Feb 28, 2020
,,,పుట్టిన ఏ ప్రాణిి అయినా కర్మ చేయక తప్పదు
అవి అనుభవించుట కోసం జన్మ పరంపర కూడా తప్పదు
ఈ చక్రవలయం నుండి బయట పడడానికి ,పాపాలు చేయకుండా జాగ్రత్త పడుతూ వుండాలి, !!
భరతుడు అంటాడు వశిష్ట మహర్షి తో,,
""గురుదేవా,,! తండ్రిగారి మాట ప్రకారం ఆన్న రాముడు అరణ్య వాసం చేస్తున్నాడు,,!!ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను రాజుగా ప్రకటించు కొని రాజ్యపాలన చేస్తూ ఉంటే,14ఏళ్లు గడిచాక నా నుండి రాజ్యం స్వీకరిస్తా డా ,!
అలా చెయ్యడు, ఎందుకంటే అతడికి నాపై గల ప్రేమా తిశయం అపరిమితం కనుక ,!!
అందువల్ల రాముడు కావడమే. ధర్మం !!,
తనకు చెందవలసిన రాజ్యం ,నేను గ్రహించడం అధర్మం ,!!
అన్నగారి పాదాలు అయోధ్యను పాలించాలి ,!, ,తాను తిరిగి వచ్చేవరకు , తన పాదాలను రక్షించే పాదరక్షలు అయినా, ఈ అయోధ్యను పాలిస్తూ ఉండాలి ,,!
నేను కేవలం అయోధ్యకు రాజు అయిన శ్రీరాముని ప్రతినిధి గా , మాత్రమే ఈ రాజ్యాన్ని పరి రక్షిస్తూ ఉంటాను,!!అందువలన
నా మనస్సాక్షి అంగీకరించని ధర్మాన్ని ఆచరించమని నన్ను ఒత్తిడి చేయకండి ,,! స్వామీ!;""
' ప్రజలు పాపాత్ముడు గా నన్ను ఈస డించు కునేలా చేయకండి ,,!""అంటూ మహర్షి పాదా లపై పడి
, రోది స్థాడు భరతుడు ,!;,
"" ధర్మం చాలా సూక్ష్మం;అయింది !!,,
అర్థం అయిన ట్టు గా ఉన్నా దానిని ,ఆచరించడం మాత్రం చాలా కష్టతరం! ;
ధర్మం తప్పితే ,,పాపం వెంటాడుతుంది !
అందుకే ,,గత జన్మ పాపాలు వెంట పడకుండా పరమాత్ముని శరణు వేడు కోవాలి, !!
,,అంటే శరణాగతి భావంతో జీవిస్తూ బ్రతకాలి ,!"
"""సర్వ ధర్మా న్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ !,,""
అంటూ,, మార్గ దర్శనం చేస్తూ,
""యోగక్షే మం వహా మ్యహం ,!"",అని అభయం ఇస్తూ, గీతాచార్యుడు సెలవిచ్చి నట్టుగా, భక్తులకు పాప భయం ఎన్నడూ ఉండదు !!"
,,ఆయన నామ స్మరణ అనే చిన్న నిప్పు రవ్వ తో, పెద్ద పెద్ద గడ్డి కుప్ప లాంటి పాపపు భారం క్షణం లో భస్మం అయిపోతుంది కదా !!!
,,అందువలన ,,
పుణ్య కర్మలు వెంట పడకుండా ఉండాలంటే ,,, కర్తృత్వ భావన లేకుండా,నిష్కామ యోగం తో ,ఫలాపేక్ష లేకుండా మంచి పనులు చేస్తూ యోగిలా , ""బురద అంట ని కమలం"" లా జీవించాలి ,
నిజానికి మానవ జీవితం అనేది,,,జననం నుండి మరణం వరకూ గడిపే చాలా విలువైన కాలం !! అది ఒక "" ""మహా యజ్ఞం "" లాంటిది,!;
పుట్టినప్పుడు బారసాల,, చనిపోయినపుడు అంత్యేష్టి ,మంత్ర యుక్తంగా యజ్ఞం లా జరిపిస్టూ ఉంటారు,,
అలాగే ,నిత్య విధుల్లో కూడా స్నానం భోజనం ,నిద్ర , పూజ మొదలైన విధులు కూడా యజ్ఞం చేస్తున్న పవిత్ర భావనతో నిర్వర్తించాలి,
భగవద్గీత లో గీతాచార్యుడు , చెప్పాడు, ""బ్రహ్మా ర్పణం , బ్రహ్మ హవిర్ బ్రహ్మా గ్నౌ, బ్రాహ్మణా యుతం ,,!"
