Feb 28, 2020
"కృష్ణా! ,నీవు నల్లగా ఎందుకుంటావు మీ అమ్మా నాన ఎర్రగా బంగారం రంగుల్లో ఉంటే ,? అహ !!ఇది నేను కాదు సుమా అనేది !, ఇంట్లో మా పెద్దవారు అనుకుంటారు?
"" ఏమో ? నాకేం తెలుసు, సుధామ?" అయినా ఈ సందేహం నాకూ వచ్చింది !!మా అమ్మా నాన నడగాలి ఎపుడైనా !""
""కృష్ణా,! నీతో ఉంటే మాకు ఆకలి ఉండదు! భయంవేయదు ! నిద్రా అలసట రాదు! ,, నిన్ను ఇంటికి వెళ్లాలంటే దిగులుగా ఉంటుంది !"ఎందుకో తెలియదు?""
""అదంతా ,నా మీద మీకున్న ప్రేమ అంతే!""
""కృష్ణా !!నీవు నల్లగా ఉండడం వల్ల ,,ముఖ్యంగా చీకట్లో కూడా ఎవరూ నిన్ను గుర్తు పట్టడం లేదు ,, సుమా??""
""చూశా రా ?? నల్లవాడి గా ఉండడం ఎంత లాభ మో మరి !"" నవ్వ కండి , అలా,!!"" అదిగో ఆ గోపన్న లేడా నల్లగా ,,??""
""కృష్ణా !,నీవు పిల్లిలా చప్పుడు కాకుండా అడుగులేస్తూ వెడతావ్ ,! ఎవరికి తెలియకుండా !!!మాకు అలా రావడం సాద్యం కావడం లేదు,,ఎందుకు ??""
"వెన్నముద్ద బాగా తింటాను "కదా !మెత్తగా ,నడుస్తుంటే వినపడకుండా ఉంటాయి నా పాదాలు !!,అందుకే కదా,, మీరు నన్ను ముందు పంపిస్తారు!""
""కృష్ణా!, నీ కాలి గజ్జెలు,మొలత్రాడు గంటలు ,నీవు నడుస్తున్నపుడు మోగడం లేదు ఎందుకు??""
, ""ఎందుకంటే, ,,అవి నేను చెప్పినట్టు వింటాయ్,కనుక !!
మీరు మళ్లీ నవ్వుతున్నారు. !!""
""కృష్ణా,!!ఇలా వేరే వారి ఇండ్లలో ,, రాత్రి వేళల్లో చొరబడి ,,వెన్న దొంగిలించడం తప్పు కాదా చెప్పు ??""
""వారు కూడా మనవారే,! మనం!అందరం ఒక్కటే,!ఇక్కడ నీది నాది అని బేధం లేదు ! ఏది ఉంటే అది అందరం కలిసి పంచుకు తినాలి!, అంతా మనదే ! అందరూ మనవా రే!""
""కృష్ణా, అందరూ నిన్ను మాత్రమే పట్టుకుంటారు ,!మమ్మల్ని వదిలేస్తూ, ఉంటారు వీరు!!,కనీసం మాకేసి చూడనైనా చూడరు!!
ఎందుకంటా వు ?""
""నేను నంద రాణి కొడుకు ను కదా ,! అందుకే నన్ను పట్టడం వారికి గొప్ప గా అనుకుంటారు, అంతే!""
**""కృష్ణా ,! నీవు దొంగతనం చేసే వెన్న తో పాటు, వెన్న లాంటి ఆ గోప గోపీ జనాలు ఆలమందల తో బాటు ఈ వ్రజపుర వాసుల , మా అందరి హృదయాలను కూడా , నీ నవ్వులతో , చేష్టలతో,ముద్దు మాటలతో నిలువునా దోచేస్తు ఉన్నావు సుమా!??""
""అదేం లేదు,!ఇదంతా మీకు నా మీద గల అపారమైన ప్రేమ !మనకు ఇష్టమైన వారు ఏం చేసినా ఇష్ట పడుతూ ఉంటాం కదా, !""నాకు కూడా మీరంటే ప్రాణం తెలుసా,?? మీరు లేకుండా నేనేమైనా చేస్తానా,, చెప్పండి,?""
