Wednesday, March 25, 2020

రాధా మాధ వం! 2

Mar 16, 2020
కృష్ణా  ! గోపికా మానస చోరా ! యమునా తీర విహారా!,
ఈ కార్తీక మాసం లో, , పండు వెన్నెల్లో ,నిండు చందమామ   కాంతుల లో,, అతి మధురంగా ,సుదూరంగా  వినిపించే నీ వేణు  గానానికి పులకించి, పరవశించే    ఆ యమునా వాహిని, ఆ ,లతలు ,పూలు, చెట్లూ , నెమళ్ళు లేళ్ళు పక్షులు ,,రామ చిలుకలు ,  చల్లని మలయమారుతం గాలులు వీస్తు ఉంటే , ఆ బృందావన దివ్య సీమ లో రమణీయంగా ,కమనీయంగా  చంద్ర కాంతిలో  ,వినూత్న శోభలతో  నయన మనోహరంగా వెలుగొందే ఆ ప్రకృతి కాంత అంద చందాలు చూసి తీరాలి  , కృష్ణా !!
ఆహా !
మాటలకు  ,ఊహలకు ,చేతలకు అందని  ఆ సుందర ప్రకృతి సోయగాలు , ఏటి జలధార వంపుల వైభవాలు ,చూస్తూ నేను  పరమానందాన్ని పొందుతున్నాను  కృష్ణా !ఇలాంటి మధురానుభూతులు  స్వర్గంలో కానీ , మరే దివ్య లోకాల్లో కూడా  కానరా వు కదా!
  నిజంగా  ఈ పావన ధరిత్రీ పై,, జ్ఞానంతో జన్మించిన ప్రతి మనిషి దన్యుడే  ,,పుణ్యాత్ముడు కదా !!
ఎందుకంటే ఎచట చూసినా నీవే  ,,నీ సర్వాంతర్యామి తత్వమే భాసిస్తూ ఉంటుంది కదా!
కృష్ణా !!
,  ఆహా ! నీలమేఘ శ్యామ సుందర లావణ్య రూప కాంతులతో వెలిగిపోతున్న  నీలో నే  లీనమై , నీవే మా ప్రాణమై , నీ చూపులే మా ఊపిరి యై ,  నీపై గల అపారమైన  ప్రేమానురాగాలతో విహ్వాలుల మై , చిత్తరువు లవలే  చేష్టలుడిగి ,నిలిచి పోతూ ఉంటున్నాము  ,నేను మా గోపికలు !
,,, అపారమైన భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని నీ  సుందర ముగ్ద మోహన రూపానికి  జోడించి "",,నీవు తప్ప అన్యము ""తలచని ఆ గోపకాంతల భాగ్యం ఏమని చెప్పగలను ?
కృష్ణా!
ఆ , లతా నికుంజములు, ఆ  పూల పొదలు ఆ, గోప గోపీ జనాలు, పూల పొదరిండ్లు , ,ఇవన్నీ చూస్తూ కూడా  ,,కేవలం నన్ను కృతార్తురాలిని చేయడానిక సంకల్పం చేశావు ,,కదా ,నీ వు,,?? కృష్ణా !!
" రాధా వల్లభుడు ""అనీ ""రాధా మాధవుడు ""అనీ ""రాధా లోలుడు ""అనీ
""రాధా కృష్ణుడు !" అనీ ,వారంతా నిన్ను పిలుస్తూ ఉంటే నిజంగా నాకు ఎంత మహదానందం గా ఉంటుందో చెప్పలేను కృష్ణా !
నీవు నాకు విదేయుడవై , నీ ప్రేమ పట్టాభిషేక సామ్రాజ్యానికి ,, నన్ను పట్టపు రాణి ని  చేసిన నీ  అపారమైన కృపా కటాక్షాలు ఎంతని పొగడ ను ??
కృష్ణా !!
ఈ విధంగా నీవు  ,నిరంతరం గా  నాపై కురిపిస్తున్న  ప్రేమామృత అనురాగ  రసదార లను చూస్తూ ,, ఆ గోపికా స్త్రీలు అందరూ,ఎలా  నన్ను ఆడి పోసు కుంటున్నా రో చూశావా ,, కృష్ణా !!
""ఈ రాధా  రాణి లేనిది, ఆ  మాధవుడు లేడు !
ఈ,రాధ రాణి అజ్ఞ రానిది,  ఆ కృష్ణుడు  ,,ఒక్క అడుగై నా ముందుకు వేయడు !!
ఈ రాధమ్మ  అనుమతి లేనిచో కృష్ణునితో ఎవరూ మాట్లాడ రాదు!""
అంతెందుకు , ఈ అందాల నందనవనం బృందావనం లో  రాదా రాణి అనుమతి పొందకుండా ఎంతవారి కైనా ప్రవేశం లేదు కదా !""
అమ్మో ! ఎంత గడుసు ది ఈ రాధా దేవి??
మా కృష్ణుని తన కొంగున ముడి వేసుకొని తన చుట్టూ తింపుకుంటూ ఉంది!
