Feb 25, 2020
రేపల్లె లో , నందుని గృహంలో , గారాబంగా పెరుగుతున్న ,చిన్ని కృష్ణుడు ,,తన రెండేళ్ల వయసులో నే ,,తల్లి యశోదకు దొరక్కుండా , తిరుగుతూ,కనబడకుండా స్థంబాల చాటున , గదిలో, మారు మూల దాక్కుంటూ "",నన్ను దొరికించుకో,, అమ్మా , !""అంటూ గల గల నవ్వుతూ, ఆమె చేతికి అందకుండా పరుగులు తీస్తుంటే , వాడిని పట్టుకోవడం యశోదా మాతకు కష్టంగా ఉంది,
రోజూ అదే పని,!అదే ఆట,!
లేచింది మొదలు కృష్ణయ్య ఉరుకులు,, పరుగులు ,,!!
, అలా,చూస్తే ఆనందమే ,!కానీ వాడిని పట్టడమే కష్టంగా ఉంది,,!!
,అందుకు ఆమెకు ఒక చక్కని ఉపాయం ఆలోచించింది !!
,మాంచి వెడల్పైన ఒక బంగారు పట్టి,మణులతో అతికించి దానికి చుట్టూరా ,గణ గణ మని మృోగుతూ ,పెద్దగా వినబడేలా , చిన్న చిన్న గంటలు అమర్చి కృష్ణుని నడుముకి మొల త్రాడులా కట్టేసింది ,,!!
దీనితో కృష్ణు డు, ఎక్కడున్నా , ఎటు వెళ్తున్నా, మొల త్రాడు కు వ్రేలాడుతూ గణ గణ మ్రోగే ,చిరు గంటల సవ్వడి ద్వారా తెలిసి పోతూఉంటుంది!!
అయినా కూడా , ఆమెకు తృప్తి కలుగలేదు ,!
వాడి కాళ్లకు కూడా బంగారు అందెలు ,గల గల మ్రొగుతూ ,చిరు గజ్జెలు కట్టి , కృష్ణయ్య అల్లరి ఆట కట్టించాలని అనుకుంది ! ఇవి రెండూ,
వెంటనే అమలుచేసింది కూడా!!
ఇప్పుడు నల్లనయ్య అడుగేస్తే చాలు,!! వాడి కాలి అందెలు ఘల్లు ఘల్లు మని మ్రోగుతూ,సందడి చేస్తూ,ఇంట్లో ప్రతిధ్వనిస్తూ వినిపిస్తూ, ఉంటుంది!;
ఇక తాను పరుగులు తీస్తుంటే ,చాలు ,,తన,నడుముకున్న బంగారు మొలత్రాడు పట్టుదట్టి,కి ఉన్న చిరు గంటలు గుడిలో గంటల్లా, గణ గణ గణ మంటూ శ్రావ్యంగా ,సుస్వరంతో మృోగుతు , శ్రవణానందక రంగా అందరకీ వినిపిస్తూ ఉంటాయి!
,,ఇప్పుడు యశోద కే కాదు,కన్నయ్య ను చూసే నెపం తో ,, ఏదో పని పెట్టుకొని ఆ ఇంటికి వస్తూ ఉండే గోప, బాలురకు గోపికా స్త్రీలకు కూడా ఆ చిన్ని కృష్ణుని సొగసు, లావణ్యం,అందాలు చూడతరం కావడం లేదు,!!
ఏ మా అందం!? ఇలాంటి బాల కృష్ణుని అందం,లావణ్యం ,సుకుమార సుందర రూపాన్ని చూడని కళ్ళు ,,,, కళ్లే నా??
వారంతా , అలా కన్నార్పకుండా,చేష్టలు ఉడిగి పోయి, చిత్తరువు ల్లా,బొమ్మల్లా , యశోదమ్మ ఇంట్లో , పారాడుతూ ,నడయాడే,, కన్నయ్య ను చూస్తూ అలాగే నిలబడి పోతున్నారు ,,
నిజానికి త్రిజగన్మోహనుడు ,, నీల మేఘ శ్యామ సుందరుడు,సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ సౌందర్య లావణ్యం ,సురుచిరసుందర , సుకుమార ,ముగ్ద మోహన రూపాన్ని ,, ఆనంద నిలయుడిని ,,, ఆ యశోదా నందుల ముద్దు తనయుడిని ,చూడటానికి ముక్కోటి దేవతలు ,అదృశ్య రూపంలో వస్తూ, దేవాది దేవునికి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ ఉంటారు !!
,, ఆ జగదానంద స్వరూపుని విడిచి వెళ్ళలేక వెళ్ళలేక వెనక్కి వెనక్కి చూస్తు వెళ్లి పోతూ అంతటి వారే,శ్రీకృష్ణ భక్త చిత్త హృదయం తో పరమానంద భరితులై ,తమను తాము మరచి పోతూ ఉంటే సామాన్య మానవులు ఏ పాటి ??
, భగవంతుని సౌందర్యాన్ని ఈ కళ్ళతో జుర్రు కోవడం సాధ్యమయ్యే పనేనా ?? మానవకాంతల కళ్ళు , దానికి , సరి తూగేనా,??
శిఖ లో నెమలి పింఛం ,! వక్షస్థలం లో వ్రేలాడే కౌస్తుభం !,ముక్కు న తళుక్కుమని మెరిసే నవ మౌక్తికం,,!నుదుట కస్తూరీ తిలకం , !చందన సౌరభం తో పరిమళించే శ్యామ సుందరుని మేని ఛాయను,,! చూడ తరమా ఆ తేజో రాశి ని ?? చెప్పడానికి మాటలు ,రాయడానికి పదాలు సరిపోతాయా ??
