Wednesday, March 25, 2020

రాధా మాధ వం !

Mar 15, 2020
నేను నీ రాధను ! కృష్ణా !
నీకంటే ముందే ఈ ధరిత్రి పై జన్మించి  ,,,నీకోసం  నిరీక్షిస్తూ  ఉన్నానురా,,!
కృష్ణా,!,
నీవు ఈ గోకులానికి ఆరాధ్య దైవానివి ,కావచ్చు !
కానీ ,నాకు  మాత్రం ప్రాణానివి సుమా !
నీ తలపు, నీ వలపు , లేని నా ఈ జన్మ వృథా యే కదా!
అడవి గాచిన వెన్నెల కాదా!"
కృష్ణా!నీవు  నాలో  పరిపూర్ణంగా నిండి ఉన్నావు!
నీవే నేను ,!నేనే నీవు !కానీ
,,నేను ఈ మానవ కాంత రూపంలో వచ్చింది నీతో అనుభూతులు పంచుకుంటూ ,
నీలో ఐక్యము కావడానికి  ,
"తత్వమసి "అన్న వేద వాక్య ప్రమాణం  సత్యం చేయడానికి !
రాధ యే కృష్ణుడు ! కృష్ణుడే రాధా దేవి!
నీవు నాకు ఎదురుగా లేకున్నా కృష్ణా!
, నీవు నా అంతరంగం లో అందంగా  సాక్షాత్కరిస్తు  నాకు అపరిమిత ఆనందాన్ని కలిగిస్తూ ఉంటావు !
ఈ ఆత్మానందం ఎంత మధురం ? ఆహా !
అందుకే విరహము కూడా సుఖమే అంటారు !
ఎందుకంటే,అందులో  తన ప్రియుని గురించిన నిరంతర చింతన , "ఎడబాటు "ను మరపిస్తు ఉంటుంది కదా !;
ఈ  రాదామాధవుల.  బంధం  ,ఎన్నో  యుగ యుగాల  నుండి పెనవేసుకుని వస్తున్న ప్రేమానురాగాల అద్వితీయ  అనుబంధం !""
"
నీ భావం లో ఉండగా , మళ్లీ  బాహ్యంలో ఎదురుగా  నేను ఎందుకు   ఉండాలి,,! అంటావేమో ?"
కృష్ణా,!
,,నేను గోలోక సౌఖ్యం వదులుకొని ఇక్కడికి నీకోసం రావడం ఇందుకే ఈ ఆత్మానందం అనుభవానికి కాదా !!
కృష్ణా !
  మన ఇరువురం ,కూడా మానవ వేష ధారు లమే!!
మానవజాతికి "ప్రేమ" యొక్క గొప్పదనం ఏమిటో, ప్రత్యక్షంగా చూపడానికి  మనప్రేమ ను సాధనంగా చేశావు !
, స్త్రీ పురుషుల మధ్య ఉండే లైంగిక వాంఛలకు అతీతంగా  ఉండే  అర్ధనారీశ్వర తత్వ జ్ఞానం గురించిన ప్రెమానుభవాన్ని ,,,ప్రేమ యొక్క కొత్త నిర్వచనాన్ని మానవాళికి అందిం చే  మిష పై ,,నన్ను ఈ పావన ధరిత్రి ,పైకి  రప్పించా వు కదా !,
నీవు వచ్చింది ""ధర్మొద్దరణ"" కు !
నన్ను పిలిపించింది, ప్రేమ తత్వ  అద్వైత సిద్ధాంతాన్ని జగతిలో  చాటేందుకు !
అందుకే ,ఎప్పుడూ  నాతోనే ఉండిపొమ్మని  నిన్ను కోరను కృష్ణా!"
నీవు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడువి!
",దుష్టశిక్షణ శిష్టరక్షణ" నిమిత్తం  నీవు శ్రీకృష్ణుడు గా అవతరించా వు ,!
సకల ప్రాణుల కల్లా,""మానవ జన్మ  బహు" మధురమైనది ,, అన్న విషయం అనుభవ పూర్వకంగా  ప్రత్యక్షంగా నేను  తెలుసుకుంటూ ఉన్నాను కృష్ణా !;
,,,ఈ శరీరం తో  ప్రకృతి అందాలు ,ఆనందాలు, అనుభవించే  పులకింతలు ,  మధుర అనుభూ తులు నిజంగా   అద్భుతం !"",
అవి మాటలకు అందవు !ఊహకు తట్టవు !!
అందులో జగన్మోహన ఆకారం తో ప్రభవించిన నీ రూపసౌందర్యం !", అహో! అపురూపం !"అద్భుతం !
, బ్రహ్మ రుద్రా దులకు కూడా , నీ సుందర స్వరూప లావణ్యాన్ని  వర్ణించ తరం కాదు కదా !!,,
కృష్ణా !   , నీ ముగ్ద మోహన రూప గుణ వైభవాన్ని దర్శించడానికి ఈ మాంస నేత్రాలు నిజంగా సరిపోవు సుమా !!
అయినా రెప్పలు ఆర్పకుండా విచ్చి  విచ్చి ,నిన్ను చూస్తూ  ,నీ సుందర రూపాన్ని తనివార కళ్ళారా దర్శించాలని అనుకుంటే , ఈ ,రెప్పలు చూడు, నిర్దయగా  అడ్డం పడుతున్నాయి !""
