Wednesday, March 25, 2020

కరోనా అంటే

Mar 13, 2020
"భయం, భయం !అనుక్షణం ,అనుదినం !
ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతకాల్సి వస్తోంది !
దేశం, ప్రాంతం అనకుండా ప్రపంచాన్ని గడ గడా వణికిస్తోంది,,ప్రాణాంతకంగా మారిన , మహమ్మారి ఈ కరోనా అంటువ్యాధి !,
"",నేడు  కరోనా !
,మొన్న గునియా , డెంగ్యూ వైరస్ ల జ్వరాల భయంకర విష జ్వాలలు !!
అవి పుట్టేది ఒక చోట!
కానీ అది  ,వినాశనం చేసేది  మాత్రం అంతటా ఉంటుంది కదా !
చెడు  తొందరగా హాని చేసినట్టుగా  ,,మంచి ప్రభావం అంతగా వ్యాపించదు కదా !
కారణం మనిషి  స్వార్థం!"  దుష్ట బుద్ధితో చేసే ఆలోచన!
తాను చచ్చినా ఫర్వాలేదు కానీ ఇతరులను చంపాలి అన్న శాడిస్టు సిద్దాంతం !ఫలితం గా నేటి యుద్ద పరిణామాలు  !
అదే "
బయోలాజికల్  వైరల్ వార్ ఫేర్ !""
విషపూరిత జీవులను ఉత్పత్తి చేసి , శత్రు దేశాల పైకి వదలడం !
ఎవరి పుణ్యమో కానీ ,ఇది
ఎంత నీచం !ఎంత దారుణం !""
ఇది ఒక అలవాటుగా మారింది , ఆ  మావోయిస్టు ,తీవ్రవాద దేశాలకి !
అక్కడ "వాక్ స్వాతంత్ర్యం" ఉండదు ,!
ఎదురిస్తే చంపడ మే వారి సిద్దాంతం ! ఇలా ! ఈ కరోనా తో!
అందుకే ,"చెరపకురా చెడేవు !""అని ,,ఊరకే అన్నారా ?""పెద్దలు ,,
సిగరెట్ కాల్చడానికి ,మద్యం త్రాగడానికి ,జల్సాలకు క్లబ్బులకి ,"" company ఉంటేనే కిక్కు వస్తుంది!"" అంటూ మజా చేస్తా రు  తాగుబోతు,లు !
ఇక్కడ ఏ   కరోనా చావు భయము ఉండదు !
అవసరం అయితే చట్టాల ను  కూడా"" డోంట్ కేర్"" అంటాడు!
చెడు ఆకర్షణ అంతా తీవ్రంగా ఉంటుంది !
అదే అనాధలకు , బీదలకు ,దివ్యాన్గులకు ,వృద్దులకు  గో సేవ లాంటి సామాజిక  ,సహాయం చేయడం లో మాత్రం ,,ఇంత హుషారు తనం ,ఐకమత్యం , చూపించ రు కదా !!""
అప్పుడు  డబ్బు ,ఖర్చు లెక్కలు పెడతారు ,, వీలు కాదంటూ !""
మంచి చేసేవారికి అడ్డుగా పుల్లలు పెట్టేవారు ఎక్కువ ఉంటారు కదా !!
  మంచి పనులు చేయడంలో , "కరోనా "కంటే ఎక్కువగా  , సందేహించి, భయపడేవారు ,, భయపెట్టేవారు  మనలో చాలా మంది , ఉంటారు!!
"" కరోనా ""అనేది మన దేశ  భాష  లో పదం ,,కాకున్నా   హిందీ లో  అర్థం చేసుకుంటే , చెయ్యి  !"అని,,
,దాని అర్థం  "ఏదైనా మంచి పనీ  చేయండి !"" అని.