ఆ వన్నెల తోనే, మనసు పిచ్చి దౌతుంటే,,
దానికి తోడు అతడి,మొలకు చిరు గంటలు ఉన్న బంగారు పట్టు దట్టి,, కృష్ణుని సుందరమైన రెండు పాదాలకు గల గల మృోగుతున్న బంగారు అందియలు ,,!! ఆహా,శృంగార దేవతా మూర్తి స్వరూపుడు , దివి నుండి భువికి దిగివచ్చిన సాక్షాత్తూ శ్రీ మన్నారాయనుడు , ఆ వైకుంఠ వాసుని దర్శించడం ఎన్ని కోట్లజన్మ ,, ల పుణ్య ఫలం ??
ముక్కోటి దేవతలకు ,, ముక్కంటి కీ,, విధాతకు కూడా , ఆ పరమాత్ముని దర్శిం చడం సాధ్యం కాని పని కదా !!
అంతటి,, అద్భుత, అపురూప,అలౌకిక ,అసాధారణ జగదేక సుందరు ని చూడటం ఈ మాంస నేత్రాలకు సాద్య పడే విషయమా,??
ఏ చిత్ర కారునికి, ఎంతటి గొప్ప కవులకు, భక్త శిఖామణి పుంగవుల కూ కూడా , బ్రహ్మాది దేవతలకు వర్ణించ సాద్యం కానీ, పరమాత్ముని సౌందర్య రాశి, ఇప్పుడు ఇలా , ఈ చిన్ని కృష్ణుని రూపంలో ,తన ఇంట్లో , తనివా రా చూస్తూ,మనసారా ప్రేమిస్తూ,నోరారా "" కృష్ణా! కృష్ణా !""అంటూ పిలుస్తూ ఉండే దివ్యమైన అనుభవానికి ,,అనందామృత భావ సంపద కు ,, పూర్వ జన్మ పుణ్యానికి , నోచుకున్న ఆ నంద యశోద ల,రేపల్లె పౌరుల భాగ్య మే,,నిజమైన మహా భాగ్యం కదా !
అలా ,జీవాత్మకు , పరమాత్మ తో ఇంత దగ్గరి సంబంధం లభించడం కన్నా పరమానంద కరమైన విషయం , జగతి లో మరొకటి ఉండదు కదా !
, ఇలాంటి భువన మోహనుడు,,,కన్నయ్య తన చేతిలో నవనీతం ఉంచుకొని , కొద్ది కొద్దిగా తింటూ, అది మోచేతుల మీదుగా కారుతూ ఉంటే,, నాలిక తో నాకుతూ, ,ఎవరైనా తనని గమనిస్తున్నారా అని,,ఏమీ తెలియని వాడిలా అమాయకంగా అటూ ఇటూ దొంగ చూపులతో చూస్తూ, సందడి చేస్తూ ,,,నడుముకి ఉన్న గంటలు గణ గణ మ్రోగుతు ఉంటే ,పరుగులు తీస్తూ ఉన్నపుడు కాళ్లకి ఉన్న అందియల గజ్జెలు ఘల్లు ఘల్లు మని నినదిస్తూ ఉంటే ,, ముద్దు ,ముద్దుగా వచ్చీ రాని మాటలు పలుకుతూ ,అల్లరి చేస్తూ, నంద గృహాన్ని ఆనంద నిలయం గా మార్చి,, ఆనందిస్తూ ,భక్తులను ఆనందింప జేస్తూ ఉన్న ఆ ముగ్ద మోహన నీల మేఘ శ్యామ సుందరు ని,, చిన్ని కృష్ణుని , లీలా మానుష వేష ధారి స్వరూపాన్ని మనం కూడా ,,మనసులో నిత్యం భావిస్తూ ఉందాం !;
ఆ,,నిరతి శయానంద పారవశ్యం తో తన్మయత్వం, చెందుతూ, శ్రీకృష్ణ భగవానుని బాల్య క్రీడలను ,కృష్ణ లీలలను చెదరని తరగని మధురానుభూతి గా అనుభవిస్తూ, తాదాత్మ్యం పొందుదాం ;!!
"హే కృష్ణా,"! వసుదేవ కుమారా!,, దేవకీ తనయా,! నంద నందనా!, యశోదా కృష్ణా!,, నారాయణా,! పరం ధా మా!, పరాత్పరా!, పరమాత్మా,!, అచ్యుతా,! ఆనంతా, !గోవిందా,,! నీ లీలలు అమోఘం ,!అద్వితీయం , అపరిమి తానంద కరం,;! జన్మ సాఫల్య దాయకం , కదా స్వామీ !!
నీ పాద కమలాలపై , దృష్టి నీ ద్యాసను కేంద్రీకరించి తరించే భాగ్యాన్ని, మాకు కరుణించు ! తండ్రీ,,
నీ లీలలను ఇలా స్మరిస్తూ ,ధన్యం అయ్యే భావ సంపద ను కూడా దయతో మాకు అనుగ్రహించు !
శరణు కేశవా,
శరణు మాధవా
శరణు గోపాలా
శరణు గోవిందా
శరణు యశోదా కృష్ణా!
"",,,__"చేత వెన్నముద్ద, చెంగల్వ పూదండ,! బంగారు మొలత్రాడు, పట్టుదట్టి,,; సందె తాయెత్తు లు , సరి మువ్వ గజ్జెలు ,! చిన్ని కృష్ణా ! నిన్ను చేరి కొలుతు !*!
స్వస్తి !"
హరే కృష్ణ హరే కృష్ణా!""""
Monday, March 2, 2020
చిన్ని కృష్ణా!, నిన్ను చేరి కొలుతు !
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment