Wednesday, March 25, 2020

క్రమ శిక్షణ దేనికీ ?

Mar 17, 2020
  చిన్నతనం లో   స్కూల్ పిల్లలకు ,, మిలిటరీ,, పోలీస్ ,,RSS లాంటి   శాఖల్లో,,  ,కార్యాలయాలలో ఈ క్రమశిక్షణ చర్యలు  చూస్తుంటాం
ఇక పెద్దవారు అయ్యాక అదే " క్రమశిక్షణ ""పట్ల  అంతగా ఆసక్తి చూపం కదా!
ఇక శేష జీవితంలో, దాని అవసరం లేదనుకుంటా ము
, క్రమశిక్షణ శరీరానికి మాత్రమే వినియోగిస్తూ ఉండే  పద్దతి
,time ప్రకారం నిద్రా, తిండి, పనీ  చేస్తుంటాం !
అంతవరకే  ఆ క్రమశిక్షణ ఉపయోగం !!
కానీ ,ఏకాగ్రత తో దైవారాధన చేయాలంటే మాత్రం ,,ఆ క్రమశిక్షణ మనిషికే కాదు , మనసుకు కూడా  ఇవ్వాల్సిన అవసరం ఉంది !
అరుణాచలం రమణ మహర్షిని ఒకరు అడిగారు 
""స్వామీ! నాకు  దైవం పై మనసు  ,నిలవడం లేదు ! దయచేసి నాకు ,ఏదైనాఒక  మంత్రం ఉపదేశించండి !""" అనీ
ఇలా ఒక సంవత్సరం పాటు  రోజూ అతడు   వేధిస్తూ ఉంటే విధిలేక ఒక మంత్రం చెప్పాడు!
తిరిగి సంవత్సరం అయ్యాక మహర్షి అతడిని అడిగాడు
" ఇపుడైన మనసు  కుదురుగా ఉంటుందా !"? "అని
""స్వామీ ,! ఏం చెప్పను ? నా పరిస్తితి ??
మీరు ఉపదేశించిన  మంత్రం జపిం చే సమయానికి దూరంగా ఒక కుక్క మొరుగు తూ వినిపిస్తోంది !దానితో
మనసు నిలపలేక పోతున్నాను , !""అంటూ వాపోయాడు
మహర్షికి అర్థం అయ్యింది
మొరుగుతుంది కుక్క కాదు !
,అతడి "మనసు "అనీ,!
కుక్క మొరగడం వినకున్నా , ఆ సమయానికి అతడు అదే భావిస్తూ ఉన్నాడు !
ఒక్క రోజులో ,ఒక నెల , సంవత్సరం లో వచ్చేది కాదు కదా!
ఋషులు మునులు వేల ఏళ్ళు చేశారు తపస్సు  తమ ,మనస్సు పరమాత్మ తో  అనుసంధానం  కావడానికి !!
అందుచేత  "మనసును "" నిలపడం అనేది అంత సాధారణ విషయం కాదు !
""మహాత్మా !వాసుదేవ !గాలిని  మూట కట్ట వచ్చునేమో కానీ మనసు నియంత్రించడం   నాకు  కష్టసాధ్యం  అవుతోంది !" అని అర్జునుడు విషాదం వ్యక్తం చేశాడు ,,
గీతాచార్యుడు  శ్రీకృష్ణ భగవానుడు  ఉపదేశించిన భగవద్గీత సారం   సాంతం విన్నాక నరుడు అన్నాడు
శ్రీకృష్ణా !,నాకు కర్మ సాంఖ్య భక్తి యోగాలు వివరించావు!
అర్థం అయినట్టే  అవుతోంది !!
కానీ దానిపై పట్టు సాధ్యం కావడం లేదు ;
చంచలమైన ఈ మనసు వల్ల ,, కృష్ణా !;నీవు అద్భుతంగా  బోధిస్తువుంటున్న అనేక ఉపదేశాలపై  చిత్తాన్ని కుదురుగా  నిలపలే క పోతున్నాను  , కృష్ణా !
నన్ను క్షమించు ! దయచేసి ,,
నా ఈ దుర్భరమైన వేదన తొలగిపోయే లా  నాకు  మార్గ దర్శనం  చెయ్యి ,,మహానుభావా ,!"
అని వేడుకుంటూ తన అసహాయత ను తెలిపాడు
భగవద్గీత ,6 వ అధ్యాయం  34 వ శ్లోకం    అది!