""కృష్ణా !నిన్ను చూస్తూ ,, నీవు చెప్పే మాటలు వింటూ ఉంటే ,మాకు ఏది జ్ఞాపకం రాదు !,స్వర్గంలో తేలిపోతూ ఉన్నట్టుగా ఉంటుంది, సుమా !!""
"" మిత్రులారా !నాకూ అలాగే అనిపిస్తూ ఉంది,!!నిజం చెప్పాలంటే మీరు లేకుండా నేను ఉండలేను తెలుసా !""??*
""కృష్ణా !!అంత పెద్ద పెద్ద రాక్షసులు నీ దగ్గరకు ఎందుకు వస్తూ నే చేతిలో చస్తున్నారు ? ఎందుకు ??""
""ఏమో నాకేం తెలుసు ?? మీ లాగే ,చిన్న పిల్లాడిని,!! బహుశా ,,వాళ్లకు కూడా నేనంటే మీ లాగే ఇష్టం కావచ్చు కదా ??""
అదిగో !!మీరు అంతా నవ్వుతున్నారు ?? మీరు అడిగితే ఏదైనా చెప్పాలి కదా నేను ??
అయినా ,ఇలా మీరు నాతో కలిసి నవ్వుతూ ఆనందంగా ఉండడమే నాకు కావాల్సింది !!"
""కృష్ణా! నీవు నిత్యం శిఖలో నెమలి పించాన్ని ఎందుకు ధరిస్తూ ఉంటావు ?""
"""ఓ అదా!;,నెమలి అడవిలో ఎప్పుడూ ఆనందంగా ఉంటూ ,తనవారితో కలిసి ,,పురి విప్పి నాట్యం చేస్తూ ఉంటుంది, కదా !! అలా ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు ఎవరైనా కూడా నాకు ఇష్టమే, !!అందుకే,,,ఇదిగో ఇలా వారిని నా తలపై పెట్టుకుం టూ ఉంటాను !!అదిగో మీరు మళ్లీ నవ్వుతున్నారు గదా !!""నేను మాట్లాడను పో !"""
""కృష్ణా! నీతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా మేము ఉండలేమని నీకు తెలుసుగా !! మరి ఈ వేణువు నీ చేతుల్లో ఎప్పుడూ ఎందుకు ఉండాలి ,? ఇది చెప్పు ??""
,,ఏముంది !!ఈ మురళీ నాదం చేస్తూ ఆనందంగా ఉంటాను !!నేను మాత్రమే కాదు,! ఈ ఆవులు లేగలు సకల ప్రాణు లు , ప్రకృతి, ఆ యమునా నదీ మాతా, మీరు, మన రేపల్లె వాసులు సమస్తము వేణు గానం వింటూ ఆనందంతో ఉంటారు!!కదా !! ఈ ,ప్రాణం లేని వేణువు ,తన నాదం తో సకల జగతికి ప్రాణం పోస్తూ , వానిలోని శక్తిని చైతన్య వంతం చేస్తూ ఉంటుంది,!;అందుకే నేను మురళీధరుని అయ్యాను !""
""కృష్ణా !;మరి ఈ వేణువు నీ చేతిలోనే అంత మధురంగా ఎందుకు మోగుతు ఉంటుంది??,మాకు ఎందుకు చేత కావడం లేదు?""
"""ఒక్కొక్క రికి ,, ఒక్కొక్క విద్య లో శ్రద్ద ఆసక్తి ఉంటుంది!!,నాకు వేణువు పలికించడం ఇష్టం!! , మీకు పాటలు పాడటం ,అడటం ఇష్టం !!; అంతే !!ఇలాగే ఇష్టం తో సాధన చేస్తూ ఉంటే, మీరు కూడా వేణువు ను మధురంగా వినిపిస్తారు అంతే !!"""
