Wednesday, March 25, 2020

శ్రీకృష్ణా !శరణం మమ !

Mar 11, 2020
" కృష్ణా !
నీ రాధను రా!అనురాగ భావనారాధన మగ్న మానసనురా ! కనరా !కరునింపరా ! మనో వీధి పదే పదే కలత వేయుచు నున్నదిరా ! పురారహో మీ ఈదలేనిక , అగాధ తమోమయ కాలవాహినిన్ !""
"హే కృష్ణా! ,, గోపాల కృష్ణా,! గోవింద కృష్ణా ,!యశోద కృష్ణా!, నంద నందన కృష్ణా,! దేవకీ తనయా కృష్ణా!, వసుదేవ కుమారా కృష్ణా,! వెన్న దొంగ కృష్ణా !, నల్లనయ్య కృష్ణా! వంశీ కృష్ణా,! వేనుగా న లోలా కృష్ణా, ! గోప గోపీ జన వల్లభా కృష్ణా ,,!""
ఆహా ! ఏ పేరున నిను  పిలువనురా ! ఏ తీరున నిను కొలవనురా కృష్ణా ,!""
రాధా కృష్ణా!
ఎంత మధురం నీ నామం ,?, , నీ రూపం , నీ భావమ్ , స్మరణం  , నీ చూపు , నీ తలపు , నీ వలపు ,,,!"  ఆహా,! మధురాతి మధురం , కదా!""
మోహన రూపా, గోపాలా!
ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది!
నా ఎ ద లోని బాధలన్నీ నీకు  చెప్పాలని ఉంది !"
కృష్ణా !
ఇలా నీకు నీ భక్తులు ఇచ్చినవి  ఎన్ని  బిరుదు లో  కదా ,,కృష్ణా !
,ఇవన్నీ కలిపితే నీకు సహస్ర  సహస్ర నామాలు అవుతూ ఉంటాయి,!
కృష్ణా! ,గొలోకం నుండి , నీ కోసం ఆతృత పడుతూ నీ కంటే ముందే  నేను వచ్చాను,!
ఇలా
నీ రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాను!
ఇక్కడి మానవుల లెక్క ప్రకారం నేను నీ కంటే పెద్ద దాన్ని అట!"
కృష్ణా! , ప్రభువు కరుణ కోసం ముందే వచ్చి  , నిలుచున్న  సేవకురాలు , తన స్వామి కంటే పెద్ద ది ఎలా అవుతుందో నాకు అర్థం కావడం లేదు!!"
ఈ దేవ రహస్యం ఎవరికీ చెప్పలేను కూడా !
కృష్ణా,నేను ఇపుడు పర దేవత ను  కాను !,, దేవతా స్త్రీని కూడా కాను ,!
మానవ కాంత ను మాత్రమే !
తల్లి గర్భంలో పుట్టడం , మనిషి వలె పెరుగుతూ ఉండడం , అంతా వింతగా నూ ,, సంతోషంగా నూ ఉంది సుమా !!
నేను  ఇపుడు అనుభవిస్తూ , ఆనందిస్తూ పులకిస్తూ ఉన్న ఈ
మనిషి శరీరం ఎంత మాధుర్యం తో నిండి ఉందో,చెప్పలేను !! ఆహా! ,ఇంద్రియాలు నియంత్రించే శక్తి, ఉండాలి గానీ,మానవుడు నిజంగా అత్యద్భుతం !
తాను  కోరుకున్న ఏ దైవాన్ని అయినా తన వద్దకే తప్పించుకునే భక్తి అనే సాధనా సంపత్తి అతని స్వంతం అవుతుంది కదా!;మహా మునులు ఋషులు తరించింది ఈ అసాధారణ మానవ శరీరం తోనే కదా !!
కృష్ణా!
నేను ఇపుడు బంగారు పంజరం లో బంధింపబడి ఉన్న చిలుకను, సుమా!!
దేవతల కుండే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు మనిషిగా ఇపుడు  నాకు లేవు ,!
, పైగా స్త్రీ ని,,! ఆడపుట్టుక పుట్టాను కదా !
ఎన్ని . కట్టుబాట్లు ?ఎన్ని  పరిమితులు ? అమ్మో,,!
అయినా ఇందులో అనుబంధం ఉంది !ప్రేమ ఉంది,!
తనవారిపై ఇంతగా  ఆత్మీయత  అనురాగం చూపే ఇలాంటి సంప్రదాయం సంస్కార హృదయం నన్ను చాలా ఆనంద పరుస్తూ ఉంది!!
కృష్ణా !,నీవు  ఎక్కడ పుట్టింది , రేపల్లె కు ఎలా వచ్చింది ,, ఇక్కడ యశోదా మాత కు  జన్మించిన నీ సోదరి దుర్గాదేవి  అక్కడ కంసుని భయభ్రాంతులకు గురిచేస్తు తన చావుకు కారకుడు పుట్టాడని చెప్పి తాను వచ్చిన పని పూర్తి చేసుకొని  వెళ్లిపోయింది ,అంతా  నాకు తెలుస్తు ఉంది !!
కృష్ణా  !
నిన్ను బంగారు తూగు టు య్యాలలో గోపికలు, యశోదా మాత లు ఎంతో ఆనందంగా  ఊపడం నేను  కూడా  దూరం నుండి చూశాను ,!
చిన్న పిల్లగా ఉన్న నన్ను నీవు  చూశావు ! ఎలా ఉన్నావు రాధా !