ఏం చేయను ? చెప్పు ,,!  అయినా కూడా , కళ్ళు మూసుకుంటూ  కూడా ,,, నీ జగన్మోహన  సౌందర్యాన్ని అంతరంగం లో నిక్షిప్తం చేస్తూ పరమానందం పొందే , ఆ మహా భాగ్యం ఒక్క ఈ మానవ జన్మ తో మాత్రమే సాద్యం అవుతోంది!!
ఆహా!! ఆ ఆత్మానందం అద్భుతం ! అది  అనుభవైక వేద్యం !!""
,అందుకే కృష్ణా !!
నిన్ను ""మునిజన హృదయ విహారా,! గోపీ మానస చోరా !""అంటారు కదా,,
వారు తమ హృదయంలో నీ మూర్తిని దర్శిస్తూ,అందులో  రమిస్తు బ్రహ్మానందం పొందుతూ ఉంటారు !!
కృష్ణా ! ,నీవు  సృష్టించిన ఈ అందాల ప్రకృతిలో కూడా నిన్ను దర్శించి తన్మయత్వం పొందే సౌలభ్యం ఉంది!""చూడగలిగే కళ్ళు ఉండాలి గానీ, కృష్ణా,,
సృష్టిలో ,అణువణువునా,, అడుగడుగునా నీవే !
, నీ అందమే , నీ లావణ్యమే ప్రచోదిస్తు ఉంటాయి !!
కృష్ణా !!స్వచ్చమైన  తటాకం , లో గలగలా పారుతూ ఉండే యమునానది జలాల్లో ,,నీవే ప్రతిబింబిస్తూ కనిపిస్తుంటావు""
""కృష్ణా !
నీవు ఆ జలం అయితే ,,అందులో స్వేచ్చగా తిరుగుతూ ,, ఆనందిస్తూ హాయిగా. ఆడుకుంటూ ఉండే చేప పిల్లను నేను కావాలి !
కృష్ణా ;!
సుందర ఏకాంత యమునాతీ రం లో , చల్లని మెత్తని ఇసుక తిన్నెల పై కూర్చుని  ఉండగా ,నింగిలో వెలిగే, ఆ  చందమామ నిండు పున్నమ వెన్నెల నీవైతే ,నేను ఆ వెన్నెల కాంతుల్లో స్వేచ్చగా ఎగురుతూ , ఆ  అనందామృతం గ్రోలే చకోర పక్షి ని. నేను కావాలి కృష్ణా !!
మల్లే మొల్ల జాజి గులాబీ లాంటి సుమధుర సుగంధ పరిమళాల పుష్పాన్ని నేనైతే , ,నీవు ఆ సౌరభాన్ని ఆస్వాదించే "భ్రమరం"గా మారి  , మన  ప్రేమా మృతాన్ని ఆస్వాదిస్తూ ఉండాలని  కోరికగా ఉంటుంది ,!
, కృష్ణా!
వేలాది గోపికలు నిన్ను సేవిస్తూ,,  నీకోసం,తమ  ప్రాణాలు సైతం  నీ ఆరాధనలో సమర్పించడానికి  తన్మయులు కావడం,చూస్తుంటే , అపుడప్పుడు  నాకు  వారిపై ఈర్ష్య గా ఉంటుంది సుమా!
మితి మీరి పెంచుకున్న  ప్రేమ,ఇలా  అసూయ గా మారుతూ ఉంటుందేమో కదా  కృష్ణా !!
ఇతర ఏ  విషయాల్లో   కూడా  అసూయ పడని స్త్రీ , తన ప్రాణానికి ప్రాణం గా చూసే ప్రియుడు , ఇతర స్త్రీల జోలికి వెళ్తే మాత్రం ఏ ఆడది తట్టుకోలేదు ,!;
ఈ అసూయ తో కోపం, ద్వేషం,,  విరహతాపం,  తీరని  వేదన  అవరించి ,, తనవాడిని చేసుకునే వరకూ ఆమె మనస్సుకు శాంతి కలుగదు సుమా !;
కోపం ఈర్ష్య లు  మనసుపై  ఎంత చెడ్డ ప్రభావం చూపి స్తు, విరోధ భావాన్ని పెంచుతాయో చూశావా కృష్ణా !
ఏం చేయను ?, ఎంత దేవ కాంత ను అయినా మానవ జన్మ  ఎత్తాను కదా!
ఈ త్రిభువనాల ను , మోహింపజేసే నీ రూపలావణ్యాలు అలాంటివి,మరి !!
అయినా ,నిన్నే ప్రాణాధికం గా ప్రేమించే  ఈ రాధ మనసు ,నీకు చక్కగా  తెలుసు,!!
ఏ గోపికలతో  నీవు ఆనందంగా విహరిస్తూ ఉన్నా,సరదాగా  ముచ్చటించినా ,వారిలో ,,నీవు నన్నే చూస్తూ,,,  నాతో ఉన్నట్టుగానే  భావిస్తూ ,,వారితో  క్రీ డిస్తు ఉంటా వని కూడా  నాకు తెలుసు !!
ఎక్కడ ఏమి చేస్తున్నా నీ లీలలు నీ వినోదాలు , నా అంతరంగం లో సచిత్రం గా  కదలాడుతూ , నాకు తెలియజేస్తూ ఉంటాయి,,!
కృష్ణా !,నీవు ఎక్కడ ఉన్నా , ఈ రాధా రాణి కళ్ళు గప్పి  , ఎక్కడికి కూడా  తప్పించుకు పోలేవు సుమా!;
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...