""కృష్ణా ,! మీ ఇంట్లో బోలెడంత వెన్న దొరుకుతుంది కదా, ??మరి ఎందుకు ఇంతగా కష్టపడుతూ ఉన్నావు వెన్న కోసం ?""
""ఓ అదా!!,, మీ కోసం , మీ స్నేహం కోసం చేస్తున్నా ఇదంతా !!, ఊరకే ఇమ్మంటే ఇస్తారా ఏదైనా ఎవరైనా ,??ఇవ్వరుగా !! అయినా ఇలా వెన్నను దొంగిలించి తినడం లో ఉన్న మజా నే వేరు లే !"" అదిగో,,నేను ఏది చెప్పినా మీరు నవ్వేస్తు ఉన్నారు !!""
""కృష్ణా,! నీవు నంద రాజు కొడుకు వైనా ,మా కోసం , ఇంత కష్టం నిష్టూరాలు పడుతున్నావు ఎందుకు?""హాయిగా ఉండకుండా మీ ఇంట్లో ??""
""నాకు మీరు కావాలి,,మీకు నేను కావాలి కదా !నేను మీరు వేరు కాదు!! ఒకటే,!! అయినా స్నేహితుల మధ్య, రాజు పేదా అని బేధాలు ఉండవు కదా!""
"""కృష్ణా,!,మాకు ఆ వెన్న కంటే ఎక్కువగా , నీతో గడపడమే ఇష్టం సుమా!""
"""అందుకే కదా !!,,,మీ కు నేను ఇష్టం కనుకనే,నేను ఏం తెచ్చినా ఏం చేసినా మీకు సంతోషం కోసమే చేస్తున్నాను తెలుసా ?"""
""అవును కృష్ణా,!; అవును !! కానీ ఆ గోపికలు నిన్ను కట్టి పడేస్తే, ""వెన్న దొంగ " నల్ల పిల్లాడు ,, నల్ల పిల్లి !""అంటూ నిన్ను పరిహాసం చేస్తుంటే,మాకు బాధగా ఉంటోంది , తెలుసా?!""
""అయ్యో , ! మీరు అలా అనుకుంటూ ఉన్నారా ?!మీ లాగే వారు కూడా సంతోషంగా ఉండాలనే ,వారు నన్ను పట్టుకునేది, తెలుసా?""
""అవునా కృష్ణా ?!వారికి కూడా నీవంటే అంత ఇష్టమా??""
, మరేమను కొన్నారు మీరు ??, వారి కోసమే,నేను వచ్చేది,! వెన్న కోసం !!, మీ కోసమే వారి ఇంట్లో దొంగతనం కూడా చేసేది, !""
""కృష్ణా,,!అయితే నేరుగా పగలే రావచ్చు గా ఇలా రాత్రి. ఎందుకు చెప్పు ?""
,""ఎందుకంటే ,వీరు పగలు పనిలో ఉంటారు!,,మీకు పెట్టకుండా, డబ్బు కోసం వెన్న పాలు పెరుగు అమ్ముకొడానికి మధుర నగరానికి వెళ్తారు ,!!
అందుకే మీ వంతు వెన్న మీకు దక్కడానికి ,మాత్రమే చేస్తున్నా ఈ నాటకం ! తెలుసా మీకు ?"""
""కృష్ణా !మాకోసం ఇంత చేస్తున్నావు కదా !!మరి , నీ కోసం మేము ఏం చేయ గలం చెప్పు ?!
""ఇందులో ,మీకు ,నేను చేస్తుంది ఏమీ లేదు!,మనం స్నేహితులం!! సంతోషంగా కలిసి ఉంటున్నాం ,!!కలిసి తింటూ ,కలిసి తిరుగుతూ ఉంటున్నాం !!
మనం అంతా ఒకటే,!!
"""కృష్ణా! ,నిన్ను చూస్తుంటే,నీతో ఇలా మాట్లాడుతూ తిరుగుతూ ఉంటే,ఎంతో ఆనందంగా ఉంటోంది!!, నీ కోసం ఏమైనా చేస్తాం!! ,అది దొంగతనం కావచ్చు !;అయినా మరేదైనా కావచ్చు,!!ప్రాణం అయినా ఇస్తాం నీకోసం !! కృష్ణా,,!"""