""చంచలం హి మనః కృష్ణ _ ప్రమాధి బలవద్దృ డం!
తస్యాహం నిగ్రహం మన్యే _ వాయోరివ  సుదుష్కరం !!""
అంటూ నరులమైన మన అందరి పక్షాన.  అర్జునుడు నరుడి గా కోరాడు 
నిజానికి
ఈ సమస్య తన ఒక్కడిదే కాదు !,
సకల మానవులది , !
మనిషి పుట్టిన క్షణం నుండీ  అతడు మరణించే వరకూ నిరంతరం వేదించే ఘోరమైన సమస్య , ఇదే
""మనసును దైవం పై లగ్నం చేయడం   !!""
అది పదార్థం పై  ,ప్రాపంచిక సుఖాల పై మొగ్గు చూపుతూ దానిపై  తీరని  ""వ్యామోహం ""కలిగిస్తూ ఉంటుంది 
కానీ మురళీ మోహనుడి ముగ్ద మోహన రూపం పై మాత్రం  మోహం కలిగించదు కదా !
అనగా మనసు నిలవదు !!
  అర్జునుడి ప్రశ్న  ,జీవులమైన మనం నిత్యం వేసుకొంటూ ఉండాలి !
  శ్రీకృష్ణుడు కోపించలేదు ,
ఇంత చెప్పాక కూడా అర్జునుడు ఇలా అనడం అతడికి చిత్రం అనిపించలేదు ,అతడి దీనస్థితి కి జాలి కలిగింది ,!
కారణం ,మనసు ప్రభావం ఎంత బలీయమో కృష్ణునికి తెలుసు!
అర్జునుడి ప్రశ్న ,సకల  జనులకు మోక్షదాయకం ,,మరియు  సంసార సాగర తరుణోపాయం ,సూచించేది కనుక , పరంధాము డు దరహాసం చేస్తూ అన్నాడు
"" ఓ అర్జునా !
నీ సందేహం నిజమే ! మనసును , చలించకుండా ఆపడం  కష్టమే  !!
కాని అసాధ్యం  మాత్రం కాదు , సుమా!
భగవంతుని కృపతో  ,, నిరంతర సాధనతో మానవుడికి సాధ్యం కానిది ఏదీ లేదు !!"
""1_అభ్యాసము 2_,వైరాగ్యము !""
అనే ఈ రెండు విధానాల ద్వారా  మాత్రమే మనిషి తన  మనసును నియంత్రించ వచ్చును!
_______&________
6 వ అధ్యాయం  ,35 వ శ్లోకం
__""_
భగవానువాచ :___
శ్లోకం !!
""అసంశయం మహా బాహో,,
_మనో దుర్ణిగ్రహం చలం !
అభ్యసేనతు కౌంతేయ _ వైరాగ్యేణ చ గృహ్యతే !!""
అంటూ  సమస్యకు  పరిష్కారం తెలియజేస్తూ అర్జునుడి మనసు తేలిక పరిచాడు ,పార్థసారథి !,గోపాలకృష్ణ మూర్తి !!
భగవద్గీత వినక ముందు "నరుడు ""గా ఉన్న అర్జునుడు ,
విన్నాక " విజయుడు" అయ్యాడు !!
"
అందుచేత "" నరులు"" గా ఉన్న మనం కూడా, మన జీవన యాత్రలో  ""విజయులం""  కావాలంటే మనసును నిగ్రహించి,,  దాని వల్ల ప్రకోపింపబడే ,,అరిషడ్వర్గాలను  సాధనతో గెలవాలి
అందుకే  ప్రతీ రోజు ,
మనం దేవుని పూజ ,అర్చన, భజన, స్తోత్ర పఠన , సంకీర్తన అభిషేక సేవలు ,దేవాలయ సందర్శన , మొదలగు ప్రక్రియల యందు మనసును  లగ్నం చేస్తూ , దానిని దైవం పై నిలిపేందుకు నిరంతర ప్రయత్నం సాగిస్తూ ఉండాలి !
పొరబాటున కూడా , మనం సాగిస్తూ ఉంటున్న  అభ్యాసం  ,ఎన్ని అవాంతరాలు ఏర్పడినా కూడా మద్యలో మాన వద్దు!
సగం దూరం తీసుకొచ్చిన  జీవన యాత్ర   తిరిగి మళ్లీ మొదటి కే వస్తుం ది కదా !
స్వస్తి !"
హరే కృష్ణ హరే కృష్ణా !!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...