చావు ముంచుకొస్తుంది అని తెలిసిన పరీక్షిత్తు భాగవతం వింటూ తరించాడు
""చెయ్యండి !""అంటే  ఏమైనా అలాంటి  మంచి పనులు చేయాలి ,,!
కానీ చేయరు ,!.
ఎందుకు ?అంటే ఆ  అలవాటు   చేసుకోలేదు  ఎపుడూ! "
అదీ  మన దౌర్భాగ్యం !"",
ఒక సినిమాలో విలన్ అంటాడు పోలీస్ ఆఫీసర్ తో,
""నాకు మనిషిని చంపడానికి ,ఒక కోడిని చంపడానికి  పెద్ద  తేడా తెలీదు!!" అంటూ దబాయిస్తాడు !
వాడు నెంబర్ వన్ క్రిమినల్ !!
ఇక, హీరో చేత చిక్కాక , వాడికి , ప్రాణ భయం, బ్రతుకు పై తీపి తెలుస్తుంది !
""ఎందుకురా ,,మా వాళ్ళని పిట్టల్లాకాల్చేశావ్ ??
ఎంత కష్ట పడ్డాను,,? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని తెచ్చా నో ,,నీకేం తెలుసు ??
సరే !నీకెంత కావాలో చెప్పు ?
,ఎన్ని కోట్లు ?ఎంత అస్తి  కావాలో ,,? చెప్పు ,,చెప్పు!""
ఏదైనా ఇస్తాను ,,! కానీ ,,నన్ను మాత్రం చంపొ ద్దు ,! నీ కాళ్ళు పట్టుకుంటాను !""
అంటూ కాళ్ళబెరం చేస్తూ బ్రతిమి లాడుతు ఉంటాడు !
అంటే తన దాకా వస్తె గానీ ,బ్రతుకు విలువ అర్థం కాదు కదా !
ఎవరైనా ఇంతే !
తనకు మాలిన ధర్మం లేదని , ప్రాణం కన్నా మిన్నగా చూసుకున్న భార్యాపిల్లలను కూడా ,తన ప్రాణం మీదకు వస్తె  లెక్కచేయకుండా  కాల్చేస్తాడు !
లేదా ,విడిచిపెట్టి పారిపోతాడు ! అలా జంతువు కంటే నీచంగా ,
స్వార్థం తో మనిషి రాయిలా కటినంగా తయారవుతాడు !
"బ్రతకడం "అంటే కోట్ల డబ్బులు ,అస్తి బంగళాలు పోగు చేసుకొంటూ తనకోసమే అన్నట్టుగా ఉండడం కాదు  కదా !
"బ్రతకడం" అంటే అందరితో మంచిగా ,స్నేహంగా ,ప్రేమగా ఉండడం,వారిలో ఉన్న  ఆనందాన్ని  తాను పంచుకుంటూ ,
అలా ఉండాలని అందరూ అనుకుంటారు!
,అందరికీ అన్నీ తెలుసు ,!
కానీ,అహంకారం ,తో,ప్రక్కనే ఘోరాలు చూస్తూ కూడా ,అదేమీ తెలియనట్టు నటిస్తూ ఉంటాడు ! ఇలాంటి వాడిని మనిషి అని అనవచ్చా ??మీరు చెప్పండి ??"
""ఏమో ,నాకు తెలియదు !,ఎవరు చెప్పలేదు ,!  జ్ఞాపకం లేదు ,మరి !,,,,,"అంటూ చేసిన తప్పును ఒప్పుకోకుండా 
తప్పించుకోడం మనిషి నైజం  అనిపించుకోదు !
, మాట దాటేయడం ,మానవత్వం కాదు!
గతంలో తాను ఎన్ని పొరబాట్లు చేశాడో ,పొరబాటున కూడా ,ఒకసారి నెమరు వేసుకో డు !
,తప్పును తప్పుగా  అనుకోడు !
అత్మ విమర్శ చేసుకో డు!
తనగురించి రోజంతా , ఆలో చిస్తు ఉంటాడు !
