శ్రీమన్నారాయణ మూర్తి  నీ చిత్తశుద్దితో ,ఆరాధించి అతడి కృపతో  సాయుజ్యాన్ని పొందారు!
,భగవంతుడు ప్రసాదించిన ఈ  నాలుకతో,  అతడి నామ రూప గుణ గానం చేస్తూ ,తలుస్తూ, భజిస్తూ, స్తుతిస్తూ,భగవంతుని దరికి చేరాలి
, ఈ  నాలుకతోచెడు మాటలు, పలుకకుం డా, హరి నామ స్మరణ చేస్తూ,, దేహాన్ని దేవాలయంగా  మార్చుకోవాలి
అందుకోసం ,,ప్రతీ ప్రాణి లో , ప్రకృతి లో చరాచర జగత్తు లో అంతర్యామి గా ఉంటూ ఉన్న  ఆ దైవాన్ని దర్శించే ప్రయత్నం చేద్దాం,,!
,భక్తిరస భరితమైన  భక్త పోతన భాగవత పద్యాలు  మనం  చదువుతూ  దైవభక్తి నీ పెంచుకుంటూ ,,,మన పిల్లలకు  కూడా వాటిని నేర్పించే ప్రయత్నం చేద్దాం !!
సత్భావన , తో, సద్బుద్దితో,సత్సంఘంతో , సర్వేశ్వరుని  సన్నిధానం లో మనసును సదా  నిలిపే సత్ సంప్రదాయాన్ని తర్వాత తరానికి అందించే ప్రయత్నం చేద్దాం !
అంతటి మహోన్నతమైన  భావ సంపదను ప్రసాదించమని గీతాచార్యుడు, శ్రీకృష్ణ భగవానుని కోరుకుందాం!!
""యద్భావం.  తద్భవతి !'" మనసును బట్టి పరమాత్మ అనుభవం ఉంటుంది, కదా!
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...