మరి , మా గతి ఏం గానూ? అంటూ వాపోతూ ఉన్నారు కృష్ణా !;
వారికి జవాబు ఏమని చెప్పను ? చెప్పు !
, అయినా  ఇలా ,  పరమాత్ముని వైన నిన్ను  ,,నేను శాసించే  అంత  గొప్ప మహోన్నతమైన  స్థాయికి  నన్ను  చేర్చావు కదా!
అర్భకురాలిని ,నాకు అంత అర్హత యోగ్యత కట్టబెట్టడం ఇదంతా  కృష్ణా  ,! కేవలం  నన్ను. అనుగ్రహించడానికే కదా !
""కృష్ణా,! నీ "ప్రేమ" అనే అమూల్య" రత్నం" లభించాక ఎవరికీ , ఏ కొరతా ఉండదు కదా !
కృష్ణా !!
మన ప్రేమ ఎంత గొప్పదో, ఈ అనురాగబందం ఎంత బలమైన దొ , భక్తలోకానికి చెప్పడానికి , ఇదంతా ఒక  లీలగా ,,హేల గా , నీవు ఆడించే ఒక  మహా నాటకం కాదా ??
నేను  ,, అందులో నన్ను కూడా చిన్న  పాత్రధారి ని  చేసి దన్యు రాలి ని చేశావు కదా ! కృష్ణా !!
, ప్రేమ అంటే స్త్రీ పురుషుల కామ సంబంధమైన  లైంగిక  వాంఛ తీర్చుకునే సంబంధము   కాదు ,, అనీ, సూచిస్తూ , అందు కు అతీతంగా  , అమరం గా ,ఆదర్శంగా అద్భుతంగా  ,అనుభవైక వే ద్యంగా  ,,అపురూపంగా మన ప్రేమానురాగాలను  రూపొందించా వు గదా ,, కృష్ణా!
, ఈ  ప్రేమ అద్వైత ప్రేమ !
,అనగా ,నీవే నేను , నేనే నీవు  !
శరీరా లు వేరు అయినా , ఇద్ద రం ఒకటే !
అని తెలియజేయడానికి    మన అనుబంధాన్ని  ""రాసలీల ""వైభవ నెపంతో  అందంగా ప్రదర్శిం చి , నీ భక్త లోకాన్ని దర్శింప జేశావు  కదా !
కృష్ణా  !,మన. ప్రేమ  అమరమైనది  !, అపురూపమైనది !
, నిజంగా ఈ వ్యవస్థ , బ్రహ్మానంద స్థితిని తలపిస్తుంది !!
ఇది ఒక " ప్రేమకథ"" కాదు ,!
ఒక తపస్సు !
ఒక సాధనా సంపత్తి! పూర్వ జన్మ పుణ్యాల మూట!! జీవాత్మ, పరమాత్మ ల అనుసంధానం !;""
చూడగలిగిన వారి కి ఒక  పండగ  ,,!కన్నుల పంట !
వాస్తవానికి ,,జీవాత్మ  పరమాత్మ యొక్క అంశ !
నేను జీవుడ ను ,!!
కృష్ణా !,నీవు దేవుడ వు!!
,కానీ తనకు  తానుగా , ఈ నిజం తెలుసు కో నీయకుండా , ఆ జీవుడి సంచిత కర్మలు అడ్డగిస్తు ఉంటాయి!
కృష్ణా !, నీ అనుగ్రహం లేనిదే , నీ పై బుద్ది పుట్టదు కదా!!
అదే విష్ణు మాయ! అజ్ఞానం అవిద్య ,అవివేకం అనబడే ఒక అడ్డు తెర!  
పరమాత్మ ను తెలుసుకోకుండా జీవాత్మను దూరంగా నెట్టుతూ ,, నట్టేట నిలువునా  ముంచుతుంది కదా!!
అనగా
""పునరపి జననం ,
పునరపి మరణం !;"
దీనికి ,
తరుణోపాయం ,,""గోవిందా!!  అంటూ చిత్తశుద్ది తో నీ భజన చేస్తూ ఉండడమే  !!
,,,అన్యదా శరణం నాస్తి !!
త్వమేవ శరణం మమ ! తస్మాత్ కారుణ్య భావేన !
రక్ష ! రక్ష! జనార్దనా!"" అంటూ కృష్ణా! జీవులం అయిన మేము ,దేవుడవైన నీకు శరణాగతి చేయ వలసి నదే కదా!!""
కావున కృష్ణా!  నా  ఈ  మొర ఆలకించి , నను బ్రోవరా దా!!""
కృష్ణా! రావే లరా! దయ జూడ రా!
రాధా మనోహర!!".
_______
""నీవే తల్లివి తండ్రివి !,
నీవే నా తోడు నీడ,, నీవే సఖుడవు ! నీవే గురుడవు ,దైవము !
నీవే నా పతియు,గతియు,,!
నిజముగా కృష్ణా ! "",
_______&&&_________

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...