,తనను నడిపించే శక్తిని  దైవంగా గుర్తించే ప్రయత్నం కూడా చేయ డు!
ఇతరుల గురించి అలోచించి ,వారి అవసరాలకు సహాయం చేయడానికి తాను ఎప్పుడూ " రెడీ " ఉండాలని  అనుకోడు!
నలుగురి   మంచి కోసం చేసిందే , మనిషికి నిజమైన  గుర్తింపు ను  ఇచ్చేది !కదా!"
అందుకే చేసే ప్రతీ పనీ ,ఒక క్రతువు లా ,పవిత్ర  యజ్ఞ భావన తో అంతా  ఈశ్వ రార్పణం""!"""   అనుకుంటూ చెయ్యాలి , ! ""కరోనా , కుచ్, సేవా !!" ఖుదా కి దువా కే లియే ,కరోనా , బాబూ ! కరో నా!!""
అమ్మా , కరోనా !""
కర్తే   , కర్తె ,చలో నా ,!""
హమ్ హై  ,,,భగవాన్ కి హతోన్ మే, ఏక్ " ఖిలోనా !""
వాస్తవానికి  ఈ "కరోనా"  అనే పదం ,చావును గుర్తుగా తెస్తూ,చేయాల్సిన మంచి పనులను సత్వరంగా చేయమని చెబుతోంది మనకి !!
!మనిషిగా జన్మ ఎత్తి నందుకు , మహోన్నతమైన విలువలు  గల సత్కార్యాలు  చేయమని చెబుతూ ఉంది ఈ కరోనా వ్యాధి !!
అన్నదానం చేస్తూ ,, డబ్బు విరాళంగా ఇస్తూ ఉండడం ,వస్త్ర
దానం,మాట సహాయం , వస్తూ సహాయం , పనిలో ఆసరా ,ఇలా చేస్తూ భరోసా లేని ఈ జీవిత యాత్రను  కీర్తి, ప్రతిష్ట ల వైభవం తో శాశ్వత  అనంద మయం గా చేసుకోమని సూచిస్తూ ఉంది కరోనా !!
,, ఉదారంగా ,ఉచితంగా , ఫలితం ఆశించకుండా , ఎదుటివారిలో దైవాన్ని దర్శిస్తూ ,సేవ
చేయమని అంటోంది కరోనా !!
ఇది దినచర్య కావాలి అంటోంది కరోనా !
ఈ ఆలోచన
ప్రతిరోజూ ప్రతివాడూ  చేయాలి !!
"", ఈ రోజున నేను ఎవరికైనా ఉపకారం ,సహాయం చేశానా?""  అని ,,!
,,చేయగలిగే స్తోమత , శక్తి,జ్ఞానం , అవకాశం ఇవన్నీ ఉండి కూడా , చేస్తాను అనీ ,,చెయ్యక పోతే,  లేదా చేయ కుండా ఉంటే,, బాధ పడాలి !
""కరోనా"" అంటే భయపడ వద్దు!
""కరోనా "" అంటూ అనుగ్రహిస్తు న్న మహ దవకాశం గా,, భగవంతుడు  మనకు జ్ఞాపకం చేస్తున్న వార్నింగ్ గా , అంటే హెచ్చరిక గా , positive గా తీసుకొంటూ   భావిస్తూ ,"" ప్రాణి కోటి సేవ యే మానవజీవన భాగ్యంగ్గా  "" సంకల్పించా లి !!
అంతేకాదు ,ఇలాంటి దైవ కార్యం ,అనబడే సేవ చెయ్యడం కోసం  తాపత్రయ పడుతూ ఉండాలి.!
సేవా కార్యక్రమాలు ఎన్నో రకాలు !!
ఆవు ఎద్దు లాంటి
నోరులేని సాదు జంతువులు ,ఎన్నో  ఉన్నాయి,, వాటికి మేత, పోషణ, రక్షణా భారం వహించవచ్చు !