" ప్రియ "మిత్రులారా !!,,చూశారా?? స్నేహం లో ఎంత ప్రేమ ఎంత బలం ఎంత దైర్యం ఉంటుందో,, ??అందుకే ఈ దొంగాట!""
""కృష్ణా ,,వేల ఆవులు తమ లేగ దూడల తో నీ చుట్టూ ఎప్పుడూ ఎందుకు తిరుగుతూ ఉంటాయి??"""
"""ఏముంది !;మీ లాగే వాటికి కూడా నేనం టె ఇష్టం ప్రేమ అంతే!""
""కృష్ణా ,! తినేవి,తాగేవి ఎన్నో ఉన్నాయి కదా,,మరి ఈ వెన్న మీదనే ఎందుకు నీకింత ఇష్టం ,?"""
""ఎందుకంటే, వెన్న శక్తి అమోఘం ! ఎంత కష్టపడితే ఈ వెన్న వస్తుందో మీకు తెలుసు గదా !!! వెన్న ఆరోగ్యం ,బుద్దిని , మేధస్సు ను, జ్ఞాపక శక్తిని,,దేహానికి బలాన్ని ఇస్తుంది,!;పైగా సులభంగా జీర్ణం అవుతుంది,;;రోగనిరోధక శక్తిని పెంచుతుంది,,!ఉత్తమ పోషక ఆహార పదార్థం పిల్లలకి !;,,ముఖ్యంగా మనలాంటి పిల్లలకు విధిగా తప్పనిసరిగా భోజనం తో పాటు,తినాల్సిన మధుర పదార్థం ,' ఈ వెన్న !దేవుడికి నివేదన చేస్తూ మాత్రమే,తినాలి సుమా !""
వెన్న తిన్న మనిషి మనసు నవనీతం గా సత్వ గుణ సంపద కలిగి ఉంటూ దైవభక్తి ని,, ముక్కోటి దేవతల నిలయ మైన గోమాత వైభవము నూ,,మనకు తెలియజేస్తూ ఉంటుంది !!""
ఇంత గొప్ప ఔషధం ,మధురమైన ఆహారం మనకు అందిస్తూ ఉంటున్న మన గో సంపద యే మన అసలు భాగ్య సంపద!!!
""అట్టి అతి పవిత్రము ,సకల దేవతా స్వరూపము అయిన గోమాతకు నిత్యము పూజిస్తూ ప్రదక్షణ చేస్తూ ,పచ్చని గడ్డి అందజేస్తూ , పూజిస్తూ,ఆమెలో ఉండే సకల దేవతల ఆశీస్సులు మనం పొందుదాం!!
""గోమా తా కి జై !!" అందరూ అనండి!"".
గో మాతా కి జై !""
""కృష్ణా !కృష్ణా!, కృష్ణా!! ఎన్ని మంచి మాటలు చెప్పావు ఈ రోజున ?? ఆహా!
""ఎంత చక్కగా మాకు మార్గ దర్శనం చేస్తున్నావు??
,, మేం ఎంత అదృష్టవంతులం?? , కృష్ణా?! నీలాంటి మంచి స్నేహితుడు దొరకడం మా భాగ్యం !""
అందుకు ఆ పరమాత్ముని కి ,,శతకోటి ప్రణామాలు అందజేస్తూ ఉన్నాం మేమంతా !!"
""అయ్యో !! మీరు అనుకునే పరమాత్ముడు ఎక్కడో లేడు!! అదిగో ఆ గోవులే మన దేవుళ్ళు,, దేవతలు!!
, ""అందరూ రండి !!వాటికి సేవలు చేద్దాం!""గో సంరక్షణ బాధ్యత చే పడుదా ము! రండి ! రండి !""
స్వస్తి !""
హరే కృష్ణ హరే కృష్ణా !""
Monday, March 2, 2020
నల్లని వాడు
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment