Wednesday, March 25, 2020

నమస్కారం !

Mar 14, 2020
"వందే మాతరం "!భారతమాత కు నమస్కారం !" భారతీయులకు నమస్కారం  !"
మన భారతీయ సనాతన ధర్మం పై విశ్వాసం తో ఆచరిస్తూ ఉన్న మనవారందరకు  ఈ వేదిక ద్వారా , నా ఈ రెండు  చేతులు జోడించి సవినయంగా నా హృదయపూర్వక నమస్కా రములు తెలియజేసుకుంటున్నాను !""  
మనల్ని చంప వచ్చే శత్రువు నైనా  కరిగించి ,మిత్రునిగా మార్చుకునే  " దివ్యమైన ఆయుధం ""ఈ నమస్కారం అనే  "రామబాణం " !
అలా "నమస్కారం  " చేస్తే , ఎంతటి నాస్తికుడైనా ,,వేరే మతం వారైన ,విదేశీయుడు అయినా , దొంగ అయినా ,దైవం అయినా , పొంగి పోతూ,మనం కోరుకున్నది ఇచ్చేస్తాడు !!
,,అంత మేజిక్  ,,ఎంతో ప్రభావం ఉంది , ఈ నమస్కారం భంగిమ లో!,,
,,,,ఇంత మహిమాన్వితమైన , సంస్కార వంతమైన  సంప్రదాయానికి ,," మన భారతీయులే ""వారసులు కావడం నిజంగా మనకు  గర్వకారణం  అయిన విషయం ! దీని ప్రాముఖ్యత ఇప్పుడు వెలుగులోకి వచ్చింది , దేశ విదేశాల్లో , ఈ పద్ధతికి  గుర్తింపు ఇస్తూ ,జేజేలు పలుకుతూ ఉన్నారు ;
""నమస్కారం ;"
అంటూ రెండు  చేతులు జోడించి  ,  ఎదుటివారు దైవ స్వరూపులుగా భావిస్తూ వినమ్రత తో  గౌరవాన్ని ఇస్తూ , ఉండే మన అద్భుతమైన సత్ సంప్రదాయాన్ని ""కరోనా"" పుణ్యమా అని  ,తిరిగి మన  ప్రాచీన వైభవాన్ని  ప్రకటిస్తూ ఉంది !
పిల్లలు నయంగ చెబితే వినకుంటే సామ దాన భేద దందో డో పాయాలు ఉపయోగించే వారు,, ఆ రోజుల్లో !!
ఇప్పుడు ,,జనం పూర్తిగా భయ భక్తులు  లేకుండా విచ్చలవిడిగా  తమకు తోచినట్టు ,గా వ్యవహరిస్తూ ఉన్నారు ,
బొత్తిగా  ,హద్దులు సభ్యతా సంస్కారాలు సంప్రదాయాలు కూడా పాటించకుండా  ఉంటున్న నేటి విపత్కర పరిస్తితి లో ఇలాంటి దండో పాయం సరియైన దే,అనిపిస్తోంది అందరికీ !!
" ,స్వదేశీ పద్దతులు ఆచార వ్యవహారాలు త్రునీకరించి  దిక్కుమాలిన విదేశీ అలవాట్లతో  అటు తమ  ఆరోగ్యాన్ని, నష్ట పోతున్నారు ,, మనవారు !!
  ఇటు  అత్యంత పవిత్రమైన ,, తమ సనాతన హిందూ ధర్మ సంప్రదాయాన్ని   ఖాతరు చేయకుండా,, పర ధర్మాన్ని నమ్మి ,తమను తాము  అత్మ వంచన చేసుకుంటూ ఉన్నారు !!
భగవద్గీత లో పరమాత్ముడు, మనిషి గా పుట్టినందుకు గర్వపడే లా, స్వధర్మాన్ని పాటించాలని , పర ధర్మం ఎంత ఆకర్షిస్తున్న కూడా ,దాన్ని విసర్జించాలని బోధించాడు !!
""నమస్కారం!"" ప్రాధాన్యత ,అద్భుతం !! అమూల్యం ,అపురూపం ! కోట్ల డబ్బు కూడా ఒక నమస్కారం విలువ కట్టలేదు !!
ఉదాహరణకు ,మొన్నటి ""నమస్తే  ట్రంప్,!""స్వాగత విధానం !
మనం నమస్కరించే వ్యక్తికి , ఆ నమస్కారం గ్రహించే వ్యక్తికి  ,,ఇద్దరి మధ్య తరగని  ప్రేమానుబంధం   పెంపొందిస్తుంది , ఈ విధానం !!,
""నమస్కారం"" మూడు రకాలుగా చేయవచ్చు అని  చెబుతారు పెద్దలు
1__ఆప్త స్నేహితులు ,బంధువు లు కలిసినపుడు ,తమ రెండు చేతులూ జోడించి తమ ఛాతీపై ఉంచి , ఆదర పూర్వకంగా చిరునవ్వుతో  సభ్యతా సంస్కారం ఉట్టిపడేలా  తలను కాస్త వినమ్రతతో వంచి నమస్కారము చేస్తూ ఉండాలి
2__తమ తలిదండ్రులు , తమ కంటే పెద్దవారు ,పూజనీయులు ,పండితులు , వేద మూర్తులు ,కనబడితే చాలు , రెండు చేతులూ జోడించి ముఖాన్ని   , నడుము నూ కొద్దిగా ముందుకు వంచి ,శరీరాన్ని బాణం ఆకారం లో ఉంచి , గౌరవ మర్యాదలు ప్రకటిస్తూ ,ముఖం లో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ,నమస్కారం  చేయాలి
3__ దేవాలయం వెళ్తే ,లేదా ఇంటిలో  పూజా విధానం అయ్యాక భక్తితో నమస్కారం పెట్టే పద్దతి ఇది !
,, దేవతా విగ్రహాలు ,ఫోటోలు ,ఉత్సవ మూర్తులు ఇలా  ,, ఏ దేవత ను దర్శించినా కూడా ,
మన చేతులూ రెండు జోడించి , చేతులు ఏ మాత్రం వంచకుండా ,, నిటారుగా ఉంచుతూ , తలకు  ఇరువైపులా ,చెవులకు తాకేలా ,,,సూటిగా , పైకెత్తి , నమస్కారము చేయాలి !!
భక్తి పూర్వకంగా చేస్తే ,,దీనిని " ప్రణామం"" అంటాము
ఇష్ట దైవానికి ,లేదా గురువులకు ,ఆచార్యులకు , శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి లాంటి మహానుభావులకు ,, జగద్గురువు నకు , విధిగా తప్పనిసరిగా ,,మనం  ఈ ""సాష్టాంగ ప్రణామము"" చేయవలసి ఉంటుంది !!
అనగా శరీరంలో ని ఎనిమిది  ప్రధాన అంగాలు ఇవి,,!
1 వక్షస్థలం 2,శిరస్సు ,3,కళ్ళు ,4, తల 5,_నోరు 6_పాదాలు7_చేతులు 8_చెవులు _!
ఇవి  భూమికి తాకేలా ఆనిస్తూ, నేలపై బోర్లా పడుకొని , ,రెండు  చేతులు, పరమాత్ముని వేపు చాచి ఉంచి నమస్కారం చేస్తూ ఉండాలి 
ఈ విధంగా , ఇలాంటి ,ఆత్మార్పణ భావంతో ,ఆనిస్తూ  చేసే  అద్భుతమైన  ఈ సాష్టాంగ నమస్కారం  ,,నేరుగా  సాక్షాత్తూ  ఆ పరమేశ్వరునికి సమర్పించడం అవుతుంది !!
ఈ విధంగా మనం ,,మనసా వాచా కర్మణా ,, చిత్తశుద్ది తో  , చేసే ఆత్మపరిశుద్ధమైన  ""నమస్కారం   ప్రక్రియ"" దైవానికి  రోజూ భక్తితో చేసే  దివ్యమైన పూజ  అవుతుంది ,!
,అయితే ఈ సాష్టాంగ నమస్కారం  కేవలం పురుషులకే పరిమితం !;,
ఇది స్త్రీలకు పూర్తిగా  నిషిద్దం !!
స్త్రీలు  మోకాళ్ల  పై  మాత్రమే  వంగి దైవానికి ,లేదా పెద్దలు గురు తుల్యులు , తలిదండ్రుల కు నమస్కారం చేయాల్సి ఉంటుంది !!
ముఖ్యంగా పెద్దవారు , తాత అమ్మమ్మ నానమ్మ ఉపాధ్యాయులు బ్రాహ్మణులకు , మొదలైన పెద్దవారికి ,మనం  నమస్కారం చేసే సమయంలో,, వారి రెండు పాదాలపై మన  రెండు చేతులూ,, తాకుతూ  ఉంచి ,తలను వారి పాదాలకు అనిస్తూ  ,మన ""ప్రవర ""చెబుతూ,అనగా శాస్త్రం విధించిన రీతిలో మనల్ని గురుదేవులకు పరిచయం చేసుకొంటూ ,,వినయ విధేయతలతో  వారికి  నమస్కరించాలి,!
""నమస్కారం ""అనే ది  నిజానికి  ఒక పవిత్రమైన దైవ భావన !
మనం ఎవరికి నమస్కారం చేస్తే ,వారిలో ""దైవాన్ని" దర్షిస్తున్న భావం. మనకు  కలగాలి !
అంటే  నమస్కారం వ్యక్తి కి కాదు !,
వ్యక్తిలో ఉన్న దైవ శక్తికి నమస్కారం !
అలా  చేస్తున్నట్టు గా మనం  భావించాలి !
అంటే,""పవిత్రత  ""అంతా మన ""భావం "లో నే ఉంటుంది !
వ్యక్తం అయ్యేది మనిషి రూపం !
అతడిలో అవ్యక్తం గా ఉండేది జ్ఞానం !,అదే దైవం !
సత్యం ,జ్ఞానం అనంతం , అనబడే బ్రహ్మ పదార్థం గా  సర్వ ప్రపంచాన్ని  భావిస్తూ ,  నమస్కరించే  ఈ  అద్భుత అద్వైత సిద్ధాంతాన్ని , పురాణ ఇతిహాసాలలో లిఖిస్తూ , ప్రతిపాదించారు మన ఋషులు ,!!
ఇంత గొప్ప సంప్రదాయాన్ని తమ వాఙ్మయం ద్వారా  మనకు అందజేసిన ""ప్రహ్లాద నారద పరాశర పుందరీక వ్యాస అంబరీష శుక శౌనకాది మహా మునులకు ""కృతజ్ఞత లతో శతకోటి ప్రణామాలు  సమర్పించు కుం దాము ,!
""యద్భావం  తద్భవతి !"
మనం ఎలా భావిస్తే ప్రపంచం అలా కనబడుతూ ఉంటుంది !
ఆలయంలో  రోజూ కనిపించే ,పూజారి ,,నీకు స్నేహితుడు ,లేదా నీకంటే చిన్నవాడు కావచ్చు !!
కానీ అతడి చేతిలో దైవానికి అర్పింపబడిన తీర్థ ప్రసాదాలు ఉన్నాయి !!
అవి గ్రహించే సమయంలో మాత్రం ,, అతడికి  భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తూ  ఉంటావు !
అనగా ,మనం చూసే చూపులో ఉంటుంది దైవ భావన !
అందుచేత   అద్భుతమైన మన ఈ ""నమస్కారం"" సంప్రదాయా న్ని మనం పాటిస్తూ ,మనవారిచే పాటింపబడెలా చూద్దాం !;
""చేతులు కలపడం ,,షేక్ హ్యాండ్ ఇవ్వడం "" లాంటి విదేశీ  అలవాటు ను  శాశ్వతంగా మరచి పోదాం!!
విదేశీయులు కూడా అభిమానించి ఆదరించి ఆచరిస్తున్న ఈ  చక్కని నమస్కారం   అనే ప్రేమను అనుబంధాన్ని పంచే ,,పెంచే  దేవతకు   పునః స్వాగతం పలుకుదాం !
వందే మాతరం ! తలిదండ్రుల కు ,గురుదేవులకు , ఆ పరమేశ్వరునకు ,నమస్కరిస్తూ, ఈ భయంకరమైన "" ""కరోనా ""మహమ్మారి నుండి , సకల జనావళికి విముక్తి ని   ఆనుగ్రహించమని. కోరుకుందాం !
హే పరమేశ్వరా !, ఆ నాడు గరళాన్ని మింగి సృష్టి వినాశనం కాకుండా కాపాడావు !
పరమశివ ! ఈ నాడు ఈ కరోనా రాక్షసి భూతం నుండి మమ్మల్ని కాపాడు! నీవు  శరణాగత వత్సలుడవు!
తండ్రీ ! జగద్రక్షకా! ఆపద్ బాందవా !   రక్షించు !!అనాధరక్షకా ! నారాయణా! దాయజూడు !!
పాహిమాం , ఈశ్వరా !
రక్షమాం ,, గౌరీ వల్లభ!
శరణు !శరణు !శరణు !!
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...