వచ్చేది ఎండాకాలం ,! మంచినీరు, మజ్జిగ ,చలివెంద్రాలు లాంటి  ప్రజా ఉపయోగ కేంద్రాలు  పెట్టవచ్చు ను !
లేదా  ఆసక్తి గలవారిచే ,డబ్బు తో పెట్టించవచ్చును కూడా !!
ఉపాధి కల్పన చేయవచ్చును !!
""ఇచ్చుటలో ఉన్న హాయి,,
వేరెచ్చటను లేనే లేదు ! అనే నగ్న సత్యం తెలిసి రావాలి అందరికీ !!
ఇతరులకు ఇవ్వడం ,దానం,గా  అనేది ఒక  దైవగుణం !
అసలైన సిసలైన మానవత్వం అది!
జంతువులకు ఈ భాగ్యం లేదు !
కేవలం మనిషికే జ్ఞానం తో బాటు ,దానం చేసుకుని తరించే అవకాశం ఇచ్చాడు ,
పరమేశ్వర అర్పణం చేస్తూ పని చేయడం మన వంతు !
ఫలితం ఇవ్వడం భగవంతుని వంతు ! ,
""పుట్టిన వాడు చావక తప్పదు!""
కానీ ఒక  మంచివాడు గా పరోపకారిగా , ఆత్మీయుడు గా  , గొప్ప స్నేహితుడుగా, పిలిచి  అన్నం పెట్టేవాడు గా , అడగకుండానే ఇతరుల అవసరాలకు డబ్బు ,వస్తువులు ,మనుషులను , అందించే ఉత్తమ వ్యక్తిగా  ,,,పుణ్యాత్ముడు ,,మహానుభావుడు ,,,పరోపకారి ,,"" అంటూ , మరణించాక కూడా ,,పదిమంది  తనను గూర్చి గొప్పగా చెప్పుకునేలా  ,బ్రతకాలి !!
తనవారికే కాకుండా , పరవారి ని  కూడా , ""వారూ తనవారే !""అన్న అత్మ సంబంధమైన  ప్రేమభావన  తో సేవిస్తూ ఉండాలి !!
చిన్న టార్చ్ లైట్ , తన చుట్టూ ఎంత చీకటి ఉన్నా , తనలోని శక్తిని అంతా కూడ గట్టుకొని  చుట్టూరా ప్రదేశాన్ని వస్తువులను మనుషులను ప్రకాశింప జేస్తూ ఉంటుంది కదా !
అలాగే మనిషి కూడా,, చుట్టూ ఉన్న అవరోధాలు అనే చీకటిని  అధిగమించి ,,, చేతనైనంత గా మంచి పనులు అనగా ఉపకారం చేస్తూ ఇంత చక్కని అవకాశం మనకి  దేవుడు ఇచ్చినందుకు  ,సంతోషంగా పొంగి పోవాలి !,
ఇలాంటి  గొప్ప మనసు గలవారికి  "కరోనా" వల్ల గానీ ,"చావు " అనే చీకటి భయం ఉండదు!
అందుకే  కనీసం ఇప్పుడైనా ,
""సబ్కో అప్నా  వో!
""కుచ్ న కుచ్ ,కరోనా,! దూస్ రోన్ కో ,  సేవా కర్నే కే లియే  కుచ్, కరోనా !""
కరోనా ప్యార్ సే !""
కహో నా,, యార్ సే!""
" జియోతో ఐసే జియో ,, జైసే ,
సబ్ తుంహారా హై ,!"
మరేతో ఐసె మరో ,,!"
,,, జైసె
తుంహార కుచ్ భీ నహీ !""
వందే మాతరం !
ప్రపంచ శాంతి వర్ధిల్లాలి !
సర్వే జనాః సుఖినో భవం తు !
సమస్త సన్మంగలాని భవం తు !""
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...