దగ్గరగా రమ్మన్నట్టు గా  నీ  కళ్ళు పలకరించాయి  నన్ను!!
అందాల బాలుడిగా , నీలమేఘ శ్యామ సుందరునీ రూపంలో కోటి మన్మధ కాంతులతో ముగ్ద మోహనంగ వెలిగే నీ సౌందర్య లావణ్యాన్ని దర్శించి పరవశించాను ! నా జన్మ , నా రాక నీ అపురూప బాల కృష్ణ దర్శనం తో ధన్యం అయ్యింది !;
కృష్ణా
!ఇప్పుడు నాకు తెలుస్తోంది,, ఈ మానవ శరీరం ధరించడం ఎంత అదృష్టమో,!!ఎన్ని పూర్వజన్మల పుణ్య ఫలమో ?!
దేవతలకు కూడా అనుభవించుట కు దుర్లభమైన  మధురానుభూతులు ,  ఈ మనిషి శరీరంలో లభ్యం అవు తూ ఉన్నాయి నాకు !!
ఎంత పులకించి పోయానో చెప్పలేను చిన్ని కృష్ణుని రూపంలో నిన్ను చూస్తూ !!"
కృష్ణా !, అవతార రూపంలో మాటి మాటికి ఈ భూమిపై కి రావడానికి  నీవు ఎందుకు అంతగా ఉత్సాహ పడుతుంటావో,, నాకు ఇప్పుడు అర్థం అవుతోంది !!
" కృష్ణా ! నీ రాక కోసం కళ్ళు కాయలు కాసేలా నిరీక్షిస్తూ వుండడంలో ఎంత  ఆనందంగా ఉంటుందో  ,అనుభవం ద్వారా తెలుస్తోంది నాకు!
అనుభవైక వే ద్యం అయిన
ఈ  అనందం,, స్వర్గంలో కానీ  గోలోకం లో కానీ ఎక్కడా లభించదు !
అందుకే సర్వ ప్రాణుల లో ఉత్కృష్టమైనది మానవజన్మ  అంటారు కదా!!
ఈ గోపికలుకూడా  గత జన్మలో మహా మునులు!
నేను కోరుకున్నట్టే వారిని కూడా కరునించడానికి   గోపికలు గా రేపల్లె లో  పుట్టి  నిన్ను ,ఆరాధిం చి తరించడానికి ,ఇక్కడ నిన్ను చేరారు!!
కృష్ణా ! 8ఏళ్ల చిన్న బాలిక నుండి 80 ఏళ్ల వృద్దురా లి వరకూ అంతా నిన్ను కోరి వచ్చిన  ఈ గోపికా స్త్రీలే, ఆ మునులు!!
కృష్ణా ! నీవు నిత్యం ఉదయమే  గోపాల బాలుర తో  ఆలమందలను మేపడానికి అడవికి వెళ్తూ ఉంటావు, !
తిరిగి చీకటి పడే వేళకు కానీ ఇళ్లకు రారు కదా!!
నిన్ను కనులారా చూద్దామని అనుకుంటే, ఎప్పుడు ఎలా వీలయ్యేది ,చెప్పు !""
సాయంత్రం, గోధూళి వేళ సమయం,,!ఎప్పుడెప్పుడా అని నీ కోసం మా ఎదురుచూపులు !!""
గోప బాలురతో కలిసి,,నీవు ఆడుతూ పాడుతూ సంతోషంగా వస్తూ ఉన్నప్పుడు ,నీ సుందర వ దనారవిందాన్ని , తని వి తీరా, చూద్దాం ఆనుకుంటే
,అసలే చీకటి, !
అందులో నీవు నల్లనయ్య వు ,కదా !
అయినా  కూడా మా కనురెప్పలు విచ్చి విచ్చి నీ జగన్మోహన స్వరూపాన్ని , ముద్దులు మూ ట కట్టే నీ లీలా మానుష  చిన్ని కృష్ణుని వేష ధారణ వైభవాన్ని దర్శించు దామని, ఉబలాట పడుతూ ఉంటే, మా ఈ మాంస నేత్రాలకు ఈ కనురెప్పలు మాటిమాటికీ అడ్డం వస్తున్నాయి కదా!
ఏం చేయమంటావు కృష్ణా?? ఎలా చూడము చెప్పు ,నిన్ను ??"
ఎంత చూసినా తనివితీరని దివ్య మంగళ విగ్రహ స్వరూపం కదా, నీది !
తృప్తి కలగడం లేదయ్యా, చిన్ని  కృష్ణా !""
మరుసటరోజు కూడా ఇంతే!
ఎప్పుడూ సాయంత్రం అవుతుందా ?,ఎప్పు డు నిన్ను రెప్పలార్పకుండ నిన్ను చూస్తామా ??, అనుకుంటూ , ఏ పనీ చేస్తున్నా  నీ ధ్యాస లోనే ,,నీ నగుమోము నే, దరహాస విలాసాన్నే ,, దర్శిస్తూ ఆనందిస్తూ , తన్మయత్వం పొందుతూ ఉంటాము 
కృష్ణా,భావములో బాహ్యము లో ఈ గోవిందుని అపురూప సుందర సురుచిరా లావణ్య వైభవాన్ని  మా అంతరంగం. లో దర్శిస్తూ తరించే భావ సంపదను ,మహా భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉన్న నీకు శత సహస్ర పాదాభి వందనాలు సమర్పిస్తూ ఉన్నాను
శ్రీకృష్ణా !శరణం ,మమ!
శరణు గోవిందా
శరణు
కృష్ణా ,! శరణు !""
స్వస్తి!"
హరే కృష్ణ హరే కృష్ణా!"
,

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...