బ్రహ్మై వతే న గంతవ్యం , బ్రహ్మ కర్మ సమాధి నా !"",, అంటూ, తినేవాడు, తినేది,తినిపించేది , అంతా బ్రహ్మ పదార్థమే ! అని,,
అంతా యజ్ఞ మే అనీ !!
,,, ప్రతీరోజూ,భోజనం ,చేయడానికి ముందు,, ఇలా చేయాలి,!
శరీరం పంచ భూతాత్మకం కనుక ఐదు సార్లు , ""ప్రాణా య స్వాహా, అపానాయ స్వాహా, వ్యానా య స్వాహా ,సమానాయ స్వాహా ,ఉదానాయ స్వాహా!"" అంటూ , ఆ దేవతా మూర్తులకు సమర్పిస్తూ ,,ఐదుసార్లు కొద్దిగా ,కొద్దిగా పరమాత్మ భావనతో నోటిలో వేసుకోవాలి ,
""అమృతమస్తు ""అంటూ తినే అన్నాన్ని అమృతంలా దైవ ప్రసాదం లా భుజించాలి ,,!
,, హోమ గుండంలో సమిధ లు వేస్తున్నట్టు గా తినే ప్రతీ ముద్దచేసి తింటున్న అన్నాన్ని, యజ్ఞ గుండం లో వేస్తున్న హవిస్సుగా భావిస్తూ భుజించాలి,!
ఈ ఆచరణ తో భోజనం చేయడం అనేది ఒక ,పవిత్రమైన యజ్ఞం చేసినట్టు అవుతోంది !;
మంచం మీద గానీ,ఒడిలో కానీ, చేతిలో కానీ పళ్లెం పెట్టుకొంటూ తినే ఆహారం గోమాంసం తో సమానం అవుతుందని వేదం సూచిస్తూ ఉంది ,,,!!
,,,,అన్నం దైవానికి నివేదన చేసి , పరమాత్ముని ప్రసాదం గా భావిస్తూ మితంగా తింటే ,అది అమృత మౌతుంది ,,
అదే అన్నం అధికంగా ,వేళా పాలా లేకుండా ,,ఆబగా తింటూ ఉంటే ,,శరీరం రోగ గ్రస్తమై ,,తినే అన్నమే విష తుల్యం అవుతుంది,
,,, ,,మధుమేహం వ్యాధి ఉన్నవారు శర్కరను మోతాదు లో వాడుతారు,,
,,,, అలా నియంత్రణ పాటించకుండా ఉంటే,చావును కొనితెచ్చుకుంటారు,,
వారి ,మరణానికి ,
కారణం శర్కర కాదు!
, బుద్ది మందగించడ మే! భోజనం చేయడం పట్ల ,ధర్మాన్ని పద్ధతిని పాటించక పోవడం కారణం !!
మందులు దుకాణం లో ఉన్నాయి కదా అని,ఇష్టం వచ్చిన మందు తీసు కొలేం కదా!!
అలాగే ,ధర్మం అనే ఒక ధనాగారం !!
అందరికీ ఒకేలా ప్రాప్తించే వీలు ఉండదు కదా !!
రోగి,,ఒకే డాక్టర్ ను ఒక రోగం తగ్గడానికి ఆశ్రయించి నట్టుగా ,మనం గురువు ను, ఆశ్రయిస్తు , మనకు యోగ్యమైన రీతిలో , జీవితంలో ధర్మాన్ని నిత్యం ఆచరిస్తూ గడపాలి
, అందుకే, సదాచార సాంప్రదాయం ,,ధర్మాచరణ , జీవితంలో అవలంబిస్తూ జీవన యజ్ఞాన్ని భగవద్ అర్పితం చేస్తూ , దన్యులం అవుదాం
ఇందుకు భగవద్గీత ను ప్రామాణిక గ్రంథంగా స్వీకరిస్తూ,శ్రీకృష్ణుడు సూచించిన విధంగా ,,విలువలు పాటిస్తూ,పరమాత్ముని కృపను పొందుదాం !
స్వస్తి!""
హరే కృష్ణ హరే కృష్ణా !!""
,
Monday, March 2, 2020
యజ్ఞం అంటే? - 2
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment